Gunde Ninda Gudi Gantalu January 1st Episode: మీనా గుండె బద్దలు..ప్రభావతి మాస్టర్ ప్లాన్.. చిక్కుల్లో రోహిణి..

Courtesy: jiohotstar

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం ఎపిసోడ్ ప్రారంభం నుంచే సరదా, రొమాన్స్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎపిసోడ్ ఆరంభంలోనే బాలు-మీనా జంట మధ్య రొమాంటిక్ క్షణాలు కనిపిస్తాయి. మీనాను చూసిన బాలు పూర్తిగా ప్రేమ మూడ్‌లోకి వెళ్లి, 'నీ వల్లే నా జీవితం మారిపోయింది... నువ్వే నన్ను మార్చావు'అంటూ ఆమెపై ప్రేమ కురిపిస్తాడు. మీనా కూడా 'మీరు దొరకడం నా అదృష్టం'అంటూ ఫన్నీగా స్పందిస్తుంది. హాల్లోనే డాన్స్ చేద్దామని బాలు పట్టుబడితే, ఎవరు వస్తారేమోనని మీనా భయపడుతుంది. కానీ బాలు 'అమ్మ వస్తే విజిల్ వేస్తూ వస్తుంది'అంటూ సరదాగా స్టెప్పులు వేస్తాడు. ఇంతలోనే ప్రభావతి అకస్మాత్తుగా రావడంతో బాలు షాక్ అవుతాడు. 'లక్ష రూపాయలు వచ్చాయి కదా, ఏమైనా చేస్తావ్' అంటూ ప్రభావతి సెటైర్లు వేయడం సీన్‌కు హైలైట్‌గా నిలుస్తుంది. ఈ సంఘటన తర్వాత మీనా కీలక నిర్ణయం తీసుకుంటుంది.ఇక సొంతంగా ఒక రూమ్ కట్టుకుందామన్న ఆలోచనను బాలుతో పంచుకుంటుంది.

బాలు కూడా అంగీకరించడంతో మేస్త్రిని తీసుకువచ్చి పై రూమ్ గురించి చర్చిస్తాడు. నాలుగు లక్షల ఖర్చు చెప్పడంతో బాలు కంగారుపడతాడు. మొత్తం డబ్బు ఉంటేనే పని మొదలుపెడతానని మేస్త్రి స్పష్టంగా చెప్పడంతో, బాలు కొంత అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాడు. ఈ వ్యవహారాన్ని ప్రభావతి దొంగచాటుగా వింటుంది. మిగతా డబ్బు కోసం ప్రభావతి బంగారాన్ని తాకట్టు పెడదామన్న బాలుది సరదా మాటగా మారినా, ఆమెకు మాత్రం కోపం తెప్పిస్తుంది. మరోవైపు మీనా ఫ్రెండ్స్‌తో గెలిచిన లక్ష రూపాయల విషయమై మాట్లాడుతుంది. బాలు తనను ఎంత అర్థం చేసుకుంటాడన్న నమ్మకంతో పందెం వేస్తుంది. బీట్రూట్ దోస చేసినా బాలు టేస్ట్ గురించి చెప్పకపోవడంతో మీనా ఓడిపోతుంది. 'మగాళ్లు ఇంతే' అంటూ ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు. ఇదే సమయంలో రోహిణికి తన కొడుకు నుంచి పుట్టినరోజు ఫోన్ రావడం ఎమోషనల్ టచ్ ఇస్తుంది. చివర్లో మనోజ్ మరోసారి గోవా ట్రిప్ ప్లాన్‌ను ప్రస్తావించగా, రోహిణి కూడా అంగీకరించడంతో కొత్త ప్రయాణానికి పునాది పడుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 588 January 1st 2025 here is full story

Courtesy: jiohotstar

ఇక గురువారం ఎపిసోడ్ లో.. మీనా తన ఫ్రెండ్స్‌తో కట్టిన పందెంలో ఓడిపోతుంది. ఓడిపోయినందుకు ఫ్రెండ్స్‌కు రూ.500 ఇవ్వడానికి వెళ్లిన మీనా, వాళ్లు డబ్బులు తీసుకోకుండా మరో పందెం పెడతారు. "ఏంటి ఆ పందెం?" అని అడిగిన మీనాకు, ఒక ఫ్రెండ్ వ్యంగ్యంగా "మెంతులు-కాకరకాయతో దోస వేయాలి" అంటూ నవ్విస్తుంది. దీంతో మరో ఫ్రెండ్ మరింతగా ఎగతాళి చేస్తూ 'అప్పుడు మెచ్చుకోవడం కాదు, జీవితంలో వంట చేయొద్దని దండం పెడతాడు'అంటూ మీనాను ఆటపట్టిస్తుంది. ఇంతలోనే అసలు పందెం బయటపడుతుంది. 'మీ ఆయనకు ఫోన్ చేసి, ఉదయం చేసిన బీట్రూట్ దోస ఎలా ఉందో అడుగు... మెచ్చుకుంటే నీ 500 నీకే' అంటూ షరతు పెడతారు. భర్త బాలు మీద నమ్మకంతో మీనా వెంటనే ఫోన్ చేస్తుంది.

అయితే బాలు డ్రైవింగ్‌లో ఉండటంతో మొదటి కాల్ కట్ చేస్తాడు. వరుసగా ఫోన్ రావడంతో కోపంగా లిఫ్ట్ చేసి, 'ఏంటి కొంపలు తగలడుతున్నట్లు ఫోన్లు చేస్తున్నావ్?' అంటూ విసుక్కుంటాడు. సమయం, పరిస్థితి అర్థం కాకుండా మీనా 'ఉదయం చేసిన దోస ఎలా ఉంది?' అని అడగడంతో బాలు మరింత కోపంగా స్పందిస్తాడు. 'డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి అనవసర విషయాలకి ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి?'అంటూ ఫోన్ కట్ చేస్తాడు. దీంతో మీనా మరోసారి పందెంలో ఓడిపోతుంది. రూ.500 కూడా పోయి, ఫ్రెండ్స్ ముందు అవమానంగా ఫీలై బాధతో ఇంటికి వెళ్లిపోతుంది.

మరోవైపు ట్రిప్ ముగించుకుని భోజనానికి కూర్చున్న బాలు, తన ఫ్రెండ్ రాజేష్‌తో కలిసి క్యారేజ్ ఓపెన్ చేస్తాడు. రాజేష్ తన టిఫిన్‌లో పచ్చడి మెతుకులు, పెరుగు చూసి 'నా పెళ్లాం రోజూ ఇలానే చేస్తుంది... భోజనం చేయాలంటేనే ఇబ్బంది'అంటూ వాపోతాడు. దానికి బాలు గర్వంగా 'నేను చాలా అదృష్టవంతుణ్ణి... మీనా రోజుకోరకం కర్రీ చేస్తుంది. ఈరోజు ఏదో స్పెషల్ చేసి ఉంటుంది' అంటూ తన కర్రీని రాజేష్‌కు ఇస్తానని చెబుతాడు. కానీ క్యారేజ్ ఓపెన్ చేయగానే బాలు షాక్ అవుతాడు. టిఫిన్‌లో పచ్చిమిర్చి పల్లీలు, దోస పిండి మాత్రమే ఉంటుంది. అది చూసిన రాజేష్ 'అదృష్టం అంటే ఇదేనా రా?' అంటూ ఎగతాళి చేస్తాడు.

ఏదో తేడా జరిగిందని గ్రహించిన రాజేష్, 'ప్రొద్దున ఏం జరిగిందో గుర్తు చేసుకో' అని బాలు చెబుతాడు. అప్పుడు మీనా ఫోన్ చేసి టిఫిన్ గురించి అడిగిందని, తానే డ్రైవింగ్‌లో ఉన్నానని ఫోన్ కట్ చేశానని బాలు గుర్తు చేసుకుంటాడు. 'ఆడవారిని మెచ్చుకోవాలి రా... ఏం చేసినా మెచ్చుకుంటేనే సంసారం పచ్చగా ఉంటుంది. మీనా నీ కోసం బీట్రూట్ దోస వేసింది, నువ్వు మెచ్చుకోలేదు. అందుకే ఇలా చేసింది.' ఇది విన్న బాలు కంగారు పడతాడు. 'ఇప్పుడు ఏం చేయాలి?'అని అడగ్గా, 'ఆడవారికి నచ్చే గిఫ్ట్ ఇస్తే కోపం ఇట్టే పోతుంది'అంటూ సలహా ఇస్తాడు. దీంతో మీనాను ఎలా ఇంప్రెస్ చేయాలా అని బాలు ఆలోచనలో పడతాడు.

ఇక మరోవైపు ప్రభావతి తన బాధను చెప్పుకోవడానికి మీనాక్షి ఇంటికి వెళ్తుంది. 'మనోజ్ జ్యోతిష్యుడు చెప్పాడని రంగురంగుల చుక్కలు వేసుకుని పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. బాలు అసలు పట్టించుకోవడం లేదు. రవి అప్పుడప్పుడు మాత్రమే, శృతి అయితే నన్ను గంజిలో ఈగ తీసేసినట్లు మాట్లాడుతుంది. మీనా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నన్ను లెక్క చేయడం లేదు' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది.

డాన్స్ స్కూల్ పెట్టినా ఒక్కరూ జాయిన్ కాలేదని బాధపడుతుంది. అప్పుడు మీనాక్షి ఓ తెలివైన ఐడియా ఇస్తుంది. 'పిల్లలకు ఫ్రీ అడ్మిషన్ అని అనౌన్స్ చేద్దాం. వచ్చిన తర్వాత డ్రెస్సులు మన దగ్గరే కొనాలని కండిషన్ పెడదాం. అడ్మిషన్లు పెరుగుతాయి, డ్రెస్సుల వల్ల ఇన్కమ్ వస్తుంది.' ఈ ఐడియాతో ప్రభావతి ఇంప్రెస్ అయి, 'ఇప్పుడే షాపింగ్‌కు వెళ్దాం' అంటూ మీనాక్షితో కలిసి బయలుదేరుతుంది.

మరోవైపు.. రోహిణి తన కొడుకు చింటూ బర్త్‌డేను ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించుకొని, అతడికి స్పెషల్ డ్రెస్ తీసుకోవడానికి బట్టల షాప్‌కు వెళ్తుంది. షాప్‌లో ఉండగానే చింటూ‌కు ఫోన్ చేసి, అతడికి నచ్చిన డ్రెస్సులను అడుగుతూ ఎంపిక చేస్తుంది. తల్లి ప్రేమతో ఒక్కో డ్రెస్సును జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తుంది రోహిణి.

ఇదే సమయంలో అదే షాప్‌కు ప్రభావతి,మీనాక్షి ఇద్దరూ వస్తారు. తమ డాన్స్ స్కూల్ కోసం భరతనాట్యం డ్రెస్సులను కొనుగోలు చేస్తారు. బిల్లు కట్టే సమయంలో అనుకోకుండా అక్కడే ఉన్న రోహిణి ప్రభావతి కంట పడుతుంది. 'ఏంటమ్మా ఇక్కడ ఇలా వచ్చావు?' అని ప్రభావతి ప్రశ్నించగా, పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన రోహిణి వెంటనే 'నా కస్టమర్ కోసం షాపింగ్ చేయడానికి వచ్చాను' అంటూ కవరింగ్ చేస్తుంది.

అయితే ఇంతలో షాప్‌కీపర్ వచ్చి, 'మీ అబ్బాయికి చాలా మంచి డ్రెస్సులు తీసుకున్నారు' అని అనడం ప్రభావతిని ఒక్కసారిగా షాక్‌కు గురిచేస్తుంది. వెంటనే 'మా కోడలికి పిల్లలే లేరు, ఏం మాట్లాడుతున్నారు?' అంటూ షాప్‌కీపర్‌పై ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుండటంతో, రోహిణి వెంటనే 'ఏదో పొరపాటుగా చెప్పినట్లున్నారు' అంటూ మాట మార్చే ప్రయత్నం చేస్తుంది. కౌంటర్ వద్ద బిల్ ఎంత అని అడగ్గా రూ.10,000 అని చెప్పడంతో ప్రభావతి మరోసారి ఆశ్చర్యపోతుంది. అయితే తేరుకుని 'వాళ్లు చాలా ఉన్నవాళ్లు, షాపింగ్ అంటే వేలల్లో, లక్షల్లోనే చేస్తారు' అంటూ మరోసారి కవరింగ్ చేస్తుంది. ప్రభావతి ఇంకా సందేహంగా చూస్తుండగానే, 'అత్తయ్య మీ బిల్లు కూడా కట్టాలా?'అని రోహిణి అడుగుతుంది. మీనాక్షి అవసరం లేదన్నట్టు మాట్లాడినా.. 'కోడలు మాటకాదు అంటే.. బంధానికి విలువ పోతుంది'అంటూ ప్రభావతి తానే రోహిణి బిల్లు కూడా కట్టిస్తుంది.

మరోవైపు మీనాను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో బాలు ఒక సారీ కొనుగోలు చేసి ఇంటికి వస్తాడు. ఉదయం జరిగిన అపార్థాన్ని గుర్తు చేసుకుంటూ మీనా మాత్రం ఇంకా కోపంగానే ఉంటుంది. బాలు ఏమీ తెలియనట్టుగా నటిస్తూ 'నీ కోసం ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను' అంటూ క్యారీ బ్యాగ్ నుంచి సారీ తీసి ఇస్తాడు. అయితే మీనా వెంటనే కూల్ అవకుండా, 'కనీసం థాంక్స్ చెప్పొచ్చు కదా' అన్న బాలు మాటకు, 'మెచ్చుకునే వాళ్లు లేరని పూలతో పాటు ఆ చిరునవ్వును కూడా అమ్మేశా' అంటూ సెటైర్ వేస్తుంది.

అసలు ఏం జరిగిందో అడిగిన బాలుకు, మీనా తన మనసులోని బాధను బయటపెడుతుంది. ఉదయం అతడి కోసం ఎంతో కష్టపడి బీట్రూట్ దోస చేసినా, కనీసం టేస్ట్ ఎలా ఉందో కూడా అడగలేదని, పైగా డ్రైవింగ్‌లో ఉన్నానంటూ కోపంగా ఫోన్ కట్ చేశాడని చెప్పుతుంది. తనను మెచ్చుకుంటారని ఆశపడి పందెం వేసి రూ.500 కూడా ఓడిపోయానని బాధతో వివరిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బాలు తన తప్పును గ్రహించి, 'అది నాకు తెలియదు కదా'అంటూ వివరణ ఇస్తాడు.

అయినా మీనా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 'ఇప్పుడు బయటికి రాకపోతే నేను వెళ్లిపోతా' అంటూ బాలు హెచ్చరించినా, చివరకు మీనా సారీ కట్టుకుని బయటికి వస్తుంది. ఆమెను చూసిన బాలు పూర్తిగా ఇంప్రెస్ అయి, పొగడ్తలతో ముంచెత్తుతూ ఇకపై కోపపడనని మాట ఇస్తాడు. దీంతో మీనా కూడా కూల్ అయి, బాలుకు థాంక్స్ చెబుతుంది. ఈ సీన్‌తో వారి మధ్య ప్రేమ, అనుబంధం మళ్లీ బలపడుతుంది.

ఇక అప్కమింగ్ ఎపిసోడ్‌లో చింటూ తన పుట్టినరోజు వేడుకకు తల్లి ఇప్పుడే రావాలని మారం చేస్తాడు. అదే సమయంలో రోహిణి గిఫ్ట్స్‌తో సడన్ ఎంట్రీ ఇవ్వడంతో చింటూ సంబరపడిపోతాడు. ఇదే బర్త్‌డే పార్టీకి మీనా, బాలు కూడా వచ్చి చింటూ‌కు గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేయడంతో రోహిణి ఒక్కసారిగా కంగారు పడుతుంది. ఈ క్రమంలో బాలు-మీనా కంట రోహిణి పడుతుందా? చింటూ నిజంగా రోహిణి కొడుకనే నిజం బయటపడుతుందా? లేక ఎవరికి చెప్పకుండా రోహిణి పార్టీ నుంచి వెళ్లిపోతుందా? అన్న ఉత్కంఠ రాబోయే ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X