Gundeninda Gudigantalu May 22th Episode: గుణతో రోహిణి, మరో కుట్రకు ఫ్లాన్, శివతో బాలు సీక్రెట్ మిషన్ ,
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగి కథను కీలక మలుపు వైపు తీసుకెళ్లింది. ముఖ్యంగా రోహిణి చుట్టూ తిరిగిన అనుమానాలు మరింత బలపడుతూ ఇంట్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. బాలు ప్రభావంతో మనోజ్ కూడా రోహిణిని నేరుగా ప్రశ్నించగా, ఆమె తడబడటం అనుమానాలను పెంచింది. చివరికి గుణ దగ్గర అప్పు తీసుకున్న విషయాన్ని ఒప్పుకున్న రోహిణి, ఆ నిర్ణయం కుటుంబ అవసరాల కోసమేనని చెప్పి పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించింది. ఇక మరోవైపు 30 లక్షల మోసం కేసు కథలో ప్రధానాంశంగా మారింది. తండ్రి సత్యం బాధను చూసిన బాలు, మోసగాడిని పట్టుకుని డబ్బులు తిరిగి తెస్తానని మాట ఇస్తాడు.
ఈ క్రమంలో బాలు-మీనాలు టీవీ ఆర్టిస్ట్ కిరణ్‌ను కలవడం ద్వారా కీలక సమాచారం తెలుసుకుంటారు. విల్లా డీల్‌లో అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని కిరణ్ చెప్పడంతో మోసం వెనుక ఉన్న వ్యక్తిపై స్పష్టత పెరుగుతుంది. తర్వాత ధవలేశ్వరం వెళ్లిన బాలు-మీనాలు విల్లా విజయ్‌ను గుర్తించి ఎదుర్కొంటారు. అతడిని నిలదీసి డబ్బులు అడిగే సమయంలో క్లైమాక్స్ టెన్షన్ తారస్థాయికి చేరుతుంది. అయితే మనోజ్ నుంచి వచ్చిన అనవసర ఫోన్ కాల్స్ కారణంగా ఏర్పడిన గ్యాప్‌ను ఉపయోగించుకుని విజయ్ తప్పించుకోవడం పెద్ద ట్విస్ట్‌గా నిలిచింది. చేతికి చిక్కిన మోసగాడు తప్పించుకోవడంతో బాలు-మీనాలు నిరాశ చెందగా, కథ మరింత ఆసక్తికరంగా మారింది.

Courtesy: Jiohotstar
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. గత ఎపిసోడ్‌లో దొరికినట్టే దొరికి తప్పించుకున్న ఫేక్ విల్లా ఓనర్‌ను బాలు మళ్లీ పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, అతడు జారుకోవడంతో కథలో ఉత్కంఠ మరింత పెరిగింది. చివరకు నిరాశతో అక్కడే ఉన్న చేపలను ఫ్రీగా పంచిపెట్టి బాలు-మీనాలు ఇంటికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇంటి వాతావరణం మాత్రం మరింత వేడెక్కింది. మీనా వంట చేయకపోవడంతో ప్రభావతి కోపంతో మండిపడుతుండగా, అదే సమయంలో మనోజ్ తన ఫ్రెండ్‌ను తీసుకురావడం పరిస్థితిని మరింత అసౌకర్యంగా మార్చింది. గేటు మూయకపోవడంపై ప్రభావతి చేసిన వ్యాఖ్యలు మనోజ్ ఫ్రెండ్‌ను ఇబ్బందికి గురిచేయగా, 30 లక్షల మోసం విషయం ప్రస్తావనతో ఇంట్లో ఉద్రిక్తత పెరిగింది. మనోజ్ మాటలు తడబడుతుండగా, అతని ఫ్రెండ్ కూడా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించడం పరిస్థితిని చల్లార్చలేకపోయింది.
ఇంతలో సత్యం ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తాడు. మీనా వంట చేయలేదన్న విషయంపై ప్రభావతిని ప్రశ్నిస్తూ ఆమెకు క్లాస్ ఇస్తాడు. అదే సమయంలో రోహిణి సహాయం చేయాలని ముందుకొచ్చినా, పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ సమయంలో బాలు-మీనాలు ఇంటికి చేరుకుని జరిగిన సంఘటనలన్నింటినీ వివరించడం కథలో కీలక మలుపు తీసుకొచ్చింది. బాలు చెప్పిన వివరాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. 30 రూపాయల కోసం మనోజ్ చేసిన ఫోన్ కాల్స్ కారణంగా మోసగాడు తప్పించుకున్నాడని చెప్పడంతో కోపం మరింత పెరిగింది. ఇదే సమయంలో రోహిణి మాట్లాడిన తీరు అనుమానాలకు తావిచ్చింది. "మా డబ్బులు మేమే వెతుక్కుంటాం" అంటూ ఆమె గాటుగా స్పందించడంతో, బాలు ఆమెపై అనుమానం వ్యక్తం చేశాడు. రోహిణి ఏదో ప్లాన్ వేస్తోందని, డబ్బుల విషయంలో మరో ఎత్తుగడ వేసే అవకాశం ఉందని అతడు స్పష్టం చేశాడు.
ఈ క్రమంలో మీనా కూడా తనవంతుగా స్పందిస్తూ, తాను ముందుగానే వంట చేసి వెళ్లానని చెప్పడం ద్వారా ప్రభావతికి గట్టి సమాధానం ఇచ్చింది. వెంటనే బాలు కూడా "వంటగదిలో ఏం జరుగుతుందో తెలియని వాళ్లు 30 లక్షలు ఎలా తెస్తారు?" అంటూ రోహిణికి ఘాటుగా కౌంటర్ ఇవ్వడం ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ కుటుంబంలో పెరుగుతున్న అనుమానాలు, డబ్బుల మిస్టరీ, పాత్రల మధ్య ఘర్షణలతో కథను మరింత ఆసక్తికరంగా మార్చింది.
మరో వైపు విద్య-గిరి సన్నివేశాలు కథకు వినోదంతో పాటు భావోద్వేగాన్ని కూడా జోడించాయి. గతంలో జరిగిన సంఘటనపై తన తప్పును గ్రహించిన విద్య, బాలు స్నేహితుడు గిరికి సారీ చెప్పడానికి ముందుకొస్తుంది. అయితే ఆమెను చూసిన గిరి భయంతో అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో సీన్ కొంత హాస్యంగా మారింది. చివరకు అతన్ని ఆపి, "ఆరోజు మీరేమిటో అర్థం చేసుకోకుండా కొట్టాను... నాదే తప్పు" అంటూ విద్య క్షమాపణ చెప్పడం ఆమె పాత్రలో వచ్చిన మార్పును చూపించింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా ఆసక్తికరంగా సాగింది.
గిరి తన స్టైల్లో "మీరు మాటలు తక్కువ మాట్లాడుతారు కానీ చేతులు ఎక్కువగా ఉపయోగిస్తారు" అంటూ చెప్పడం నవ్వు తెప్పించింది. దీంతో విద్య కూడా కూల్‌గా స్పందించి, ఇకపై జాగ్రత్తగా ఉంటానని చెబుతూ ఫ్రెండ్స్‌గా షేక్‌హ్యాండ్ ఇస్తుంది. అయితే వెంటనే జరిగిన చిన్న సంఘటన మరోసారి పెద్ద మిస్ అండర్‌స్టాండింగ్‌కు దారితీసింది. స్కూటీ ఎక్కే సమయంలో విద్య చున్నీ టైర్‌లో ఇరుక్కోవడంతో గిరి సహాయం చేయడానికి ప్రయత్నించగా, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న విద్య మళ్లీ అతనిపై చేయి చేసుకోవడం సన్నివేశాన్ని హాస్యభరితంగా మార్చింది. దీంతో గిరి "ఈ అమ్మాయిని మళ్లీ కలవకూడదు" అన్నట్లు భయంతో అక్కడి నుంచి పారిపోవడం ఎపిసోడ్‌కు కామెడీ హైలైట్‌గా నిలిచింది.
ఇంటికి చేరుకున్న విద్య మాత్రం ఈ ఘటనపై ఆలోచిస్తూ కనిపిస్తుంది. తన చున్నీని చూసి మరోసారి తాను చేసిన తప్పును గుర్తించి బాధపడుతుంది. గిరి లాంటి మంచి వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకున్నానని ఫీలవుతూ, ఎలాగైనా మళ్లీ అతన్ని కలవాలని నిర్ణయించుకోవడం ఆమె మనసులో మార్పును స్పష్టం చేసింది. ఈ సమయంలో రోహిణి ఎంట్రీ ఇవ్వడం కథను మళ్లీ సీరియస్ ట్రాక్‌లోకి తీసుకెళ్లింది.
రోహిణి విద్యతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే, విద్య మాత్రం గిరి గురించే ఆలోచిస్తూ ముసిముసి నవ్వులు నవ్వడం ఆసక్తికరంగా మారింది. దీనిని గమనించిన రోహిణి, ఆమెను ఆటపట్టిస్తూ "నేను ఇక్కడ టెన్షన్‌లో ఉన్నాను... నువ్వేమో రొమాంటిక్ మోడ్‌లో ఉన్నావ్" అంటూ సెటైర్ వేయడం సీన్‌కు లైట్ మూడ్ ఇచ్చింది. అయితే వెంటనే అసలు విషయానికి వచ్చి 30 లక్షల మోసం కేసులో కీలక క్లూ దొరికిందని రోహిణి వెల్లడించడం కథను మళ్లీ ఉత్కంఠ వైపు మళ్లించింది.
సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మోసగాళ్ల ముఖాలు బయటపడే అవకాశం ఉందని చెప్పిన రోహిణి, ఆ ఫుటేజ్ దొరికితే వారిని సులభంగా పట్టుకోవచ్చని తన ప్లాన్‌ను వివరిస్తుంది. అయితే ఈ ప్లాన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని కూడా బయటపెట్టింది. బాలు-మీనాలు డబ్బులు రాబడితే తమకు రావాల్సిన వాటా రాదని, డీలర్లకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేమని భావించి వారిని వెతకవద్దని వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పడం షాకింగ్‌గా మారింది.
రోహిణి మాటల్లో దాగిన స్వార్థం గమనించిన విద్య, ఈ వ్యవహారంలో తాను ఇన్వాల్వ్ కావాలనుకోవడం లేదని స్పష్టం చేస్తుంది. "నీకు నచ్చినట్టు చేసుకో... కానీ నన్ను మాత్రం ఈ ప్లాన్‌లో లాగొద్దు" అంటూ క్లియర్‌గా చెప్పడం ఆమె పాత్రలో ఉన్న నైతికతను చూపించింది. మొదట విద్య సహాయం తీసుకోవాలని అనుకున్న రోహిణి, ఇప్పుడు గుణ సహాయం తీసుకోవాలని నిర్ణయించుకోవడం కథలో మరో కీలక మలుపు తీసుకొచ్చింది.
ఇక కథ మరో కీలక దిశగా మళ్లింది. బాలు తన బామ్మర్ది శివను కలిసి వీడియో లీక్ వ్యవహారంపై చర్చించడం సస్పెన్స్‌ను మరింత పెంచింది. తన ఫోన్‌లోనే ఉన్న సీసీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందో అర్థం కావడం లేదని బాలు చెప్పడం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. ఈ విషయంలో శివ వ్యక్తం చేసిన అనుమానం కథలో కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది. "మనకు గుణకు మధ్య ఎక్కడో ఒక ఇంటర్ లింక్ ఉంది... అది బయటపడితే అసలు నిందితుడు ఎవరో తెలుస్తుంది" అన్న శివ మాటలు కీలక క్లూగా మారాయి.
దీంతో బాలు కూడా వెంటనే ప్లాన్ సిద్ధం చేస్తాడు. గుణ స్నేహితులతో కాంటాక్ట్‌లోకి వెళ్లి, వారికి తెలియకుండా ఈ వీడియో లీక్ విషయాన్ని తెలుసుకోవాలని శివకు సూచిస్తాడు. చిన్న క్లూ దొరికినా అసలు మిస్టరీ బయటపడుతుందని భావిస్తాడు. అయితే ఈ ప్లాన్‌పై మీనా అభ్యంతరం వ్యక్తం చేయడం మరో ట్విస్ట్. మళ్లీ గుణతో సంబంధాలు పెట్టుకోవడం ప్రమాదమని ఆమె హెచ్చరిస్తుంది. కానీ బాలు మాత్రం శివ మారిపోయాడని, ఇప్పుడు తప్పులు చేయడని నమ్మకం వ్యక్తం చేస్తూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటాడు. దీంతో శివ కూడా గుణపై నిశితంగా కన్నేయాలని నిర్ణయించుకుంటాడు.
ఇక మరోవైపు రోహిణి తీసుకున్న నిర్ణయం కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. 30 లక్షల మోసం వ్యవహారంలో సహాయం కోసం నేరుగా గుణను కలవడం పెద్ద ట్విస్ట్‌గా మారింది. విల్లా కొనుగోలు పేరుతో ఒక వ్యక్తి తనను మోసం చేశాడని చెప్పి గుణను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో గుణ స్పందన కూడా గమనార్హం. "మొదటినే చెప్పుంటే అప్పుడే వాడిని పట్టుకునేవాడిని" అంటూ రోహిణిపై వ్యాఖ్యానించడం అతని పాత్రను బలంగా చూపించింది.
అంతటితో ఆగకుండా గుణ డీల్ కూడా సెట్ చేయడం కథలో కీలక మలుపు. సాధారణంగా అందరి దగ్గర నుంచి 4 శాతం తీసుకునే తాను, రోహిణి దగ్గర మాత్రం 2 శాతం మాత్రమే తీసుకుంటానని చెప్పడం వెనుక ఏదో లెక్క ఉందనే అనుమానం కలుగుతోంది. అంటే 30 లక్షలపై కేవలం 60,000 రూపాయలతో డీల్ క్లోజ్ చేయడం సింపుల్‌గా కనిపించినా, దీని వెనుక పెద్ద ప్లాన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాలతో కథలో ఉత్కంఠ మరింత పెరిగింది. ఒకవైపు వీడియో లీక్ మిస్టరీ, మరోవైపు 30 లక్షల రికవరీ కోసం గుణ ఎంట్రీ... ఈ రెండు ట్రాక్‌లు కలిసిపోవడంతో కథ మరింత కాంప్లెక్స్‌గా మారుతోంది. ముఖ్యంగా రోహిణి ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పులు, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు అనుమానాలకు తావిస్తున్నాయి. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో సస్పెన్స్, స్ట్రాటజీ, అనుమానాలు అన్నీ కలిసిపోయి కథను హై వోల్టేజ్ దిశగా తీసుకెళ్లాయి. రాబోయే ఎపిసోడ్‌లలో గుణ పాత్ర ఎంత కీలకంగా మారుతుంది? శివ బయటపెట్టే నిజాలు ఏమిటి? ముఖ్యంగా రోహిణి అసలు గేమ్ ఏమిటి? అన్న ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications