Gunde Ninda Gudi Gantalu January 7th Episode: బాలు చారిత్రత్మాక నిర్ణయం.. కొడుకు జీవితంతో రోహిణి చెలగాటం..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే బాలు, మీనా గుడికి వెళ్లి చింటూని దత్తత తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని దేవుడినే అడగాలని నిర్ణయిస్తారు. చిట్టీలు వేసిన తర్వాత 'దత్తత తీసుకోవద్దు' అనే చీటీ మీనా చేతికి రావడంతో ఆమె భయపడిపోతుంది. వెంటనే ఈ పని చేయొద్దని బాలును హెచ్చరిస్తుంది. కానీ బాలు మాత్రం ఇది దేవుడి సంకేతం కాదని, మంచి పని చేయాలనుకుంటే భయపడాల్సిన అవసరం లేదని లైట్‌గా తీసుకుంటాడు. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందామని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు ప్రభావతి డ్యాన్స్ స్కూల్‌కు ఆరుగురు స్టూడెంట్స్ రావడంతో ఆమె ఆనందంతో మురిసిపోతుంది. అయితే వారిలో ఇద్దరు లవర్స్ కావడం, ఆ అబ్బాయి ప్రభావతిని మెప్పించేందుకు అతివినయంగా ప్రవర్తించడం రాబోయే ప్రమాదానికి సంకేతంగా కనిపిస్తుంది. డ్యాన్స్ పేరుతో బయట కలవలేని ప్రేమజంట స్కూల్‌ను అడ్డాగా మార్చుకోవడం కథకు కొత్త మలుపు ఇస్తుంది. ఇక ఇంట్లో రవి, శృతి మధ్య సరదా సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. శృతిని బతిమాలిన రవి బయటకు తీసుకెళ్తానని చెప్పగా, ఆమె షాపింగ్, సినిమా, డిన్నర్ అంటూ పెద్ద లిస్ట్ పెడుతుంది. దీనిపై ఇద్దరి మధ్య సరదా మాటల యుద్ధం నడుస్తుంది.

చింటు బర్త్‌డే సందర్భంగా అతని అమ్మమ్మ ప్రవర్తనపై బాలు, మీనా తీవ్రంగా మండిపడతారు. అదే సమయంలో రోహిణి మరింత ఇరుక్కునేలా తల్లి సుగుణకు ఫోన్ చేసి, దత్తత విషయంతో వస్తే గట్టిగా తిట్టి పంపించమని చెబుతుంది. వెంటనే మీనా చేసిన ఫోన్ కాల్‌ను చింటు ఎత్తగా, అతని అమ్మమ్మ వాళ్లను అవమానించేలా మాట్లాడటం బాలు, మీనాల చెవిన పడుతుంది. ఇదే ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచి, రాబోయే ఎపిసోడ్‌పై ఉత్కంఠను పెంచింది.
ఇక బుధవారం ఎపిసోడ్‌లో చింటూ దత్తత విషయం ఇంట్లో చెప్పాలని బాలు నిర్ణయించుకుంటాడు. ఎలా చెప్పాలని కాలు గాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ కంగారుగా ప్రవర్తిస్తాడు. దీనిని గమనించిన సత్యం, 'ఏంట్రా బాలు... ఏమైంది?'అని అడగగా, బాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'నేను ఓ చారిత్రాత్మక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాను'అంటూ షాకింగ్ కామెంట్ చేస్తాడు. ఇక మీనా ఇంట్లో ఉన్న వారందరినీ హాల్‌లోకి పిలుస్తుంది.
ముందుగా అక్కడికి వచ్చిన ప్రభావతి, ఎప్పటిలాగే హేళనగా 'ఏంట్రా ఆ సంచలన నిర్ణయం? మీ ఇద్దరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతున్నారా?'అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది. దీనికి బాలు కూడా ఏమాత్రం తగ్గకుండా, 'మీ ఇద్దరి మధ్య నుంచి బయటికి వెళ్తే నువ్వు అడుక్క తినాలి. మనోజ్ గాడు ఎప్పుడో ఈ ఇంటిని మింగేస్తాడు'అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తాడు. దీంతో ప్రభావతి ఒక్కసారిగా సైలెంట్ అవుతుంది.
అసలు విషయం ఏంటని సత్యం అడగగానే, బాలు నిజాన్ని బయటపెడతాడు. తాము చింటూ పుట్టినరోజుకు వెళ్లినప్పుడు అతడి కన్న తల్లి గురించి అసలు నిజం తెలిసిందని చెబుతాడు. ఇన్నాళ్లు "అత్త"గా చెప్పిన ఆవిడే నిజానికి చింటూ అమ్మ అని, ఆమె దుబాయ్‌లో ఉంటుందని వెల్లడిస్తాడు. ఈ మాటలు వింటూ బయట నుంచే రోహిణి కంగారుతో వణికిపోతుంది. 'ఎక్కడ నా బాగోతం బయటపడుతుందో' అని భయపడుతుంది. బాలు అక్కడితో ఆగకుండా మరిన్ని షాకింగ్ విషయాలు చెబుతాడు. చింటూ అమ్మ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తుందని, కానీ కొడుకుపై అసలు ప్రేమ లేదని, ప్రపంచానికి 'నా కొడుకు'అని చెప్పడానికి ఇష్టపడటం లేదని, పైగా మరో పెళ్లి కూడా చేసుకుందని చెబుతాడు. దీంతో ఇంట్లో ఉన్నవారంతా అవాక్కవుతారు.
సత్యం 'తన కొడుకును కొడుకులా చూడని తల్లి కూడా తల్లేనా? అలాంటి తల్లి ఉన్నా లేకున్నా ఒకటే'అంటూ గట్టిగా మాట్లాడతాడు. శృతి అయితే మరింత ఆగ్రహంతో 'ఇలాంటి వ్యక్తిని షూట్ చేసి పడేయాలి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. మనోజ్ కూడా తనదైన శైలిలో 'అది లేడీ కాదు, కిలాడి... దుబాయ్‌లో ఎవడో ఒకడిని బకరా చేసి పెళ్లి కూడా చేసుకుని ఉంటుంది'అంటాడు. ఇక ప్రభావతి అయితే 'అలాంటి ఆడవాళ్లు ఆ కుటుంబానికి శత్రువులు... అలాంటి వాళ్లు ఉంటే ఆ వంశం నాశనం అవుతుంది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది.
ఈ పరిస్థితుల మధ్య బాలు-మీనా తమ మనసులోని నిర్ణయాన్ని చెబుతారు. 'చింటూ బాధ మేం అర్థం చేసుకున్నాం. తల్లి ఉన్నా తల్లి ప్రేమ దొరకని వాడి పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అందుకే వాడిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాం' అని బాలు చెబుతాడు. ఈ మాటలతో ఇంట్లో వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే ప్రభావతి మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గదు. ' ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను అస్సలు ఒప్పుకోను' అంటూ తెగేసి చెబుతుంది. దేవుడే దిగివచ్చి చెప్పినా ఈ విషయంలో వెనక్కి తగ్గనని, ఇదేమైనా ఆశ్రమమా? తల్లికి అక్కర్లేని వాడు మనకు అవసరమా?'అంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కావాలంటే బట్టలు కొనివ్వండి, స్కూల్ ఫీజులు కట్టండి కానీ 'ఎవడికో పుట్టిన వాడిని నా ఇంట్లోకి తీసుకురానివ్వను'అంటూ తన నిర్ణయాన్ని చెబుతుంది.
ఈ వాదోపవాదాలన్నీ బయట నుంచే వింటున్న రోహిణి, సరైన సమయం చూసుకుని లోపలికి వస్తుంది. ఈ విషయంలో ఆమె అభిప్రాయం కూడా తెలుసుకోవాలని బాలు భావించినా, రోహిణి ఏం చెప్పాలో తెలియక సందిగ్ధంలో పడుతుంది. అప్పుడు సత్యం మాట్లాడుతూ, 'బాలు తీసుకున్న నిర్ణయం మంచిదే. కానీ తరాలు, వారసత్వం, మన రక్తం అని మనం నమ్ముతాం. అందుకే ఇది తొందరగా జీర్ణం కాదు' అంటాడు. అంతేకాదు, ఈ విషయంలో చింటూ అమ్మమ్మ నిర్ణయం, అలాగే ఆ పిల్లవాడికి ఇక్కడికి రావాలనే ఇష్టం కూడా ఉండాలని చెబుతాడు. అయితే ఈ మాటలన్నింటి మధ్య కూడా ప్రభావతి, మనోజ్ మాత్రం చింటూ దత్తతను పూర్తిగా ఖండిస్తారు.
ఇక రోహిణి ఒంటరిగా కూర్చుని చింటూ గురించి ఆలోచనల్లో మునిగిపోతుంది. చింటూని దత్తత తీసుకుని బాలు-మీనా ఇంటికి తీసుకొస్తే, తన గతం మొత్తం బయటపడుతుందని, అప్పటివరకు కాపాడుకుంటూ వచ్చిన తన భాగోతం ఒక్కసారిగా వెలుగులోకి వస్తుందని భయపడుతుంది. అలా జరిగితే తన ఇంట్లో తనకు ఎలాంటి స్థానం ఉండదన్న ఆందోళన ఆమెను పూర్తిగా కుదిపేస్తుంది. ఈ భయంతోనే వెంటనే తల్లికి ఫోన్ చేసి, ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని వివరంగా చెబుతుంది.
ఫోన్‌లో 'బాలు-మీనా తో మాట్లాడవద్దని నేను ముందే చెప్పానుకదా... ఈరోజు ఈ సమస్య అంతా నీ వల్లే వచ్చింది. వాళ్లతో ఎందుకు మాట్లాడుతున్నావ్?' అంటూ రోహిణి గట్టిగా మందలిస్తుంది. అంతేకాదు, 'అందరి ముందే వాళ్లు చింటూని దత్తత తీసుకుంటామని చెప్పారు'అని రోహిణి చెప్పడంతో పరిస్థితి మరింత టెన్షన్‌గా మారుతుంది. అయితే రోహిణి ఊహించినట్లుగా కాకుండా, ఈ నిర్ణయం విన్న సుగుణమ్మ మాత్రం చాలా సంతోషపడుతుంది. చింటూ దత్తత వల్ల భవిష్యత్తులో తమ కుటుంబానికి మంచి జరుగుతుందని, తమకు ఒక స్థిరమైన జీవితం దొరుకుతుందని భావిస్తుంది. కానీ ఈ ఆనందాన్ని రోహిణి ఏమాత్రం అంగీకరించదు.
'నా కొడుకును నేను ఎవరికీ దత్తత ఇవ్వను' అంటూ రోహిణి చెబుతుంది. ఈ విషయంలో అనవసరంగా బాలు-మీనా తో మాట్లాడవద్దని, వాళ్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవద్దని, వాళ్లు ఇంటికి వచ్చిన బయటకు పంపించమని ఘాటుగా హెచ్చరిస్తుంది. సుగుణమ్మకు ఈ నిర్ణయం నచ్చకపోయినా, చివరికి ' సరే'అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇక మరోవైపు బాలు, మీనా కూడా చింటూ గురించే ఆలోచనలో మునిగిపోతారు. ఎలాగైనా సుగుణమ్మను ఒప్పించి చింటూని ఇంటికి తీసుకురావాలనే పట్టుదల బాలు చూపిస్తాడు. వెంటనే మీనా దగ్గరికి వెళ్లి, 'సుగుణమ్మకి ఫోన్ చేయి... మన నిర్ణయం ముందే చెప్పేద్దాం' అని అంటాడు. అయితే మీనా మాత్రం కాస్త ఆచితూచి మాట్లాడుతుంది. ' ఇంట్లో వాళ్లందరూ ఒప్పుకున్నాకే ఏ నిర్ణయం అయినా తీసుకుందాం'అని చెబుతుంది. కానీ బాలు తన పట్టు విడవడు. 'ముందు ఫోన్ చేసి మాట్లాడుదాం' అంటూ మీనాను ఒత్తిడి చేస్తాడు. దీంతో మీనా సుగుణమ్మకి ఫోన్ చేస్తుంది. కానీ కాసేపటి క్రితం రోహిణి చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో, చివరి క్షణంలో ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టేస్తుంది.
ఈ విషయాన్ని గమనించిన చింటూ, 'మీనా ఆంటీ... ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు?'అని అమాయకంగా ప్రశ్నిస్తాడు. సుగుణమ్మ 'నీకు అమ్మ ప్రేమ కావాలా... మీనా ఆంటీ కావాలా?'అని అడగడంతో, చింటూ ఒక్క క్షణం ఆలోచించకుండా 'అమ్మ కావాలి'అని చెబుతాడు. వెంటనే సుగుణమ్మ, 'ఇకపై మీనా ఆంటీతో గానీ, బాలు అంకుల్‌తో గానీ మాట్లాడొద్దు'అని చెబుతుంది. చింటూ కూడా ఏమీ తెలియనట్టు 'సరే'అని అంగీకరిస్తాడు. ఈ సీన్‌లో చింటూ అమాయకత్వం కలచివేస్తుంది. సుగుణమ్మ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాలు తీవ్రంగా ఆలోచనలో పడతాడు. 'ఏం జరిగి ఉంటుంది? ఎందుకు రెస్పాండ్ కావడం లేదు?'అంటూ మీనాను ప్రశ్నిస్తాడు.
అప్పుడు మీనా చాలా మెచ్యూర్‌గా స్పందిస్తుంది. 'ఇది చింటూ భవిష్యత్తు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు. ఇక్కడికి వచ్చాక చింటూ సంతోషంగా ఉండాలి కానీ ఇబ్బందులు పడకూడదు. అందరూ ఒప్పుకున్నాకే దత్తత గురించి ఆలోచిద్దాం'అని తన అభిప్రాయాన్ని చెబుతుంది. దీనికి బాలు కొంచెం ఎమోషనల్‌గా, 'నీకు దత్తత తీసుకోవడం ఇష్టం లేదా?'అని అడుగుతాడు. మీనా మాత్రం స్పష్టంగా, 'నీ ఆలోచన నాకు ఇష్టం. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అందరినీ కాదని ఒక నిర్ణయం తీసుకుంటే అది చింటూకే నష్టం. కాస్త ఆలోచించి ముందుకు వెళ్దాం'అంటుంది. ఈ మాటలు బాలు మనసును తాకుతాయి. అతడు కూడా కాస్త ఆలోచనలో పడతాడు.
ఇక ఎపిసోడ్ చివర్లో రోహిణి తన ఫ్రెండ్‌ను కలుసుకుని ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని వివరంగా చెబుతుంది. మీనా తీసుకున్న నిర్ణయాన్ని ఆమె ఫ్రెండ్ కూడా సమర్థిస్తుంది. కానీ రోహిణి మాత్రం 'నాకు ఇది నచ్చడం లేదు. సమయం చూసుకుని నేనే ఇంట్లో అసలు నిజం చెబుతాను' అంటూ మరోసారి షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాదు, చింటూని బాలు-మీనా నుంచి దూరం చేయాలని, తన ఫ్యామిలీని సిటీకి షిప్ట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తుంది.
అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఈ కథ మరింత మలుపు తిరగబోతోంది. రోహిణి తన ప్లాన్‌లో భాగంగా మొదట మెటర్నిటీ హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్లను కలుస్తుంది. 'ఇంతకుముందే నాకు ఒక కొడుకు పుట్టాడు... ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను' అని చెబుతుంది. అయితే అదే హాస్పిటల్‌లో రోహిణిని చూసిన మీనా చెల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. 'ఇక్కడ తనకేం పని? ఎందుకు వచ్చింది?' అనే అనుమానంతో వెంటనే మీనాకు ఫోన్ చేసి విషయం చెబుతుంది. ఈ హాస్పిటల్ ట్విస్ట్‌తో రోహిణి ప్లాన్ బయటపడుతుందా? చింటూ నిజం అందరికీ తెలుస్తుందా? అనే ప్రశ్నలతో సీరియల్ మరింత ఉత్కంఠభరితంగా మారింది.


Click it and Unblock the Notifications











