Gunde Ninda Gudi Gantalu January 9th Episode: మీనా త్యాగం.. రోహిణి మాస్టర్ ప్లాన్.. కోడలిపై ప్రభావతికి అనుమానం

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ లో ఆసక్తికర ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఎపిసోడ్ ప్రారంభంలో రోహిణి తన స్నేహితురాలిని కలుసుకుని ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ చెబుతుంది. బాలు, మీనా చింటూని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారని, కానీ మనోజ్ ఒప్పుకోవడం లేదని వెల్లడిస్తుంది. రోహిణి ఫ్రెండ్ మాత్రం ఇది మంచి నిర్ణయమని, చింటూ భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని చెప్పినా, రోహిణి మాత్రం తాను బతికుండగా దత్తతకు ఒప్పుకోనని స్పష్టం చేస్తుంది. ముందుగా తానే పిల్లలను కనాలని, ఆ తర్వాత చింటూని ఇంటికి తీసుకురావాలని తన ప్లాన్‌ను వెల్లడించడంతో ఫ్రెండ్ అసంతృప్తిగా వెళ్లిపోతుంది.

ఇక మరోవైపు మీనాకు ఆమె చెల్లి సుమతి ఫోన్ చేసి డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయి కాలేజ్ టాపర్‌గా నిలిచిందని చెప్పడంతో మీనా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. విషయం తెలిసిన బాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తాడు. అయితే ప్రభావతి మాత్రం ఈ శుభవార్తను తేలిగ్గా తీసుకుంటూ వెటకార వ్యాఖ్యలు చేయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. మీనా తన తల్లి పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతుంటే, సత్యం ఆమెకు మద్దతుగా నిలుస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 594 January 9th 2025 here is full story

Photo Courtesy: JioHotstar

ఇంతలో శృతి, రవి వచ్చి ప్రభావతికి గట్టి కౌంటర్ ఇస్తారు. సుమతి విజయం సెలబ్రేట్ చేసుకోవాలని బిర్యానీ, గిఫ్ట్ ప్లాన్స్ వేస్తారు. మరోవైపు ఆఫీస్‌లో రోహిణి లెక్కలు చూసి మనోజ్ ఖర్చులపై షాక్ అవుతుంది. నెలకు రూ.30 వేల భోజన ఖర్చు, రూ.10 లక్షల క్రెడిట్ కార్డు ఆఫర్ రావడం క్లైమాక్స్‌గా మారింది, మనోజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ భవిష్యత్తులో సమస్యలకు దారి తీస్తుందన్న సంకేతాలతో ఎపిసోడ్ ముగిసింది.

గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ మొత్తం ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలో మనోజ్‌కు క్రెడిట్ కార్డు ఆఫర్ రావడంతో అతడు తెగ ఎగ్జైట్ అవుతాడు. దీనిని బిజినెస్‌కు ఉపయోగపడే అవకాశంగా చూస్తాడు. కానీ రోహిణి మాత్రం క్రెడిట్ కార్డులు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు దారి తీస్తాయని భయపడుతుంది. ఖర్చులకు అదుపు లేకుండా పోతుందని హెచ్చరిస్తుంది. మనోజ్ మాత్రం 'అవసరమైతే ఎవరి దగ్గర అడగాల్సిన పని ఉండదు'అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటాడు.

అతడి ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి రోహిణికి భవిష్యత్తుపై టెన్షన్ మొదలవుతుంది. రోహిణిని ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో మనోజ్ మళ్లీ మాటలు మార్చి, 'నువ్వు నా దేవతవు... నువ్వు షాప్‌కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది'అంటూ పొగడ్తలు కురిపిస్తాడు. క్రెడిట్ కార్డు వచ్చాక ఇద్దరం గోవా టూర్‌కు వెళ్దామని చెప్పి ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు.

ఇదిలా ఉండగా రోహిణికి తన కొడుకు చింటూ నుంచి ఫోన్ వస్తుంది.' అమ్మ నీతోనే ఉండాలనిపిస్తుంది' అంటూ తన మనసులోని కోరికను చెబుతాడు. దీంతో రోహిణి భావోద్వేగానికి లోనై, త్వరలోనే నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చుకుంటానని, నీకు కొత్త స్కూల్ కూడా చూసానని భరోసా ఇస్తుంది. అయితే చింటూ మాత్రం 'నేను నీ దగ్గర ఉంటే చాలు' అంటూ తల్లి ప్రేమకు కరిగిపోతాడు. ఇంతలోనే రోహిణికి గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. వెంటనే తన స్నేహితురాలు దివ్యకు ఫోన్ చేసి హాస్పిటల్‌కు వెళ్దామని చెబుతుంది. ఈ పరిణామం రాబోయే ఎపిసోడ్లకు ఆసక్తిని పెంచుతుంది.

మరోవైపు సుమతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావడంతో మీనా తల్లి పార్వతి ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. తాను పడ్డ కష్టానికి దేవుడు ఇచ్చిన ప్రతిఫలంగా భావిస్తూ స్వీట్లు పంచుతుంది. పొరుగింటి మహిళ వచ్చి సుమతిని, అలాగే పార్వతిని ప్రశంసించడంతో ఆమె వినమ్రంగా, "ఇది దేవుడి ఆశీర్వాదం... సుమతి కష్టపడి చదివింది" అంటూ కూతురిని మెచ్చుకుంటుంది.

ఇంతలోనే మీనా, బాలు ఇద్దరూ గుడికి చేరుకుంటారు. అక్కడికి రాగానే మీనా తన చెల్లి సుమతిని హగ్ చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. 'మొదటిసారి అమ్మ కళ్లల్లో ఇంత సంతోషం చూస్తున్నాను... ఇలాగే ఆమెను సంతోషంగా ఉంచు' అంటూ సుమతికి చెబుతుంది. బాలు కూడా తన స్టైల్‌లో 'ఈ కంగ్రాట్స్ చెప్పడానికి నేను గంటల నుంచే ఎదురుచూస్తున్నా' అంటూ ఫన్నీ కామెంట్ చేస్తాడు. సుమతి కన్వికేషన్ డ్రెస్‌లో కనిపించడంతో బాలు మెచ్చుకుంటాడు. దానికి సుమతి, ఇది కోర్టు లాయర్ డ్రస్ కాదని, కన్వికేషన్‌కు ఇచ్చేదని సరదాగా సమాధానం ఇస్తుంది.

ఆ తర్వాత సుమతి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనవుతూ మీనా చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తుంది. చదువుల్లో ఫస్ట్‌గా ఉన్న మీనా, తల్లిదండ్రుల కష్టాన్ని చూసి తన చదువును మానేసి, తమ్ముడు-చెల్లిని చదివించిందని చెబుతుంది. ఈ మాటలు విని బాలు షాక్ అవుతాడు. 'ఈ విషయం నాకు ఎప్పుడూ చెప్పలేదే?'అని అడుగుతాడు. మీనా మాత్రం సందర్భం రాలేదని చెప్పి మాట దాటేస్తుంది.

ఇక మరోవైపు రోహిణి తన ఫ్రెండ్ దివ్యతో కలిసి హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ రోహిణి తన అసలు ప్లాన్‌ను బయటపెడుతుంది. చింటూ పుట్టినప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని, కానీ పెళ్లయి ఏడాది అయినా కన్సీవ్ కాలేకపోతున్నానంటే ఏదో సమస్య ఉండొచ్చని డాక్టర్‌ను కలవాలని చెప్పినట్టు వెల్లడిస్తుంది. ఎలాగైనా కన్సీవ్ అయితే మనోజ్ క్షమిస్తాడని, అత్తయ్య కూడా తన గతాన్ని అంగీకరిస్తుందని చెప్పడంతో దివ్య షాక్ అవుతుంది.

అదే హాస్పిటల్‌కు సుమతి ఇంటర్వ్యూ కోసం మీనాతో వస్తుంది. ఇద్దరూ ఒకే చోట ఉన్నా, ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండటంతో ఎదురుపడరు. ఇక డాక్టర్ రోహిణికి శారీరకంగా ఎలాంటి సమస్య లేదని, కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరుగుతాయని సూచిస్తుంది. బయటకు వచ్చాక దివ్య, రోహిణి దాచిపెట్టిన విషయాలను వెటకారంగా ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగుతుంది. ఇదిలా ఉండగా సుమతి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి జాబ్ దక్కిందని మీనాకు ఫోన్ చేస్తుంది. ఈ శుభవార్తతో మీనా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. కానీ ఫోన్ పెట్టేముందు సుమతి, 'ఇంటర్వ్యూ సమయంలో రోహిణిని హాస్పిటల్‌లో చూశాను'అని చెప్పడంతో మీనాకు అనుమానం మొదలవుతుంది. ఈ అనుమానమే రాబోయే ఎపిసోడ్లలో కొత్త మలుపులకు దారి తీసేలా కనిపిస్తోంది.

రాబోయే ఎపిసోడ్‌లో కథ ఊహించని మలుపులు తిరగనుంది. మీనా ఇంట్లో స్వీట్లు చేసి అందరికీ పంచుతుంది. అసలు విషయం ఏమిటని రోహిణి అడగకముందే, "నువ్వు తల్లివి కాబోతున్నావు కదా... అందుకే ఈ స్వీట్" అంటూ మీనా ఇచ్చే ట్విస్టు ఇస్తుంది. కానీ వెంటనే రోహిణి 'నేను ప్రెగ్నెంట్ కాదు'అని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఈ మాటలు వినగానే ప్రభావతి నియంత్రణ కోల్పోయి,' నా ఆశలన్నీ అడియాశలు చేసింది నీ పెళ్లాం'అంటూ గట్టిగా అరుస్తుంది.ఇక రోహిణి మనోజ్ దగ్గరకు వెళ్లి, ఇద్దరం కలిసి హాస్పిటల్‌కు వెళ్లి చెక్ అప్ చేసుకుందామా అని అడుగుతుంది. అయితే మనోజ్ మాత్రం, ' కన్సీవ్ కానిది నువ్వు... నేను ఎందుకు చెక్ అప్ చేయించుకోవాలి?'అంటూ నిర్లక్ష్యంగా స్పందిస్తాడు.

దీంతో రోహిణి మరింత కోపంగా 'నీ మాజీ లవర్‌తో లివింగ్ రిలేషన్ లో ఉన్నావు కదా?'అంటూ అనుమానాన్ని బయటపెడుతుంది. ఈ మాటలు విన్న ప్రభావతి ఒక్కసారిగా మండిపడుతూ.. 'నువ్వు విదేశాల్లో ఉన్నప్పుడు మేమెప్పుడైనా నిన్ను అనుమానించామా?'అంటూ రోహిణిని నిలదీస్తుంది. అంతటితో ఆగకుండా, తర్వాత మనోజ్‌ను పక్కకు తీసుకుని, పెళ్లికి ముందు రోహిణి జీవితం మనకు పూర్తిగా తెలియదని, ఆమె ఏదో దాస్తున్నట్లుగా అనిపిస్తోందని ప్రభావతి షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. ఇలా అనుమానాలు, ఆరోపణలతో నిండిన ఉత్కంఠభరిత సన్నివేశాలతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. రాబోయే ఎపిసోడ్లలో రోహిణి గతం బయటపడుతుందా? చింటూ గురించి నిజం మనోజ్‌కు తెలిసిపోతుందా? అన్న ప్రశ్నలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X