Gunde Ninda Gudi Gantalu January 13th Episode:రొమాన్స్‌లో మునిగిన బాలు-మీనా.. మనోజ్-రోహిణి గోవా ట్రిప్!

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌ ఆద్యంతం అపార్థాలు, భావోద్వేగాలు, షాకింగ్‌ ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే సుమతి తన అక్క మీనాకు ఫోన్ చేసి ఉద్యోగం వచ్చిన శుభవార్త చెప్పడం సంతోషాన్ని తీసుకొచ్చింది. అయితే ఇంటర్వ్యూ సమయంలో మేటర్నిటీ హాస్పిటల్‌లో రోహిణిని చూసినట్టు చెప్పడం కథను అనూహ్య మలుపు తిప్పింది. ఈ మాటను మీనా తప్పుగా అర్థం చేసుకుని రోహిణి గర్భవతి అయ్యిందని అనుకోవడం పెద్ద అపార్థానికి దారితీసింది.

ఆనందంతో ఇంట్లో స్వీట్స్‌ చేసి 'మనింట్లో శుభవార్త' అంటూ అందరినీ పిలవడం, రోహిణిని తల్లి కాబోతున్నావని ప్రకటించడం ఒక్కసారిగా సంబరాల వాతావరణాన్ని సృష్టించింది. కానీ అసలు విషయం తెలియని రోహిణి తీవ్ర షాక్‌కు గురై ఆగ్రహంతో స్పందించింది. హాస్పిటల్‌కు వెళ్లినంత మాత్రాన ఇలా ఊహించుకోవడం ఎంత తప్పో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడం ఎమోషనల్‌గా మారింది. ప్రభావతి కూడా తన ఆశలు చిద్రమయ్యాయని మీనాపై కోపం చూపించడంతో, మీనా అపార్థంలో మిగిలిపోయింది.

Gunde Ninda Gudi Gantalu January 13th Episode

తర్వాత బాలు ప్రశ్నలతో అసలు నిజం బయటపడింది. అదే హాస్పిటల్‌లో సుమతికి ఉద్యోగం వచ్చిందని తెలిసి అందరూ సిగ్గుపడతారు. ఇక రోహిణి-మనోజ్ మధ్య సంభాషణ మరింత ఘర్షణకు దారి తీసింది. పిల్లల విషయం ప్రస్తావన, మనోజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రోహిణిని తీవ్రంగా కలచివేశాయి. ప్రభావతి వచ్చి మనోజ్‌కు మద్దతుగా మాట్లాడినా, ఈసారి రోహిణి వెనక్కి తగ్గకుండా గట్టిగా ప్రశ్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎపిసోడ్ చివర్లో ప్రభావతి మాటలు పూర్తిగా కొత్త అనుమానాన్ని రేకెత్తించాయి. రోహిణి గతం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు కథను డేంజర్ జోన్‌లోకి నెట్టేశాయి. ఈ అనుమానాలు ఏ దిశగా వెళ్లబోతున్నాయో అన్న ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రారంభంలో ప్రభావతి, మనోజ్‌ను పక్కకు తీసుకెళ్లి పర్సనల్‌గా మాట్లాడుతుంది. రోహిణి గతం గురించి తనకు అనుమానాలు ఉన్నాయని స్పష్టంగా చెబుతుంది. పెళ్లికాకముందు ఆమె ఎలా ఉండేది, ఏం చేసేది అన్నది మనకు పూర్తిగా తెలియదని, ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మడం మంచిది కాదని హెచ్చరిస్తుంది. రోహిణి గతం ఏంటో తెలుసుకోవాలని మనోజ్‌కు సూచిస్తుంది. అయితే మనోజ్ మాత్రం ప్రభావతి మాటలను పెద్దగా పట్టించుకోడు. రోహిణి తనకు అన్ని విషయాలు నిజాయితీగా చెబుతుందని, ఆమె చాలా మంచిదని సమర్థించే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభావతి మాత్రం లోకం తీరు తెలుసుకో, ప్రతి విషయాన్ని విచక్షణతో ఆలోచించు అంటూ గట్టిగా చెబుతుంది. ఈ మాటలు మనోజ్ మనసులో సందేహాల విత్తనాలు నాటుతాయి.

ఇక మరోవైపు బాలు దాబాపై కూర్చుని డబ్బులు లెక్కపెడుతూ కనిపిస్తాడు. ఇంటి ఖర్చులు, ఈఎంఐలు, రూమ్ కట్టడానికి అవసరమైన డబ్బు అంటూ లెక్కలు వేసుకుంటూ ఒత్తిడిలో ఉంటాడు. అప్పుడు మీనా వచ్చి అతడి పక్కన కూర్చుంటుంది. కానీ బాలు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో మీనా బుంగమూతి పెట్టుకుంటుంది. బాలు మాత్రం తన పనిలోనే మునిగిపోతాడు. ఈ సమయంలో ఎలాగైనా అతడిని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో మీనా తన చీర కొంగును బాలు ముఖంపై వేస్తుంది. దీంతో బాలు టెంప్ట్ అవుతాడు, పనిని పక్కన పెట్టి మీనా చెంత చేరుతాడు. మీనా తాను తల్లిని కావాలని, పిల్లలు కావాలన్న తన కోరికను బయటపెడుతుంది. అయితే బాలు మాత్రం ముందే అప్పులు, ఈఎంఐలు ఉన్నాయని, ఇప్పుడు పిల్లలు అంటే తానెళ్లలేనని కాస్త కఠినంగా మాట్లాడతాడు. అయినా మీనా మల్లెపూల వాసనతో బాలుని మళ్లీ ఆకర్షిస్తుంది. చివరికి ఇద్దరూ హగ్ చేసుకుంటూ రొమాన్స్‌లో మునిగిపోతారు. పూలగంప-ముళ్లకంపలా వారి ప్రేమ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరుసటి రోజు బాలు తన తండ్రి సత్యంతో మాట్లాడుతుండగా, మనోజ్ ఖరీదైన గిఫ్టులతో ఇంటికి వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు. ముందుగా రోహిణికి బంగారు తాళిబొట్టు ఇచ్చి ఆమెను ఆనందంలో ముంచేస్తాడు. అలాగే తల్లి ప్రభావతిని ఇంప్రెస్ చేయడానికి పట్టు చీర తీసుకొస్తాడు. చీర ఖరీదు పాతిక వేలని తెలిసి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ సమయంలో బాలు నాన్నకు ఏమి తీసుకొచ్చావని అడగగా, మనోజ్ వచ్చి తీసుకొచ్చానని చెబుతాడు. కానీ ప్రభావతి అడ్డుపడి, సత్యం రిటైర్డ్ అయిపోయాడు, డ్యూటీలేమీ లేవు అంటూ అతడిని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఈ మాటలతో ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారుతుంది.

మనోజ్ తన ఖరీదైన వాచ్‌ను చూపిస్తూ అందరి ముందు గొప్పగా మాట్లాడటం మొదలుపెడతాడు. "నీతో మనోజ్ అయిన ఈ వాచ్ నాకోసం తీసుకున్నాను... దీని ఖరీదు 50 వేలు" అని చెప్పగానే ఇంట్లో ఉన్నవారంతా షాక్ అవుతారు. ఒక్క వాచ్‌కు ఇంత ఖర్చా అనే ఆశ్చర్యం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో బాలు తన సహజమైన వ్యంగ్య శైలిలో పంచ్ వేస్తాడు. "నా వాచ్ 200 రూపాయలైనా మూడు ముళ్లు ఉన్న ఆగడియారానికి 50 వేలెందుకురా?" అని ప్రశ్నించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఈ మాటలను అవమానంగా తీసుకున్న మనోజ్ వెంటనే తన అహంకారాన్ని బయటపెడతాడు. "నేను బిజినెస్ మాన్... నీలా కార్ డ్రైవర్‌ని కాదు" అంటూ బాలు మీద నేరుగా దూషణ చేస్తాడు. ఈ మాటలు బాలు మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. కోపం కట్టలు తెంచుకునే స్థితికి వెళ్లినా, మీనా అడ్డుపడడంతో బాలు మౌనంగా ఉండిపోతాడు. ఆ మౌనం అతని లోపలి అగ్నిని మరింత భయంకరంగా చూపిస్తుంది.

అయితే మనోజ్ అహంకారం అక్కడితో ఆగదు. "నాన్న కోసం టవల్ తీసుకొచ్చాను" అంటూ తన తండ్రి సత్యం మీద టవల్ కప్పే ప్రయత్నం చేస్తాడు. ఇది చూసిన బాలు మరింత ఉప్పొంగిపోతాడు. "చూశావా నాన్న... వీడు నీ మీద చూపిస్తున్న ప్రేమ ఇదేనా?" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ సన్నివేశంలో తండ్రిని తక్కువ చేసే భావన స్పష్టంగా బయటపడుతుంది. వెంటనే ప్రభావతి కూడా రంగంలోకి దిగుతుంది. "ఖరీదైన గిఫ్టులు తీసుకొచ్చేసరికి ఎక్కలేని బుద్ధి బయటపడుతోంది" అంటూ మనోజ్‌ను గట్టిగా నిలదీస్తుంది. ఇంట్లో గొడవ మరింత పెద్దదవుతుందనే భయంతో రోహిణి, మనోజ్‌ను అక్కడి నుంచి గదిలోకి తీసుకెళ్తుంది.

గదిలోకి వెళ్లాక అసలు నిజం బయటపడుతుంది. రోహిణి చాలా ఆందోళనతో "ఇంతకీ ఇవన్నీ తీసుకోవడానికి డబ్బు ఎలా వచ్చింది?" అని ప్రశ్నిస్తుంది. దీనికి మనోజ్ చాలా నిర్లక్ష్యంగా "నాకు క్రెడిట్ కార్డు వచ్చింది... అదే కార్డుతో అన్నీ తీసుకున్నాను" అని సమాధానం ఇస్తాడు. ఇది విన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుల ఊబిలో మళ్లీ మనోజ్ చిక్కుకుంటాడేమోనని లోపల భయపడుతుంది. "ఇవన్నీ నిజంగా అవసరమా?" అని అడిగినా, మనోజ్ మాత్రం తన అహంకారాన్ని మరింతగా చూపిస్తూ "నేను బిజినెస్ మాన్‌ని... నా రేంజ్‌కి తగ్గట్టు ఉండాలి. నేను ఏం చేసినా రిచ్‌గా ఉండాలి" అంటూ తన గొప్పలను చాటుకుంటాడు. రోహిణి బయటకు మాత్రం సంతోషంగా ఉన్నట్టు నటించినా, లోపల మాత్రం భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళనలో మునిగిపోతుంది.

ఇంతటితో సరిపెట్టకుండా మనోజ్ మరో షాక్ ఇస్తాడు. "మనమిద్దరం గోవా వెళ్దాం" అంటూ రోహిణికి ట్రిప్ సర్ప్రైజ్ ఇస్తాడు. వద్దు అంటే మనోజ్ బాధపడతాడని భావించిన రోహిణి, మనసులో భయాన్ని దాచుకుని సరే అని అంగీకరిస్తుంది. ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో కొత్త సమస్యలకు దారితీయబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి.

ఇక మరోవైపు కథ మరింత ఉత్కంఠకు చేరుతుంది. శివ తన ఫ్రెండ్ గుణతో కలిసి ఒక సెటిల్‌మెంట్ కోసం వెళ్తాడు. అదే సమయంలో ఆ ఇంటికి చెందిన వ్యక్తిని బాలు కారులో తీసుకెళ్తాడు. అతడు అర్జెంట్ పని ఉందని తొందరగా తీసుకెళ్లమని అడుగుతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత తన బ్యాగ్ కారులోనే మర్చిపోయానని గుర్తిస్తాడు. దాంతో బాలు ఆ బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ శివ చేస్తున్న అరాచకాన్ని బాలు చూసిన తర్వాత ఏం చేస్తాడు? గుణకు, బాలుకు మధ్య గొడవ జరుగుతుందా? శివ-బాలు మధ్య మరోసారి పెద్ద ఘర్షణ తప్పదా? ఈ ప్రశ్నలతో ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X