Gunde Ninda Gudi Gantalu January 22th Episode: రోహిణి గతం వెలుగులోకి? ప్రభావతి వార్నింగ్‌తో ఇంట్లో తుఫాన్!

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ లో రోహిణి విషయంలో తెలిసిన షాకింగ్ నిజం తర్వాత మీనా ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఆ విషయాన్ని ఎవరికీ ఎలా చెప్పాలో తెలియక ఆమె అయోమయంలో పడుతూ నాన్‌సింక్‌గా ప్రవర్తించడం బాలును ఆందోళనకు గురిచేస్తుంది. అదే సమయంలో ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిన అర్జెంట్ కాల్ రావడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది.ఇంట్లో మీనా వింతగా ప్రవర్తించడాన్ని గమనించిన ప్రభావతి ఆమెపై మండిపడుతుంది. టీ అడిగితే కాఫీ తీసుకురావడం చిన్న విషయమే అయినా, దాన్ని పెద్ద గొడవగా మార్చి మీనాను అవమానిస్తుంది.

ఇదే సమయంలో రోహిణి, మనోజ్ స్వీట్స్‌తో ఇంటికి వచ్చి 'శుభవార్త' అంటారు. కానీ అది బిజినెస్ సేల్స్ గురించి అని తెలిసి ప్రభావతి తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. పిల్లల విషయం కాకుండా వ్యాపారం గురించే మాట్లాడుతున్నారంటూ వ్యంగ్యంగా స్పందిస్తుంది. ఈ అపార్థాల మధ్య బాలు పూలదండ, స్వీట్ బాక్స్‌తో ఇంట్లోకి రావడం ఎపిసోడ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ట్రాఫిక్ జామ్ కారణంగా మార్కెట్‌లోనే జరిగిన డెలివరీకి సహాయం చేసి తల్లి-బిడ్డలను కాపాడిన కథను బాలు వివరించడంతో అందరూ భావోద్వేగానికి గురవుతారు. బాలు చూపిన మానవత్వాన్ని కుటుంబసభ్యులు మెచ్చుకుంటారు. అయితే ఈ ఆనందం మధ్యలోనూ ప్రభావతి ఆస్తి, వారసత్వం గురించే మాట్లాడడం సత్యాన్ని ఆగ్రహానికి గురిచేస్తుంది. ఈ ఎపిసోడ్‌తో కుటుంబంలో కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యే సంకేతాలు కనిపించాయి.

Gunde Ninda Gudi Gantalu serial episode 603 January 22th 2026 here is full story

Photo Courtesy: jiohotstar

గురువారం ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, అనుమానాలు, షాకింగ్ సంభాషణలతో ఉత్కంఠభరితంగా సాగింది. ఊర్లో ఎవరికో పిల్లలు పుడుతుంటే, తమ ఇంట్లో మాత్రం పిల్లల గురించి ఎవరికీ ఆలోచన లేదంటూ ప్రభావతి నిరాశగా మాట్లాడటం ఎపిసోడ్‌కు మొదటి హైలైట్‌గా నిలిచింది. దీనికి సత్యం స్పందిస్తూ, అనవసరంగా టెన్షన్ పడవద్దని, ప్రతి ఒక్కరికీ ఒకే సమయానికి అన్నీ జరగవని, బాలు చేసిన పుణ్యం ఎక్కడికీ పోదని ధైర్యం చెప్పాడు. ఈ మాటలకు రవి కూడా మద్దతుగా, ముందుగా పెళ్లయింది బాలు అన్నయ్యకే కాబట్టి, పిల్లలు కూడా ముందుగా వారికే పుట్టడం సహజమని అన్నాడు.

అయితే ప్రభావతి మాత్రం దీనిని అంగీకరించకుండా, ఇంట్లో పెద్దవాడు మనోజ్ కాబట్టి ముందుగా అతడికే పిల్లలు పుట్టాలని, వారసత్వంగా వచ్చే ఆస్తి మనోజ్-రోహిణి పిల్లలకే ఇవ్వాలని అంటుంది. ఆమె మాటలు విన్న సత్యం 'ఇది మారదు' అంటూ అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోతాడు. ఈ సంభాషణలతో బాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పిల్లలు ఎదుగుతుంటే, అభివృద్ధి సాధిస్తుంటే ఓర్వలేకపోయే తల్లిని రోజూ చూస్తున్నానంటూ బాధపడతాడు. రవి కూడా ఇలాంటి ప్రైవేట్ విషయాలను నలుగురిలో మాట్లాడాల్సిన అవసరం లేదంటూ ప్రభావతిపై కోప్పడతాడు. శృతి సైతం ఇలాంటి సెన్సిటివ్ విషయాలను పదిమందిలో చర్చించడం ఆంటీకి అలవాటైపోయిందేమో అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది.

ఇదిలా ఉండగా మరోవైపు రోహిణి విషయం బయటపడితే ఏమవుతుందోనన్న భయంతో మీనా తీవ్రంగా కంగారుపడుతుంది. ఎవరు ఈ విషయం తెలుసుకున్నారు? ఎవరికైనా చెప్పారా? అని ఆందోళన చెందుతుంది. ఈ సమయంలో బాలు వచ్చి, తన వీడియో వైరల్ అవుతున్న విషయం మీనాకు చూపిస్తాడు. అయితే మీనా ఆశించినట్టుగా సంతోషించదు. అసలు నీకేం అయిందని బాలు ప్రశ్నిస్తే, ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మనుషులు, చెట్లు, జీవులు అంటూ వేదాంతంలా మాట్లాడుతుంది. మీనా ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కాక బాలు అయోమయంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇక మరో కీలక సీన్‌లో శృతి తాను చేస్తున్న సీరియల్ కథ గురించి ఫోన్‌లో మాట్లాడుతుంది. అందులో ఓ క్యారెక్టర్ పెళ్లి కాకముందే తల్లి అవడం, ఆ బిడ్డను మరోచోట ఉంచడం వంటి అంశాలు చెప్పడం మీనాకు షాక్ ఇస్తాయి. శృతి మాటలు విన్న మీనా చేతిలోని గిన్నె జారిపడి పగిలిపోతుంది. వెంటనే శృతి ఫోన్ కట్ చేసి కిచెన్‌లోకి వచ్చి, ఎందుకింత కంగారు, ఎందుకు ఇలా షేక్ అవుతున్నావు అని ప్రశ్నిస్తుంది. ఈ సమయంలో మీనా నిజం చెప్పాలా? దాచాలా? అనే సందిగ్ధంలో పడుతుంది. చివరకు శృతితో "ఒక విషయం చెబుతాను... ఇంకెవరికీ చెప్పొద్దు" అంటూ మాట తీసుకుంటుంది.

అనంతరం మీనా, రోహిణికి పెళ్లికాకముందే కొడుకు ఉన్నాడన్న అనుమానం ఉందని, ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్‌కు వెళ్తోందని శృతికి చెబుతుంది. ఈ నిజం విన్న శృతి ఒక్కసారిగా కంగారుపడి, "ఏంటి ఇది... నిజమా?" అంటూ షాక్‌కు గురవుతుంది. మొదటగా మీనా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని శృతిని గట్టిగా కోరుతూ మాట తీసుకుంటుంది. కానీ శృతి మాత్రం ఆ రహస్యాన్ని తనలోనే దాచుకోలేక తీవ్ర అయోమయానికి లోనవుతుంది. ఏం చేయాలో అర్థం కాక చివరకు రవిని ఆశ్రయిస్తుంది. రోహిణి గురించి విన్న రవి ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. "నీకు ఎవరు చెప్పారు? ఎందుకు ఇలాంటి అనవసరమైన నిందలు వేస్తున్నావు?" అంటూ శృతిని ప్రశ్నిస్తాడు. అయితే శృతి, ఈ విషయం తనకు మీనా చెప్పిందని, హాస్పిటల్‌లో చూసిన విషయమే ఆధారమని చెప్పగానే రవికీ కంగారు మొదలవుతుంది.

అయితే రవి, ' ఈ విషయం నాకెందుకు చెప్పావు?' అని అడగ్గా, శృతి తన మనసులోని భయాన్ని బయటపెడుతుంది. "నాకు రహస్యాలు దాచుకోవడం అంటే భయం. ఇంకెవరికీ చెప్పకుండా ఉంటే అది నాకు జీర్ణం కాదు. అందుకే నీకు చెప్పాను" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ మాటలతో రవి మరింత టెన్షన్‌లో పడతాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పకపోతే తనకూ మనసు నిలబడదని భావించి వెంటనే బాలును కలిసి అసలు విషయం చెబుతాడు.

రోహిణి రహస్యం విన్న బాలు ఒక్కసారిగా ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. "ఇన్నాళ్లు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టిందా? ఆ పిల్లవాడు ఎవరు? ఆడపిల్లనా, మగపిల్లనా? ఇండియాలో ఉన్నాడా లేక విదేశాల్లో పెరుగుతున్నాడా? అసలు ఈ నిజాన్ని ఎందుకు ఇంతకాలం దాచారు?" అంటూ వరుస ప్రశ్నలతో ఆలోచనల్లో మునిగిపోతాడు. అంతేకాదు, ఈ విషయం ప్రభావతికి తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో, మనోజ్ దీన్ని జీర్ణించుకుంటాడా లేక భార్యను ఇంటి నుంచి బయటకు పంపుతాడా అన్న భయాలు కూడా అతడిని కలవరపెడతాయి. తనకు ముందునుంచే కొన్ని అనుమానాలు ఉన్నాయని, గతంలో చూసిన అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ బాలు భావోద్వేగానికి లోనవుతాడు.

ఈ రహస్యం ఎవరికైనా చెప్పకుండా ఉంటే తన మనసుకు శాంతి ఉండదని నిర్ణయించుకున్న బాలు, నేరుగా తండ్రి సత్యం వద్దకు వెళ్లి నిజం చెబుతాడు. ఇది విన్న సత్యం ఒక్కసారిగా స్థబ్ధుడవుతాడు. 'ఇది నిజమేనా? ఎవరు చెప్పారు? అనవసరంగా మన ఇంటి ఆడపిల్ల మీద ఇలాంటి ఆరోపణలు వేయడం కరెక్ట్ కాదు' అంటూ బాలును నిలదీయగా, బాలు "మీరు వెంటనే రియాక్ట్ అవుతారని తెలుసు కాబట్టే ఇంతవరకు చెప్పలేదు. లేదంటే ఇంటి ముందు, వెనక అందరినీ పిలిచి పంచాయతీ పెట్టేవాడిని" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు.

బాలు మాటల్లోని నిజాయితీని గమనించిన సత్యం కాస్త శాంతిస్తాడు. "నాన్నా, నాకు మద్యం తాగి చెప్పిన మాటలు ఇవి కావు. ఈ విషయం తెలిసి ఎవరికీ చెప్పాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. ఇక మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం" అంటూ బాలు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో సత్యం లోతైన ఆలోచనలో పడతాడు. ఇది నిజమా? లేక అపార్థమా? ఈ విషయం ప్రభావతికి ఇప్పటికే తెలిసి ఉండే అవకాశం ఉందేమోనన్న సందేహంతో ఆమెను ప్రశ్నించేందుకు వెళ్తాడు. ఇక ప్రభావతి ఈ నిజం విన్నప్పుడు ఎలా స్పందిస్తుందన్నది రాబోయే ఎపిసోడ్స్‌లో కీలక మలుపుగా మారనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X