Gunde Ninda Gudi Gantalu January 28th Episode: ప్రభావతి మరో కుట్ర..మీనాకు శ్రుతి దూరం.. శోభన సంతోషం!
Gunde Ninda Gudi Gantalu: గుడి నిండా గుడి గంటలు మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, డ్రామా, హాస్యంతో ఆసక్తికరంగా సాగింది. రోహిణి చేసిన తప్పిదానికి నేరుగా శిక్ష అనుభవించాల్సి వచ్చిన వ్యక్తి మీనా చెల్లెలు సుమతి. రోహిణి ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన ఘటన హాస్పిటల్‌లో పెద్ద వివాదంగా మారడంతో, సుమతిని ఆమె డాక్టర్ తీవ్రంగా మందలిస్తుంది.'నీ నిర్లక్ష్యం వల్ల హాస్పిటల్‌కు చెడ్డ పేరు వచ్చింది' అంటూ ఉద్యోగం నుంచి తీసేస్తానని హెచ్చరిస్తుంది. ఉద్యోగం తన జీవితానికి ఎంత ముఖ్యమో చెబుతూ సుమతి కన్నీళ్లతో వేడుకున్నా, డాక్టర్ పూర్తిగా క్షమించదు. శిక్షగా ఈ నెల మొత్తం ఆఫ్ సాలరీతోనే పని చేయాలన్న కఠిన నిర్ణయం తీసుకుంటుంది. డబ్బు విలువ నేర్చుకోవాలంటూ చేసిన హెచ్చరిస్తుంది. దీంతో సుమతి బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక మరోవైపు మీనా జీవితంలో భావోద్వేగ క్షణాలు చోటుచేసుకున్నాయి. పూలు గుచ్చడానికి రమ్మన్న స్నేహితులను మీనా నిరాకరించడంతో వారు సైలెంట్‌గా వెళ్లిపోతారు. అదే సమయంలో బాలు ఫోన్ చేసి ఈరోజు రానని చెప్పడంతో మీనా మరింత కుంగిపోతుంది. మరో ట్రాక్‌లో శృతి-రవి మధ్య గొడవ జరుగుతుంది. రవి ఈవెంట్ కారణంగా లేటవుతానని చెప్పడంతో శృతి అలుగుతుంది. మీనా మధ్యలోకి వచ్చి పరిస్థితిని చక్కదిద్దుతుంది. రాత్రి శృతి హారర్ మూవీ ప్లాన్ వేయడంతో కథ హాస్యంగా మారుతుంది. ప్రభావతి 'నాకు భయం తెలియదు' అంటూ ఓవర్ యాక్షన్ చేయడంతో, శృతి టెక్నాలజీ సహాయంతో అత్తయ్యను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. అరుపులు, హడావుడితో మనోజ్ కూడా భయపడిపోతాడు. చివరికి ఇది శృతి, మీనా పని అని ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేయడంతో నేటి ఎపిసోడ్ ఉత్కంఠతో ముగిసింది.

Photo Courtesy: jiohotstar
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ సరదా, భావోద్వేగాలు, అపార్థాలతో ఆసక్తికరంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే మనోజ్ తన భయాన్ని బయటపెడతాడు. 'మీరు చేసిన పనికి నేను చాలా భయపడ్డాను. కాసేపటికి హార్ట్ ఎటాక్ వచ్చినా వచ్చేది' అంటూ తన ఆందోళనను వ్యక్తం చేస్తాడు. అయితే అదే సమయంలో ఇంత అర్ధరాత్రి బాలు, రవి ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. దీనికి మీనా బాలు ట్రిప్‌కు వెళ్లాడని చెప్పగా, రవి రెస్టారెంట్‌లో పార్టీకి వెళ్లాడని శ్రుతి చెబుతుంది. కానీ ప్రభావతి మాత్రం దీనికి మీనానే కారణమని భావించి, ఉదయం తిట్టినందుకు తనపై కక్ష సాధించేందుకు ఇదంతా చేసిందని మీనాపై నిందలు వేస్తుంది.
ఈ సందర్భంలో శ్రుతి ధైర్యంగా స్పందిస్తూ... 'ఇది నా ఐడియానే. మీరు భయపడనని అన్నారు కదా, ఇప్పుడు భయం అంటే ఏంటో తెలిసిందా?'అని ప్రశ్నిస్తుంది. అయినా తాను భయపడలేదంటూ ప్రభావతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటన తర్వాత మీనా తన బాధను శ్రుతితో పంచుకుంటుంది. 'ఈ ఇంట్లో ఏం జరిగినా ముందు అత్తయ్య నన్నే తిట్టుతుంది, తర్వాతే అసలు విషయం తెలుసుకుంటుంది' అంటూ ఫీల్ అవుతుంది. తన తప్పు తెలుసుకున్న శ్రుతి సారీ చెబుతూ, మీనాను నవ్వించేందుకు ప్రయత్నిస్తుంది.
ఇక మరుసటి రోజు ఉదయం బాలు ట్రిప్ ముగించుకుని ఇంటికి వస్తాడు. అతని కళ్లు ఎర్రగా ఉండటాన్ని గమనించిన మీనా, "రాత్రంతా నిద్ర లేదా?" అని అడుగుతుంది. కస్టమర్లు మార్నింగ్ వరకూ ట్రిప్ పూర్తి చేయాలని ఫోర్స్ చేయడంతో నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయాల్సి వచ్చిందని బాలు వివరిస్తాడు. దీనిపై మీనా ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి రాత్రి ప్రయాణాలు మళ్లీ చేయొద్దని సలహా ఇస్తుంది. అయితే బాలు తన మనసులోని పట్టుదలని బయటపెడతాడు. "మనకు ఇల్లు కట్టాలి అంటే రాత్రి పగలు కష్టపడాల్సిందే. ఇంట్లో నాన్న మాత్రమే మా గురించి ఆలోచిస్తున్నారు. అమ్మ అయితే ఈ జన్మలో ఇల్లు కట్టడం కుదరదన్నట్టుగా మాట్లాడుతుంది. అందరికీ సమాధానం ఇవ్వాలంటే కచ్చితంగా ఇల్లు కట్టాలి" అంటూ తన లక్ష్యాన్ని చెబుతాడు. తర్వాత మీనా కళ్లను గమనించిన బాలు కూడా ఆమెను ప్రశ్నిస్తాడు. అప్పుడు రాత్రి శ్రుతి చేసిన చిలిపి చేష్టల గురించి మీనా వివరిస్తుంది.
మరోవైపు శృతి రవికి సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్త టీ షర్ట్ కొనుగోలు చేస్తుంది.కానీ, రవి మాత్రం 'ఇది పాతదే... ఆల్రెడీ నాకు ఉంది' అంటూ నిర్లక్ష్యంగా స్పందించడంతో శృతి తీవ్రంగా నిరాశ చెందుతుంది. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతాయి. కోపంలో శృతి ఆ టీ షర్ట్‌ను చెత్తలో వేస్తానని, లేకపోతే ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఉపయోగిస్తానని ఆవేశపడుతుంది. అదే కంగారులో పరుగు పరుగున కిందికి వస్తుంది. అదే సమయంలో మీనా బాలు దగ్గరకు చిన్న గిన్నెలో నూనె తీసుకెళ్తూ ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు గమనించకుండా ఎదురెదురుగా ఢీకొనడంతో కిందపడిపోతారు. ఫలితంగా నూనె నేలపై చిందుతుంది. వెంటనే శృతి మీనాకు సారీ చెబుతుంది. "ఏం పర్వాలేదు, నేనే క్లీన్ చేస్తాను" అని మీనా చెప్పినా, శృతి తన దగ్గర ఉన్న టీ షర్ట్‌తో తుడవమంటుంది. అయితే మీనా అంగీకరించకుండా తానే శుభ్రం చేస్తానని చెబుతుంది.
ఇంతలో నేలపై నూనె పడిన విషయం తెలియక ప్రభావతి అటువైపుగా వస్తుంది. ఒక్కసారిగా కాలుజారి కిందపడుతుంది. ఆమెను పట్టుకోవడానికి వెళ్లిన మీనా కూడా జారి పడిపోతుంది. దీంతో ప్రభావతి 'అయ్యో... నేను చనిపోయాను'అంటూ గట్టిగా అరుస్తుంది. శబ్దం విని ఇంట్లో వాళ్లంతా హాల్లోకి చేరుకుంటారు. ఈ సందర్భంలో బాలు తన స్టైల్‌లో సెటైర్లు వేస్తూ, 'అత్త కోడలు హాల్లో పడుకుని ఏం చేస్తున్నారు?' అంటూ నవ్వులు పూయిస్తాడు. ఏమైందని మనోజ్ ప్రశ్నించగా, ప్రభావతి 'పడుకుని పొర్లుదండాలు పెడుతున్నాం.. కనిపించడం లేదా?' అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అంతేకాదు, మీనా తనను చంపాలనే ప్లాన్ చేసిందని, తల బద్దలయ్యేలా కుట్ర పన్నిందని తీవ్ర ఆరోపణలు చేస్తుంది.
దీనిపై బాలు 'ఇంత జరిగినా నోరు మాత్రం కంట్రోల్ కావడం లేదా?' అంటూ మరోసారి సెటైర్ వేస్తాడు. ఇక మీనా మాత్రం తొలిసారి కాస్త గట్టిగా స్పందిస్తూ, 'మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం ఏంటి?' అని ప్రశ్నిస్తుంది. కానీ ప్రభావతి తగ్గకుండా 'నా చావు కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తోంది కాబట్టే నూనె పోసింది'అంటూ ఆరోపణలు కొనసాగిస్తుంది. ఈ దశలో శృతి తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. 'మీరు ఎంత పూలీస్‌గా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నూనె పడింది నా వల్లే. అనవసరంగా దీన్ని పెద్ద రాద్ధాంతం చేయొద్దు. మీరు కళ్లు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నారు?' అంటూ ప్రభావతిని ఎదురు ప్రశ్నిస్తుంది.
ఇక మనోజ్ అయితే హద్దులు దాటి 'ఇది అటెంప్ట్ మర్డర్ కిందకి వస్తుంది" అంటూ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తాడు. దీంతో బాలు ఒక్కసారిగా సీరియస్ అయి, 'మీ మోసాలకు, కుట్రలకు ఇంకా ఎన్ని శిక్షలు వేయాలి? ఇలా కొనసాగితే తల్లి కొడుకులు ఇద్దరూ జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది' అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీనితో ప్రభావతి మరింత కోపంగా 'మీరు మాట్లాడుకుంటారా? నన్ను లేపేది ఉందా?' అంటూ అరుస్తుంది. అప్పుడు బాలు చురకగా 'నేను లేపను... మళ్లీ పడితే నాపై నిందలు వేస్తావు' అంటూ సైలెంట్ అవుతాడు. మనోజ్ మాత్రం హీరో బిల్డప్ ఇస్తూ 'బాహుబలిలాంటి కొడుకు ఉండగా ఎందుకు కంగారు పడతావు అమ్మ'అంటూ ప్రభావతిని లేపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతడికీ కాలుజారి పడిపోతుంది. 'అయ్యో ముర్రు... నా నడుము విరిగింది'అంటూ మనోజ్ అరుస్తాడు.
చివరికి రవి, బాలు వచ్చి మెల్లగా ప్రభావతిని పైకి లేపి కుర్చీలో కూర్చోబెడతాడు. మనోజ్ తనను కూడా లిఫ్ట్ చేయమని అడిగితే, 'నిన్ను మాత్రం లేపను' అంటూ బాలు తేల్చి చెబుతాడు. చివరకు చేసేది లేక రోహిణి వచ్చి మనోజ్‌ను పైకి లేపుతుంది. హాల్లో కూర్చున్న ప్రభావతి, 'నేను ఒకవేళ మంచాన పడితే నా పరిస్థితి ఏమయ్యేది?'అంటూ బాధపడుతుంది. దీనికి బాలు తన స్టైల్‌లో భవిష్యత్తు చిత్రాన్ని కళ్లకు కట్టినట్టుగా వివరిస్తాడు. 'పెద్దకొడుకు నీ దగ్గర నుంచి రూపాయి రాకపోతే పట్టించుకోడు. పెద్ద కోడలు నిన్ను విడిచి వెళ్లిపోతుంది. చిన్న కోడలు అసలే పట్టించుకోదు. రవి గాడు 'నాకే ఖర్చులు లేవు, నేను ఎందుకు పట్టించుకోవాలి' అని వదిలేస్తాడు. మీనా అయితే నువ్వు బాగున్నప్పుడు రోజూ తిట్టినందుకు నీ కర్మాన్ని వదిలిపెడుతుంది. ఇక నేనైతే అసలు పట్టించుకోను. చివరకు నువ్వే నీతో నువ్వు మంచానికి అంకితం అయిపోతావు' అంటూ ఘాటుగా చెబుతాడు. బాగున్నప్పుడు కోడళ్లను బిడ్డలలా చూసుకోవాలి కానీ గయ్యాలి గంగావతిలా చూస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని బాలు ప్రభావతిని హెచ్చరిస్తాడు.
ఈ మాటల తర్వాత ప్రభావతి, మనోజ్ ఇద్దరూ హాల్లో బాధతో కూర్చుంటారు. అప్పుడు రోహిణి వచ్చి అత్తకు సపర్యలు చేస్తూ, 'ఇదంతా మీనా కుట్రే. మీనా ఇంతకు ముందు ఇలా లేదు, ఇప్పుడు మాటకు మాట ఇస్తోంది'అంటూ విషం చిమ్ముతుంది. దానికి ప్రభావతి కూడా తగ్గకుండా, 'నన్ను కావాలనే కింద పడేసింది. నన్ను మంచాన పడేసి తాను ఇష్టం వచ్చినట్టు ఉండాలని చూసింది. ఇలాగే మీ నాన్న వదిలేస్తే ఒకరోజు నన్ను చంపేస్తుంది' అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తుంది.
ఈ మాటలను చాటుగా విన్న శృతి ఒక్కసారిగా మండిపడి ప్రభావతి దగ్గరికి వస్తుంది. 'ఏంటి ఈ మాటలు? మీనా మిమ్మల్ని మర్డర్ చేయాలని ప్లాన్ చేసిందా? కథలు బాగా అల్లుతున్నారే' అంటూ నిలదీస్తుంది. ప్రభావతి 'నీకు మీనా సంగతి ఏమి తెలుసు?" అని ఎదురు ప్రశ్న వేయగా, శృతి మరింత ఘాటుగా స్పందిస్తుంది. 'నూనె పడడానికి కారణం నేనే. ఆ విషయం నాకు తెలుసు, మీకూ తెలుసు. అందరి ముందే క్లియర్‌గా చెప్పాను. అయినా మీనా మీదే నిందలు వేయడం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? రోజూ మీనాను తిడుతూనే ఉండాలేరా?'అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.
ఈ సమయంలో రోహిణి అత్తకు సపోర్ట్‌గా మాట్లాడేందుకు ప్రయత్నించగానే, శృతి 'అత్తయ్యతో కలిసి భజన చేస్తున్నావా?' అంటూ దిమ్మ తిరిగిపోయేలా ప్రశ్నిస్తుంది. మనోజ్ మధ్యలో కలుగజేసుకోవాలని చూస్తే, 'ఆడవాళ్ల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకు, బాగోదు' అంటూ శృతి హెచ్చరిస్తుంది. అంతటితో ఆగని ప్రభావతి, 'మీ కళ్లెక్కడ పెట్టుకున్నారు? కింద ఏముందో కూడా చూడరా? మీనా ను ఏదో అన్నాడని కాకుండా మీకు నోరు కూడా కట్టుకుపోయిందా?' అంటూ శృతికి క్లాస్ పీకుతుంది. ఈ మాటలకు అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. దీంతో ప్రభావతి మరోసారి విషపు ఆలోచనలకు తెరతీస్తుంది. 'శృతి ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వీటన్నింటికీ నేను చెక్ పెడతాను' అంటూ కొత్త మాస్టర్ ప్లాన్ వేస్తుంది.
మరోవైపు అత్తయ్య ప్రభావతి కిందపడిన ఘటన తర్వాత ఆమె నొప్పి తగ్గించేందుకు మీనా చాటుగా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి నాటువైద్యం గురించి వివరాలు అడుగుతుంది. ఎవరికి ఏమైందని అడిగిన ఫ్రెండ్స్‌కు అత్తయ్య కిందపడిందని, నొప్పి తగ్గించేందుకు ఏదైనా మార్గం ఉందా అని ప్రశ్నిస్తుంది. దీనికి ఫ్రెండ్స్ "మంచిగానే పడింది కదా, అనవసరంగా రిస్క్ తీసుకోకు, లైట్ తీసుకో" అంటూ సలహా ఇస్తారు. అయినా మీనా తగ్గకుండా, "ఏదైనా నాటువైద్యం ఉంటే చెప్పండి, నొప్పి తగ్గేలా ఏం చేయాలో వివరంగా చెప్పండి" అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. చివరకు ఆమె ఫ్రెండ్ నాటువైద్యం గురించి క్లియర్‌గా వివరించడంతో, మీనా వాటిని నోట్ చేసుకుని వైద్యం సిద్ధం చేయడం మొదలుపెడుతుంది.
ఈ సమయంలో అక్కడికి వచ్చిన బాలు "ఏం చేస్తున్నావు?" అని ప్రశ్నిస్తాడు. అత్తయ్య నొప్పి తగ్గేందుకు నాటువైద్యం చేస్తున్నానని మీనా చెప్పడంతో, బాలు ఒక కథ చెబుతాడు. నీళ్లలో పడిన తేలను స్వామీజీ ప్రతిసారి బయటకు తీసేవాడని, అయితే తేలు ప్రతిసారి అతడిని కుట్టేదని వివరిస్తాడు. అయినా స్వామీజీ దానిని పట్టించుకోకుండా తన పని చేసేవాడని చెబుతూ, "ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలానే ఉంది. మా అమ్మ నిన్ను తప్పుబడుతున్నా, నువ్వు ఇంకా ఆమెకే మంచి చేయాలని చూస్తున్నావు. ఇది అవసరమా?" అంటూ ప్రశ్నిస్తాడు.
దీనికి మీనా దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇస్తుంది. "మీరు చెప్పిన కథలో తేలు మీ అమ్మ అయితే... నేను ఆ స్వామీజీ లాంటిదాన్నే. మా అత్తకు సేవ చేయడం నాకు అర్థం" అంటూ ధైర్యంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ సీన్‌లో మీనా పాత్ర బలంగా, స్పష్టంగా నిలుస్తుంది. ఇక మరోవైపు ప్రభావతి దగ్గరకు రోహిణి వెళ్లి "ఎలా ఉంది?" అని అడుగుతుంది. దానికి ప్రభావతి నొప్పిని తట్టుకుంటూనే తన మనసులోని విషాన్ని బయటపెడుతుంది. "నొప్పితో ఆనందతాండవం చేయాలనిపిస్తుంది. ఇన్ని రోజులు ఇంట్లో నాకు ఎదురు చెప్పేవాడు ఒక్క బాలు గాడే. ఇప్పుడు శృతి కూడా నన్ను ఎదిరించి మాట్లాడుతోంది. రోజు రోజుకు ఆమె ఆగడాలు పెరుగుతున్నాయి" అంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. ఇంకా ముందుకెళ్లి, 'రాను రాను నాకు శత్రువుల సంఖ్య పెరుగుతోంది. అందరూ మీనా భజననే చేస్తున్నారు. దీనికి ముగింపు పలకాలి. లేకపోతే నా ఇంట్లోనే నేను గొంతు మూసుకుని కూర్చోవాల్సి వస్తుంది' అంటూ తన కమింగ్ ఐడియా గురించి సంకేతాలు ఇస్తుంది.


Click it and Unblock the Notifications











