Gunde Ninda Gudi Gantalu January 30th Episode:తోడికోడల మధ్య శోభ చిచ్చు.. ప్రభావతి ఆనందతాండవం.. మీనాకు ప్రమాదం
Gunde Ninda Gudi Gantalu: గుడి నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రభావతి కాలుజారి కిందపడటంతో ఇంట్లో కలకలం రేగుతుంది. నొప్పులతో విలవిల్లాడుతున్న ప్రభావతికి నాటు వైద్యం చేయాలని మీనా ప్రయత్నించగా, బాలు ముందుగానే "అమ్మ నీ మంచిని కూడా తప్పుగా అర్థం చేసుకుంటుంది" అని హెచ్చరిస్తాడు. అతను చెప్పినట్లుగానే ప్రభావతి మీనాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, వేడి నీళ్లతో తనను కాల్చాలని చూస్తున్నావా అంటూ కసురుకుంటుంది. అయినా మీనా సహనంగా స్పందిస్తూ, "మీరు నా అత్తయ్యే... మీ బాగోగులు చూసుకోవడం నా బాధ్యత" అని చెప్పి బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ప్రభావతి మరోసారి కాపడం పెట్టుకోవాలనగా, వంటింట్లోకి వెళ్లే సమయంలో కొత్త ట్విస్ట్ జరుగుతుంది. టేబుల్‌పైకి ఎక్కి వస్తువులు సర్దుతున్న మీనాను ప్రభావతి అక్కసుతో తన్ని వేయగా, బాలు క్షణాల్లో స్పందించి ఆమెను కాపాడతాడు.
అయితే కుంకుమ ప్రభావతిపై పడటంతో ఆమె రూపం చూసి అందరూ భయపడిపోతారు. ఈ సన్నివేశం హాస్యంగా, ఉత్కంఠగా సాగుతుంది. ఇదే సమయంలో శృతి అత్తయ్యపై సెటైర్లు వేస్తూ సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇంట్లో కొత్త అగ్గిని రాజేస్తుంది. ఈ విషయం తెలిసిన ప్రభావతి పెద్ద కోడలు రోహిణితో కలిసి మీనాక్షి ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేస్తుంది. అక్కడ శృతి తల్లి శోభన చేరి, ఈ గొడవను చాలా లైట్‌గా తీసుకుంటూ ప్రభావతికి రివర్స్ పంచులు వేస్తుంది. శోభన వైఖరితో ప్రభావతి మరింత నిరాశకు గురవుతుండగా, శోభన మాత్రం లోపల మరో ప్లాన్ వేసుకుంటుంది. మరోవైపు ప్రభావతి శృతి-మీనాలను విడదీయాలనే కొత్త కుట్రలకు సిద్ధమవుతుంది. ఎపిసోడ్ అంతా ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది.

Photo Courtesy: jiohotstar
శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రభావతి తన పక్కా ప్లాన్ ప్రకారం శృతి తల్లి శోభనను ఇంటికి పిలిపిస్తుంది. శృతిపై నేరుగా చెప్పకుండా, మాటల మధ్యలో విషం చల్లే ప్రయత్నం చేస్తుంది. "మీనా వల్లే మీ అమ్మాయి మారిపోతోంది... మీనా దగ్గర ఉంటే శృతి జీవితం పాడవుతుంది..." అంటూ శోభన ముందు పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తుంది. ఇదంతా విని శోభన కూడా మొదట కాస్త షాక్ అవుతుంది. ప్రభావతి ఆశించినట్లే శోభన రెచ్చిపోతుందనుకుంటుంది. కానీ ఇక్కడే ట్విస్ట్... శోభన చాలా కూల్‌గా, స్పష్టంగా స్పందిస్తుంది. "నా కూతురు ఎలా ఉండాలో నాకు తెలుసు... మీ ఇంట్లో జరిగే విషయాల్లో నాకు జోక్యం లేదు" అంటూ తేల్చి చెబుతుంది. ప్రభావతి మాటలను పూర్తిగా తిరస్కరిస్తూ... "ఇలాంటి ఫిర్యాదులతో నన్ను ఇబ్బంది పెట్టొద్దు" అంటూ అక్కడినుంచి నేరుగా బయటకు వెళ్లిపోతుంది.
ఇది ప్రభావతికి పెద్ద షాక్.తన ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో లోలోపల మండిపోతుంది. "ఇలా మాట్లాడుతుందని అసలు ఊహించలేదు..." అంటూ తనే తనలో తాను బాధపడుతుంది. ఇదిలా ఉండగా... రోహిణికి తన తల్లి నుంచి ఫోన్ వస్తుంది. అదే సమయంలో మరోవైపు నుంచి "నీ తల్లికి యాక్సిడెంట్ అయ్యింది" అంటూ అన్య వ్యక్తి ఫోన్ చేయడంతో రోహిణి పూర్తిగా కంగారుపడిపోతుంది. ఇంట్లో ఎవరికీ క్లారిటీ ఇవ్వకుండా... "నాకు అర్జెంట్ వర్క్ ఉంది" అంటూ టెన్షన్‌లో బయటకు వెళ్లిపోతుంది.
మరోవైపు ప్రభావతి తన డాన్స్ క్లాస్‌లో జరుగుతున్న విషయాలపై గమనించడం మొదలుపెడుతుంది. స్టూడెంట్స్ ప్రవర్తనలో ఏదో తేడా ఉందని ఆమెకు అనుమానం వస్తుంది. కానీ స్టూడెంట్ ప్రేమ్ కుమార్ మాత్రం చాలా తెలివిగా మాయమాటలతో ప్రభావతిని మోసం చేస్తాడు.ఈసారి వ్యవహారం బయటపడకపోయినా... భవిష్యత్తులో ప్రభావతికి ఇది పెద్ద ముప్పుగా మారబోతుందన్న హింట్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక ఎపిసోడ్‌లో కీలకమైన మరో సీన్... శృతి తల్లి శోభన కార్లో వెళ్తూ రోడ్డుపై మీనాను చూసేస్తుంది."ఇదే సరైన సమయం" అనుకుని మీనా దగ్గరికి వెళ్తుంది. మీనా ఎంతో సాధారణంగా "బాగున్నారా?" అని అడిగితే... శోభన వ్యంగ్యంగా "నువ్వు ఉండగా ఎవరు బాగుంటారు లే" అంటూ చురకలు అంటిస్తుంది. మీనా షాక్ అవుతుంది. "ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా వచ్చారు?" అని ప్రశ్నిస్తుంది. అప్పుడు శోభన ఒక్కసారిగా మండిపడి... "అనవసరంగా నా కూతురు జీవితంలో చించిపెట్టకు. మీరిద్దరూ కలిసి ఇంట్లో గొడవలు పెడుతున్నారట కదా!" అంటూ లేని నిందలు వేస్తుంది. దీంతో మీనా నిలదీస్తుంది. 'ఇంతకీ మీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? నన్ను ఇలా ఎందుకు అనుమానిస్తున్నారు?" అని ప్రశ్నిస్తుంది.
అప్పుడే అసలు నిజం బయటపడుతుంది. శోభన కోపంతోనే నిజం చెప్పేస్తుంది "నీ అత్తయ్య మీనాక్షి నన్ను ఇంటికి పిలిచి చెప్పింది...రోహిణి కూడా నీ గురించి చాలా చెప్పింది!" అంటూ అసలు రహస్యాన్ని బయటపెడుతుంది. శోభన మాటల తీరుతో మీనా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. అయితే నిజం తెలిసినా శోభన వెనక్కి తగ్గకుండా పరిస్థితిని మరింత విషమంగా మార్చే ప్రయత్నం చేస్తుంది.
శృతి తల్లి అన్న కనీస గౌరవం కూడా లేకుండా, బాలు-మీనా సంబంధాన్ని టార్గెట్ చేస్తూ నానా మాటలు అంటిస్తుంది. "నీ మొగుడికి తాగడానికి డబ్బులు లేవా? నీ సంసారంలో గొడవలు లేవా? అందుకే నా కూతురితో ఇలాంటి చేష్టలు చేస్తున్నావా?" అంటూ శోభన చేసిన వ్యాఖ్యలు మీనాను దిమ్మ తిరిగేలా చేస్తాయి. అయినా కూడా మీనా తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది. "ఈ స్థానంలో ఇంకెవరైనా ఉంటే సమాధానం మరోలా ఉండేది. మీరు శృతి తల్లి కాబట్టే గౌరవంగా మాట్లాడుతున్నాను" అంటూ చాలా స్ట్రాంగ్ కానీ పరిమితి దాటని రిప్లై ఇస్తుంది. కానీ శోభన అక్కడితో ఆగదు. మాటలు మరింత దిగజార్చుతుంది.
దీంతో మీనా ఇక తట్టుకోలేకపోతుంది.
"మాటలు మంచిగా రాని మీలాంటి వాళ్ల కడుపులో శృతి లాంటి తెలివైన అమ్మాయి ఎలా పుట్టిందో నాకు అర్థం కావడం లేదు. శృతికి మంచి-చెడు ఏంటో తెలుసు, విచక్షణ ఉంది. అజ్ఞానం మీకే ఉంటే ఇలా మాట్లాడే వాళ్లు కాదు" అంటూ ఘాటు మాటలు పేల్చుతుంది. ఈ మాటలతో శోభన మరోసారి రెచ్చిపోవడానికి ప్రయత్నించగానే... అక్కడే మీనా పక్కన ఉన్న ఆమె స్నేహితురాలు రంగంలోకి దిగుతుంది. "ఎవరు మీరు ఇలా మాట్లాడటానికి? అనవసరంగా మా మీద నిందలు వేస్తే చూస్తూ ఊరుకోం. ఇక్కడే నీ కారును తగలబెట్టేస్తాం!" అంటూ మాస్ స్టైల్‌లో హెచ్చరిస్తుంది. ఇక మీనా కూడా వెనక్కి తగ్గదు. "నా గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఈ స్థానంలో ఇంకెవరైనా ఉంటే... శృతి మీద ఆసిడ్ పోసిన వాళ్లపై నేను ఎలా దాడి చేశానో మీకు తెలుసు. అలాంటి పరిస్థితి మీ వల్ల వస్తే... మీ మీద కూడా చేయాల్సి వస్తుంది" అంటూ చివరి వార్నింగ్ ఇస్తుంది. ఈ హెచ్చరికలతో శోభన పూర్తిగా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఈ సీన్‌ను గమనించిన బాలు వెంటనే మీనా దగ్గరకు వచ్చి, "ఏం జరిగింది?" అని అడుగుతాడు. మీనా మాత్రం విషయాన్ని దాచేస్తూ, "ఏం లేదు... పూలు కొనడానికి వచ్చింది" అంటూ అబద్ధం చెబుతుంది. కానీ బాలు అనుమానం విడిచిపెట్టడు. "నీ ముఖం చూస్తే పూలు కొనడానికి వచ్చినట్టు లేదు. నీతో గొడవ పడడానికి వచ్చినట్టు ఉంది. ఆవేశంగా వెళ్లిపోవడం చూస్తే మీ మధ్య ఏదో జరిగిందని స్పష్టంగా కనిపిస్తోంది" అంటూ గట్టిగా ప్రశ్నిస్తాడు. మీనా మౌనంగా ఉండిపోతుంది. అప్పుడే మీనా స్నేహితురాలు అసలు నిజాన్ని బయటపెడుతుంది. "నీపై, మీనాపై లేనిపోని నిందలు వేసింది. మీ గురించి చాలా తప్పుగా మాట్లాడింది" అంటూ జరిగినదంతా చెప్పేస్తుంది. ఇది విన్న బాలు ఆగ్రహానికి లోనవుతాడు. ఒక్క మాట కూడా ఆలోచించకుండా... "మీనా... కారులో కూర్చో. వెళ్దాం. తేల్చుకుందాం!" అంటూ ఆమెను వెంట తీసుకుని సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మరోవైపు ప్రభావతి తన ప్లాన్ ఫెయిల్ అయిందన్న అసహనంతో లోలోపల మండిపోతుంది. "ఒక్కసారి ఆ ప్లాన్ వర్కౌట్ అయి ఉంటే... శృతి తల్లి శోభన రియాక్షన్ మరోలా ఉండేది. నా గొడవ సక్సెస్ అయితే మీనా-శృతి ఇకపై మాట్లాడుకునే ఛాన్సే ఉండేది కాదు. ఇంట్లో నిత్యం గొడవలతో గోలగోలగా ఉండేది" అంటూ తన పిచ్చి కలల్లో తానే హీరోగా ఊహించుకుంటుంది. వాస్తవం దెబ్బకొట్టినా, ఊహల్లో మాత్రం ప్రభావతి ఆధిపత్యం పూర్తిగా కొనసాగుతుందన్న భావనలో తేలిపోతుంది.
ఇంతలోనే రవి-శృతి ఇంటికి చేరుకుంటారు. వాళ్లను చూసిన ప్రభావతి వెంటనే, "ఏంట్రా... ఇంత తొందరగా వచ్చారు?" అని అనుమానంగా ప్రశ్నిస్తుంది. ఈ మాటలు శృతికి నచ్చవు. వెంటనే పరిస్థితిని కవర్ చేయాలనే ఉద్దేశంతో, "అయ్యో... ఇంత తొందరగా వచ్చామా? సరే లే... మనం వెళ్దాం" అంటూ రవిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇది గమనించిన ప్రభావతి మాట మార్చేస్తూ, "నేను అలా అనలేదు... నిన్నటి కంటే ఈరోజు ముందుగా వచ్చారు కదా అని అడిగాను అంతే" అంటూ డైవర్షన్ ఇస్తుంది.
అయితే రవి మాత్రం ప్రభావతి మాటల్ని వదిలిపెట్టడు. తనదైన శైలిలో పంచ్ వేస్తూ, "నీ మాటలు విడకారంగా ఉన్నాయి. బిర్యానీలో లవంగాలన్నీ ఒకేసారి నమిలితే ఎలా ఘాటుగా ఉంటుందో... నువ్వు మాట్లాడే మాటలు కూడా అలా ఉన్నాయి" అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తాడు. ఈ మాటలతో వాతావరణం మరింత బరువెక్కుతుంది. శృతి తలనొప్పి అంటూ రూమ్‌లోకి వెళ్లిపోతుంది.
ఇదే సమయంలో బాలు- మీనా ఆవేశంతో ఇంటికి చేరుకుంటారు. రవి కనిపించగానే బాలు ఒక్కసారిగా రెచ్చిపోతాడు. "ఇక్కడికి రా... నీ పెళ్లాం నా భార్యను తక్కువ చేసి మాట్లాడుతుందా? నన్ను కూడా తక్కువగా చూస్తుందా?" అంటూ భారీ డైలాగులతో విరుచుకుపడతాడు. రవి ఏం జరిగిందో అర్థం కాక, "ఏమైంది?" అని అడిగినా బాలు వినడు. "నీతో మాట్లాడేది ఏంటి?" అంటూ పైకి వెళ్లిపోతాడు. పరిస్థితి ఏంటో తెలియని రవి కూడా అన్న వెంట రూమ్‌కి వెళ్లిపోతాడు.
రూమ్‌లోకి వెళ్లగానే బాలు-మీనా-రవి-శృతి నలుగురూ ఒకరిపై ఒకరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటారు. వారి మాటలు, వాలకం చూస్తే ఇంట్లో ఏదో పెద్ద ఉపద్రవం జరిగిపోయినట్టే కనిపిస్తుంది. అయితే ఆ గొడవలో అసలు రియల్ ఫీలింగ్ కనిపించదు. ప్రేక్షకులకు మాత్రం స్పష్టంగా అర్థమయ్యేది ఒక్కటే-ఇది నిజమైన గొడవ కంటే, నలుగురు ముందుగానే ఫిక్స్ అయి ఆడుతున్న కొత్త డ్రామాలా ఉంది.
కానీ ఈ మొత్తం సీన్‌ను తప్పుగా అర్థం చేసుకున్న ప్రభావతి మాత్రం విపరీతంగా ఆనందపడిపోతుంది. "నా కొడుకు-కోడలు గొడవ పడుతున్నారు" అంటూ వెర్రిగా చిందులు వేస్తూ, ఇకపై శృతి-మీనా మాట్లాడుకోరని, ఇంట్లో తన ఆధిపత్యం మళ్లీ తన చేతుల్లోకి వచ్చిందని ఊహల్లో తేలిపోతుంది. ఇంతలోనే సత్యం ఇంటికి చేరుకుంటాడు. "ఏం జరిగింది? ఎందుకు ఇంత అరుపులు?" అని ప్రశ్నిస్తే, ప్రభావతి వెంటనే "వాళ్ల నలుగురు గొడవ పడుతున్నారు" అంటూ విషయాన్ని చెప్పేస్తుంది. "అంత గొడవ జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావ్?" అని సత్యం ప్రశ్నించగా, ప్రభావతి చాకచక్యంగా కవరింగ్ ఇస్తూ, "గతంలో మీరే కదా... అనవసరంగా ఎవరి గొడవల్లోకి వెళ్లొద్దన్నారు. అందుకే వెళ్లలేదు" అంటూ తప్పించుకుంటుంది.
అప్పుడే గొడవ ముగిసినట్టు బాలు ఆవేశంగా కిందికి వచ్చి, "మరోసారి నా నాన్న గానీ, నా భార్య గానీ మాట అన్నా నేను ఊరుకోను. ఎవరైనా సరే చూసుకుంటా" అంటూ హెచ్చరిక ఇస్తూ బయటకు వెళ్లిపోతాడు. వెంటనే మీనా కూడా, "నన్ను గానీ, నా మొగుడిని గానీ పళ్ళు ఎత్తి మాట్లాడితే ఇకపై పడను" అంటూ గట్టిగా చెబుతుంది. అంతలోనే శృతి కూడా కిందికి వచ్చి, "ఇకపై మీనా మాటలు వినను. ఎవరికైనా అర్థం కావాలి అంటే ఇప్పుడే అర్థమవుతుంది" అని ప్రకటిస్తుంది. అంతేకాదు, అవసరమైతే ఇకపై తన అత్త ప్రభావతితోనే మాట్లాడతానని చెప్పడం ప్రభావతికి మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్‌లో బాలు-మీనా మధ్య ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ డ్రామా వెనుక దాగి ఉన్న అసలు ప్లాన్ ఏంటన్నది తెలుసుకోవాలంటే... రాబోయే ఎపిసోడ్లు మిస్ కాకూడదు!


Click it and Unblock the Notifications











