Gunde Ninda Gudi Gantalu February 2nd Episode: మీనా మాస్టర్ ప్లాన్..సుగుణకి హార్ట్ ఎటాక్.. చిక్కులో రోహిణి..
Gunde Ninda Gudi Gantalu: గుడి నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో మొత్తం కుట్రలు, అపార్థాలు, ధైర్యమైన కౌంటర్లు, చివర్లో ఊహించని మైండ్ గేమ్ ట్విస్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే మీనాపై చాడీలు చెప్పాలని నిర్ణయించుకున్న ప్రభావతి, శృతి తల్లి శోభన ఇంటికి రాగానే తన అసలు నాటకం మొదలుపెడుతుంది. మీనా వల్ల శృతి జీవితం నాశనం అవుతుందని విషం చల్లే ప్రయత్నం చేసినా, శోభన గట్టిగా ఎదురు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రభావతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది.ఇదే సమయంలో రోహిణికి తల్లి యాక్సిడెంట్ ఫోన్ రావడంతో ఆమె అసలు నిజం చెప్పకుండా వెళ్లిపోవడం ప్రభావతిలో మరింత అనుమానాలను రేకెత్తిస్తుంది.
ఆ తర్వాత రోడ్డు మీద శోభన-మీనా మధ్య జరిగిన ఘర్షణ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలుస్తుంది. ప్రభావతి మాటలు నమ్మిన శోభన మీనాపై తీవ్ర ఆరోపణలు చేస్తే, మీనా గౌరవంగా కానీ ధైర్యంగా కౌంటర్ ఇస్తుంది. చివరకు మీనా స్నేహితురాలి హెచ్చరికతో శోభన భయపడి వెళ్లిపోతుంది. ఈ దృశ్యాలను గమనించిన బాలు నిజం తెలుసుకుని కోపంతో మీనాతో కలిసి ఇంటికి వస్తాడు. ఇదే సమయంలో బాలు, మీనా, రవి, శృతి ముందే ప్లాన్ చేసిన డ్రామాను స్టార్ట్ చేస్తారు. బయట ఉన్న ప్రభావతి తన ప్లాన్ సక్సెస్ అయిందని ఆనందపడుతుండగా, నిజానికి నలుగురూ కలిసి ప్రభావతినే బకరా చేస్తారు. ఈ ట్విస్ట్‌తో శుక్రవారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది.

గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ ట్విస్ట్‌తో సాగుతూ ఇంట్లోని వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంట్లో అన్నదమ్ములు-తోడికోడళ్ల మధ్య గొడవలు జరుగుతుంటే, అందరికంటే ఎక్కువగా ఆనందపడింది మాత్రం ప్రభావతే. "ఇదే నాకు కావాల్సింది" అన్నట్టు ఆమె ముఖంలో కనిపించిన ఆనందం ప్రేక్షకులకే నవ్వు తెప్పించింది. ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటూ, శృతి-మీనా, బాలు-రవి మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే ప్రభావతి మాత్రం లోపల లోపల ఆనంద తాండవం చేస్తుంది.
అయితే ఈ మార్పును గమనించిన వ్యక్తి సత్యం. ఇప్పటివరకు ఐక్యంగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా ఇలా గొడవ పడటం చూసి, "ఇది ఏదో తేడాగా ఉంది" అని తల పట్టుకుంటాడు. బాలు, రవి, శృతి, మీనా మధ్య ఇలాంటి విభేదాలు ఎందుకు వచ్చాయో అర్థం కాక అయోమయంలో పడతాడు. అసలు నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుని బాలు దగ్గరకు వెళ్లి ఆరా తీస్తాడు.ఇక్కడే అసలు ట్విస్ట్.. బాలు మొదట కొంచెం మొహమాటపడినా, ఆ తర్వాత అసలు రహస్యాన్ని తండ్రికి చెబుతాడు. తాము నలుగురూ నిజంగా గొడవ పడటం లేదని, కావాలనే అలా నటిస్తున్నామని చెప్పడంతో సత్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని అడిగితే, బాలు పూర్తిగా వివరంగా చెబుతాడు.
మీనా మాస్టర్ ప్లాన్..
శృతి-మీనా కలిసి ఉండటం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ప్రభావతికి అస్సలు నచ్చడం లేదని బాలు వివరిస్తాడు. వాళ్ల ఐక్యతను చెడగొట్టాలనే ఉద్దేశంతో ప్రభావతి కావాలనే శృతిని రెచ్చగొట్టి, మీనాపై లేనిపోని ఆరోపణలు వేసిందని చెబుతాడు. శృతి ద్వారా మీనా దగ్గరకు వెళ్లి ప్రభావతి నానా మాటలు అనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని వివరిస్తాడు.
అప్పుడు మీనా తన తెలివిని ఉపయోగించింది. ఇప్పుడు నిజంగా గొడవ పడితే ఇంట్లో అనవసర సమస్యలు వస్తాయని, అన్నదమ్ముల మధ్య కూడా విభేదాలు రావచ్చని ఆలోచించింది. ముఖ్యంగా ప్రభావతిని సాటిస్‌ఫై చేయడానికి, ఆమె పన్నిన కుట్రను ఆమెకే తిరగదీసేలా ఒక ప్లాన్ వేసింది. "మనం గొడవ పడుతున్నట్టు నటిద్దాం. అప్పుడు అమ్మ సంతోషిస్తుంది, కానీ మన మధ్య నిజంగా ఏమీ మారదు" అని శృతి, రవి, బాలు అందరికీ చెప్పింది. వాళ్లంతా మీనా ఆలోచనకు ఒప్పుకుని ప్లాన్ ప్రకారం నటించడం మొదలుపెట్టారు. ఈ నిజం విన్న సత్యం మొదట ఆశ్చర్యపోయినా, తర్వాత మీనా తెలివితేటలకు మెచ్చుకుంటాడు. అదే సమయంలో ప్రభావతికి తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచన కూడా అతని మనసులో భావిస్తాడు.
శోభనకు శృతి స్ట్రాంగ్ వార్నింగ్
ఇంట్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో శృతి తన తల్లి శోభనకు ఫోన్ చేస్తుంది. 'వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాలి" అంటూ శృతి చెప్పడంతో శోభన ఒక్కసారిగా షాక్ అవుతుంది. "ఏంటి అలా మాట్లాడుతున్నావ్?" అని ప్రశ్నిస్తుంది. అందుకు శృతి ఆగ్రహంగా స్పందిస్తుంది. "ఎందుకు నా జీవితంలో జోక్యం చేసుకుంటున్నావ్? నాతో గొడవ పడ్డావు, నా మనసు ఎందుకు గాయపరిచావ్?" అంటూ నిలదీస్తుంది. మీనా విషయంలో ప్రభావతి చెప్పిన మాటలతోనే తాను అలా ప్రవర్తించానని, మీ సంసారం ఎక్కడ చెడిపోతుందోనని భయపడ్డానని శోభన తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది.అయితే శృతి మాత్రం వెనక్కి తగ్గదు. "నా జీవితంలో ఇకపై తలదూర్చవద్దు. లేనిపోని గొడవలు క్రియేట్ చేయవద్దు" అంటూ తల్లికి కఠిన హెచ్చరిక ఇస్తుంది. ఈ ఫోన్ కాల్‌తో శృతి పాత్ర మరింత స్ట్రాంగ్‌గా, నిర్ణయాత్మకంగా మారిందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
రోహిణి తల్లి సుగుణమ్మకి హార్ట్ ఎటాక్
ఇదిలా ఉండగా, మరో కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. రోహిణి తల్లి సుగుణమ్మ ఇంట్లో పడిపోవడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమంగా మారుతుంది. పక్కింటి వారు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి జాయిన్ చేస్తారు. విషయం తెలిసిన వెంటనే రోహిణి పరుగు పరుగున హాస్పిటల్‌కు చేరుకుంటుంది. డాక్టర్లను అడిగి పరిస్థితి తెలుసుకున్న రోహిణికి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. సుగుణమ్మ హార్ట్ పేషెంట్ అని, తప్పనిసరిగా ఎవరో ఒకరు దగ్గరుండి చూసుకోవాలని డాక్టర్లు స్పష్టంగా చెబుతారు.అయితే తాను సిటీకి దూరంగా ఉంటానని, అత్తగారింట్లో తల్లిని ఉంచుకోవడం సెట్ కాదని రోహిణి ఆందోళన వ్యక్తం చేస్తుంది.
దీనిపై డాక్టర్లు మరింత సీరియస్ హెచ్చరిక ఇస్తారు. "సరైన జాగ్రత్తలు లేకపోతే ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. మీరు దగ్గరుండి చూసుకోలేకపోతే కనీసం కేర్‌టేకర్‌ను ఏర్పాటు చేయాలి" అని సూచిస్తారు. ఈ మాటలు విన్న రోహిణి పూర్తిగా అయోమయంలో పడుతుంది.
ఒకవైపు తల్లి ఆరోగ్యం, మరోవైపు తన గతం, తన కొడుకు విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందోనన్న భయం రోహిణిని మదనపెడుతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక తీవ్రంగా బాధపడుతుంది.
బాలు-మీనా మధ్య ఫన్నీ ఫైట్
ఎపిసోడ్ చివర్లో బాలు-మీనా మధ్య ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి చూపులకు వెళ్లే ఓ వ్యక్తిని అర్జెంటుగా డ్రాప్ చేయాల్సిన బాధ్యత బాలు మీద పడుతుంది. ఆ తొందరలో కారును వేగంగా నడుపుతుండగా, ఎదురుగా మీనా బైక్‌పై వస్తుంది. అతివేగం కారణంగా ఇద్దరూ ఢీకొట్టుకునేంత వరకు వెళ్లడంతో రోడ్డుమీదే మాటల యుద్ధం మొదలవుతుంది. "రోడ్ మీద జాగ్రత్త లేదా?" అంటూ మీనా, "నీదే తప్పు" అంటూ బాలు-ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతాయి. ఈ గొడవ మధ్యలో పెళ్లి చూపులకు వెళ్లే వ్యక్తి పూర్తిగా ఇరుక్కుపోతాడు. "అనవసరంగా మీ ఇద్దరి గొడవలో నేను చిక్కుకున్నాను" అన్నట్టుగా అతని ఇబ్బంది ప్రేక్షకులకు బాగా నవ్వు తెప్పిస్తుంది. చివరకు ఈ సరదా సన్నివేశంతోనే నేటి ఎపిసోడ్ ముగిసి, లైట్ నోట్‌లో ముగింపు ఇచ్చింది.
అప్‌కమింగ్ ఎపిసోడ్: రోహిణి చిక్కులో పడినట్టే?
ఇదిలా ఉండగా, రాబోయే ఎపిసోడ్‌లో మాత్రం టోన్ పూర్తిగా మారనుంది. రోహిణి అబద్ధాలు ఒక్కొక్కటిగా ఆమెను చిక్కుల్లోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. మనోజ్ ఫోన్ చేయగానే, "దివ్య దగ్గరికి వెళ్లాను... రావడానికి లేట్ అవుతుంది" అంటూ రోహిణి అబద్ధం చెబుతుంది.
అయితే అదే సమయంలో అనూహ్యంగా దివ్యే రోహిణిని కలవడానికి మనోజ్ షాప్‌కు రావడం కథలో పెద్ద ట్విస్ట్‌గా మారుతుంది. దీనితో మనోజ్‌కు అనుమానం పెరుగుతుంది. మరోసారి రోహిణికి ఫోన్ చేసి "ఎక్కడికి వెళ్లావు?" అని అడిగితే, ఆమె మళ్లీ "దివ్య దగ్గరికి వెళ్తున్నాను" అని చెప్పడం పరిస్థితిని మరింత గందరగోళంగా చేస్తుంది. ఇంటికి వచ్చిన వెంటనే మనోజ్ రోహిణిని నిలదీయబోతున్నట్టు ప్రోమోలో చూపించడంతో, ఆమె అబద్ధాల గుట్ట ఎప్పుడు బయటపడుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. అప్‌కమింగ్ ఎపిసోడ్ కూడా హై వోల్టేజ్ డ్రామాతో సాగనుందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











