Gunde Ninda Gudi Gantalu February 3rd Episode:రోహిణిపై మనోజ్ అనుమానం.. తప్పించుకునేందుకు మరో డ్రామా..

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ లో అన్నదమ్ములు-తోడికోడళ్ల మధ్య జరుగుతున్న గొడవలను చూసి ప్రభావతి లోపలలోపల ఆనంద తాండవం చేస్తుండటం ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది. శృతి-మీనా, బాలు-రవి మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే, "ఇదే నాకు కావాల్సింది" అన్నట్టు ప్రభావతి ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ మార్పును గమనించిన సత్యం, ఇంతవరకు ఐక్యంగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా ఇలా గొడవ పడటం చూసి అనుమానం పెంచుకుంటాడు. అసలు నిజం తెలుసుకోవాలనుకుని బాలు దగ్గరకు వెళ్లి ప్రశ్నించగా, ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. తాము నిజంగా గొడవ పడటం లేదని, కావాలనే నటిస్తున్నామని బాలు చెప్పడంతో సత్యం షాక్ అవుతాడు. ఇది మీనా వేసిన మాస్టర్ ప్లాన్ అని బాలు వివరించడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.

శృతి-మీనా ఐక్యతను చెడగొట్టాలనే ఉద్దేశంతో ప్రభావతి చేసిన కుట్రను ఆమెకే తిరగదీసేందుకు, గొడవపడుతున్నట్టు నటిద్దామని మీనా ప్లాన్ వేసిందని తెలుస్తుంది. ఈ తెలివికి సత్యం మెచ్చుకుని, ప్రభావతికి తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచనలో పడతాడు. ఇదిలా ఉండగా, శృతి తన తల్లి శోభనకు ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. తన జీవితంలో జోక్యం చేయవద్దని, లేనిపోని గొడవలు సృష్టించవద్దని కఠినంగా హెచ్చరిస్తుంది. మరోవైపు రోహిణి తల్లి సుగుణమ్మకు హార్ట్ సమస్య రావడంతో హాస్పిటల్ డ్రామా మొదలవుతుంది. తల్లి ఆరోగ్యం, తన గతం బయటపడుతుందన్న భయం మధ్య రోహిణి అయోమయంలో పడుతుంది. ఎపిసోడ్ చివర్లో బాలు-మీనా మధ్య రోడ్డుపై జరిగే ఫన్నీ ఫైట్ ప్రేక్షకులకు మంచి వినోదం ఇచ్చింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 611 February 3rd 2026 here is full story

రోడ్డుపై బాలు మీనా రచ్చ... పోలీస్ ఫైన్‌తో ప్యాచ్ అప్

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో బాలు- మీనా జంట చేసిన రచ్చ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. ఇంట్లో మొదలైన చిన్న గొడవ రోడ్డుపైకి చేరడంతో సీన్ మొత్తం కామెడీగా మారిపోయింది. ఒకరినొకరు తిట్టుకుంటూ నడిరోడ్డుపై నానా హడావుడి చేయడం... చుట్టుపక్కల వాళ్లంతా ఆశ్చర్యంగా చూడడం హైలైట్‌గా నిలిచింది. ఈ గొడవ పీక్స్‌కు చేరిన క్షణంలోనే ట్రాఫిక్ పోలీస్ ఎంట్రీ ఇవ్వడం సీన్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఏమిటి ఈ రచ్చ అంటూ ప్రశ్నించిన పోలీస్, నడిరోడ్డుపై గొడవకు రూ.500 చలాన్ వేయడంతో ఇద్దరికీ ఒక్కసారిగా బుద్ధి వచ్చింది. అప్పటివరకు తలలు పట్టుకుని తిట్టుకున్న జంట... ఫైన్ మాట వినగానే ఒక్కటైపోయారు. ఇంతకీ ఇదేం జంట అంటూ పోలీస్ కూడా వీళ్ల వ్యవహార శైలికి షాక్ అవుతాడు. బాలు కారులో ప్రయాణించిన వ్యక్తి కూడా వీళ్ల చేష్టలు చూసి ఆశ్చర్యపోవడం మరింత కామెడీ టచ్ ఇచ్చింది.

రోహిణి టెన్షన్... మనోజ్ అనుమానం
మరోవైపు ఎపిసోడ్ సీరియస్ మోడ్‌లోకి మారింది. రోహిణి తల్లి సుగుణమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె హాస్పిటల్‌కు పరుగులు తీస్తుంది. తల్లి పరిస్థితి గురించి ఆలోచిస్తూ, తన కొడుకు తల్లి కోసం బాధపడుతుండడం చూసి రోహిణి మరింత కలత చెందుతుంది. అయితే దగ్గర ఉండి చూసుకునే పరిస్థితి లేకపోవడంతో, సుగుణమ్మకు ఒక నర్స్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తెలియాలంటే రిపోర్ట్స్ రావాల్సిందేనని డాక్టర్లు స్పష్టం చేస్తారు. ఆ రిపోర్ట్స్ ఆధారంగానే పేషెంట్ కండిషన్ చెబుతామని చెప్పడంతో రోహిణి గుండెల్లో ఆందోళన పెరుగుతుంది.

ఇక చాలా సేపు ఇంటికి దూరంగా ఉండడంతో, అనుమానం రాకుండా మనోజ్‌కు ఫోన్ చేయాలని అనుకుంటుంది. కానీ అంతలోనే మనోజ్ నుంచే కాల్ రావడం ట్విస్ట్. ఎక్కడున్నావ్ అని ప్రశ్నించిన మనోజ్‌కు, తాను బయటకు వచ్చానని, త్వరలో ఇంటికి వస్తానని రోహిణి చెబుతుంది.అయితే బిజినెస్ బాగా జరిగిందని చెప్పడానికి ఫోన్ చేశానని మనోజ్ అనడంతో, రోహిణి కాస్త డల్‌గా స్పందిస్తుంది. ఈ మార్పు గమనించిన మనోజ్ మరోసారి అనుమానంతో ప్రశ్నిస్తాడు. దీంతో రోహిణి 'దివ్య దగ్గరికి వచ్చాను' అని చెబుతుంది. కానీ అదే సమయంలో దివ్య షాప్‌లోకి ఎంటర్ కావడం ఉత్కంఠను రెట్టింపు చేసింది. అనుమానం పెరిగిన మనోజ్ మళ్లీ అదే ప్రశ్న వేయడంతో, రోహిణి అదే సమాధానం చెప్పడంతో కోపంతో మనోజ్ ఫోన్ కట్ చేస్తాడు.

బాగోతం బయటపడే ప్రమాదం?
తక్షణమే రోహిణి దివ్యకు ఫోన్ చేసి షాప్ వైపు రావద్దని చెబుతుంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. తాను షాప్‌లోనే ఉన్నానని, మనోజ్ కూడా చూసేశాడని దివ్య చెప్పడంతో రోహిణి గుండె గుబేలు మంటుంది. తన బాగోతం బయటపడుతుందేమోనన్న భయం ఆమెను వెంటాడుతుంది. ఇక మనోజ్ కూడా... తనకు చెప్పకుండా రోహిణి ఏం చేస్తోంది? ఎందుకు అబద్ధం చెప్పింది? అంటూ పలు విధాలుగా ఆలోచిస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తాడు. బాలు-మీనా ట్రాక్ పూర్తిగా ఫన్నీ మూడ్‌లో సాగితే, రోహిణి వ్యవహారం మాత్రం మరోసారి ఇంట్లో కలకలం రేపింది.

రోడ్డుపై జరిగిన గొడవ తర్వాత ఇంటికి వచ్చిన బాలు-మీనా మధ్య పరిస్థితి మరింత ఫన్నీగా మారింది. కోపంతో ఊగిపోతున్న మీనా... బాలు మీద గ్లాసులు, గిన్నెలు విసిరేయడం ప్రేక్షకులకు నవ్వులు తెప్పించింది. ఏం చేయాలో తెలియని బాలు... ఎలాగైనా మీనా కోపం చల్లార్చాలని తన ట్రిక్స్ ఉపయోగించాడు. మీనాకు ఎంతో ఇష్టమైన స్వీట్ తెచ్చి ఇవ్వడం, ఆ తర్వాత సారీ చెప్పడం పని చేసింది. ఒక్కసారిగా మీనా కూల్ అవ్వడంతో గొడవ ముచ్చటగా ముగిసింది. అయితే ఆ తర్వాత మీనా మనసులోని బాధ బయటపడుతుంది. చాలా రోజులుగా చింటూని చూడకపోవడం తనకు బాధగా ఉందని, ఒకసారి వెళ్లి చూసేద్దామా అని అడుగుతుంది. బాలు కూడా ఆలస్యం చేయకుండా కచ్చితంగా వెళ్దాం అని మాట ఇస్తాడు.

మనోజ్ ఆగ్రహం... రోహిణి కన్నింగ్ ప్లాన్
ఇక మరోవైపు ఇంటికి రాగానే మనోజ్ ఆగ్రహంతో రోహిణిని నిలదీస్తాడు. తనకు ఎందుకు అబద్ధం చెప్పావని ప్రశ్నిస్తాడు. మాటల మధ్యలో మీనా క్యారెక్టర్‌ను కూడా తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. కానీ రోహిణి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు... తన నటనను స్టార్ట్ చేస్తుంది. తాను ఓ స్వామీజీ దగ్గరికి వెళ్లానని, మనోజ్ కోసం మహిమగల దండాలు తీసుకొచ్చానని చెబుతుంది. అయినా మనోజ్ పూర్తిగా నమ్మడు. "నువ్వు రంగురంగుల బట్టలు వేసుకుంటేనే నన్ను తిట్టేదానివి... అలాంటిది ఈ మాలలు ఎందుకు?" అంటూ ప్రశ్నిస్తాడు.

అప్పుడే రోహిణి మరో మెట్టు ఎక్కుతుంది. మనోజ్ స్వామీజీ చెప్పినట్లే నడుచుకుంటున్నాడని, అందుకే బిజినెస్ ఇంత డెవలప్ అయిందని చెప్పి... ఇంకా గొప్ప బిజినెస్‌మ్యాన్ కావాలనే కోరికతోనే ఈ హారం తీసుకొచ్చానని భావోద్వేగంగా చెబుతుంది. భవిష్యత్తు గురించి తాను ఎంతగా ఆలోచిస్తున్నానో వివరించడంతో మనోజ్ గాల్లో తేలిపోతాడు. చివరకు ఆ గొడవ అక్కడితో ముగుస్తుంది. మొత్తానికి రోహిణి తన కన్నింగ్ ప్లాన్‌తో మరోసారి తప్పించుకుంటుంది.

మరోవైపు వంటింట్లో రవి తన పాకశాస్త్ర ప్రతిభ చూపించాడు. రుచికరమైన లడ్డూలను తయారు చేసి శృతికి ఇవ్వడంతో ఆమె ఆశ్చర్యపోతుంది. ఇవి ఇక్కడే కాకుండా ఫారెన్ మార్కెట్‌లో అమ్మితే మంచి లాభం వస్తుందని, మనం ఓ బిజినెస్ స్టార్ట్ చేద్దామంటూ ఐడియా వేస్తుంది. ఈలోపే అక్కడికి వచ్చిన మీనా కూడా లడ్డూలను రుచి చూసి అద్భుతంగా ఉన్నాయని కితాబిస్తుంది. అప్పటివరకు సరదాగా ఉన్న వాతావరణం... ప్రభావతి ఎంట్రీతో ఒక్కసారిగా మారిపోతుంది. ఆమె వస్తోందని తెలిసిన వెంటనే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం మొదలుపెడతారు.

ప్రభావతి వచ్చి మీనాపై అరుస్తూ, శృతి-రవిలతో మళ్లీ మాట్లాడితే బాగోదని హెచ్చరిస్తుంది. దీంతో మీనా కూడా అత్తయ్యకు ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తుంది. ప్రభావతి వెళ్లిపోయాక మళ్లీ అందరూ ఫన్నీగా మాట్లాడుకోవడం ఈ ట్రాక్‌కు రిలీఫ్ ఇచ్చింది. బాలు-మీనా చింటూని చూడటానికి వెళ్తున్నామని చెప్పగా, రవి చేసిన లడ్డూలను తీసుకెళ్లమని మీనా ఇస్తుంది.

అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్
రాబోయే ఎపిసోడ్‌లో బాలు సుగుణమ్మకు ఫోన్ చేసి... తాము చింటూని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతాడు. ఈ వార్తతో సుగుణమ్మ ఆనందానికి అవధులు ఉండవు. వెంటనే ఈ విషయాన్ని రోహిణికి చెప్పడంతో... రోహిణి షాక్‌కు గురవుతుంది. రోహిణి వద్దన్నా, తన నిర్ణయం మారదని సుగుణమ్మ స్పష్టం చేయడంతో... రోహిణి ఏం చేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో పడుతుంది. రాబోయే ఎపిసోడ్స్‌లో దత్తత అంశం ఇంట్లో ఎలాంటి తుఫాన్ సృష్టిస్తుందో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X