Gunde Ninda Gudi Gantalu February 5th Episode: మనోజ్ ఆత్మహత్య.. ప్రభావతికి హార్ట్ అటాక్.. జంటకు మీనా వార్నింగ్

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో భావోద్వేగాలు, అనుమానాలు, కీలక నిర్ణయాలు కథను ఉత్కంఠభరిత మలుపు తిప్పాయి. బాలు-మీనా కలిసి చింటూని కలవాలనే ఉద్దేశంతో సుగుణమ్మ ఇంటికి వెళ్లడం నుంచే కథ ఆసక్తికరంగా సాగింది. సుగుణమ్మ ఆరోగ్య పరిస్థితి చూసి ఇద్దరూ ఆందోళన చెందుతారు. తన ఆరోగ్యం గురించి ఎందుకు చెప్పలేదని బాలు ప్రశ్నించగా, ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే చెప్పలేదని సుగుణమ్మ వివరణ ఇస్తుంది. అయితే కూతురు రోహిణి రాకపోవడంపై బాలు, మీనా ఇద్దరూ అసహనం వ్యక్తం చేస్తారు. సుగుణమ్మ మాత్రం కూతుర్ని సమర్థిస్తూ, నర్స్‌ను ఏర్పాటు చేసిందని చెబుతుంది. చింటూ కనిపించకపోవడంతో బాలు ప్రశ్నించగా, ఆరోగ్యం బాగోలేక బంధువుల ఇంటికి పంపించామని సుగుణమ్మ అబద్ధం చెబుతుంది. ఈ క్రమంలో బాలు కీలక నిర్ణయాన్ని లేవనెత్తుతూ, చింటూని దత్తత తీసుకోవాలనే ఆలోచనను సుగుణమ్మ ముందు ఉంచుతాడు.

ఇది విని ఆమె కళ్లలో ఆనందం మెరుస్తుంది. కానీ తుది నిర్ణయం కూతురి చేతిలో ఉందని స్పష్టం చేస్తుంది. మీనా కూడా అవసరమైతే తమపై ఆధారపడాలని ధైర్యం ఇస్తుంది. అనంతరం సుగుణమ్మ రోహిణికి ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ చెబుతుంది. దీంతో రోహిణి ఆగ్రహంతో రగిలిపోతుంది. చింటూని దత్తత ఇవ్వాలన్న తల్లి ఆలోచనతో ఆమె పూర్తిగా షాక్ అవుతుంది. చింటూ భవిష్యత్తు కోసమే నిర్ణయమని సుగుణమ్మ తేల్చి చెప్పడంతో తల్లి-కూతుళ్ల మధ్య ఘర్షణ తీవ్రంగా మారుతుంది.మరోవైపు బాలు సందేహాల్లో మునిగిపోతే, మీనా శాంతంగా ధైర్యం చెబుతుంది. చివరికి రోహిణి తన స్నేహితురాలు దివ్యతో మాట్లాడి కొత్త ప్లాన్ వేస్తుంది. తల్లిని, చింటూని సిటీకి తీసుకొచ్చి ఇక్కడే ఉంచాలని నిర్ణయించుకుంటుంది. చింటూకు స్కూల్ అడ్మిషన్ తీసుకున్నానని తల్లికి చెప్పడంతో సుగుణమ్మ ఆనందంతో మురిసిపోతుంది. ఈ మలుపుతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగుస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 613 February 5th 2026 here is full story

photo courtesy: Jio Hotstar

గురువారం ప్రసారమైన గుండె నిండా గుడిగంటలు తాజా ఎపిసోడ్ మొత్తం సరదా, అపార్థాలు, చిన్న చిన్న ట్విస్ట్‌లతో ప్రేక్షకులను చివరి వరకూ కట్టిపడేసింది. ఎపిసోడ్ ఆరంభంలోనే మీనా ఇంటివారందరికీ రుచికరమైన బిర్యానీ వండిపెడుతుంది. ఆ బిర్యానీని ఆస్వాదిస్తూ శృతి... 'నీ చేతిలో ఏదో మహత్యం ఉంది మీనా!" అంటూ తెగ పొగడ్తలు కురిపిస్తుంది. ఇద్దరూ సరదాగా మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉండగా... మీనా 'మనిద్దరం ఇలా సంతోషంగా ఉన్నాం కానీ... మా అత్తయ్యకి మన విషయం తెలిస్తే మనకు చుక్కలు చూపిస్తుందేమో' అంటూ తన భయాన్ని బయటపెడుతుంది.

ఈ మాటలు విన్న సత్యం కోడళ్లను ఆటపట్టించాలనే ఉద్దేశంతో 'రా ప్రభావతి వస్తోంది' అంటూ ప్రాంక్ వేస్తాడు. ఆ పేరు వినగానే మీనా-శృతి ఇద్దరూ ఒక్కసారిగా ఒకరినొకరు తిట్టుకోవడం మొదలుపెడతారు. వెంటనే సత్యం నవ్వేస్తూ తాను అబద్ధం చెప్పానని అంటాడు. దీంతో శృతి 'మామయ్య మీరు కూడా మాపై ప్రాంకులా?' అంటూ అలక చూపిస్తుంది. మీనా 'ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది' అని చెబుతుంది. దీనికి సత్యం, 'భార్య మోసం చేస్తే ఏమి చేయలేను... కనీసం కోడళ్లను ఆటపట్టించుకోవచ్చుగా!'అంటూ నవ్వులు పూయిస్తాడు.

ఇక టైం అయిపోయిందంటూ ప్రభావతికి టిఫిన్ తీసుకెళ్లేందుకు మీనా బయలుదేరుతుంది. దూరం ఉండటంతో కావడంతో బాలుని డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. బాలు ఇప్పటికే ట్రిప్‌కు లేట్ అవుతోందంటూ కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అతికంగారులో మీనా క్యారీ బ్యాగ్‌ను ఫ్రంట్ సీట్లో పెట్టేసి... పూల కోసం మళ్లీ ఇంట్లోకి వెళ్తుంది. అదే సమయంలో బాలు తన ఖర్చుల లెక్కలు చూసుకుంటూ ఉండగా... అనుకోకుండా ఒక బిల్ మీనా క్యారీ బ్యాగ్‌లో పడిపోతుంది. కానీ ఆ విషయాన్ని బాలు గమనించడు. మీనా వచ్చి, 'అర్జెంటుగా అత్తయ్యకి టిఫిన్ ఇచ్చి... అక్కడ్నుంచి కస్టమర్‌కి పువ్వులు ఇవ్వాలి' అంటూ తొందర పెడుతుంది. ఇంతలో బాలు ట్రిప్‌కు బయల్దేరాల్సి రావడంతో మీనాను మీనాక్షి ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోతాడు.

డాన్స్ స్కూల్‌లో ప్రేమజంట హడావుడి
మరోవైపు ప్రభావతి డాన్స్ స్కూల్‌లో బిజీగా ఉంటుంది. అక్కడ ఓ ప్రేమికుల జంట పని మానేసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండటాన్ని మీనాక్షి గమనిస్తుంది. వాళ్ల ఎక్స్‌ప్రెషన్స్‌ను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే... ప్రభావతి మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది. మీనా టిఫిన్ తీసుకుని అక్కడికి చేరుకునే సమయానికి ప్రభావతి, 'లంచ్ బ్రేక్... అందరూ వెళ్లి భోజనం చేయండి' అంటుంది. అదే సమయంలో ఆ ప్రేమజంట ఒకరికొకరు తినిపించుకుంటూ మరింతగా రొమాన్స్ చేయడం ఎపిసోడ్‌కు మరో సరదా టచ్ ఇచ్చింది.

మరోవైపు మీనా టిఫిన్ తీసుకుని రాగానే ప్రభావతి ఒక్కసారిగా మండిపడుతుంది. 'ఏంటి ఇంత లేట్ చేసావ్? ఏమనుకుంటున్నావ్?' అంటూ మీనాను గట్టిగా నిలదీస్తుంది. దీనికి మీనా అమాయకంగా 'నాకు తెలియదు' అంటుంది. వెంటనే ప్రభావతి, 'ఇంట్లో వాచ్ లేదా?'అని ప్రశ్నించగా... మీనా మాత్రం, 'ఒక గడియారం నడవడం లేదు, ఇంకోటి లేటుగా నడుస్తోంది' అంటూ తింగరి సమాధానం ఇస్తుంది. ఇది విన్న పక్కనే ఉన్న మీనాక్షి కూడా ప్రభావతిపై సెటైర్లు వేస్తూ, 'నువ్వు విఐపివి కదా... పది నిమిషాలకు పది లక్షలు సంపాదించే డాన్సర్! పది నిమిషాలు లేట్ అయితే ఇంత బిల్డప్ అవసరమా?' అంటూ చురకలు అంటిస్తుంది. పరిస్థితి ఇంకా చేదుగా మారుతుందని భావించిన మీనా, తాను పూల ఆర్డర్ ఇవ్వాలని వెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ ప్రభావతి మాత్రం, 'ఏమనుకుంటున్నావ్? క్యారేజ్ నా ముఖాన పడేసి వెళ్తే నేను తినాలా?' అంటూ మరింతగా చిర్రెత్తుతుంది. దీంతో మీనా ఏమాత్రం మాట తిరగకుండా ప్రభావతికి మర్యాదగా బిర్యానీ వడ్డిస్తుంది.

బిర్యానీ తింటూనే ప్రభావతి, 'నువ్వే చేసావా... లేక హోటల్ నుంచి తెచ్చావా?' అంటూ మీనాపై అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనికి మీనా, ఇంట్లో అందరూ తృప్తిగా తిన్నారని, తానే స్వయంగా వండిన బిర్యానీ అని చెబుతుంది. అనంతరం, 'నాకు టైం అవుతోంది... మిగతా భోజనం పూర్తిచేసి గిన్నెలు క్యారీ బ్యాగ్‌లో పెట్టేయండి' అంటూ వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా ప్రభావతి మాత్రం పీకలదాకా బిర్యానీ తినేస్తుంది. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో మీనా డాన్స్ స్కూల్‌లో ఉన్న ప్రేమజంటను చూసి సందేహపడుతుంది. వాళ్లను పిలిచి, 'ఏకాగ్రతతో డాన్స్ నేర్చుకోండి... అనవసర విషయాలు పట్టించుకోకుండా ప్రాక్టీస్ చేయండి' అంటూ ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తుంది.

మరోవైపు.. మనోజ్ ట్రాక్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. ఫర్నిచర్ షాప్‌లో బిజినెస్ చూసుకుంటూ బిజీగా ఉన్న మనోజ్ దగ్గరకు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఓ లెటర్ ఇస్తాడు. ఊరు పేరు కూడా లేకుండా వచ్చిన ఆ లెటర్ చూసిన మనోజ్, 'ఏంటి ఇది? అడ్రస్ కూడా లేదు... నాకెందుకు ఇస్తున్నావ్?' అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ వ్యక్తి, 'ఊరు పేరు ఉంటేనే చదువుతావా? లోపల ఏముందో నువ్వే చూసుకో' అంటూ తేలిగ్గా సమాధానం ఇస్తాడు. మనోజ్ ఆ లెటర్ ఓపెన్ చేసి చదవగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అందులో మీ అమ్మకు హార్ట్ ఎటాక్ వస్తుంది... మీ తమ్ముడు హంతకుడవుతాడు... నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు... అని భయంకరమైన మాటలు రాసి ఉంటాయి.

సంబంధం లేకుండా ఇలా ఎందుకు రాశారో అర్థం కాక, మనోజ్ వెంటనే ఆ వ్యక్తిని వెతకడం మొదలుపెడతాడు. కొద్దిసేపటికి హోటల్ దగ్గర ఆ వ్యక్తి కనిపించడంతో మనోజ్ అతడిని నిలదీస్తాడు. 'అసలు ఆ లెటర్ ఏంటి? నాకెందుకు ఇచ్చావ్?'అని ప్రశ్నించగా... ఆ వ్యక్తి చాలా విచిత్రంగా, 'ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే ముందు హోటల్ బిల్ కట్టి రా' అంటూ మనోజ్‌ను లోపలికి పంపిస్తాడు. ఆ వ్యక్తి చెప్పినట్టుగానే మనోజ్ బిల్ పేమెంట్ చేసి బయటకు వస్తాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోతాడు. దీంతో మనోజ్ పూర్తిగా గందరగోళంలో పడిపోతాడు. 'అసలు ఎవడు వాడు? ఎందుకు ఆ లెటర్ ఇచ్చాడు?' అంటూ ఆలోచనల్లో మునిగిపోతాడు.

ఇక ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి తిన్న బిర్యానీ అరగలేదని ఇబ్బందిపడుతుంది. వెంటనే మీనాపై ఆరోపణలు మొదలుపెడుతుంది. బిర్యానీలో ఏదో కలిపిందని, కావాలనే తన ఆరోగ్యాన్ని పాడుచేసే ప్రయత్నం చేసిందని నిందలు వేస్తుంది.అదే సమయంలో రోహిణి క్యారీ బ్యాగ్‌లో ఉన్న బిల్‌ను చూసి, 'కచ్చితంగా ఇది హోటల్ బిర్యానీనే. అత్తయ్య ఆరోగ్యం చెడగొట్టాలనే మీనా ఇలా చేసింది' అంటూ లేనిపోని మాటలు అంటుతుంది. ఇంతలో మీనా కూడా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూసిన వెంటనే ప్రభావతి, 'ఏం వండి పెట్టావు? అసలు ఆ బిర్యానీ ఏ హోటల్ నుంచి తెచ్చావ్?'అంటూ తీవ్రంగా నిలదీస్తుంది.

దీనికి మీనా, 'ఇంట్లో అందరూ తిన్నారు... వాళ్లకు ఏమీ కాలేదు. మీకే ఇలా అయింది' అంటూ సమాధానం ఇస్తుంది. ఈ మాటలు విన్న సత్యం రంగంలోకి దిగుతూ, 'నువ్వే పీకలదాకా తిని... ఇప్పుడు జీర్ణం కాక ఇబ్బంది పడుతూ మీనాపై నిందలు వేస్తావా?' అంటూ ప్రభావతిని మందలిస్తాడు. కానీ ప్రభావతి మాత్రం బిల్ చూపిస్తూ, 'ఇదిగో సాక్ష్యం! హోటల్ నుంచే తెచ్చింది' అంటూ మరింత గొడవ పెడుతుంది. అంతలోనే బాలు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. బిల్ విషయం, ప్రభావతి ఆరోపణలు, మీనా అమాయకత్వం... ఇవన్నీ బాలు ముందు ఎలా బయటపడతాయో అన్న ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.

అప్‌కమింగ్ ఎపిసోడ్ ప్రోమో: ఇక రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో మరో పెద్ద ట్విస్ట్ చూపించారు. రోహిణి గతానికి సంబంధించిన విషయాలతో కూడిన ఓ లెటర్ బయటపడుతుంది. ఆ లెటర్ గురించి ప్రభావతికి తెలియడంతో ఆమె వెంటనే పలు అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో రోహిణిని పిలిచి వివరణ కోరినట్టు తెలుస్తోంది. అలాగే ఆ లెటర్ ఇచ్చిన వ్యక్తి ఎవరో అడిగితే, 'వాడు ఒక దొంగ... తరచూ జైలుకు వెళ్లి వస్తూ ఉంటాడు' అని సమాధానం వస్తుంది. ఇది విన్న రోహిణి ఒక్కసారిగా కంగారుపడుతుంది. ఆ వ్యక్తి తన బాయ్‌ఫ్రెండ్ దినేష్ అయ్యుండొచ్చేమో అన్న భయంతో లోలోపల తడబడిపోతుంది.రోహిణి బాగోతం బయటపడుతుందా? రోహిణి గతంపై వెలుగులోకి వచ్చిన కొత్త రహస్యాలు... ఇవన్నీ కలిసి కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X