Gunde Ninda Gudi Gantalu February 6th Episode: బాలుకి పీడకల.. అద్దె ఇంటికి రోహిణి లక్ష.. ప్రభావతి చిచ్చు..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్ సరదా, అపార్థాలు, చిన్న ట్విస్ట్‌లతో ప్రేక్షకులను చివరి వరకూ కట్టిపడేసింది. ఎపిసోడ్ ఆరంభంలో మీనా ఇంటివారందరికీ బిర్యానీ వండిపెట్టగా... శృతి "నీ చేతిలో ఏదో మహత్యం ఉంది" అంటూ పొగడ్తలు కురిపిస్తుంది. అత్తయ్య విషయం బయటపడితే ఇబ్బందులు వస్తాయేమోనని మీనా భయపడగా, సత్యం "రా ప్రభావతి వస్తోంది" అంటూ ప్రాంక్ వేయడంతో మీనా-శృతి గందరగోళానికి గురవుతారు. చివరికి అది సరదానేనని తెలిసి నవ్వులు పూయిస్తాడు. ప్రభావతికి టిఫిన్ ఇవ్వడానికి బయల్దేరిన మీనా, బాలుతో కలిసి వెళ్తుంది. తొందరలో క్యారీ బ్యాగ్ కారులో పెట్టగా... అనుకోకుండా బాలు ఖర్చుల బిల్ అదే బ్యాగ్‌లో పడిపోతుంది. ఇదే తర్వాత పెద్ద వివాదానికి కారణమవుతుంది. డాన్స్ స్కూల్‌లో ప్రేమజంట సరదాలు మీనాక్షి గమనిస్తే, ప్రభావతి మాత్రం పట్టించుకోని తీరు చూపిస్తుంది.
టిఫిన్‌తో వచ్చిన మీనాపై ప్రభావతి లేట్ అంటూ మండిపడుతుంది. మీనాక్షి సెటైర్లు వేయగా, మీనా మర్యాదగా బిర్యానీ వడ్డిస్తుంది. తింటూనే "ఇది హోటల్‌దా?" అంటూ ప్రభావతి అనుమానం వ్యక్తం చేస్తుంది. మరోవైపు మనోజ్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి భయంకరమైన మాటలతో లెటర్ ఇచ్చి మాయమవడం మరో ఉత్కంఠను పెంచింది. ఇంటికి వచ్చాక ప్రభావతి బిర్యానీ జీర్ణం కాలేదని మీనాపై ఆరోపణలు చేస్తుంది. రోహిణి క్యారీ బ్యాగ్‌లో బిల్ చూసి "హోటల్ బిర్యానీనే" అంటూ చిచ్చు పెడుతుంది. సత్యం మందలించినా ప్రభావతి బిల్ చూపిస్తూ గొడవ చేస్తుంది. అంతలో బాలు ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. బిల్ నిజం బయటపడుతుందా? మీనా అమాయకత్వం రుజువవుతుందా? అన్న ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.

photo courtesy: Jio Hotstar
శుక్రవారం ఎపిసోడ్ లో ప్రభావతి తిన్నది జీర్ణం కాక అవస్థలు పడుతుండగా, ఇదే అవకాశంగా భావించిన రోహిణి మీనాపై నిందలు వేస్తుంది. కావాలనే హోటల్‌లో బిర్యానీ కొనిపెట్టి అత్తయ్య ఆరోగ్యాన్ని పాడుచేసిందంటూ నోరు జారుతుంది. దీనికి తోడు ప్రభావతి కూడా "ఇంట్లో వండిన బిర్యానీ కాకుండా హోటల్‌ది పెట్టింది" అంటూ ఆరోపణలు చేస్తుంది. ఈ సమయంలో బాలు ఎంట్రీ ఇచ్చి అసలు విషయం ఏంటని ప్రశ్నిస్తాడు. ప్రభావతి వెంటనే హోటల్ బిల్లు చూపిస్తుంది. బిల్లు చూసిన బాలు నవ్వుతూ అసలు నిజాన్ని బయటపెడతాడు.
'ఇది ఈరోజు బిల్లు కాదు... 31వ తేదీన రాజేష్ దగ్గర నేను బిర్యానీ తెచ్చుకున్నప్పుడు వచ్చిన బిల్. అనుకోకుండా మీనా క్యారీ బ్యాగ్‌లో పడింది'అని క్లారిటీ ఇస్తాడు. దీంతో రోహిణి మాటలు ఆగిపోతాయి, మెల్లగా అక్కడి నుంచి జారుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ మీనా గట్టిగా నిలదీస్తూ, ఇప్పటివరకు ఆరోపణలు చేసి ఇప్పుడు నోరు మూసుకుని వెళ్లిపోతావా అంటూ ప్రశ్నిస్తుంది. ప్రభావతిని కూడా మీనా తీవ్రంగా నిలదీస్తుంది.
ఇంతలో సత్యంకు రంగా నుంచి ఫోన్ రావడం మరో కీలక మలుపు. మీనాక్షి వంటలో పచ్చ కర్పూరం బదులు కర్పూరం వేసిందని, అందుకే మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయని రంగా చెప్పడంతో అసలు కారణం బయటపడుతుంది. దీంతో సత్యం ప్రభావతిని గట్టిగా హెచ్చరిస్తూ.. నిజాలు తెలియకుండా ఎదుటివారిపై నిందలు వేయడం మానేయాలని చెబుతాడు. మీనా కూడా ప్రభావతి, రోహిణిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ 'బయట ఏది పడితే అది తిని నా మీద నిందలా? ఇకనైనా ఆలోచించి మాట్లాడండి' అంటుంది. బిల్లు ట్విస్ట్‌తో మీనా నిర్దోషిత్వం రుజువు అవుతుంది.
మరోవైపు.. మనోజ్ నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. లెటర్‌లో రాసినట్టే ప్రభావతికి హార్ట్ ఎటాక్ రావడం, తాను ఆత్మహత్య చేసుకోవడం కలలో కనిపించడంతో తీవ్రంగా కంగారుపడ్డాడు. ఈ విషయాన్ని దాచుకోలేక అదే అర్ధరాత్రి తల్లికి ఫోన్ చేసి ధాబాపైకి రమ్మని కోరాడు. ప్రభావతి వచ్చిన వెంటనే మనోజ్ జరిగినదంతా చెప్పి లెటర్ చూపించాడు. అందులో ఉన్న భయంకరమైన మాటలు చూసి ప్రభావతి కూడా ఆందోళనకు లోనవుతుంది. "నాకు హార్ట్ ఎటాక్ రావడమేంటి? నువ్వు ఆత్మహత్య చేసుకోవడమేంటి?" అంటూ కంగారు పడుతుంది. లెటర్ ఎవరు ఇచ్చారో అడిగితే... అతను దొంగ, హంతకుడు, తరచూ జైలుకు వెళ్లి వచ్చే వ్యక్తి అని మనోజ్ చెబుతాడు. దీంతో ప్రభావతి మరింత భయపడిపోతుంది.
అదే సమయంలో ధాబాపై ఏదో అలికిడి వినిపించడంతో ఇద్దరూ దొంగేనని ఫిక్స్ అవుతారు. ప్రభావతి అయితే ఇటుక పట్టుకుని దాడికి సిద్ధమవుతుంది. కానీ అక్కడికి వచ్చినది రోహిణి. మనోజ్ కోసం వెతుకుతూ వచ్చిన ఆమెపై ప్రభావతి దాడి చేయబోయేలోపే రోహిణి అప్రమత్తమై గట్టిగా అరుస్తుంది. విషయం తెలిసిన తర్వాత మనోజ్ లెటర్ రోహిణికి ఇస్తాడు. చదివిన రోహిణి నవ్వుతూ- ఇది ఎవరో బ్లాక్‌మేయిల్ చేయడానికి రాసిన లెటర్ అయి ఉంటుందని, అనవసరంగా భయపడొద్దని ధైర్యం చెబుతుంది. అయినా మనోజ్ మాత్రం ఆ వ్యక్తి ప్రమాదకరుడు అంటూ కంగారు పడతాడు. లోలోపల ఆ లెటర్ ఇచ్చింది తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దినేష్ కావచ్చని రోహిణి భయపడినా బయటకు చెప్పకుండా షాప్‌కు అదనపు సెక్యూరిటీ పెట్టాలని సలహా ఇస్తుంది.
మరోవైపు బాలుకూ పీడకల వచ్చి ఉలిక్కిపడతాడు. మీనా ఏమైందని అడిగితే- కలలో ఇద్దరూ పెద్దగా గొడవపడినట్టు చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తాడు. మీనా మాత్రం ఆలుమగలు అండర్‌స్టాండింగ్‌తో ఉంటే ఏమీ కాదంటూ సర్దిచెబుతుంది, దిష్టి కూడా తీసేస్తుంది. ఆ తర్వాత బాలు రొమాంటిక్‌గా దగ్గరవ్వగా మొదట మీనా దూరం పెట్టినా... చివరికి ఇద్దరూ హగ్ చేసుకుని ప్రేమలో మునిగిపోతారు.
మరోవైపు రోహిణి తన ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరుసటి రోజు తల్లి, కొడుకును తన దగ్గరికి తీసుకురావాలన్న ఉద్దేశంతో అద్దె ఇల్లు వెతుకుతూ బయటకు వస్తుంది. ఈ క్రమంలో ఓ ఇల్లు కనిపించినా... ఆ రూమ్ ఓనర్ కాస్త వెటకారం మనిషిగా, నిక్కచ్చిగా మాట్లాడే టైప్‌గా ఉంటాడు. అతడి బిహేవియర్ చూసిన రోహిణి ఫ్రెండ్ దివ్య, "ఇలాంటి వాళ్ల దగ్గర ఇల్లు అవసరమా?" అని సందేహం వ్యక్తం చేస్తుంది. కానీ రోహిణి మాత్రం ఈ ఇల్లు అన్ని చోట్లకు దగ్గరగా ఉందని, తమకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి ముందుకు వెళ్తుంది.
అయితే ఇంటి ఓనర్ ముందుగా రోహిణి గురించి ఆరా తీసి రూమ్ ఇవ్వనని అంటాడు. రోహిణి బతిమాలడంతో చివరికి ఇంటిని చూసుకోమని అనుమతిస్తాడు. ఇల్లు ఓకే అనగానే నెలకు రూ.20 వేల అద్దె, అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేయడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయినా ప్రస్తుతం పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ ఇల్లు కావాల్సి రావడంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి, మిగతాది రెండు రోజుల్లో ఇస్తానని ఒప్పుకుంటుంది. ఇలా తన ప్లాన్‌లో భాగంగా తల్లి-కొడుకులను తన దగ్గరకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో రోహిణి మరో అడుగు ముందుకేస్తుంది.
మరోవైపు బాలు టాక్సీ స్టాండ్‌కు వెళ్లగా... అతని ఫ్రెండ్స్ అంతా ఖాళీగా కూర్చుని కనిపిస్తారు. ట్రిప్స్ రావడం లేదని వాళ్లు చెబుతారు. ఇదే సమయంలో బాలు ఫ్రెండ్ రాజేష్ పూర్తిగా మద్యం మత్తులో వచ్చి పడిపోతాడు. "వీడు ఈ మధ్య ఇలా ఎందుకు?" అని బాలు అడిగితే, కుటుంబ బాధలే కారణమంటూ రాజేష్ దీనంగా సమాధానం చెబుతాడు. ఈ సన్నివేశంతో ఎపిసోడ్ భావోద్వేగంగా ముగుస్తుంది.
రాబోయే ఎపిసోడ్‌లో రాజేష్ తన తల్లిదండ్రులకు షష్టిపూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ డబ్బులు తానే అరేంజ్ చేస్తానని బాలు మాట ఇస్తాడు. కానీ మీనా మాత్రం అనవసరంగా డబ్బులు వృధా చేయొద్దంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ మాటలను ప్రభావతి దొంగచాటుగా విని... బాలు-మీనా మధ్య చిచ్చు పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు ప్రోమోలో చూపించారు. ఇక రాబోయే ఎపిసోడ్‌ల్లో రోహిణి, ప్రభావతి ప్లాన్లు ఎలా ఫలిస్తాయో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











