Gunde Ninda Gudi Gantalu February 9th Episode: బాలు, మీనాల మధ్య గొడవ.. రోహిణి కీలక నిర్ణయం..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారంఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రభావతి అస్వస్థతకు గురవ్వడంతో ఇంట్లో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఇదే అవకాశంగా భావించిన రోహిణి, మీనాపై నిందలు మొదలుపెడుతుంది. బయట హోటల్ బిర్యానీ తెప్పించిందని ఆరోపిస్తూ పరిస్థితిని మరింత విషమం చేస్తుంది. ప్రభావతి కూడా అదే మాట అంటడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ సమయంలో బాలు ఎంట్రీ ఇచ్చి అసలు నిజాన్ని బయటపెడతాడు. ప్రభావతి చూపించిన బిల్లు పాతదని, అది గతంలో తానే తెచ్చుకున్న బిర్యానీకి సంబంధించినదని క్లారిటీ ఇవ్వడంతో రోహిణి మాటలు ఆగిపోతాయి. తర్వాత రంగా కాల్ ద్వారా వంటలో పచ్చ కర్పూరం బదులు కర్పూరం పడిందని తెలిసి అసలు కారణం బయటపడుతుంది. దీంతో సత్యం ప్రభావతిని హెచ్చరిస్తాడు.
మీనా కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఆధారాలు లేకుండా నిందలు వేయొద్దని స్పష్టంగా చెబుతుంది. బిల్లు ట్విస్ట్‌తో మీనా నిర్దోషిత్వం రుజువు అవుతుంది. మరోవైపు మనోజ్‌కు భయంకరమైన కల రావడంతో అర్ధరాత్రే తల్లిని పిలిపించి లెటర్ విషయం చెబుతాడు. దొంగ అలికిడి అనుకుని భయపడిన ఇద్దరికీ అక్కడ రోహిణి కనిపిస్తుంది. లెటర్ చదివిన రోహిణి ఇది బ్లాక్‌మెయిల్ అయి ఉండొచ్చని ధైర్యం చెబుతుంది. ఇంకో వైపు బాలు-మీనా మధ్య భావోద్వేగ క్షణాలు చోటుచేసుకుంటాయి. అదే సమయంలో రోహిణి తన ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అద్దె ఇల్లు ఫిక్స్ చేస్తుంది. నెలకు రూ.20 వేల అద్దె, లక్ష అడ్వాన్స్ వినగానే షాక్ అయినా, పరిస్థితుల దృష్ట్యా కొంత డబ్బు ఇచ్చి మిగతాది రెండు రోజుల్లో ఇస్తానని ఒప్పుకుంటుంది. ఎపిసోడ్ మొత్తం డ్రామా, ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా సాగింది.

సోమవారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. బాలు ఫ్రెండ్ రాజేష్ ఫుల్లుగా పీకలు దాకా తాగి, సోయిలేకుండా టాక్సీ స్టాండ్ లోనే పడుకుంటాడు. ఈ పరిస్థితిని చూసిన బాలు తొలుత ఆగ్రహంతో ఊగిపోతాడు. 'ఎందుకు తాగావ్ రా' అంటూ రాజేష్ పై చేయి చేసుకుంటాడు బాలు. దీంతో రాజేష్ తన పేదరికం గురించి ఇంట్లో సమస్యల గురించి, సమాజంలో డబ్బు ఇచ్చే విలువ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు. దీంతో బాలు ఇంతకీ నీ సమస్య ఏంటి? ఎందుకు ఈ వేదాంతం? అని ప్రశ్నించగా.. లాస్ట్ వీక్ తన పెదనాన్నకు షష్టిపూర్తి ఘనంగా చేశారని, వాళ్లు డబ్బులు ఉన్నవాళ్లు కాబట్టి ఊరంతా పిలిచి గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేశారు. మరో వారం రోజుల్లో తన నాన్న షష్టిపూర్తి కూడా ఉందని, వారిలాగా తన కూడా తన తండ్రికి షష్టిపూర్తి చేయాలని భావిస్తున్నాననీ చెబుతాతు. అయితే సింపుల్గా ఈ వేడుక చేస్తే తమ పరువు పోతుందని, నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు అని బాధపడతాడు.
తనకు జన్మనిచ్చిన తండ్రికి జీవితంలో గుర్తుండిపోయేలా ఒక్క పని కూడా చేయలేదని, అందుకే వారిని సంతోషపెట్టాలని షష్టిపూర్తి చేయాలనుకుంటున్నాను అంటూ రాజేష్ బాధపడతాడు. దీంతో బాలు కూడా ఆలోచనలో పడతాడు. మెయిన్ గా ఫాదర్ సెంటిమెంట్ తో చెప్పడంతో బాలు మరింత ఆలోచిస్తాడు. ఇంతకీ ఆ ఫంక్షన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని బాలు ప్రశ్నించగా.. ఎంత చిన్నగా చేసిన దాదాపు లక్ష వరకు ఖర్చవుతుందనీ, ఇప్పటికే చాలామంది అడిగాననీ, కానీ ఎవరు కూడా డబ్బు ఇవ్వడానికి ముందుకు రాలేదనీ, ముఖం చాటేస్తున్నారంటూ ఎమోషనల్ అవుతాడు. దీంతో బాలు ఆ డబ్బులు తాను ఇస్తానని, వెళ్లి ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని మాట ఇస్తాడు. దీంతో రాజేష్ ఆనందంతో ఎగిరి గంతేస్తాడు.
ఇక మరోవైపు.. మనోజ్ తన షోరూమ్ కు సెక్యూరిటీని పెట్టుకోవాలని ఇంటర్వ్యూలు నిర్వహిస్తాడు. అయితే మనోజ్ కు నచ్చిన క్యాండిడేట్స్ రాకపోవడంతో నిరాశ చెందుతాడు. ఈ క్రమంలో అవసరమా అనే స్థాయికి కూడా వెళ్తారు. ఈ సమయంలో ఓ వ్యక్తి ఇంటర్వ్యూకు వస్తాడు. అతని అవతారం, ఎత్తు చూసి మనోజ్ షాక్ అవుతాడు. 'వీడేంటి ఇంత ఇప్పుడు ఉన్నాడేంటి' అని ఆశ్చర్యపోతాడు. తాను సెక్యూరిటీ గార్డ్ ఇంటర్వ్యూకు వచ్చానని, తాను పదివేలకు పని చేయడానికి అని చెప్తాడు. అయితే ఈ సమయంలో తన కండిషన్లు చెబుతూ.. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా 20 పూరీలు, 50 ఇడ్లీలు, మధ్యాహ్నం బిర్యాని, సాయంత్రం డ్రింక్స్, నైట్ 25 ఎగ్స్, చపాతీలు, ఫ్రూట్స్ అంటూ తన డైట్ చెబుతాడు. దీంతో మనోజ్ ఒకసారి నోరెలా బెడుతాడు. ఇవన్నీ తినడానికా లేక హోటల్ గాని రెస్టారెంట్ గాని నడపడానికా?.. ఇంతలా చెప్తున్నావ్ అంటూ ప్రశ్నించాడు మనోజ్.
సెక్యూరిటీ గార్డ్ అంటే ఈ మాత్రం తినకపోతే ఎలా సార్ , మీపై అటాచ్ చేసే వారిని ఎలా అడ్డుకుంటాం అంటాడు. అంతేకాకుండా.. మనోజ్ ను ఒకసారి నిలబడమని.. ఎత్తుకొని గిరి గిరా తిప్పి కింద పడేస్తాడు. దీంతో మనోజ్ కు చుక్కలు కనిపిస్తాయి. తాను తన నిర్ణయం చెప్తానని 10 నిమిషాలు బయట వెయిట్ చేయమని చెప్తాడు. ఈ విషయాన్ని రోహిణి తో డిస్కస్ చేసి, వీడు మనకు అవసరమా ? అని ప్రశ్నించగా.. 'నిన్న నువ్వు రక్షించుకోవాలంటే కనీసం ఇలాంటి పర్సన్ ఉండాలి.. పెట్టుకో' అని చెప్పగా.. కానీ వాని డైట్ చూసి మనోజ్ కాస్త సందేహిస్తాడు. రోహిణి మాత్రం.. కచ్చితంగా ఆ పర్సనల్ ను సెక్యూరిటీ గార్డ్ గా పెట్టుకోమని సూచిస్తుంది. దీంతో మనోజ్ కూడా ఓకే చెబుతాడు.
ఇక మరోవైపు బాలు .. మీనా దగ్గరికి వస్తాడు. అయితే మీనా పని చిరాకులో ఉంటుంది. తాను పనిలో ఉన్నానని అనవసరంగా తనని డిస్టర్బ్ చేయవద్దని చెబుతుంది. దీంతో బాలు.. మీనాకు సహాయం చేస్తాడు. ఆ పని పూర్తి అయినా త్వరగా.. మీనా ఫ్రీ అవుతుంది. దీంతో బాలు రాజేష్ విషయాన్ని చెబుతాడు. రాజేష్ తన తండ్రికి షష్టిపూర్తి చేయాలని భావిస్తున్నాడని, అయితే డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాడని, ఆ డబ్బులను తాను అరేంజ్ చేస్తానని మాట ఇచ్చినట్లు బాలు చెబుతాడు. 'అయినా నీ దగ్గర ఎంత డబ్బు ఎక్కడిది? ఎలా తీసుకొస్తావ్? అని మీనా ప్రశ్నించగా.. మనమిద్దరం కాంపిటీషన్లో గెలిచిన డబ్బు ఉంది కదా.. ఆ భరోసాతోనే తాను డబ్బులు ఇస్తానని మాట ఇచ్చాననీ, తన మాట మేరకు రాజేష్ వేడుకలను చేసుకుంటున్నాడు అని బాలు చెప్తాడు. దీంతో మీనా ఒకసారిగా షాక్ అవుతుంది. ఆ డబ్బులను ఇల్లు కట్టుకోవడానికి దాచిపెట్టానని అనవసరంగా ఇలాంటి ఖర్చులు చేయవద్దని మీనా చెబుతుంది. కానీ బాలు మాత్రం తాను మాట ఇచ్చానని మరోసారి చెబుతాడు.
ఈ విషయంలో నేను అస్సలు తగ్గదు. అనవసరమైన ఆర్భాటాలకు పోయి సమస్యలకు పొంది తెచ్చుకోవద్దని, మీరైనా మీ స్నేహితుడికి చెప్పమని బాలుకి సూచిస్తుంది. అయినా డబ్బు లేనప్పుడు అంత ఆర్పాటంగా వేడుకలు చేయడమేంటి? ఒకవేళ ఆ డబ్బును తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఏం చేస్తావ్? అంటూ మీనా ప్రశ్నిస్తుంది. ఏదేమైనా ఒకటే మాట మీద ఉంటుంది. తాను ఇలాంటి విషయాలలో అస్సలు వెనుకకు తగ్గని, అనవసరమైన ఖర్చులు పెట్టవద్దని బాలుకు చెప్తుంది. ఒకవేళ మీ ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడో లేదా ఏదైనా సమస్య వచ్చిందో అంటే అలాంటి విషయాలలో డబ్బులు సహాయం చేయడం తప్పేమీ కాదని చెబుతోంది. ఇలా రాజేష్ విషయంలో బాలు మీనా అభిప్రాయం భేదాలతో గొడవ జరుగుతుంది. ఈ విషయాన్ని అంతా ప్రభావతి చాటుగా వింటుంది.
ఎప్పుడెప్పుడు చిచ్చుపెట్టాలని ప్రభావతి ఇది సరైన సమయంలో భావిస్తాను. కానీ, బాలు మాత్రం. తన తల్లి ఆలోచన విధానాన్ని భావించి ముందుగానే అప్రమత్తమవుతాడు. అనవసరంగా తమ మధ్య చిచ్చు పెట్టవద్దని, ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని సూచిస్తాడు. దీంతో ప్రభావతి డీలపడుతుంది. మరోవైపు బాలు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి అప్పు కావాలని వారిని సహాయం కోరుతాడు. అనవసరంగా వాడికి ఎందుకు మాట ఇచ్చావు ఇంట్లో అంతా సమస్యలు ఉండగా వాడికి సహాయం ఎందుకు చేస్తానని మాట ఇచ్చావు అంటూ స్నేహితులు కూడా బాలుని తిడతారు. దీంతో బాలు ఆలోచనలో పడతాడు ఎలాగైనా తన ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని, లక్ష రూపాయల కోసం తిరుగుతూ ఉంటాడు.
ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో ఈ విషయం బాలు, మీనాల మధ్య విభేదాలు వచ్చినట్లు అర్థమవుతుంది. ఈ విషయాన్ని బాలు తన అన్నదమ్ములకు చెప్పుకుంటూ బాధపడుతుండగా.. మీనా ఈ విషయాన్ని రోహిణి, శృతి లకు చెబుతూ తన తన నిర్ణయాన్ని చెబుతోంది. ఇలా బాలు ,మీనాల మధ్య రాజేష్ విషయంలో గొడవ జరగబోతున్నట్లు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











