Gunde Ninda Gudi Gantalu February 10th Episode: రాజేష్ కు మీనా క్లాస్.. భార్యపై బాలు ఆగ్రహం.. ప్రభావతి చిచ్చు.

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ ప్రారంభంలో బాలు తన ఫ్రెండ్ రాజేష్‌ను టాక్సీ స్టాండ్‌లో మద్యం మత్తులో పడిపోయి ఉండటం చూసి షాక్ అవుతాడు. ఆగ్రహంతో రాజేష్‌పై చేయి చేసుకుంటాడు. అయితే రాజేష్ తన పేదరికం, కుటుంబ పరిస్థితులు, సమాజంలో డబ్బుకు ఉన్న విలువ గురించి ఆవేదనగా మాట్లాడుతాడు. ఇటీవల తన పెదనాన్నకు ఘనంగా షష్టిపూర్తి జరిపారని, మరో వారం రోజుల్లో తన తండ్రికి కూడా షష్టిపూర్తి ఉందని చెబుతాడు. తండ్రికి జీవితంలో గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని అనుకుంటున్నానని, కానీ డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నానని ఎమోషనల్ అవుతాడు. దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చవుతుందని, ఎవరూ అప్పు ఇవ్వక ముఖం చాటేస్తున్నారని చెప్పడంతో బాలు కదిలిపోతాడు. చివరికి ఆ డబ్బులు తానే ఇస్తానని మాట ఇచ్చి రాజేష్‌ను ఆనందపరుస్తాడు.

ఇక మరోవైపు మనోజ్ తన షోరూమ్‌కు సెక్యూరిటీ గార్డ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తాడు. విచిత్రమైన డైట్ కండిషన్లతో వచ్చిన భారీ కాయుడిని చూసి మనోజ్ షాక్ అవుతాడు. అయితే అతని బలం చూసిన తర్వాత, రోహిణి సూచనతో చివరికి అతడిని సెక్యూరిటీగా పెట్టుకోవడానికి ఓకే చెబుతాడు. ఈ సన్నివేశాలు కామెడీగా ఆకట్టుకున్నాయి. ఇక బాలు-మీనా మధ్య రాజేష్ విషయంలో గొడవ మొదలవుతుంది. కాంపిటీషన్‌లో గెలిచిన డబ్బును ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్నామని మీనా అభ్యంతరం తెలుపుతుంది. అనవసర ఆర్భాటాలకు ఖర్చు పెట్టవద్దని సూచిస్తుంది. బాలు మాత్రం మాట ఇచ్చానని వెనక్కి తగ్గడు. ఈ సంభాషణను ప్రభావతి చాటుగా విని చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ బాలు ముందే అప్రమత్తమై ఆమెను ఆపేస్తాడు. చివరికి లక్ష రూపాయల కోసం బాలు స్నేహితుల దగ్గర తిరుగుతూ ఉండటంతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగుస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 616 February 10th 2026 here is full story

photo courtesy: Jio Hotstar

మంగళవారం ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, ఆర్థిక ఒత్తిళ్లు, వ్యక్తిగత సంఘర్షణలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కథ ఆరంభంలోనే బాలు తన ఫ్రెండ్ రాజేష్ కోసం డబ్బులు సమకూర్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అయితే మీనా మాత్రం దీనికి గట్టిగా నిరాకరిస్తూ, "అనవసరమైన ఆర్భాటాలకు పోయి తిప్పలు పడొద్దు" అంటూ రాజేష్‌కే ఈ విషయం చెప్పమని సూచిస్తుంది. అయినా బాలు మాత్రం తాను ఇచ్చిన మాట కోసం వెనక్కి తగ్గకుండా ప్రయత్నాలు కొనసాగిస్తాడు. ఈ క్రమంలో బాలు తన స్నేహితుల దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతాడు. కానీ వారు కూడా తమ వద్ద డబ్బులు లేవని స్పష్టం చేస్తూ, "లేని పరిస్థితుల్లో వాడికి మాట ఇచ్చి ఆశలు ఎందుకు పెట్టావు?" అంటూ బాలు మీదే అసహనం వ్యక్తం చేస్తారు. దీంతో బాలు మరింత సంకటంలో పడిపోతాడు. ఫ్రెండ్‌కు ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి, డబ్బు ఎలా అరేంజ్ చేయాలి అనే ఆలోచనలతో తీవ్రంగా మథనపడతాడు.

ఇదిలా ఉండగా... రాత్రివేళ శృతికి దివ్య నుంచి ఫోన్ రావడంతో పరిస్థితి మరో మలుపు తిరుగుతుంది. అర్ధరాత్రి కాల్ రావడంతో కంగారుపడిన శృతి, ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్లి మాట్లాడుతుంది. అప్పుడే దివ్య అసలు విషయం బయటపెడుతుంది. రూమ్ ఓనర్ అర్జెంటుగా లక్ష రూపాయల అడ్వాన్స్ ఇవ్వమని, లేదంటే ఆ రూమ్‌ను వేరే వారికి ఇచ్చేస్తానని బెదిరిస్తున్నాడని చెబుతుంది. ఇప్పటికే కొంత అడ్వాన్స్ ఇచ్చామని చెప్పినా, రేపు ఉదయం వరకు మొత్తం కట్టకపోతే రూమ్ ఇవ్వనని అతను గట్టిగా హెచ్చరించాడని దివ్య వెల్లడిస్తుంది. దీంతో రోహిణి పూర్తిగా అయోమయంలో పడిపోతుంది. ఏం చేయాలో తెలియక ఆలోచనలో మునిగిపోతుంది. ఈ సమయంలో దివ్య "నీకు దుబాయ్ మామయ్య, దుబాయ్ మొగుడు ఉన్నారుగా" అంటూ వెటకారంగా మాట్లాడడంతో రోహిణి కోపం తెచ్చుకుంటుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన మనోజ్, ఎవరు ఫోన్ చేశారు? దుబాయ్ మాటలు ఎందుకు వస్తున్నాయి? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు.

తప్పించుకునే ప్రయత్నంలో రోహిణి తన ఫ్రెండ్‌కు అర్జెంట్ అవసరం ఉందని చెప్పి లక్ష రూపాయలు అడుగుతుంది. కానీ మనోజ్ మాత్రం "ముక్కు ముఖం తెలియని వాళ్లకు డబ్బులు ఇవ్వను" అంటూ స్పష్టంగా తిరస్కరిస్తాడు. దీంతో రోహిణి అతడిని రెచ్చగొడుతూ, "నీ గర్ల్ ఫ్రెండ్‌కు 40 లక్షలు ఇచ్చావు... కానీ నేను అడిగితే ఇవ్వవా?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. దీనితో మనోజ్ తీవ్ర ఆగ్రహానికి లోనై అక్కడి నుంచి ధాబాకు వెళ్లిపోతాడు. అప్పటికే అక్కడ బాలు, రవి డబ్బుల విషయమై చర్చించుకుంటూ ఉంటారు. మనోజ్ కూడా చేరి రోహిణితో తనకు జరిగిన గొడవను వివరిస్తాడు. ఈ సందర్భంగా రవి, అనవసర ఆర్భాటాలకు పోకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని ఇద్దరికీ సూచిస్తాడు. అలాగే స్నేహితులకు డబ్బులు ఇస్తే త్వరగా తిరిగి రావాలంటే వడ్డీకి ఇవ్వాల్సిందేనని సలహా ఇస్తాడు. ఇది విన్న మనోజ్‌కు ఒక్కసారిగా "సొల్యూషన్ దొరికింది" అన్న భావన కలిగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

అయితే బాలు మాత్రం దీనికి వ్యతిరేకంగా స్పందిస్తూ, స్నేహితుల మధ్య వడ్డీ లెక్కలు సరిపోవని చెబుతాడు. రవి కూడా బాలు మాటకు మద్దతు ఇస్తూ, అవసరం మరియు ఆర్భాటం మధ్య తేడా తెలుసుకోవాలని సూచిస్తాడు. అంతేకాదు, గతంలో రాజేష్ చేసిన సహాయాన్ని గుర్తు చేస్తూ-ఒక సందర్భంలో రాజేష్ కారును వడ్డీ వాళ్ల దగ్గర నుంచి విడిపించేందుకు తన కారును తాకట్టు పెట్టి మరీ సహాయం చేశాడని గుర్తు చేస్తాడు. అప్పట్లో ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా రాజేష్ ఎంత పెద్ద త్యాగం చేశాడో చెబుతూ, ఇప్పుడు నిర్ణయం తీసుకునే ముందు వెనుక ముందు ఆలోచించమని రవికి బాలు సూచిస్తాడు.

మరోవైపు.. వంటగదిలో మీనా, శృతి మాట్లాడుకుంటుండగా అక్కడికి వచ్చిన రోహిణి కూడా తన బాధ చెప్పుకుంది. మీనా మాట్లాడుతూ - డబ్బు విషయంలో తనకు బాలుకి మధ్య గొడవ జరిగిందని, అనవసరంగా బాలు రాజేష్ కోసం డబ్బులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడని, అవసరం-ఆర్భాటం మధ్య తేడా గుర్తించలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి రోహిణి కూడా స్పందిస్తూ... తాను కూడా మనోజ్‌తో డబ్బుల విషయంలో గొడవపడ్డానని, అర్జెంటుగా లక్ష రూపాయలు అవసరముందని, ఏమైనా సర్దుబాటు చేయగలవా అని శృతిని అడిగింది. అప్పుడు శృతి కీలక సలహా ఇచ్చింది. "మీ ఇద్దరి సమస్య కూడా డబ్బుతో ముడిపడి ఉంది. బాలు తన ఫ్రెండ్‌కు సహాయం చేయాలనుకుంటున్నాడు, నువ్వు నీ స్నేహితురాలికి చేయాలనుకుంటున్నావు. వాళ్ల దగ్గర నుంచి డబ్బు త్వరగా రావాలంటే - వేరే వ్యక్తి దగ్గర అప్పు చేసి ఇచ్చామని చెప్పండి. అప్పుడు మీ డబ్బు కూడా త్వరగా రిటర్న్ అవుతుంది" అని సూచించింది. ఈ మాటలతో రోహిణికి పరిష్కారం దొరికినట్లయ్యింది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఇదే సమయంలో మనోజ్-రోహిణి మధ్య ఓ అండర్‌స్టాండింగ్ ఏర్పడింది. డబ్బును మిత్తిగా ఇవ్వాలని మనోజ్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతాడు. రోహిణి ఆశ్చర్యపోతూ- తాను చెప్పాలనుకున్న ఐడియానే మనోజ్ చెప్పాడని భావిస్తుంది. గొడవలు పెరగకూడదనే ఉద్దేశంతో సరే అంటుంది. మనోజ్ మూడు రూపాయల వడ్డీతో లక్ష రూపాయలు ఇస్తానని, ప్రతినెల ఒకటో తారీకు వరకు మూడు వేల రూపాయలు కట్టాలని స్పష్టం చేస్తాడు. దీనికి రోహిణి ఓకే చెబుతుంది.

మరుసటి రోజు ఉదయం మీనా టాక్సీ స్టాండ్‌కు వెళ్లి రాజేష్‌ను కలుస్తుంది. డబ్బు విషయంలో తనకు బాలుకి మధ్య గొడవలు జరుగుతున్నాయని చెబుతూ, నేరుగా రాజేష్‌కు క్లియర్‌గా మాట్లాడుతుంది. "లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలుసు. అలాంటి డబ్బును ఒక్కరోజులో హంగులు, ఆర్భాటాల కోసం ఖర్చు పెట్టడం సరికాదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు తిండి పెట్టడానికే పిల్లలు ఆలోచిస్తున్నారు. అలాంటిది మీరు షష్టిపూర్తి చేయాలనుకోవడం మంచి విషయం. కానీ ఎదుటివాళ్లు ఘనంగా చేశారు కదా అని మనం కూడా అప్పులు చేసి ఆర్భాటాలు చేయాల్సిన అవసరం లేదు" అని సోదరిగా హితవు పలుకుతుంది.

వెళ్లే ముందు ముఖ్యంగా "అవసరం - ఆర్భాటం మధ్య తేడా తెలుసుకోండి" అని సూచిస్తుంది. ఈ మాటలు అక్కడున్న ఇతర ఫ్రెండ్స్ కూడా విని ఆశ్చర్యపోతారు. దీంతో రాజేష్ - ఈ విషయం ఇక్కడితో ఆపేయాలని, అనవసరంగా బాలు-మీనా మధ్య గొడవలు రావద్దని వారిని కోరుతాడు. ఇక మరోవైపు రోహిణి మనోజ్ షాప్‌కు వెళ్లగా... అప్పటికే అతడు లక్ష రూపాయలు సర్దుబాటు చేసి పెడతాడు. డబ్బులు ఇచ్చే ముందు డాక్యుమెంట్స్ క్లియర్‌గా ఉండాలని, సంతకాలు తప్పనిసరిగా తీసుకురావాలని సూచిస్తాడు. అవసరమైతే తానే సంతకం పెడతానని రోహిణి చెప్పగా - "డబ్బు విషయంలో నేను ఎదుటివాళ్లను నమ్మను... నిన్నే నమ్మి ఇస్తున్నాను" అని మనోజ్ స్పష్టం చేస్తాడు. మరోసారి వడ్డీ లెక్కను కూడా గుర్తు చేస్తాడు.

ఈ సమయంలో రోహిణి ఫ్రెండ్ పేరు విషయంలో కూడా మనోజ్‌కు అనుమానం వస్తుంది. నిన్న ప్రియా అన్నావు, ఈరోజు భాను అంటున్నావు - అసలు ఎవరు నీ ఫ్రెండ్ అని అడగగా, ఆమె పేరు భానుప్రియ అని సమాధానం చెబుతుంది. అంతలోనే దివ్య వచ్చి రోహిణిని పక్కకు తీసుకెళ్లడంతో మనోజ్ మరింత అనుమానంలో పడిపోతాడు. తనకు తెలియకుండా డబ్బు ఎవరికి ఇస్తోంది? ఏం చేస్తోంది? అన్న ఆలోచనల్లో మునిగిపోతాడు.

ఇక అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో మీనా రాజేష్‌కు సలహా ఇచ్చిన విషయం తెలిసిన బాలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడని తెలుస్తోంది. తన ఫ్రెండ్స్ విషయంలో మీనా జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని, "నాకు నచ్చినట్టు నేను చేస్తాను, అడ్డు చెప్పకు" అంటూ భార్యపై కోపం చూపిస్తాడు. ఇదే సమయంలో ప్రభావతి వచ్చి బాలు వైపు నిలబడి మాట్లాడడంతో బాలు-మీనా మధ్య విభేదాలు మరింత ముదురే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిణి అద్దె ఇంటి కోసం లక్ష రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతుండటం, మనోజ్ అనుమానాలు పెరగడం... ఇవన్నీ రాబోయే ఎపిసోడ్లలో మరిన్ని ట్విస్టులకు దారి తీసేలా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X