Gunde Ninda Gudi Gantalu February 11th Episode:రోహిణి డ్రామా… మనోజ్ అమాయకత్వం… రాజేష్ మోసం… బాలు కన్నీళ్లు!

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, ఆర్థిక ఒత్తిళ్లు, వ్యక్తిగత సంఘర్షణలతో ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది. కథ ఆరంభంలోనే బాలు తన ఫ్రెండ్ రాజేష్ కోసం డబ్బులు సమకూర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అయితే మీనా మాత్రం దీనికి గట్టిగా వ్యతిరేకిస్తూ.. అనవసర ఆర్భాటాల కోసం అప్పులు చేయొద్దని, నేరుగా రాజేష్‌తో మాట్లాడమని సూచిస్తుంది. అయినా ఇచ్చిన మాట కోసం బాలు వెనక్కి తగ్గకుండా స్నేహితుల దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతాడు. అక్కడ కూడా నిరాశే ఎదురవడంతో బాలు మరింత మథనంలో పడిపోతాడు. ఇదే సమయంలో రోహిణి ట్రాక్ మరో ఉత్కంఠను తెచ్చింది. అర్ధరాత్రి దివ్య నుంచి వచ్చిన కాల్‌తో లక్ష రూపాయల అడ్వాన్స్ సమస్య బయటపడుతుంది.

ఈ విషయమై మనోజ్‌తో రోహిణికి తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. "గర్ల్‌ఫ్రెండ్‌కు లక్షలు ఇచ్చావు... నాకు ఇవ్వవా?" అన్న రోహిణి మాటలతో మనోజ్ కోపంతో బయటికి వెళ్లిపోతాడు. అక్కడ బాలు, రవి మాటలతో వడ్డీకి డబ్బు ఇచ్చే ఐడియా మనోజ్‌కు క్లిక్ అవుతుంది. మరోవైపు వంటగదిలో మీనా-శృతి-రోహిణి సంభాషణ కీలక మలుపు తిప్పింది. ఇద్దరి సమస్యలు డబ్బుతో ముడిపడ్డాయని గుర్తించిన శృతి, "వేరే వాళ్ల దగ్గర అప్పు చేసి ఇచ్చామని చెప్పితే డబ్బు త్వరగా తిరిగి వస్తుంది" అంటూ సలహా ఇస్తుంది. దీంతో రోహిణికి పరిష్కారం దొరికినట్టవుతుంది. మరుసటి రోజు మీనా రాజేష్‌ను కలిసి అవసరం-ఆర్భాటం మధ్య తేడా చెప్పి హితవు పలుకుతుంది. మరోవైపు మనోజ్ రోహిణికి లక్ష రూపాయలు వడ్డీతో ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అయితే ఫ్రెండ్ పేర్ల విషయంలో వచ్చిన గందరగోళం మనోజ్‌లో అనుమానాలను పెంచుతుంది. ఇలా బాలు-మీనా మధ్య భావోద్వేగాలు, రోహిణి-మనోజ్ మధ్య డబ్బు డ్రామాతో ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 617 February 11th 2026 here is full story

Photo courtesy: Jio Hotstar

బుధవారం ఎపిసోడ్ ఆరంభంలోనే మనోజ్ తన దగ్గరున్న లక్ష రూపాయలను రోహిణి ఫ్రెండ్‌కు అప్పుగా ఇస్తాడు. నెల నెల మొదటి వారంలో వడ్డీ కట్టాలనే కండిషన్ పెడతాడు. దీనికి రోహిణి కూడా ఒప్పుకుంటూ, 'ఈ డబ్బుకు నేనే షూరిటీ' అని భరోసా ఇస్తుంది. అప్పుడే దివ్య అక్కడికి రావడం, రోహిణిని పక్కకు తీసుకెళ్లి ఏడుస్తూ తన తల్లికి ఆపరేషన్ ఉందని, అత్యవసరంగా రూ.75,000 కావాలని వేడుకోవడం... ఈ సీన్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. మొదట రోహిణి తన దగ్గర డబ్బులు లేవని, తాను సహాయం చేయలేనని చెప్పేస్తుంది. ఇదంతా గమనించిన మనోజ్ అసలు ఏం జరిగిందని అడగడంతో... దివ్య తల్లి ఆపరేషన్ విషయం బయటపడుతుంది. 'మన దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉన్నాయి?' అని రోహిణి అనగానే... మనోజ్ వెంటనే స్పందించి, 'ఆ డబ్బును నేనే ఇస్తాను'అంటూ మాట ఇస్తాడు. అక్కడే దివ్య అకౌంట్‌కు రూ.75,000 ట్రాన్స్ఫర్ చేస్తాడు మనోజ్. అంతేకాదు, ఇంకేదైనా అవసరం ఉంటే నిర్భయంగా అడగమని కూడా చెబుతాడు. మనోజ్ మంచితనానికి దివ్య కృతజ్ఞతలు చెప్పడం, రోహిణి కూడా తనతో పాటు హాస్పిటల్‌కు వెళ్తానని చెప్పి బయటకు రావడం... అన్నీ చూసిన ప్రేక్షకులకు మనోజ్ నిజంగా గొప్ప మనిషిలా కనిపిస్తాడు.

కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్!
తర్వాత కట్ చేస్తే... ఇదంతా రోహిణి ఆడిన పెద్ద డ్రామా అని తెలుస్తుంది. అసలు దివ్య తల్లి ఆపరేషన్ అనే విషయం అబద్ధం. చింటూ స్కూల్ ఫీజు కోసం ముందే ప్లాన్ వేసుకుని, దివ్యతో కలిసి మనోజ్‌ను మోసం చేసినట్లు బయటపడుతుంది. ఇలా లక్షతో పాటు మరో 75 వేల రూపాయలు కూడా మనోజ్ దగ్గర నుంచి లాగేసుకుంటుంది రోహిణి. కానీ ఈ విషయం ఏమాత్రం తెలియని మనోజ్ మాత్రం... 'ఫర్నిచర్ షాప్ బిజినెస్ కంటే వడ్డీ వ్యాపారమే బెస్ట్' అంటూ గాల్లో కోటలు కడుతూ కలలు కంటూ ఉంటాడు.

ఇక మరోవైపు... బాలు తన ఫ్రెండ్ రాజేష్ కోసం ఫైనాన్సర్ దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకుని టాక్సీ స్టాండ్‌కు చేరుకుంటాడు. డబ్బులు ఇవ్వబోతుంటే రాజేష్ మాత్రం ఆశ్చర్యకరంగా "నాకు ఫంక్షన్ చేయడం లేదు" అంటూ తీసుకోవడానికి నిరాకరిస్తాడు. దీంతో బాలు అనుమానం వచ్చి... అసలు ఏం జరిగింది? ఎవరు ఏమన్నారని ప్రశ్నిస్తాడు. అప్పుడే రాజేష్ 'మీనా వచ్చింది' అని చెబుతాడు. కానీ మీనా తప్పుగా ఏమీ మాట్లాడలేదని, అనవసరంగా గొడవ పడొద్దని కూడా అంటాడు. ఇది వినగానే బాలు కోపోద్రిక్తుడై... ఎవరి మాటలు వింటావ్? నా మాట విను! ఈ డబ్బు తీసుకోకపోతే మన స్నేహమే ఉండదంటూ రాజేష్‌ను హెచ్చరిస్తాడు. బాలు మాటలకు రాజేష్ చివరకు ఒప్పుకుని డబ్బు తీసుకుంటాడు. దీంతో తన తండ్రి షష్టిపూర్తి వేడుకలను చేయడానికి సిద్ధమవుతాడు. ఈ సీన్‌లో బాలు ఫ్రెండ్ కోసం ఎంత వరకు అయినా వెళ్లే మనస్తత్వం మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక ఈ వ్యవహారంతో పూర్తిగా కోపంతో ఉన్న బాలు, ఇంటికి రాగానే మీనాను నేరుగా దాబాపైకి తీసుకెళ్లి గొడవ మొదలుపెడతాడు. 'ఎందుకు రాజేష్ దగ్గరికి వెళ్లావు? నా ఫ్రెండ్స్ ముందు నా పరువు ఎందుకు తీస్తున్నావు?' అంటూ మీనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తాను స్నేహితుల కోసం ఎంతగా కష్టపడుతున్నాడో, అలాంటప్పుడు ఆమె అలా ప్రవర్తించడం తనకు అవమానంగా అనిపించిందని బాలు వాపోతాడు. దీనికి మీనా చాలా స్పష్టంగా స్పందిస్తుంది. తాను రాజేష్ దగ్గరకు వెళ్లింది హంగులు ఆర్భాటాల కోసం డబ్బు వృథా చేయొద్దని, ఉన్నదాంట్లోనే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రమే చెప్పానని క్లారిటీ ఇస్తుంది. అయినా బాలు తగ్గకుండా, 'నా ఫ్రెండ్ కోసం నేను సహాయం చేస్తున్నాను... ఇది తప్పా?" అంటూ వాదిస్తాడు. కానీ మీనా మాత్రం గట్టిగానే నిలబడి, అనవసరంగా డబ్బులు వృథా చేయడం సరైంది కాదని, తాగి తందనాలు చేసే వాళ్లకు డబ్బులు పోసే కంటే నిజంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మేలని సూచిస్తుంది.

ఇద్దరి మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా జరుగుతుండగా, ఇదంతా చాటుగా వింటున్న ప్రభావతి ఎంట్రీ ఇస్తుంది. పరిస్థితిని చల్లార్చాల్సిన చోట... మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. 'వాడు సంపాదించిన డబ్బులు వాడికి ఇష్టం వచ్చినవాళ్లకి ఇస్తాడు... నీకేంటి ప్రాబ్లం?' అంటూ మీనాను గట్టిగా తిడుతుంది. దీనికి మీనా కూడా వెనక్కి తగ్గకుండా, 'అనవసరంగా మీరు ఎందుకు ఈ గొడవల్లో తలదూరుస్తున్నారు?' అంటూ చురకలాంటిస్తుంది. అప్పుడే ప్రభావతి మరింత కోపంతో, 'పెద్ద చిన్నా లేకుండా మాట్లాడుతున్నావ్! మొగుడికి ఎదురు చెప్పే ధైర్యం నీకు ఎక్కడ నుంచి వచ్చింది?'అంటూ మీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో మీనా కూడా ఇక ఆగకుండా, 'మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి... తాగి తందనాలు చేసే వాళ్లకి డబ్బులు ఇస్తారో, ఫ్రెండ్ డబ్బులు ఇవ్వకపోతే మీరే కష్టపడతారో మీ ఇష్టం... నాకు సంబంధం లేదు'అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇక్కడ ప్రభావతి ఆ గొడవను ఇంకా పెద్దది చేయాలని చూస్తూ.. 'చూశావా రా... మీనా ఇలా మాట్లాడుతుందో? ఇదంతా నువ్వు ఇచ్చిన అలుసే. మొదటినుంచి కంట్రోల్లో పెట్టుంటే ఇలా మాట్లాడేది కాదు' అంటూ లేనిపోని మాటలు చెబుతుంది. అయితే బాలు మాత్రం ఈ విషయంలో తల్లి జోక్యం అవసరం లేదని చెప్పి, అనవసరంగా తలదూర్చవద్దని స్పష్టంగా చెప్పేస్తాడు. దీంతో ప్రభావతి అయోమయంలో పడుతుంది. అసలు వీరిద్దరూ నిజంగా గొడవపడ్డారా? లేక నేను తలదూర్చి తప్పు చేశానా? అంటూ తనను తానే ప్రశ్నించుకుంటుంది.

మరుసటి రోజు ఉదయం బాలు, తన ఫ్రెండ్ రాజేష్ తండ్రి షష్టిపూర్తి వేడుకలకు వెళ్తున్నానని తన తండ్రి సత్యానికి చెబుతాడు. దానికి సత్యం, 'ఒక్కడివే వెళ్తున్నావా? మీనా కూడా వస్తుందా?' అని అడుగుతాడు. బాలు మొదట తానే ఒక్కడు వెళ్తున్నానని చెప్పబోతుండగా... సత్యం మధ్యలోనే ఆపి, 'పెళ్లయిన వాళ్లు ఇలాంటి శుభకార్యాలకు ఒంటరిగా వెళ్లడం పద్ధతి కాదు. భార్యను కూడా తీసుకెళ్లాలి. దంపతుల ఆశీర్వాదం తీసుకుంటే మీ బంధం కూడా బలపడుతుంది' అంటూ హితబోధ చేస్తాడు. అంతలోనే మీనా వచ్చి, తాను కూడా ఫంక్షన్‌కు వస్తున్నానని, అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెబుతుంది. ఇది విన్న బాలు షాక్ అవుతాడు. తాను రమ్మనుకోని మీనా వస్తుందేమిటి అని లోపలే కంగారు పడతాడు. అయినా బయటకు మాత్రం కూల్‌గా ఉండి, 'నేను సహాయం చేయడం వల్ల ఓ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో చూద్దాం రా’ అని మీనాతో అంటాడు.

దానికి మీనా కూడా, 'మీ గౌరవం కాపాడడానికి, ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో చూడ్డానికి నేనూ వస్తున్నాను' అంటూ సమాధానం ఇస్తుంది. ఇలా ఒకరినొకరు మాటలతో గుచ్చుకుంటూనే ఇద్దరూ ఫంక్షన్‌కు బయల్దేరుతారు. కట్ చేస్తే... షష్టిపూర్తి వేడుకల దగ్గరికి వెళ్లాక బాలు షాక్ అవుతాడు. అక్కడ ఎలాంటి ఘనమైన ఏర్పాట్లు లేకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది చూసి బాలు అనుమానంతో, 'ఏంటి... ఏ ఏర్పాట్లు చేయలేదే?' అని అడుగుతాడు. దానికి రాజేష్ భార్య కన్నీళ్లతో, 'ఏం చేయమంటారు... మీ ఫ్రెండ్ చెప్పేది వింటాడా?' అంటూ బాధతో చెప్పడం ఎపిసోడ్‌కు ఎమోషనల్ క్లైమాక్స్‌గా నిలుస్తుంది.

ఇక అప్కమ్మింగ్ ఎపిసోడ్ లో రాజేష్ ప్రవర్తన బాలు జీవితంలోనే పెద్ద షాక్‌గా మారింది. ఫ్రెండ్ కోసం లక్ష రూపాయలు అప్పుగా తీసుకొని, తన తండ్రి షష్టిపూర్తి వేడుకలు ఘనంగా జరిపిస్తాడని నమ్మిన బాలు... అక్కడికి వెళ్లి చూసిన దృశ్యం అతడిని లోపల నుంచి కుదిపేసింది. ఫంక్షన్‌కు సరైన ఏర్పాట్లు లేకపోవడమే కాకుండా, రాజేష్ తాగి తందనాలు చేస్తూ తిరుగుతున్న తీరు చూసి బాలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. 'నేను నీ కోసం ఇంత చేశాను... ఇదేనా నీ బాధ్యత?' అంటూ రాజేష్‌ను నిలదీయడానికి బాలు ముందుకు వెళ్లగా... అక్కడే అవమానానికి గురైనట్లు తెలుస్తుంది. రాజేష్ మాటలు, ప్రవర్తన బాలు మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. తన మంచితనాన్ని, స్నేహాన్ని రాజేష్ విలువ చేయలేదన్న నిజం బాలు గుండెల్లో బలమైన దెబ్బ కొడుతుంది.

ఆ అవమానాన్ని దిగమింగుకుంటూ ఇంటికి తిరిగొచ్చిన బాలు ఒంటరిగా కూర్చుని తనను తానే ప్రశ్నించుకుంటూ, 'నేను చేసింది తప్పా?' అంటూ లోపల కుమిలిపోతాడు. అప్పుడే మీనా గతంలో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. తాగి తందనాలు చేసే వాళ్లకు డబ్బులు ఇవ్వడం అనవసరం అని ఆమె ఇచ్చిన హెచ్చరికను పట్టించుకోకపోవడం ఇప్పుడు తనకే భారంగా మారిందని బాలు గ్రహిస్తాడు. 'మీనా చెప్పినప్పుడు వినక పంతానికి పోయాను... ఫ్రెండ్ కోసం లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాను... ఇప్పుడు ఆ అప్పు నా మీదే పడింది' అంటూ బాలు బాధపడతాడు. తన నిర్ణయమే కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టిందన్న భావన అతడిని మరింత కుంగదీస్తుంది. రాబోయే ఎపిసోడ్లలో బాలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాడు? రాజేష్ తన తప్పు గ్రహిస్తాడా? మీనా-బాలు మధ్య బంధం మరింత బలపడుతుందా? అన్న ఉత్కంఠతో సీరియల్ కొనసాగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X