Gunde Ninda Gudi Gantalu February 12th Episode: బాలుకి ఘోర అవమానం.. చింటూ కిడ్నాప్..రోహిణి బాయ్ ఫ్రెండ్ బ్లాక్
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. ప్రారంభంలో మనోజ్, రోహిణి ఫ్రెండ్ దివ్యకు లక్ష రూపాయలు అప్పుగా ఇస్తూ ప్రతి నెల మొదటి వారంలో వడ్డీ చెల్లించాలని షరతు పెడతాడు. రోహిణి షూరిటీగా నిలుస్తుంది. అయితే కొద్ది సేపటికే దివ్య వచ్చి తన తల్లికి అత్యవసర ఆపరేషన్ కోసం 75 వేల రూపాయలు కావాలని ఏడుస్తూ అడుగుతుంది. మొదట రోహిణి వద్దని చెప్పినా, మనోజ్ విషయం తెలుసుకుని తానే డబ్బు ఇస్తానని మాట ఇస్తాడు. వెంటనే 75 వేలు ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. కానీ తర్వాత ఇది చింటూ స్కూల్ ఫీజు కోసం రోహిణి వేసిన డ్రామా అని తెలుస్తుంది. ఇలా మనోజ్ దగ్గర నుంచి లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు వెళ్లిపోతాయి. అయినా అతడు విషయం గ్రహించకుండా వడ్డీ వ్యాపారం గురించి కలలు కంటుంటాడు.
ఇక మరోవైపు బాలు తన స్నేహితుడు రాజేష్ కోసం లక్ష రూపాయలు అప్పు తీసుకువస్తాడు. కానీ రాజేష్ ఫంక్షన్ చేయనని చెప్పడంతో బాలు కోపంతో డబ్బు తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తాడు. రాజేష్ తండ్రి షష్టిపూర్తి వేడుకలు జరపాలని నిర్ణయిస్తాడు. దీనిపై మీనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్భాటాల కంటే అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మంచిదని అంటుంది. ప్రభావతి వచ్చి గొడవను మరింత పెంచే ప్రయత్నం చేస్తుంది. అయినా బాలు తల్లిని ఆపేస్తాడు. మరుసటి రోజు ఫంక్షన్‌కు వెళ్లిన బాలు, మీనా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవని గమనిస్తారు. రాజేష్ భార్య కన్నీటి పర్యంతమై మాట్లాడుతుండగా ఎపిసోడ్ ముగుస్తుంది.

గురువారం ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, షాకింగ్ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బాలు,మీనా ఇద్దరూ కలిసి రాజేష్ తల్లిదండ్రుల షష్టిపూర్తి వేడుకలకు చేరుకుంటారు. కానీ, అక్కడ కనీస ఏర్పాట్లు లేకపోవడం చూసి మీనాకు మొదట నుంచే అనుమానం మొదలవుతుంది. ముందుగా పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని వెళ్లిన వారిని చూసి మీనా పూర్తిగా చలించిపోతుంది. ఆకలితో ఉన్న తల్లిదండ్రులు 'అమ్మా... అన్నం పెట్టండి'అని దయనీయంగా అడగడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతుంది. ఇదంతా చూసిన మీనా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రాజేష్ భార్యను ప్రశ్నిస్తుంది. ఆమె కన్నీళ్లతో "నేను ఎంత చెప్పినా ఆయన వినడం లేదు... నన్ను కూడా పట్టించుకోవడం లేదు" అంటూ బాధను వెళ్లగక్కుతుంది. బాలు కూడా షాక్‌కు గురవుతూ 'తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చింది?'అని అడుగుతాడు. దీంతో రాజేష్ భార్య... "అక్కడ ఆడవాళ్లు వెళ్లలేరు... మీరే వెళ్లి చూడండి" అని చెప్పడంతో బాలు, మీనా అక్కడికి వెళ్తారు.
అక్కడ కనిపించిన దృశ్యం వారిని మరింత కలచివేస్తుంది. మద్యం మత్తులో రాజేష్‌తో పాటు అతని ఫ్రెండ్స్, బంధువులు పీకలదాకా తాగి ఊగిపోతుంటారు. ఇదే సమయంలో బాలు ముందుగా రాజేష్ తల్లిదండ్రులకు అన్నం పెట్టిస్తాడు. తర్వాత రాజేష్ దగ్గరికి వెళ్లగానే అతడు మద్యం మత్తులో 'నీ లక్ష రూపాయలతో ఫంక్షన్ ఎంత గ్రాండ్‌గా చేశానో చూడు... ఫంక్షన్ అంటే తాగాలి, ఊగాలి, మద్యం ఏరులై పారాలి' అంటూ గొప్పలు చెప్పడం బాలును మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది.
అంతలో ఒకడు మటన్ సరిగా వేయలేదని గొడవ చేస్తే... ఇంకొకడు మందు సరిపోలేదంటూ రచ్చ చేస్తాడు.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాలు ప్రయత్నించగా, ఓ వ్యక్తి తనకు మటన్ లో నల్లిబొక్క రాలేదని బాలు మీద చేయి చేసుకుంటాడు. వెంటనే మీనా ఎంట్రీ ఇచ్చి బాలును అక్కడి నుంచి బయటకు తీసుకువస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మీనా తీవ్రంగా స్పందిస్తూ... 'చూశారా మీ ఫ్రెండ్ చేస్తున్న నిర్వాకం... కనీసం తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా తాగి తందనాలు చేస్తున్నాడు. ఇదేనా ఫంక్షన్ అంటే?' అంటూ నిలదీస్తుంది. ఆ దృశ్యాలు భరించలేక బాలు కూడా మౌనంగా మారిపోతాడు. చివరికి ఇద్దరూ అక్కడ ఒక్క ముద్ద అన్నం కూడా తినకుండా ఇంటికి తిరిగివెళ్లాలని నిర్ణయించుకుంటారు.
ఇక ఇంటికి చేరుకున్న తర్వాత బాలు తండ్రి సత్యం... 'ఫంక్షన్ ఎలా జరిగింది?' అని అడగగా, ఏం చెప్పాలో తెలియక బాలు మౌనంగా ఉండిపోతాడు. అయితే మీనా మాత్రం జరిగిన అవమానాన్ని నేరుగా చెప్పకుండా, వ్యంగ్యంగా 'ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది... డబ్బులు ఏరులై పారాయి... మర్యాదలు చాలా రిచ్‌గా ఉన్నాయి' అంటూ ఇన్‌డైరెక్ట్‌గా సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత బాలుతో మాట్లాడిన మీనా... 'ఇప్పటికైనా అర్థమైందా? పెళ్లాం ఎందుకు చెబుతుందో తెలుసుకోవాలి. మీరు ఇచ్చిన లక్ష రూపాయలు ఏ పనికీ రాకుండా పోయాయి. అదే డబ్బులు అతని పిల్లల చదువులకు ఇచ్చుంటే కనీసం పుణ్యమైనా దక్కేది' అంటూ క్లాస్ పీకుతుంది. దీంతో బాలు మాటలేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మరోవైపు రోహిణి జీవితంలో ఊహించని మలుపు తిరగగా... మరోవైపు బాలు తన తప్పుల్ని గుర్తించే దశకు చేరుకున్నాడు. రోహిణి బాయ్‌ఫ్రెండ్ దినేష్ అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చి ఆమెకు షాకిచ్చాడు. నేరుగా రోహిణి కొడుకు చింటూ దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగి, ఆ ఫోటోను రోహిణికి పంపిస్తాడు. ఆ ఫోటోలు చూసిన రోహిణి కంగారు పడిపోతుంది. వెంటనే దినేష్‌కు ఫోన్ చేసి 'నా కొడుకు జోలికి రావద్దు... బాగుండదు' అంటూ హెచ్చరిస్తుంది. కానీ దినేష్ మాత్రం మరింత బెదిరింపులకు దిగుతూ... 'నీ కొడుకు ఇప్పుడు నా కంట్రోల్‌లోనే ఉన్నాడు. నేను చెప్పినట్టు చేయకపోతే ఇక్కడ్నుంచి ఇక్కడే కిడ్నాప్ చేస్తా' అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో రోహిణి భయంతో వణికిపోతూ 'నీకేం కావాలి?' అని అడుగుతుంది. అప్పుడు దినేష్ ఒక లొకేషన్ పంపించి, ఎలాంటి మాటలు లేకుండా వెంటనే అక్కడికి రావాలని ఆదేశిస్తాడు. ఏం చేయాలో అర్థంకాని అయోమయంలో రోహిణి నిలిచిపోతుంది.
ఇక మరోవైపు... రాజేష్ వ్యవహారంతో తీవ్రంగా బాధపడుతున్న బాలు దాబాపైకి వెళ్లి మళ్లీ తాగేందుకు సిద్ధమవుతాడు. అయితే ఈసారి అతని అంతరాత్మే అతడిని ప్రశ్నిస్తుంది. 'ఇప్పటికైనా సిగ్గు రాలేదా? నువ్విచ్చిన లక్ష రూపాయలు అక్కడ తాగి తందనాలు ఆడడానికే ఉపయోగపడ్డాయి. దీనివల్ల ఏమైనా మేలు జరిగిందా?' అంటూ బాలు మనసులోనే గుణపాఠం వినిపిస్తుంది. మొదట స్నేహం పేరుతో తనను తాను సమర్థించుకున్న బాలు... క్రమంగా మీనా చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. 'నా పెళ్లాం మాట వింటే తప్పేంటి? ఇప్పటికైనా మీనా మాటలకు విలువ ఇవ్వు... పరిస్థితులకు తగ్గట్టు నడుచుకో' అంటూ అంతరాత్మ సూచించడంతో బాలు మౌనంగా మారిపోతాడు.
అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో మరో కీలక మలుపు కనిపించనుంది. రాజేష్ తన తప్పు తెలుసుకుని బాలు దగ్గరికి వచ్చి క్షమాపణ చెబుతాడు. ఫంక్షన్‌కు కట్నంగా వచ్చిన డబ్బులు బాలుకు ఇచ్చి, ఇంకా ఏమైనా తక్కువైతే చెప్పమని వెళ్లిపోతాడు. దీంతో బాలు ఆనందంగా 'చూశావా... నేను ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చాయి' అంటూ అమాయకంగా మాట్లాడతాడు. కానీ మీనా మాత్రం గట్టిగా స్పందిస్తూ... 'ఇప్పటికైనా అర్థం చేసుకోండి. గుణపాఠాలతో మీ వ్యవహార శైలి మార్చుకోండి. సహాయం చేసేముందు వెనక ముందు ఆలోచించండి' అంటూ చురకలంటిస్తుంది. మీనా మాటలకు బాలు సైలెంట్ అయిపోవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











