Gunde Ninda Gudi Gantalu February 16th Episode:30 లక్షలు డిమాండ్.. మీనాపై గుణ దాడి.. ఆగ్రహంతో బాలు..

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాల తుఫానులోకి నెట్టింది. ఫంక్షన్‌లో ఎదురైన అవమానం ఇంకా బాలు మనసును కాల్చేస్తుండగా... మళ్లీ మద్యం చేతికి తీసుకున్నాడు. ఈసారి అతని ఎదురుగా మనుషులు కాదు... అతని అంతరాత్మే నిలబడి ప్రశ్నించింది. మీనా మాట వినకుండా స్నేహితులకు అప్పులు ఇచ్చి తానే అప్పుల పాలయ్యాడని హెచ్చరించగా, "కష్టంలో ఉన్న స్నేహితుడికి సాయం చేయడం తప్పా?" అంటూ బాలు తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. కానీ అంతరాత్మ మీనాకు సారీ చెప్పమన్న క్షణంలో ఆవేశంతో సీసాను తన ప్రతిబింబంపైనే విసిరాడు. మందు నేలపై కారిపోవడంతో... "నేను ఏం చేస్తున్నాను? నా జీవితం ఎటు వెళ్తోంది?" అనే ప్రశ్న తొలిసారి అతని మనసులో మెదిలింది. మరుసటి రోజు ఉదయం రాజేష్ బాలు ఇంటికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తిగా పశ్చాత్తాపంతో కనిపించిన రాజేష్, ఫంక్షన్ కోసం డబ్బు వృథా చేశానని ఒప్పుకుని, కట్నంగా వచ్చిన డబ్బును బాలు చేతిలో పెట్టి అప్పు తీర్చుమని చెబుతాడు.

అయితే రాజేష్ వెళ్లిన తర్వాత బాలు మళ్లీ బిల్డప్ ఇవ్వగా, మీనా సూటిగా "నిజమైన స్నేహం అంటే అప్పులు చేసి ఆదుకోవడం కాదు... అప్పులే రాకుండా జాగ్రత్తపడటమే" అంటూ గుణపాఠం చెప్పింది. ఇక మరోవైపు రవి పనిచేసే రెస్టారెంట్‌లో కొత్త ఇన్‌చార్జ్ ఎంట్రీతో కలకలం మొదలైంది. మొదట ఉద్యోగం పోతుందేమోనన్న భయం రవిని కుదిపేసినా, చివరకు కొత్త బాస్ అతని టాలెంట్ మెచ్చుకోవడంతో కాస్త ఊరట కలిగింది. అదే సమయంలో శృతి "మాది లవ్ మ్యారేజ్" అంటూ వార్నింగ్ ఇవ్వడం రాబోయే గొడవలకు సంకేతంగా మారింది. అటు మీనా పుట్టింట్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శివ చెడు సహవాసాలకు బానిస అవుతుండటంతో తల్లి పార్వతి కన్నీళ్లతో మీనాకు ఫోన్ చేసి, "నీ తమ్ముడ్ని కాపాడు" అంటూ వేడుకుంది. ఇలా ఈ ఎపిసోడ్ భావోద్వేగంగా ముగిసింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 620 February 16th 2026 here is full story
Photo courtesy: Jio Hotstar

సోమవారం ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, కుటుంబ కలహాలు, బ్లాక్ మెయిల్ డ్రామాతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కథ ఆరంభంలోనే మీనా తల్లి పార్వతి ఫోన్ చేసి ఇంటికి రమ్మనడంతో మీనా పుట్టింటికి వెళ్తుంది. అక్కడ పార్వతి తన కొడుకు శివ మారిపోయిన తీరును చూసి కన్నీళ్లతో బాధపడుతుంది. ముఖ్యంగా గుణతో స్నేహం మొదలైన తర్వాత శివ ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని, ఆగడాలు ఎక్కువయ్యాయని, పైగా ఇటీవల తాగుడు అలవాటు కూడా చేసుకున్నాడని మీనాకు చెబుతుంది. దీంతో మీనా ఆగ్రహంతో ఊగిపోతుంది. గుణ గురించి తెలిసినా తన భర్త బాలు శివకు డబ్బులు ఇచ్చాడని గుర్తు చేసుకుని, "అప్పుడే చేతు విరిసిన వాడికి ఇంకా బుద్ధి రాలేదా?" అంటూ బాధపడుతుంది.

శివను తప్పుపట్టడం కంటే... వాడిని ఇలా మార్చిన గుణకే బుద్ధి చెప్పాలని మీనా గట్టిగా నిర్ణయించుకుంటుంది. మన తమ్ముడు చెడిపోవడానికి కారణం గుణ నేనని, అతడిని వదిలిపెట్టేది లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే పార్వతి మాత్రం మీనాను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది. 'మన బంగారం బాగుపడాలి కానీ వాడితో గొడవ పడి ఏం లాభం? శివకే బుద్ధి లేదు కాబట్టి గుణతో తిరుగుతున్నాడు. అనవసరంగా గొడవలు పెట్టుకుని ఇబ్బందులు తెచ్చుకోకు' అంటూ మీనాకు హితవు చెబుతుంది. కానీ తల్లి మాటలను పట్టించుకోని మీనా... గుణను ఎదుర్కొనేందుకు నేరుగా అతని ఆఫీసుకే వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. పార్వతి ఎంత ఆపినా వినకుండా కోపంతో బయటకు వెళ్లిపోతుంది.

ఇదిలా ఉండగా మరోవైపు రోహిణి కథ మరో సంచలన మలుపు తిరిగింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ దినేష్‌ను కలవడానికి దివ్యతో కలిసి రోహిణి అక్కడికి చేరుతుంది. అయితే దినేష్ ఒక్కదానివే రావాల్సింది అంటూ దివ్యను చూసి అసహనం వ్యక్తం చేస్తాడు. వెంటనే రోహిణి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది 'నా కొడుకుతో ఎందుకు సెల్ఫీ దిగావు? నన్ను ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నావ్? డబ్బు ఇస్తున్నా కదా... ఇంకా ఏం కావాలి?' అంటూ ఆవేదనతో నిలదీస్తుంది. దీనికి దినేష్ షాకింగ్ డిమాండ్ పెడతాడు. తనకు లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ కావాలంటూ, ఒక్కసారి 30 లక్షలు ఇస్తే ఇక జీవితంలో మళ్లీ నీ జోలికి రానని స్పష్టం చేస్తాడు. ఈ మాటలు విన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. '30 లక్షలు డబ్బు ఏమైనా చెట్లకు వస్తుందా? ఉద్యోగం కావాలంటే సిఫారసు చేస్తా... కానీ అంత పెద్ద మొత్తం నా వల్ల కాదు' అంటూ స్పష్టంగా చెప్పేస్తుంది.

అప్పుడే దినేష్ అసలు రంగు బయటపడుతుంది. డబ్బు ఇవ్వకపోతే నీ గతం మొత్తం మీ ఇంట్లో చెప్పేస్తానని, అప్పుడు నీ జీవితం రోడ్డు పాలు అవుతుందని బెదిరింపులకు దిగుతాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... లేదంటే సీరియల్‌లా నీ గతాన్ని బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. దీంతో రోహిణి పూర్తిగా కంగుతింటుంది. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో నిలిచిపోతుంది. ఈ కీలక సమయంలో దివ్య రోహిణికి ధైర్యం చెబుతూ, 'మనకున్న ఒకే ఒక వ్యక్తి గుణ.. వాడిని కలిస్తే.. ఏదైనా చేయగలడు' అంటూ సూచన ఇస్తుంది. ఆ మాటలకు రోహిణి కూడా ఒప్పుకుని, ఆ వ్యక్తిని కలవాలని నిర్ణయించుకుంటుంది.

మరోవైపు తీవ్ర ఆగ్రహంతో మీనా నేరుగా గుణ ఆఫీసుకు చేరుతుంది. అదే సమయంలో గుణ తన అసిస్టెంట్‌తో మాట్లాడుతూ శివకు ఫోన్ చేయమని చెప్పడం మీనా వింటుంది. వెంటనే అక్కడే మండిపడిన మీనా... 'ఇకపై నా తమ్ముడు నీ దగ్గరికి రాడు. అనవసరంగా వాడి జీవితంతో ఆటలాడొద్దు' అంటూ ఘాటుగా హెచ్చరిస్తుంది. దీనికి గుణ మాత్రం ఏమీ తెలియనట్టు 'అక్కా' అంటూ ప్రేమగా నటిస్తూ మాటలు మార్చే ప్రయత్నం చేస్తాడు. కానీ మీనా అతని వేషాలను నమ్మకుండా, మరోసారి తన తమ్ముడు జోలికి వస్తే బాగోదని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

దీంతో గుణ కూడా రెచ్చిపోతాడు. 'నీ తమ్ముడు ఏమైనా చిన్న పిల్లవాడా? నేను చెప్పితే వినడానికి... డబ్బుల కోసమే నా దగ్గర పని చేస్తున్నాడు. నేను ఏం చెడగొట్టడం లేదు' అంటూ తనని తాను సమర్థించుకుంటాడు. దీనికి మీనా మరింత ఆగ్రహంతో స్పందిస్తూ, 'వాడు నీ దగ్గరికి వచ్చిన తర్వాతే వాని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అనవసరంగా వాడి జీవితాన్ని నాశనం చేయకు' అంటూ నిలదీస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. మాటలు పెరిగి చివరికి గుణ 'ఏం చేసుకుంటావో చేసుకో... పోవే' అంటూ అవమానకరంగా మాట్లాడతాడు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న మీనా గుణ చెంపపై చెల్లుమనిపిస్తుంది. దీనికి ప్రతిగా గుణ కూడా ఆగ్రహానికి లోనై మీనాను గట్టిగా తోసేస్తాడు. దాంతో మీనా నేలపై పడిపోయి తలకు తీవ్ర గాయం అవుతుంది.

అదే సమయంలో అక్కడికి కరెక్టుగా బాలు ఎంట్రీ ఇస్తాడు. మీనాపై చేయి చేసుకున్న దృశ్యం చూసిన బాలు ఆగ్రహంతో ఊగిపోతాడు. 'నా భార్యను కొడతావా?' అంటూ గుణపై విరుచుకుపడి దాడి చేస్తాడు. తన కోపాన్ని అదుపు చేసుకోలేని బాలు, గుణకు 'బుద్ధి చెప్పాలి' అన్న ఉద్దేశంతో అతని రెండు చేతులను విరిచేస్తాడు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మీనాను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందజేస్తాడు. హాస్పిటల్‌లో డాక్టర్ మీనాకు తలకు గాయం తగిలిందని, తప్పనిసరిగా స్కానింగ్ చేయాలని సూచిస్తుంది. అయితే మీనా మాత్రం 'నాకు చిన్న దెబ్బే... అనవసరంగా టెస్టులు వద్దు'అంటూ నిరాకరిస్తుంది. కానీ బాలు మాత్రం గట్టిగా నిలబడి, "నీ ఆరోగ్యం కంటే నాకు ఇంకేమీ ముఖ్యం కాదు" అంటూ స్కానింగ్ చేయిస్తాడు.

రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ ఊరట కలిగించే వార్త చెబుతుంది. మీనాకు ఎలాంటి ప్రమాదకర గాయం లేదని, అన్నీ నార్మల్‌గా ఉన్నాయని వెల్లడిస్తుంది. అయితే భద్రత కోసమే ఒకటి రెండు గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత తీసుకెళ్లవచ్చని సూచిస్తుంది. దీంతో బాలు సరేనంటూ అంగీకరిస్తాడు. ఇదిలా ఉండగా హాస్పిటల్‌లో ఉన్న మీనా పరిస్థితిని తెలుసుకునేందుకు పార్వతి బాలుకు ఫోన్ చేస్తుంది. మీనా ఎలా ఉందని ఆందోళనతో అడగగా, బాలు జరిగిన అసలు విషయాన్ని చెప్పేస్తాడు. గుణతో జరిగిన గొడవలో మీనాకు తలకు గాయం అయిందని, ప్రస్తుతం తాము హాస్పిటల్‌లో ఉన్నామని వివరిస్తాడు. ఈ విషయం విన్న పార్వతి పూర్తిగా కుంగిపోతుంది. తన కొడుకు శివ వల్లే తన కూతురు ఇలాంటి పరిస్థితిలో పడిందని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

అదే సమయంలో శివ ఇంటికి చేరుకుంటాడు. తల్లి ఏడుస్తుండటాన్ని చూసి మొదట చిరాకు పడతాడు. 'ఇంటికి రావాలంటేనే విసుగొస్తోంది' అంటూ నానా మాటలు అంటాడు. దీంతో పార్వతి ఒక్కసారిగా మండిపడి శివను కొడుతుంది. 'నీ వల్లే నీ అక్క తలకు దెబ్బ తగిలింది... దీనికి కారణం గుణ' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ మాటలు విన్న శివ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన అక్క ఇప్పుడు ఎక్కడ ఉందని ఆందోళనతో అడుగుతాడు. హాస్పిటల్‌లో ఉందని చెప్పగానే ముందుగా గుణను కలిసి వస్తానంటూ కోపంతో బయటకు వెళ్లిపోతాడు. గుణ దగ్గరికి వెళ్లిన శివకు అక్కడ మరో షాకింగ్ సీన్ ఎదురవుతుంది. బాలు చేతిలో తీవ్రంగా గాయపడ్డ గుణ ముక్కుతో రక్తం కారుస్తూ బాధపడుతూ కనిపిస్తాడు.

తన తప్పేమీ లేనట్లు నటిస్తూ, 'నీ బావ వాళ్లే ఇలా చేశారు'అంటూ అబద్ధాలు చెబుతాడు. కానీ శివ మాత్రం గట్టిగా నిలదీస్తూ, 'నా అక్కయ్య మీద చేయి చేసుకోవాల్సిన అవసరం ఏంటి?' అని ప్రశ్నిస్తాడు. దీనికి గుణ, 'నీ అక్క నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టింది... అందుకే అలా జరిగింది'అంటూ సమాధానం ఇస్తాడు. దీంతో శివ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 'ఈ పొజిషన్‌లో ఉన్నావు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావు... లేదంటే మరోలా ఉండేది'అంటూ హెచ్చరిస్తాడు. ముందు నా అక్కయ్యకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఇక తన ఆఫీస్ ముఖం కూడా చూడనని స్పష్టం చేస్తాడు.

అనంతరం శివ ఇంటికి వెళ్లి తల్లి పార్వతి, అక్కయ్య సుమతో కలిసి హాస్పిటల్‌కు చేరుకుంటాడు. మీనా పరిస్థితిని చూసి కంటతడి పెట్టుకుంటాడు. తన వల్లే అక్కయ్య గాయపడిందని బాధపడుతూ, ఇకపై గుణతో స్నేహం చేయనని, అతని సహవాసాన్ని పూర్తిగా వదిలేస్తానని మాట ఇస్తాడు. అయితే బాలు మాత్రం శివ మాటలపై నమ్మకం లేదని అనుమానం వ్యక్తం చేస్తాడు. కానీ శివ గట్టిగా నిలబడి, చెడు సావాసాలకు దూరంగా ఉంటానని మీనాకు మాట ఇస్తాడు. అబ్జర్వేషన్ పూర్తయ్యాక మీనాను అత్తగారింటికి తీసుకెళ్తారు. ముందుగా మీనాను చూసిన మామ సత్యం షాక్ అవుతాడు. అసలు కారణం తెలుసుకోకుండానే బాలును చడామడా తిడతాడు. దీంతో బాలు 'కారణం తెలియకుండా ఎందుకు తిడుతున్నారు?'అని ప్రశ్నిస్తాడు. గాయం ఎలా అయిందని సత్యం అడగగా, బాలు స్కూటీ నుంచి పడిపోయిందని అబద్ధం చెబుతాడు.

ఇంతలో ప్రభావతి ఇంటికి చేరుకుంటుంది. మీనా తలకు గాయం చూసి హేళనగా మాట్లాడుతుంది. దీనికి సత్యం ఆమెను మందలిస్తూ, 'మనిషి లాగా మాట్లాడు'అని హెచ్చరిస్తాడు. అయినా ప్రభావతి తన స్టైల్ మార్చకుండా డబ్బు, ఆరోగ్యం గురించి తత్వబోధ చేస్తుంది. దీనిపై సత్యం వ్యంగ్యంగా స్పందిస్తూ, "నేను సత్యం... నువ్వు డబ్బు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది" అంటూ ఆమె మాటలకు కౌంటర్ ఇస్తాడు. చివరికి ప్రభావతి "మీ నాన్న రెస్ట్ తీసుకోండి... నేనే వంట చేస్తా" అంటూ వంటింట్లోకి వెళ్లి పనుల్లో పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మాటల తూటాలు, భావోద్వేగాలు, అనుమానాలతో నేటి ఎపిసోడ్ ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X