Gunde Ninda Gudi Gantalu February 17th Episode: గతం మరిచిన మీనా.. మౌనికపై నీలకంఠం కుట్ర.. ఒక్కటైనా రోహిణి,గుణ.

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, కుటుంబ కలహాలు, బ్లాక్ మెయిల్ డ్రామాతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కథ ప్రారంభంలో మీనా తల్లి పార్వతి ఫోన్ చేయడంతో మీనా పుట్టింటికి వెళ్తుంది. అక్కడ శివ ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని, గుణ స్నేహం వల్ల చెడు అలవాట్లు అలవర్చుకున్నాడని పార్వతి వాపోతుంది. ఇది విన్న మీనా తీవ్ర ఆగ్రహంతో గుణకే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఇదే సమయంలో రోహిణి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దినేష్‌ను కలవగా, అతడు 30 లక్షల డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్‌కు దిగుతాడు. డబ్బు ఇవ్వకపోతే గతాన్ని బయటపెడతానని బెదిరించడంతో రోహిణి షాక్‌కు గురవుతుంది. దివ్య సూచనతో గుణను కలవాలని రోహిణి నిర్ణయించుకుంటుంది.

మరోవైపు మీనా గుణ ఆఫీసుకు వెళ్లి గొడవ పడుతుంది. మాటలు ముదిరి మీనా గుణను కొట్టగా, గుణ ఆమెను తోసేయడంతో మీనా తలకు గాయం అవుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన బాలు గుణపై దాడి చేసి మీనాను హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. స్కానింగ్‌లో పెద్ద ప్రమాదం లేదని డాక్టర్ చెబుతారు. ఈ విషయం తెలుసుకున్న పార్వతి కుంగిపోతుంది. శివకు నిజం తెలిసి గుణను నిలదీస్తాడు, అక్కకు క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తాడు. హాస్పిటల్‌లో మీనా పరిస్థితి చూసి శివ కంటతడి పెట్టుకుంటూ గుణతో స్నేహం వదిలేస్తానని మాట ఇస్తాడు. చివరికి మీనాను అత్తగారింటికి తీసుకెళ్లగా అక్కడ మరో మాటల యుద్ధం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుమానాలు, భావోద్వేగాలతో ఎపిసోడ్ ముగిసింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 621 February 17th 2026 here is full story

Photo courtesy: Jio Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకొని ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచింది. మీనా తలకు గాయం అయిన విషయం తెలుసుకున్న తర్వాత కూడా తొలుత హేళనగా మాట్లాడిన ప్రభావతి... సత్యం హెచ్చరించడంతో కాస్త తగ్గుతుంది. 'మీనా ను రెస్ట్ తీసుకోనివ్వండి... నేనే వంట చేస్తా" అంటూ వంటగదిలోకి వెళ్తుంది. అయితే ఎప్పుడూ వంటగదిలో అడుగుపెట్టని ప్రభావతి అక్కడ ఏది ఎక్కడ ఉందో తెలియక అయోమయంలో పడుతుంది. కారం, ఉప్పు కోసం పదే పదే మీనాను పిలవడంతో బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "వంట చేస్తానని ముందుకు వచ్చి మళ్లీ మీనానే పిలిస్తే ఎలా?" అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దీంతో ప్రభావతి కవరింగ్ ఇస్తూ "నాకు అన్నీ తెలుసు" అంటూ నటిస్తుంది. చివరకు మీనా తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటే, ప్రభావతి తన పాక శాస్త్ర నైపుణ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది.

ఇదిలా ఉండగా మరోవైపు రోహిణి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దినేష్ నుంచి తప్పించుకునే మార్గం కోసం గుణ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే బాలు, శివలపై పగ పెంచుకున్న గుణ అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. రోహిణిని చూసిన వెంటనే "ఈసారి ఎంత డబ్బు కావాలి?" అంటూ ఎగతాళి చేస్తాడు. కానీ రోహిణి ఈసారి డబ్బు కోసం రాలేదని, గతంలో తనను వేధించిన వ్యక్తే మళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెబుతుంది. అప్పట్లో వేలల్లో అడిగిన వాడు ఇప్పుడు లక్షల్లో డిమాండ్ చేస్తున్నాడని వాపోతుంది.

దీన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న గుణ... 'ఇప్పుడు ఏం చేయాలి?' అని ప్రశ్నిస్తాడు. మరోసారి దినేష్ తన జోలికి రాకుండా ఏం చేసినా సరే, ఎంత డబ్బైనా ఇస్తానని రోహిణి మాట ఇస్తుంది. అప్పుడు గుణ తనకు డబ్బు అవసరం లేదని, కానీ తనకు సహాయం చేసినందుకు తిరిగి ఓ సహాయం చేయాలని షరతు పెడతాడు. ఆ సహాయం ఏమిటని రోహిణి అడగగా... మీనా తమ్ముడు శివ ప్రభావతి గొలుసు దొంగతనం చేశాడని, ఆ విషయం బాలు‌కు కూడా తెలుసని, అందుకే శివపై బాలు కోపంగా ఉన్నాడని చెబుతాడు. అంతేకాదు... ఆ దొంగతనానికి సంబంధించిన వీడియో బాలు ఫోన్‌లో ఉందని, అది తనకు కావాలని గుణ డిమాండ్ చేస్తాడు.

తప్పని పరిస్థితుల్లో రోహిణి ఆ వీడియో ఇస్తానని ఒప్పుకుంటుంది. ఇలా చేస్తే ఒకవైపు దినేష్ సమస్య తీరుతుందని, మరోవైపు గుణ సపోర్ట్ కూడా దొరుకుతుందని రోహిణి ప్లాన్ వేస్తుంది. ఈ విషయం తన స్నేహితురాలు దివ్యకు చెబుతుంది. అయితే దివ్య మాత్రం బాలు గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని, నీ సమస్యను బాలుకు చెబితే ఆయనే పరిష్కరిస్తాడని హెచ్చరిస్తుంది. కానీ రోహిణి ఆగ్రహంతో స్పందిస్తూ... "బాలుకు ముందే నాపై అనుమానం ఉంది. ఇంకేం చెప్పినా నన్ను ఇంట్లో ఉండనివ్వడు. మనోజ్ కూడా నన్ను వెళ్లగొడతాడు. ఈ విషయం అత్తకు తెలిస్తే నా సంసారం రోడ్డు పాలవుతుంది" అంటూ భయంతో కేకలు వేస్తుంది. దివ్య ఇక నీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరోవైపు నీలకంఠం తన కొడుకు సంజుకు మరో పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఎపిసోడ్‌లో స్పష్టంగా చూపించారు. ఇదే సమయంలో ఓ స్నేహితుడు వచ్చి తన మనుమడు బారసాలకు ఆహ్వానిస్తాడు. వెళ్లే ముందు నీలకంఠం కోడల్ని చూసి "అమ్మాయి చక్కగా ఉంది... సంప్రదాయాలు తెలిసిన పిల్లలున్నట్టుంది" అంటూ ప్రశంసించి వెళ్లిపోతాడు. ఈ మాటలు విన్న నీలకంఠానికి ఒక్కసారిగా అనుమానం మొదలవుతుంది. పెళ్లి అయి సంవత్సరం దాటినా ఇంకా పిల్లలు ఎందుకు లేరని సంజును నేరుగా ప్రశ్నిస్తాడు.

దీనికి సంజు తల్లి మధ్యలోకి వచ్చి అసలు నిజం బయటపెడుతుంది. "వాడు ఎప్పుడైనా మౌనికను భార్యలా చూసాడా? పనిమనిషిలా చూసాడు తప్ప ఆప్యాయంగా మాట్లాడిందే లేదు. రోజు తాగి వచ్చి గొడవలు పెడితే ఇంకెక్కడ పిల్లలు పుడతారు?" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయినా నీలకంఠం మాత్రం పిల్లలు పుట్టడం లేదనే కారణంతో మౌనికను ఇంట్లో నుంచి గెంటేయాలని ప్లాన్ వేస్తాడు. ఈ విషయంలో సంజీవ్ కూడా తండ్రి మాటకు మద్దతిస్తూ, ఆ నిర్ణయానికి ఏకమవడం మరో షాకింగ్ ట్విస్ట్‌గా మారింది.

ఇక మరోవైపు తలకు గాయం కావడంతో మీనా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఈ సమయంలో బాలు ఆమెను లేపి మందు ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. అయితే మీనా అకస్మాత్తుగా గతం మర్చిపోయినట్లుగా నటిస్తూ "నేనెవరు? ఎక్కడున్నాను? నాకు ఏమైంది? నా పేరు ఏమిటి?" అంటూ వింత ప్రశ్నలు అడుగుతుంది. ఇది చూసి బాలు పూర్తిగా కంగారుపడి, తన భార్యకు మెమరీ లాస్ వచ్చిందేమోనని బాధపడతాడు. బాలు ఫీల్ అవడం చూసిన మీనా వెంటనే నిజం చెప్పి "నిన్ను ఆటపట్టించానంతే" అంటూ నవ్వుతుంది. దీంతో బాలు కూడా రిలీఫ్ ఫీలవుతాడు. అనంతరం రాజేష్ విషయంలో మీనా మాట వినలేదని బాలు సారీ చెబుతాడు. మీనా నవ్వుతూ సరే అంటుంది.

ఇంతలో రవి, శృతి ఇంటికి చేరుకుంటారు. మీనా తలకు బ్యాండేజ్ చూసి షాక్ అవుతూ ఏం జరిగిందని ప్రశ్నిస్తారు. బాలు సమాధానం చెప్పకముందే అపార్థం చేసుకుని అతడిని తిడుతుంటారు. దీంతో బాలు ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ "ఇక ఆపండి... ఒక్కసారైనా నేను చెప్పేది వినండి. మీనా బయటికి వెళ్తూ బైక్ నుంచి పడిపోయింది. అందుకే తలకు గాయమైంది" అంటూ అసలు విషయం బయటపెడతాడు.

ఇంకా ఇదే సమయంలో రోహిణి ఇంటికి చేరుకుంటుంది. మీనా తలకు కట్టిన బ్యాండేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే తన అసలు ఉద్దేశం బయటపడకుండా చాలా తెలివిగా మాట్లాడుతుంది. తాను గుడికి వెళ్లానని, మీనా పేరుమీద అర్చన చేయించానని చెబుతూ... రాబోయే రోజుల్లో మీనా, బాలుకు కష్టాలు ఎదురవుతాయని పూజారి చెప్పాడంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తుంది. ఇది విన్న బాలు తీవ్ర ఆగ్రహానికి లోనై, "నీలాంటి తోడికోడలు ఉంటే ఎవరికైనా కష్టాలు వస్తాయి. ఆయన నీ తండ్రి ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తాడో చెప్పలేదా?" అంటూ కౌంటర్ ఇస్తాడు. దీంతో రోహిణి ఒక్కసారిగా నోరు మూసుకుని మౌనంగా మారుతుంది.

ఇదిలా ఉండగా ప్రభావతి తాను వంట చేశానని అందరినీ ఫ్రెష్ అయ్యి రమ్మంటూ పిలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులంతా తమ తమ గదుల్లోకి వెళ్లిపోతారు. కొద్దిసేపటికి ప్రభావతి భారీ బిల్డప్‌తో డైనింగ్ టేబుల్‌పై అన్నీ వడ్డిస్తుంది. ఇన్నాళ్లూ మీనా వంట తిని తనను ఎగతాళి చేశారని, ఈరోజు మాత్రం తన చేతి వంట తిని అందరూ ఫిదా అయిపోతారని ఊహల్లో తేలిపోతుంది. కానీ ఎవ్వరూ తినడానికి ముందుకు రారు. దీంతో పళ్లెంతో శబ్దం చేస్తూ అందరినీ గట్టిగా పిలుస్తుంది.

ఈ పరిస్థితిని గమనించిన బాలు వ్యంగ్యంగా మాట్లాడుతూ, "నాకు ఇంకా ప్రాణాల మీద ఆశ ఉంది... మాపై ప్రయోగాలు చేయకండి" అంటాడు. అయినా ప్రభావతి మాత్రం తన వంట బాగోలేదని ఎలా అంటావు అంటూ అందరినీ బలవంతంగా టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. ఒక్కొక్కరు ఒక బుక్క పెట్టుకోగానే తప్పించుకునే మార్గాలు వెతకడం మొదలుపెడతారు. బాలు బయటకు జారుకుంటాడు. సత్యం కూడా "ఇప్పటికే రెండు బుక్కలు తిన్నా... ఇక సాహసం చేయలేను" అంటూ వెళ్లిపోతాడు.

రోహిణి, మనోజ్ మాత్రం అటు తినలేక ఇటు వదిలేయలేక ఇబ్బంది పడుతుంటారు. అత్త మనసు బాధపడుతుందేమోనన్న భయంతో కూర్చుంటారు. ప్రభావతి మనోజ్ దగ్గరికి వెళ్లి "నీ కోసం ప్రేమగా వండాను... నువ్వు కూడా తినకపోతే ఎలా?" అంటూ భావోద్వేగంగా మాట్లాడుతుంది. మనోజ్ ఒత్తిడితో ఒక బుక్క తినగానే ప్రభావతి కారం ఎక్కువై "కారం... కారం" అంటూ అరుస్తుంది. అప్పుడు తన వంట ఎందుకు అందరికీ నచ్చడం లేదో ఆమెకే అర్థమవుతుంది.

ఆ తర్వాత ప్రభావతి తన భర్త సత్యం దగ్గరికి వెళ్లి కొత్తగా స్వీట్ చేశానంటూ మళ్లీ ప్రయత్నిస్తుంది. సత్యం బెంబేలెత్తుతూ "నాపై ప్రయోగాలు చేయకు... నాకు ప్రాణం మీద ఆశ ఉంది" అని అంటాడు. అయినా ప్రభావతి ప్రేమగా బ్రతిమాలడంతో సత్యం స్వీట్లు తింటాడు. ఈ సమయంలో ప్రభావతి-సత్యం మధ్య చోటుచేసుకున్న రొమాంటిక్ సన్నివేశం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో రోహిణి వ్యంగ్య వ్యాఖ్యలు, బాలు స్ట్రాంగ్ కౌంటర్, ప్రభావతి వంట డ్రామా, చివర్లో భర్తతో రొమాన్స్ అన్ని కలసి ప్రేక్షకులకు వినోదంతో పాటు ఉత్కంఠను కూడా అందించాయి. రోహిణి వేసిన ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ప్రభావతి వంట తర్వాత ఏమవుతుంది? అన్న ఆసక్తితో కథ మరింత ముందుకు సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X