Gunde Ninda Gudi Gantalu February 18th Episode: మీనా,బాలు పై హత్య ప్రయత్నం.. రవి,శృతి గొడవ.. రోహిణి దారుణం.
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులకు ఉత్కంఠ, వినోదం, భావోద్వేగాలను ఒకేసారి అందించింది. ఎపిసోడ్ ఆరంభంలోనే మీనా తలకు గాయం అయిన విషయం తెలిసినా తొలుత హేళనగా మాట్లాడిన ప్రభావతి, సత్యం హెచ్చరికతో కాస్త తగ్గుతుంది. "మీనా రెస్ట్ తీసుకోనీ... నేనే వంట చేస్తా" అంటూ వంటగదిలోకి అడుగుపెడుతుంది. కానీ ఎప్పుడూ కిచెన్ వైపు చూడని ప్రభావతి, ఏది ఎక్కడుందో తెలియక తికమకపడుతుంది. కారం, ఉప్పు కోసం పదే పదే మీనాను పిలవడంతో బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "వంట చేస్తానని ముందుకొచ్చి మళ్లీ మీనానే పిలిస్తే ఎలా?" అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అయినా ప్రభావతి కవరింగ్ ఇస్తూ తన వంట నైపుణ్యాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తుంది.
ఇక మరోవైపు రోహిణి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దినేష్ నుంచి తప్పించుకునేందుకు గుణను ఆశ్రయిస్తుంది. ఇప్పటికే బాలు, శివలపై పగతో ఉన్న గుణ ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. దినేష్ ఇప్పుడు లక్షల్లో డబ్బు డిమాండ్ చేస్తున్నాడని రోహిణి వాపోతుంది. దీనికి గుణ డబ్బు వద్దని, బదులుగా ఓ సహాయం చేయాలని షరతు పెడతాడు. మీనా తమ్ముడు శివ ప్రభావతి గొలుసు దొంగతనం చేశాడన్న వీడియో బాలు ఫోన్‌లో ఉందని, అది తనకు కావాలని డిమాండ్ చేస్తాడు. తప్పని పరిస్థితుల్లో రోహిణి ఒప్పుకోవడం కథలో కీలక మలుపుగా మారుతుంది.

Photo courtesy: Jio Hotstar
ఈ విషయం దివ్యకు చెప్పినా, బాలు సహాయం చేస్తాడని ఆమె హెచ్చరిస్తుంది. కానీ రోహిణి భయంతో, అనుమానాలతో ఆ మాట వినదు. "అత్తకు తెలిస్తే నా సంసారం రోడ్డు పాలవుతుంది" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు నీలకంఠం తన కొడుకు సంజుకు మరో పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. పెళ్లి అయి సంవత్సరం అయినా పిల్లలు లేరని ప్రశ్నించగా, సంజు తల్లి అసలు నిజం బయటపెడుతుంది. అయినా నీలకంఠం మౌనికను ఇంట్లో నుంచి పంపేయాలనే నిర్ణయానికి వస్తాడు. ఈ విషయంలో సంజీవ్ కూడా తండ్రికి మద్దతివ్వడం మరో షాకింగ్ ట్విస్ట్.
ఇక మీనా బెడ్‌రెస్ట్‌లో ఉండగా, బాలు మందు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మీనా మెమరీ లాస్ వచ్చినట్లు నటించి బాలును భయపెడుతుంది. నిజం తెలిసిన తర్వాత బాలు రిలీఫ్ ఫీలవుతాడు. ఈలోపే రవి, శృతి వచ్చి అపార్థంతో బాలును తిడుతారు. చివరకు మీనా బైక్ నుంచి పడిపోయిందని బాలు క్లారిటీ ఇస్తాడు. రోహిణి ఇంటికి వచ్చి మీనా బ్యాండేజ్ చూసి షాక్ అవుతుంది. గుడికి వెళ్లానని, మీనా పేరుమీద అర్చన చేయించానంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుంది. దీనికి బాలు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో రోహిణి మౌనంగా మారుతుంది.
ఎపిసోడ్ చివర్లో ప్రభావతి వంట డ్రామా నవ్వులు పూయించింది. ఎవ్వరూ తినడానికి ముందుకు రాకపోవడంతో బాలు, సత్యం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. చివరకు తన వంటలో కారం ఎక్కువైందని ప్రభావతికే అర్థమవుతుంది. అయితే భర్త సత్యంతో జరిగిన రొమాంటిక్ సీన్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది.
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలు, ఉత్కంఠ, ఫన్నీ సన్నివేశాలతో కట్టిపడేసింది. ముఖ్యంగా మీనా-బాలు మధ్య జరిగిన హార్ట్ టచ్చింగ్ సంభాషణలు, రవి-శృతి మధ్య కామెడీ ట్రాక్, చివర్లో పూల ఆర్డర్ ట్విస్ట్ కథను ఆసక్తికరంగా ముందుకు నడిపించాయి. ఎపిసోడ్ ప్రారంభంలో అర్థ రాత్రి వేళ మీనా ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి కూర్చుంటుంది. రోహిణి అన్న మాటలు గుర్తుకు వచ్చి లోపల లోపల బాధపడుతుంది. ఇది గమనించిన బాలు వెంటనే దగ్గరకు వచ్చి, 'ఏమైంది? తల తిరుగుతుందా? ఆరోగ్యం బాగానే ఉందా?' అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తాడు. మీనా మాత్రం తన హెల్త్ బాగానే ఉందని చెబుతూ, 'మనిద్దరికీ ఏదో కీడు జరుగుతుందేమోనన్న భయం కలుగుతోంది'అని మనసు విప్పుతుంది. అప్పుడు బాలు చాలా పాజిటివ్‌గా స్పందిస్తూ, 'భయంతో ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఇంకా భయపడాల్సి వస్తుంది. ధైర్యంగా ఉంటే కష్టాలే దూరమవుతాయి. అనవసరంగా ఆలోచించకుండా పడుకో'అంటూ మీనాకు ధైర్యం చెబుతాడు. భర్త మాటలతో రిలీఫ్ ఫీలైన మీనా మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తుంది. ఈ సీన్ ప్రేక్షకులకు మంచి ఎమోషనల్ కనెక్ట్ ఇచ్చింది.
ఇక మరోవైపు అర్ధరాత్రి వేళ రవికి తన లేడీ బాస్ నీతూ నుంచి ఫోన్ వస్తుంది. అదే సమయంలో శృతి నిద్ర లేచి చిరాకుగా మారుతుంది.'ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు?'అంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. రవి మాత్రం ఫోన్ కట్ చేయకుండా అక్కడే తిరుగుతూ మాట్లాడుతుంటాడు. దీంతో శృతి మరింత కోపంతో రవిని గది నుంచి బయటకు గెంటేస్తుంది. ఈ గోలలో బాలు కూడా లేచి, 'అర్ధరాత్రి వేళ నీ అరుపులు ఏంట్రా?' అంటూ రవిని తిడతాడు. చివరికి రవి మళ్లీ పైకి వెళ్లిపోతాడు. ఈ మొత్తం సీక్వెన్స్ కామెడీగా సాగుతూ నవ్వులు పూయించింది. అయితే పరాయి అమ్మాయితో అర్ధరాత్రి మాట్లాడడంపై శృతి తీవ్రంగా స్పందిస్తూ.. 'మళ్లీ ఇలాంటి టైమ్‌లో ఫోన్ వస్తే కట్ చేయి' అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
మరుసటి రోజు ఉదయం మీనా తల గాయం ఉన్నా కూడా వంటగదిలో పని చేస్తూ కనిపిస్తుంది. ఇది చూసిన బాలు ఆగ్రహంతో, 'ఇంట్లో ఇంకెవరూ లేరా? తలకు దెబ్బ తగిలినా నువ్వే వంట చేయాలా?' అంటూ కోప్పడతాడు. మీనా మాత్రం తన ఆరోగ్యం బాగానే ఉందని చెబుతుంది. అయినా బాలు జాగ్రత్తగా ఉండాలని పదే పదే హెచ్చరిస్తాడు. ఇంతలో మీనాకు పూల ఆర్డర్ వస్తుంది. భారీ మొత్తంలో పూలు కావాలని చెప్పడంతో మీనా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయాలని సిద్ధమవుతుంది. కానీ, బాలు మాత్రం ఆమెను బయటకు పంపించడానికి అంగీకరించడు. అయితే 'ఈ ఆర్డర్ మిస్ అయితే డబ్బులు పోతాయి, మాట వస్తుంది' అంటూ మీనా బాలు మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది. చివరకు బాలు కూడా ఒప్పుకుని, 'నేనే బైక్ డ్రైవ్ చేస్తా' అంటూ మీనాకు సపోర్ట్ ఇస్తాడు. భర్త అండతో మీనా సంతోషంగా పూలు తెచ్చేందుకు బయలుదేరుతుంది.
మరోవైపు.. గుణ కారులో వెళ్తుండగా ఓ టీ షాప్ వద్ద శివ టీ తాగుతూ కనిపిస్తాడు. అప్పటికే శివపై కోపంతో ఉన్న గుణ, 'ఎలాగైనా ఇతన్ని నా దారిలోకి తీసుకురావాలి'అంటూ కొత్త ప్లాన్ వేస్తాడు. వెంటనే తన అసిస్టెంట్‌ను పంపించి శివ బిల్ పే చేయమని చెప్పిస్తాడు. కానీ శివ ఘాటుగా స్పందిస్తూ వాళ్లను అక్కడి నుంచి పంపించేస్తాడు. దీంతో గుణ ఆగ్రహం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలోనే గుణ రోహిణికి ఫోన్ చేసి.. 'ఎంతైనా సరే... బాలు ఫోన్ నుంచి ఆ వీడియో త్వరగా పంపించు. లేదంటే దినేష్ వ్యవహారం నీ చేతుల్లోనే పెట్టేస్తా' అంటూ హెచ్చరిస్తాడు. గుణ మాటలతో భయపడిన రోహిణి, సాధ్యమైనంత త్వరగా వీడియో తీసుకోవాలని తన ప్రయత్నాలు మొదలుపెడుతుంది.
ఇదే సమయంలో బాలు-మీనా ఇద్దరూ బైక్‌పై వెళ్తుంటారు. అటుగా వెళ్తున్న గుణ వాళ్లను చూసి కోపంతో రగిలిపోతాడు. 'నేను అంటే భయపడాలి' అన్న ఉద్దేశంతో వెంటనే తన డ్రైవర్‌కు, బాలు బైక్‌ను కారుతో గుద్దమని ఆదేశిస్తాడు. డ్రైవర్ కారు వేగంగా తీసుకొచ్చి బాలు బైక్‌ను ఢీకొట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే బాలు అప్రమత్తమై బైక్‌ను పక్కకు మళ్లించడంతో పెద్ద ప్రమాదం తప్పుతుంది. అయినా తప్పించుకునే ప్రయత్నంలో బాలు-మీనా ఇద్దరూ కింద పడిపోతారు. వారి బైక్ రోడ్డు పక్కన ఉన్న ఓ ముసలి జంటను తాకుతుంది. దీంతో ఆ వృద్ధ దంపతులు కూడా స్వల్పంగా గాయపడతారు. వెంటనే బాలు పరుగున వెళ్లి వాళ్లకు ఏమైనా అయ్యిందా అని అడుగుతాడు.వారు 'మాకు పెద్దగా ఏమీ కాలేదు' అని చెబుతారు. వారి పరిస్థితి గమనించిన బాలు, వాళ్లకు కొంత ఆర్థిక సహాయం చేస్తాడు. అంతేకాదు, "భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా మాకు చెప్పండి... మేము మీకు అండగా ఉంటాం" అంటూ మీనాతో కలిసి భరోసా ఇస్తాడు.
మరోవైపు.. శృతి రవి రెస్టారెంట్‌కు చేరుకుంటుంది. కానీ నేరుగా లోపలికి వెళ్లకుండా బయటే నిలబడి రవికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే రవి అప్పటికే పనిలో బిజీగా ఉండి, తన లేడీ బాస్ నీతూ చెప్పిన విషయాలు నోట్ చేసుకుంటాడు. ఈ క్రమంలో శృతి కాల్స్‌ను వరుసగా కట్ చేస్తాడు. దీంతో శృతి కోపంతో నేరుగా రెస్టారెంట్‌లోకి వెళ్లిపోతుంది. అక్కడ రవి-నీతూ ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడంతో శృతి మరింత ఆగ్రహానికి లోనవుతుంది. ఈ విషయాన్ని గమనించిన రవి స్పందించేలోపే శృతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రవి ఆమెను కలవడానికి వెళ్లి ఆఫ్‌డే కావాలని చెబుతాడు. రోడ్డుపైనే ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. చివరకు రవి కాస్త తగ్గి క్షమాపణ చెప్పడంతో శృతి మనసు కాస్త చల్లబడుతుంది.
శృతిని కూల్ చేయాలన్న ఉద్దేశంతో రవి రెస్టారెంట్‌కు వెళ్లాలని సూచిస్తాడు. శృతి కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ కలిసి డిన్నర్‌కు వెళ్తారు. అక్కడ టేస్ట్ విషయంలో సరదాగా పోటీ పడతారు. రవి ఆర్డర్ చేసిన డిష్ శృతికి కూడా బాగా నచ్చడంతో, "నీ టేస్ట్ నిజంగా చాలా బాగుంది" అంటూ ఆమె అప్రిషియేట్ చేస్తుంది. అయితే ఇదే సమయంలో రవి నోరు జారేసి, 'నీతూ కలిసి ఈ డిష్‌ను రేపటినుంచి నా రెస్టారెంట్‌లో స్టార్ట్ చేస్తాం' అంటూ పని విషయాన్ని తీసుకొస్తాడు. దీంతో శృతికి మండిపోతుంది. 'ఇక్కడ కూడా నీ వర్క్ గురించే మాట్లాడాలా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రవి కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నించే క్రమంలో పొరపాటున శృతిని 'నీతూ' అని పిలవడం పరిస్థితిని మరింత చెడగొడుతుంది. దీంతో శృతి తీవ్రంగా కోపపడి, 'వెళ్లి ఆమెతోనే ఉండిపో' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా నీతూ కారణంగా రవి-శృతి మధ్య గొడవలు మొదలవుతాయి.
ఇక ఎపిసోడ్ చివర్లో సంజు తన భార్య మౌనికను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. ఈ విషయం తెలియని సంజు తల్లి కంగారుపడుతూ నీలకంఠాన్ని ప్రశ్నిస్తుంది. కానీ నీలకంఠం నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడు. కొద్దిసేపటికి సంజు మౌనికతో ఇంటికి చేరుకుంటాడు. 'హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లారు?' అని అడిగితే, పిల్లలు పుడతారా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి టెస్టులు చేయించుకున్నామని సంజు చెబుతాడు. దీంతో సంజు తల్లి ఆగ్రహంతో, 'సంసారం చేస్తేనే కదా పిల్లలు పుట్టేది' అని ఘాటుగా అంటుంది. ఇదే సమయంలో నీలకంఠం మధ్యలోకి వచ్చి, 'విత్తనం వేస్తే మొలుస్తుందో లేదో తెలుసుకోవడానికి టెస్ట్ చేయాలి కదా... అందుకే వాడు ముందే చెక్ చేయించాడు' అంటూ అవమానకరంగా మాట్లాడతాడు. ఈ మాటలు విన్న మౌనిక ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. ఆమె కళ్లలో కనిపించిన బాధ, అవమానం ఈ ఎపిసోడ్‌లో అత్యంత హార్ట్ టచ్ చేసే క్షణంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











