Gunde Ninda Gudi Gantalu February 20th Episode:ప్రేమ జంట రొమాన్స్.. ఉచ్చులో ప్రభావతి.. మీనా బొమ్మల కొలువు

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు చోటుచేసుకున్నాయి. కథ ఆరంభంలోనే నీలకంఠ తన పక్కా ప్లాన్‌లో భాగంగా మౌనిక, సంజును హాస్పిటల్‌కు టెస్టుల కోసం పంపిస్తాడు. మౌనిక అన్నల కుటుంబాల్లో పిల్లలు లేకపోవడంతో అనుమానం వచ్చిందని చెప్పడం ఆమెను షాక్‌కు గురి చేస్తుంది. దీనిపై మౌనిక ప్రశ్నించగానే సంజు ఆగ్రహంతో ఆమెపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తుంది. ఇదే సమయంలో నీలకంఠ ల్యాబ్‌కు ఫోన్ చేసి రిపోర్టులు తనకు అనుకూలంగా ఇవ్వాలని డబ్బు ఆఫర్ చేయడం అతడి దురుద్దేశాన్ని స్పష్టంగా చూపించింది.

మరోవైపు బాలు-మీనా హాల్లో కూర్చొని భవిష్యత్తు కలలు కంటారు. వృద్ధాప్యం, పిల్లల పెళ్లిళ్లు అంటూ సరదాగా ఊహించుకుంటూ భావోద్వేగ క్షణాలు పంచుకుంటారు. ఆ వెంటనే రోహిణి బాలు ఫోన్‌లోని వీడియోలు దొంగిలించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ బాలు తరచూ మీనాను పిలవడం, ప్రభావతి గదిలోకి రావడంతో రోహిణి మంచం కిందే చిక్కుకుంటుంది. చివరకు ఫోన్ బ్యాటరీ అయిపోవడంతో ఆమె ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇదిలా ఉండగా రవి తన బాస్ నీతూతో సూపర్‌మార్కెట్‌కు వెళ్లడం పెద్ద ట్విస్టుగా మారుతుంది. అక్కడ శోభ వారిద్దరి క్లోజ్‌నెస్ చూసి అనుమానంతో శృతికి ఫోన్ చేస్తుంది. మరోవైపు మీనా పూల కొట్టు వద్ద తమ్ముడు శివ మారిన ప్రవర్తన చూసి సంతోషపడుతుంది. పంతులు చెప్పిన బొమ్మల కొలువు మాటలు మీనా మనసులో ఆశను నింపుతాయి.

Gunde Ninda Gudi Gantalu serial episode 624 February 20th 2026 here is full story

Photo courtesy: Jio Hotstar

తల్లి-కూతురు మధ్య రవి-నీతు చర్చ..

శృతి తల్లి శోభన డబ్బింగ్ స్టూడియోకు వెళ్లి రవి, నీతు వ్యవహారంపై తన కూతురిని జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది. నీతు ప్రవర్తన కాస్త భిన్నంగా ఉందని, ఏదైనా అపార్థం రాకుండా చూసుకోవాలని ఆమె హెచ్చరిస్తుంది. కానీ శృతి మాత్రం రవిపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేస్తుంది. 'రవి అలాంటి వ్యక్తి కాదు... నీతుతో షాపింగ్‌కి వెళ్తున్నట్టు ముందే చెప్పాడు. అనవసర అనుమానాలు పెట్టుకోవద్దు' అంటూ తల్లికి గట్టిగా చెబుతుంది. ఇక్కడే శృతి గతాన్ని ప్రస్తావిస్తూ తల్లిని ప్రశ్నిస్తుంది 'నువ్వు కూడా ఒకసారి వేరే వ్యక్తితో షాపింగ్‌కి వెళ్లావు... అప్పుడు మేమేమైనా అపార్థం చేసుకున్నామా?' అంటూ కౌంటర్ ఇస్తుంది. ఈ ప్రశ్నతో శోభన కంగుతింటుంది. ఇకపై ఇలాంటి విషయాలు చెప్పడానికి రావద్దని, తన గురించి టెన్షన్ పడవద్దని శృతి స్పష్టం చేస్తుంది. తల్లి-కూతురు మధ్య ఈ ఘట్టం ప్రేక్షకులను ఆలోచనలో పడేసింది.

మీనా బొమ్మల కొలువు ఆలోచన
మరోవైపు ఇంటి వాతావరణంలో సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మీనా వంటగదిలో పని చేస్తూ బొమ్మల కొలువు పెట్టాలని ఆలోచనలో పడుతుంది. అదే సమయంలో వెనుక నుంచి బాలు సరదాగా ఆమెను అడ్డంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఒక్కసారిగా అప్రమత్తమైన మీనా చేతిలో ఉన్న కత్తితో బాలుపై దాడి చేయబోతుంది. దీంతో బాలు ఉలిక్కిపడతాడు. తర్వాత పరిస్థితి చల్లారడంతో మీనా సారీ చెబుతుంది. ఇక తన కోరికను బాలుకు వెల్లడిస్తూ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలని చెబుతుంది. బొమ్మల కొలువు కోసం అత్త ప్రభావతి పర్మిషన్ అవసరమని భావించిన మీనా, బాలుతో కలిసి సత్యం దగ్గరకు వెళ్తుంది. కానీ బాలు డొంకతిరుగుడుగా మాటలు మొదలుపెట్టడంతో సత్యం స్ట్రెయిట్‌గా 'ఏం చెప్పాలనుకుంటున్నావ్?'అంటూ అడుగుతాడు.

దీంతో మీనా తన కోరికను చెప్పుతుంది. ఇంట్లో మంచి జరగాలని, వారసుడు రావాలని ఉద్దేశంతో బొమ్మల కొలువు పెట్టాలని భావిస్తున్నట్టు సత్యం ప్రభావతికి వివరిస్తాడు. ప్రభావతి మొదట్లోనే 'ఇది గొప్పింటి వాళ్లు చేసుకునే పండుగ... మనకెందుకు?'అంటూ తిరస్కరిస్తుంది. కానీ సత్యం చాకచక్యంగా మాట మార్చి, 'ఇంటికి వారసుడు వస్తానంటే వద్దంటావా? నువ్వు పూజలు, పాటలు పాడుతావు కదా... నీ గొంతు గాన కోకిలలా ఉంటుంది'అంటూ పొగిడేస్తాడు. ఆ పొగడ్తలతో ప్రభావతి ఇంప్రెస్ అయి చివరికి పర్మిషన్ ఇస్తుంది. ఇలా సత్యం మస్కా కొట్టి మీనా కోరిక తీరేలా చేస్తాడు.

డాన్స్ స్కూల్‌లో ప్రభావతి ఆవేదన
ప్రభావతి తన డాన్స్ స్కూల్‌కు వెళ్లి స్నేహితురాలు మీనాక్షితో బొమ్మల కొలువు విషయాన్ని పంచుకుంటుంది. 'ఉన్న ఇల్లే చాలా చిన్నది... అందులో మీనా బొమ్మల కొలువు పెట్టాలని చూస్తోంది. ఇంట్లో తన ఇష్టం వచ్చినట్లు చేస్తోంది'అంటూ మీనాపై అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే మీనాక్షి మాత్రం వేరే కోణాన్ని చూపిస్తుంది. 'బొమ్మల కొలువు పెట్టుకుంటే ఇంట్లో శుభం జరుగుతుంది. ఏదైనా కీడు ఉంటే పోతుంది. సంతానం కోసం కోరుకునేవారు కూడా ఈ పూజ చేస్తారు' అంటూ వివరంగా చెబుతుంది. ఇంకా బొమ్మల కొలువు అంటే రోజూ పూజలు, పాటలు, పిండి వంటలు అన్ని ఉంటాయి గా అని గుర్తుచేస్తుంది. అప్పుడు ప్రభావతి గర్వంగా 'మా సత్యం నన్నే పాటలు పాడమంటూ మొహమాటం పెడుతున్నాడు'అంటూ తన ఆనందాన్ని పంచుకుంటుంది. ఇలా మీనాక్షి మాటల్లో ప్రభావతి పూర్తిగా మునిగిపోతుంది.

ప్రేమ జంట రొమాన్స్.. మీనా ఎంట్రీతో షాక్
ఇదే సమయంలో డాన్స్ స్కూల్‌లోని ఒక రూమ్‌లో ప్రేమ జంట తమ పనిలో తాముంటూ రొమాన్స్‌లో మునిగిపోతుంటారు. అయితే అనూహ్యంగా మీనా అక్కడికి భోజనం తీసుకుని ఎంట్రీ ఇస్తుంది. వారిని ఆ స్థితిలో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. 'ఇది డాన్స్ స్కూల్... ఇలాంటి పనుల కోసం వచ్చారా?'అంటూ గట్టిగా క్లాస్ పీకుతుంది. మరోసారి ఇలా చేస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. తమ విషయం బయటపడుతుందేమోనని భయపడిన ఆ ప్రేమ జంట ముందుగానే ప్లాన్ ప్రకారం ప్రభావతి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ నటిస్తారు. 'మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీనా అపార్థం చేసుకుని తిట్టింది'అంటూ అబద్ధం చెబుతారు. ఏది నిజమో ఆలోచించకుండా ప్రభావతి మీనాపై మండిపడుతుంది. నానా మాటలు అంటుంది. దీంతో బాధపడిన మీనా 'ఇప్పటికైనా జాగ్రత్త... ఈ విషయం మీ మెడకు ఉచ్చు లా మారుతుంది'అంటూ హెచ్చరించి అక్కడినుంచి వెళ్లిపోతుంది. అక్కడే ఉన్న మీనాక్షి మాత్రం ప్రభావతి వ్యవహారశైలిని తప్పుపడుతుంది. 'మంచి చెడు తెలుసుకోకుండా మీనాను తిట్టడం సరైంది కాదు'అంటూ స్పష్టంగా చెప్పి వెళ్లిపోతుంది.

బొమ్మల కొలువు పేరుతో ఇంట్లో కొత్త హంగామా..
మీనా బొమ్మల కొలువు ఆలోచన ఇంట్లో కొత్త సందడితో పాటు చిన్నచిన్న కలహాలకు కూడా కారణమైంది. ప్రతి సన్నివేశం కుటుంబ రాజకీయాలతో నిండిపోయింది. మీనా ఆలోచన మేరకు బాలు బొమ్మలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టగా, వాటిని చూసి మీనా తెగ ఆనందపడుతుంది. అచ్చం పండగ వాతావరణం నెలకొంటుంది. ఇదే సమయంలో మనోజ్ ఎంట్రీ ఇస్తాడు. 'ఇవన్నీ ఏంట్రా?'అని అడిగితే, బాలు తిన్నగా సమాధానం ఇవ్వకుండా సెటైర్ వేస్తాడు. 'మీనాక్షి బొమ్మల కొట్టు పెడుతుంది... దాని పక్కన నువ్వు బోర్డు పట్టుకొని నిలబడాలి!' అని. దీంతో మనోజ్ అవమానంగా ఫీలై సైలెంట్‌గా వెళ్లిపోతాడు. ఈ విషయం రోహిణికి చెబితే, ఆమె అసూయతో 'మీ అమ్మ ఎప్పుడు పర్మిషన్ ఇచ్చింది? బాలు, మీనా మీ నాన్నగారిని ఒప్పించి తీసుకున్నారు' అని చెబుతుంది. మనోజ్ వెంటనే ఖర్చు విషయాన్ని లేపి.. 'వారు డబ్బు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు'అంటూ తన కుళ్ళి బుద్ధిని బయటపెడతాడు.

మరోవైపు బాలు ఈ పూజ అందరి కోసం కాబట్టి ముందుగా తన బామ్మకు చెప్పాలని సత్యం చేత ఫోన్ చేయిస్తాడు. సత్యం తన తల్లి సుశీలమ్మకు విషయం చెబితే ఆమె ఎంతో ఆనందిస్తుంది. ఇంకా 'ఇంట్లో నలుగురికి పెళ్లై ఏడాది అవుతోంది... పిల్లలు లేకపోవడం సరి కాదు. హోమం కూడా జరపాలి. ఆ హోమంలో మౌనిక, సంజును కూడా కూర్చోబెట్టండి'అంటూ సూచిస్తుంది. దీంతో బొమ్మల కొలువు కార్యక్రమం మరింత గ్రాండ్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. బాలు ఈ పూజ అందరి కోసం కాబట్టి ఖర్చు కూడా సమానంగా పంచుకోవాలని నిర్ణయిస్తాడు. మొత్తం ఖర్చు రూ.15,000 అవుతుందని, అందులో ప్రతి ఒక్కరి వాటా రూ.5,000 అని చెబుతాడు.

మొదట మనోజ్ దగ్గరకు వెళ్లి అడిగితే, అతడు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తెగేసి చెబుతాడు. కానీ రోహిణి పరువు పోతుందని భావించి తనవంతు డబ్బు ఇస్తానని చెప్పి పరిస్థితిని చక్కబెడుతుంది. అప్పుడు బాలు అన్నకు పంచ్ వేస్తూ 'తీసుకోవడమే కాదు... అప్పుడప్పుడు ఇవ్వడం కూడా నేర్చుకో'అంటూ వెళ్తాడు. తర్వాత బాలు, మీనా శృతి-రవి దగ్గరకు వెళ్లి బొమ్మల కొలువు గురించి చెబుతారు. మొదట అసలు విషయం అర్థం కాక 'కంగ్రాట్స్' అంటారు. తర్వాత ఖర్చు విషయం చెప్పగానే శృతి వెంటనే రూ.2,500 ఇస్తుంది. మిగతా రూ.2,500 రవి ఇస్తాడని చెబుతుంది. అందరినీ సమానంగా చూస్తున్నారని బాలు వారిని మెచ్చుకుంటాడు.

తోడికోడళ్ల డ్రామా.. ప్రభావతి ఆనందం
మరుసటి రోజు బాలు బొమ్మలను హాల్లో సర్దుతుంటే రవి-శృతి వాటిని చూసి ఇంప్రెస్ అవుతారు. ఇదే సమయంలో సత్యం, ప్రభావతి ఎంట్రీ ఇస్తారు. సత్యం ఇన్‌డైరెక్ట్‌గా తన కొడుకులకు కొన్ని మాటలు చెప్పడంతో, ఒకవైపు మీనా-బాలు, మరోవైపు రవి-శృతి తిట్టుకోవడం ప్రారంభిస్తారు. ఈ దృశ్యం చూసిన ప్రభావతి 'ఇంకా తోడికోడళ్ళు కలిసినట్లు లేరు' అంటూ మనసులో సంతోషిస్తుంది. అయితే అందరూ ప్రభావతిని మస్కా కొట్టి మేనేజ్ చేస్తూ పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి మీనా బొమ్మల కొలువు ఆలోచన ఇంట్లో కొత్త ఉత్సాహం తెచ్చినా... ఖర్చు, అసూయ, అపార్థాలతో చిన్న చిన్న విభేదాలకు దారితీసింది. ఇప్పుడు అసలు ట్విస్ట్..సుశీలమ్మ చెప్పినట్టు హోమంలో మౌనిక, సంజు పాల్గొంటారా? లేక ఇది మరో కొత్త గొడవకు కారణమవుతుందా? బొమ్మల కొలువు శుభం తెస్తుందా? లేక కుటుంబంలో మరింత కలహాలకు దారితీస్తుందా? ప్రేమ జంట అబద్ధం బయటపడుతుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X