Gunde Ninda Gudi Gantalu February 25th Episode:రవికి ఫైన్.. నీలకంఠంకు మీనా వార్నింగ్.. పందెంలో ప్రభావతి ఓటమి

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్ మొత్తం హై వోల్టేజ్ డ్రామాతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తనకు వస్తున్న బెదిరింపు లెటర్ల వెనుక బాలు ఉన్నాడంటూ మనోజ్ ఇంట్లో అందరి ముందే ఆరోపణలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. మీనా మాత్రం ధైర్యంగా స్పందిస్తూ... బాలు అలాంటి వ్యక్తి కాదని, ఆధారాలు లేకుండా నిందలు వేయడం సరికాదని గట్టిగా వాదించింది. అయినా వినిపించుకోని మనోజ్ బాడీగార్డ్‌ను పిలిపించగా, బాలు ఒక్క గుద్దుతో అతడిని నేలకూల్చి తన పవర్ చూపించాడు. దీంతో మనోజ్ అవమానంతో బాడీగార్డ్‌ను ఉద్యోగం నుంచి తొలగించాడు.ఆ తర్వాత బాలు అసలు లెటర్లు ఎవరు ఇచ్చారో ప్రశ్నించగా... ఫకీర్ వేషంలో ఓ వ్యక్తి ఇచ్చినట్టు మనోజ్ ఒప్పుకున్నాడు. పోలీస్ కేసు పెట్టాలన్న సత్యం, శృతి మాటలను రోహిణి అడ్డుకోవడంతో బాలు ఆమెపై అనుమానం వ్యక్తం చేశాడు.

"ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టను" అంటూ బాలు ఛాలెంజ్ విసరడంతో రోహిణి భయపడిపోయింది. వెంటనే దివ్యతో కలిసి బాలు ఫోన్‌లో ఉన్న శివ వీడియోను డిలీట్ చేయాలన్న ప్లాన్ వేసింది. కానీ దివ్య ప్రయత్నం విఫలమవడంతో రోహిణి మరింత కంగారుపడింది. ఇదిలా ఉండగా బాలు గుడికి వెళ్లి లెటర్లు ఇచ్చిన వ్యక్తి వివరాలు సేకరించి దర్యాప్తు వేగం పెంచాడు. ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర మీనా-మనోజ్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోగా, బాలు నాలుగు రోజుల్లో అసలు నిజం బయటపెడతానని ప్రకటించాడు. మరోవైపు నీతూ లిఫ్ట్ డ్రామాతో శృతి-రవి మధ్య టెన్షన్ మొదలైంది. మొత్తానికి నేటి ఎపిసోడ్‌లో బాలు దర్యాప్తు, రోహిణి భయం, మీనా ఆగ్రహంతో కథ కీలక మలుపు తిరిగింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 627 February 25th 2026 here is full story

Photo courtesy: Jio Hotstar

బుధవారం ఎపిసోడ్ మొత్తం ఫన్, ఫైట్, ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేసింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే రవి-శృతి-నీతూ కలిసి బైక్‌పై ప్రయాణిస్తారు. ఈ సమయంలో కావాలనే నీతూ రవిని రెచ్చగొట్టడం, దానికి శృతి మండిపడటం కామెడీగా సాగుతుంది. ఇంటికి చేరుకున్న తర్వాత రవి 'నా పని అయిపోయింది' అన్నట్టుగా ఫీలవుతుండగా, అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది. ట్రాఫిక్ పోలీసులు ట్రిపుల్స్ వెళ్తున్నందుకు ఆపి ఫైన్ వేయడంతో ముగ్గురూ షాక్ అవుతారు. రవి దగ్గర డబ్బులు లేవని చెప్పగా, నీతూ కూడా తన పర్సు మర్చిపోయానని అంటుంది. శృతి తన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఫైన్ కట్టేందుకు ముందుకు రావడంతో, నీతూ 'నేను ఎందుకు కట్టాలి?'అంటూ చిన్న గొడవకు దిగుతుంది. చివరకు నీతూ ట్రాఫిక్ పోలీస్ బైక్ ఎక్కి వెళ్లిపోవడంతో శృతి ఒంటరిగా ఫైన్ కట్టి రవితో కలిసి ఇంటికి వెళ్తుంది. ఈ సందర్భంగా శృతి రవికి 'ఇలాంటి పనులు మళ్లీ చేయొద్దు'అంటూ వార్నింగ్ ఇస్తుంది.

మరోవైపు.. ప్రభావతి ఇంటికి వచ్చి తాను చాలా అలసిపోయానని చెప్పడం, మీనా కాళ్లకు మసాజ్ చేయాలా అని అడగగా అవసరం లేదంటూ కసురుకోవడం కనిపిస్తాయి. దీనిపై సత్యం ప్రభావతి తీరును ఎత్తిపొడుస్తాడు. బాలు కూడా 'ఆల్ ఇండియా గయ్యాళి అత్తల సంఘానికి మా అమ్మే అధ్యక్షురాలు'అంటూ సరదాగా కామెంట్ చేస్తాడు. ఇదే సమయంలో సత్యం 'మా అమ్మ రాబోతోంది'అని చెప్పడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. 'మీ అమ్మ ఎందుకు వస్తుంది?'అంటూ అడగగా, సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. బాలు మరింత ఆటపట్టించడంతో ఆ సీన్ ఫుల్ కామెడీగా మారింది.పూజ నేపథ్యంలో ఇంట్లో మరోసారి హై వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. ఇప్పటికే చిన్న చిన్న విభేదాలతో ఉద్రిక్తంగా మారిన వాతావరణానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు మీనా ముందుకొచ్చింది.

'ఇంత పెద్ద పూజ చేస్తున్నాం... మన ఇంటి ఆడబిడ్డ మౌనిక లేకుండా ఫంక్షన్ చేయడం సరికాదు'అంటూ స్పష్టంగా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. వెంటనే బాలు స్పందిస్తూ, 'రేపే వెళ్లి నా చెల్లిని తీసుకొస్తా'అని చెప్పాడు. అయితే ప్రభావతి మాత్రం వ్యంగ్యంగా నవ్వుతూ, 'నువ్వు వెళ్లినా అనవసరంగా గొడవే అవుతుంది... వాళ్లు రారు'అంటూ ఎగతాళి చేసింది. పరిస్థితి మరింత వేడెక్కకుండా మీనా సత్యాన్ని ఫోన్ చేయమని కోరినా, 'వారి మాట తీరే వేరుగా ఉంటుంది.. నేను మాట్లాడలేను' అంటూ సత్యం తప్పించుకున్నాడు. ఇదే సమయంలో ప్రభావతి రంగంలోకి దిగుతూ, 'నేను మాట్లాడితే నా అల్లుడు సంజు చెప్పినట్లు వింటాడు'అంటూ గొప్పలు చెప్పింది.

దీంతో బాలు వెంటనే ఫోన్ చేసి ప్రభావతికి ఇచ్చాడు. మొదట మౌనిక ఫోన్ ఎత్తకపోవడంతో మరోసారి లౌడ్‌స్పీకర్‌లో కాల్ చేశారు. ఈసారి సంజు లిఫ్ట్ చేసి, ఎవరు అంటూ తెలియనట్టు మాట్లాడాడు. ప్రభావతి తనను 'మీ అత్తగారు'అని పరిచయం చేసుకోగానే సంజు పంచ్‌లతో పరువు తీసేలా మాట్లాడాడు. 'మీ పెద్ద కొడుకు లాగా గుడి ముందు అడక్కు తినడం లేదు'అంటూ సెటైర్ వేయడంతో ప్రభావతి అవాక్కైంది. అయినా సమన్వయంతో పూజకు రావాలని ఆహ్వానించగా, సంజు 'మేము రాము... మళ్లీ ఫోన్ చేయొద్దు'అంటూ కట్ చేయడంతో ఇంట్లో ఉద్రిక్తత పెరిగింది. మౌనిక లేకుండా పూజ ఎలా జరుపాలనే ఆందోళన మొదలైంది.

ఇక్కడే మీనా ధైర్యంగా ముందుకొచ్చి, 'నేనే వెళ్లి మౌనిక-సంజును పూజకు తీసుకొస్తాను'అంటుంది. దీనిపై ప్రభావతి హేళనగా, 'నువ్వు పూలు అమ్ముకునే దానివి... నిన్నెవరూ లెక్క చేయరు' అంటూ తీవ్రంగా మాట్లాడింది. దీంతో మీనా ఆ మాటలను సవాల్‌గా స్వీకరించింది. ఒకవేళ తాను ఓడిపోతే పూల వ్యాపారం మూసేసి ఇంట్లోనే సైలెంట్‌గా ఉంటానని ఒప్పుకుంది. దీనికి ప్రతిగా బాలు కూడా షరతు పెట్టాడు 'నువ్వు గెలిస్తే మాత్రం మీనా మాట వినాలి'అని. అలా అత్తా-కోడళ్లు ఒకరికొకరు సవాల్ విసురుకోవడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు అందరి దృష్టి మీనా మిషన్‌పై నిలిచింది.

ప్రభావతితో వేసిన సవాల్‌ను నిలబెట్టుకోవడానికి మీనా నేరుగా మౌనిక ఇంటికి వెళ్లడం ఈ ఎపిసోడ్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఇంట్లో జరుగుతున్న సంతాన హోమం గురించి చెబుతూ... "పిల్లల కోసం చేస్తున్న ఈ పూజకు తప్పకుండా రావాలి" అంటూ మౌనికను, ఆమె అత్తయ్యను ఆహ్వానిస్తుంది మీనా. మొదట పరిస్థితి కాస్త సాఫ్ట్‌గా కనిపించినా.. ఇంతలోనే సంజు ఎంట్రీ ఇచ్చి అసలు డ్రామా మొదలవుతుంది. 'నేనే పంపించాను... ఇక మా ఇంట్లో మౌనిక కాలు పెట్టదు'అంటూ సంజు అవమానకరంగా మాట్లాడడంతో మీనాకు ఒళ్ళు మండిపోతుంది. అయినా కోపాన్ని కంట్రోల్ చేసుకుని చాలా స్ట్రాంగ్‌గా స్పందిస్తుంది. 'మీ పిల్లను ఇచ్చిన వాళ్లకి ఎంత బాధ ఉంటుందో... తీసుకునే మాకు అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మా మీద చేయి ఎత్తేలా మాట్లాడుతున్నావా?'అంటూ సంజుని నిలదీస్తుంది.

దీంతో సంజు మరింత గట్టిగా మాట్లాడగా... మీనా మాస్ వార్నింగ్ ఇస్తుంది. 'మౌనికను ఇబ్బంది పెడుతున్నావని గృహహింస కేసు పెడితే నీ పరిస్థితి ఏంటో తెలుసా? నీ నాన్న కంటున్న రాజకీయ కలలు కూడా మట్టి అవుతాయి. గతంలో గుండాలను ఎలా తరిమి కొట్టానో గుర్తుందా?'అంటూ స్ట్రాంగ్ డైలాగ్‌తో సంజును పూర్తిగా సైలెంట్ చేస్తుంది. అప్పుడే నీలకంఠ అక్కడికి వచ్చి కాస్త కఠినంగా మాటలు మాట్లాడతాడు. కానీ మీనా అక్కడ కూడా తగ్గదు. 'మౌనిక ఇన్ని రోజులు మౌనంగా ఉంది... ఆ మౌనం బద్దలైతే మీ ఇంట్లో భూకంపమే వస్తుంది' అంటూ మరో మాస్ డైలాగ్ వేసి షాక్ ఇస్తుంది. మీనా ఆగ్రహానికి నీలకంఠ కూడా కాస్త తగ్గి, 'పిల్లల కోసం యాగం అంటున్నారు కదా... పంపిస్తాం' అంటూ మాట మార్చేస్తాడు.

మీనా విజయం సాధించిన ఆనందంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిన తర్వాత నీలకంఠ తన కొడుకుతో మాట్లాడుతూ, ఇది సరైన సమయం కాదని... అనవసర గొడవలు వద్దని, పూజకు వెళ్లడం బెటర్ అంటూ తన 'మాస్టర్ ప్లాన్'ను అమలు చేయాలని సూచిస్తాడు. మరోవైపు ప్రభావతి మాత్రం ముందే 'మీనా ఓడిపోతుంది' అన్న నమ్మకంతో ఇంట్లో గిన్నెలు, బట్టలు సర్దేసి హాల్లో పెట్టేస్తుంది. ఇది చూసిన సత్యం ఆశ్చర్యపోతూ ఏంటీ హడావుడి అని అడగగా.. బాలు సెటైర్ వేస్తూ, 'అమ్మ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది.. పాత సామాన్లు కొనుగోలు చేస్తుందేమో!' అంటూ చురక అంటిస్తాడు. అప్పుడు ప్రభావతి అసలు విషయం బయటపెడుతుంది . 'మీనా పందెంలో ఓడిపోతుంది కాబట్టి, ఆమె నా మాట వినాలి... అందుకే ముందే రెడీ అవుతున్నా' అని తెగ సంబరపడుతుంది. దీనికి రోహిణి, మనోజ్ కూడా మొదట సపోర్ట్ ఇస్తారు.

అయితే బాలు మాత్రం వెంటనే ట్విస్ట్ ఇస్తూ.. 'ఒకవేళ అమ్మే ఓడిపోతే... మీరు కూడా మీనా చెప్పినట్టే వినాలి' అని స్పష్టం చేస్తాడు. దీంతో రోహిణి, మనోజ్ వెంటనే వెనక్కి తగ్గి, తాము కేవలం సపోర్ట్ మాత్రమే చేశామని, పందెంతో తమకు సంబంధం లేదని చేతులెత్తేస్తారు. ఇంతలో మీనా సంతోషంగా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. కానీ ప్రభావతి మాత్రం ఇంకా తనే గెలిచినట్టు భావిస్తూ.. 'మౌనిక అత్తగారు ముఖం మీదే తిరస్కరించి ఉంటారు... మీనా ఓడిపోయింది'అంటూ తెగ సంబరపడుతుంది. అయితే మీనా మాత్రం చాలా కూల్‌గా తన మామయ్యతో మాట్లాడుతూ, 'బామ్మకు ఫోన్ చేసి సంజీవ్, మౌనికలకూ బట్టలు తీసుకురావాలా అడగండి'అంటుంది. అంతే... ప్రభావతి ఫేస్ ఒక్కసారిగా మారిపోతుంది.

బాలు కూడా తన చెల్లి వస్తోందని ఆనందంతో గంతులు వేస్తాడు. పందెంలో ప్రభావతి ఓడిపోయిందని, ఇప్పుడు మీనా చెప్పినట్టే వినాలని బాలు గుర్తుచేయడంతో... ప్రభావతి ఓటమి బాధతో మౌనంగా లోపలికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీనా పూజ కోసం కావాల్సిన సరుకులు, వంటల లిస్టు తయారు చేస్తుంది. ఇదే సమయంలో శృతి వచ్చి మీనాతో మాట్లాడటం చూసిన రోహిణికి అనుమానం మొదలవుతుంది. ఆ అనుమానమే పెద్ద గొడవగా మారి.. శృతి-మీనా మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

ఈ హంగామా చూసిన సుశీలమ్మ ఎంట్రీ ఇచ్చి, 'అక్కచెల్లెల్లలా ఉండాల్సిన మీరు ఇలా ఎందుకు గొడవ పడుతున్నారు?' అంటూ బాలును ప్రశ్నిస్తుంది. కానీ బాలు అసలు విషయం చెప్పకుండా ఇది పెద్ద కథ అంటూ తప్పించుకుంటాడు. మౌనిక పూజకు వస్తుందా? ప్రభావతి నిజంగానే మీనా మాట వినాల్సి వస్తుందా? రోహిణి అనుమానాలు ఏ మలుపు తిరుగుతాయో? అన్న ఆసక్తితో రాబోయే ఎపిసోడ్లపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X