Gunde Ninda Gudi Gantalu February 26th Episode: ప్రభావతికి శిక్ష.. బాలు ఫోన్ రోహిణి చేతికి..సుశీలమ్మ ట్విస్ట్

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ లో రవి-శృతి బైక్‌పై వెళ్తుండగా మధ్యలో నీతూ ఎక్కడం, ట్రాఫిక్ పోలీసులు ట్రిపుల్ రైడింగ్ అంటూ క్లాస్ పీకడం హైలైట్ అయ్యింది. చివరకు ఫైన్ కూడా శృతినే కట్టాల్సి రావడంతో రవిపై ఆమె చిరాకు చూపించింది. ఇంటివద్ద ప్రభావతి కాళ్ల నొప్పుల పేరుతో మీనాను ఆటపట్టించగా.. బాలు తన పంచ్ డైలాగ్‌లతో ఆమెను గట్టిగా ఆటాడుకున్నాడు. ఇక సత్యం సంతాన హోమం ప్రస్తావన తీసుకురావడంతో ఇంట్లో మరోసారి గొడవలు మొదలయ్యాయి. ప్రభావతి ముందుగా మనోజ్-రోహిణిలకే యాగం అంటూ మెలిక పెట్టడంతో బాలు మండిపడ్డాడు. 'మేం సెకండ్ సెటప్ పిల్లలమా?' అంటూ ప్రశ్నించి ప్రభావతిని ఇరుకున పెట్టాడు.

ఇదే సమయంలో మౌనికను పిలవాలని మీనా అనడంతో ప్రభావతి గొప్పలు చెప్పింది. కానీ అల్లుడు సంజు ఫోన్‌లోనే ప్రభావతిని అవమానించడంతో ఆమెకు భారీ షాక్ తగిలింది. అసలు మలుపు మీనా ఎంట్రీతో వచ్చింది. సంజుతో ముఖాముఖి వాగ్వాదంలో మీనా తన అసలైన స్ట్రెంగ్త్ చూపించింది. మౌనిక వస్తువు కాదు మనిషి అని క్లాస్ పీకుతూ... అవసరమైతే మీడియా, పోలీస్ కేసుల వరకూ వెళ్తానని హెచ్చరించింది. చివరకు సంజు కుటుంబం వెనక్కి తగ్గడంతో మౌనికను తీసుకొచ్చింది మీనా. ఇంటికి వచ్చాక పందెం గెలిచానంటూ ప్రభావతిపై బాలు 'ఈరోజు నుంచి ప్రభావతి కాదు... పూలవతి' అంటూ శిక్ష విధించాడు. మీనా పూలు అల్లిస్తే, ప్రభావతి పూలు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. చివర్లో ప్రభావతి అత్త ఎంట్రీతో ఆమె వాయింపు మొదలవ్వడంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 628 February 26th 2026 here is full story

Photo courtesy: Jio Hotstar

గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. సంతాన యాగం నేపథ్యంలో బామ్మ సుశీలమ్మ ఎంట్రీ ఇవ్వడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఇంట్లో జరుగుతున్న పరిణామాలను గమనించిన ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. వచ్చి రాగానే ప్రభావతి - కోడలు మధ్య జరుగుతున్న వాగ్వాదం చూసి షాక్ అయిన సుశీలమ్మ అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని పట్టుబట్టింది. ఈ సమయంలో బాలు పరిస్థితిని చాకచక్యంగా హ్యాండిల్ చేశాడు. 'అది పెద్ద కథ బామ్మ' అంటూ కవర్ చేస్తాడు. అప్పటివరకు జరిగిన పందెం విషయాన్ని వెల్లడిస్తూ, ప్రభావతి ఆ పందెంలో ఓడిపోయిందని తెలిపాడు. అంతేకాదు, 'రేపటి నుంచి ప్రభావతి పూలు అమ్మాలి' అని కీలక ప్రకటన చేయడంతో ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ నిర్ణయం విన్న ప్రభావతి షాక్‌కు గురై మాటరాని స్థితిలో నిలిచిపోయింది.

ఇదిలా ఉంటే, సుశీలమ్మకు ఇంట్లో జరుగుతున్న ప్రతి అంశం తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఆమె నేరుగా బాలు దగ్గరకు వెళ్లి శృతి - మీనా గొడవకు అసలు కారణం ఏమిటని ప్రశ్నించింది. అప్పుడు బాలు శాంతంగా జరిగిన విషయాన్ని వివరించాడు. మీనా తన తెలివితో వ్యవహరించిన తీరు గురించి చెప్పగా, సుశీలమ్మ ఆనందంతో మురిసిపోయింది. 'పెళ్లయిన కొత్తలో ఈ అమ్మాయిని చూసి నా కోడలికి తగ్గట్టు ఉండదేమో అనుకున్నా... కానీ ఇప్పుడు అత్తకు తగ్గ కోడలిగా మారింది' అంటూ మీనాను ప్రశంసించింది.

మరోవైపు ప్రభావతి మాత్రం పందెంలో ఓడిపోయిన బాధతో కలవరపడుతోంది. ఆ టెన్షన్‌లోనే ఆమెకు ఒక భయంకరమైన కల వస్తుంది. తాను నిజంగానే పూల షాపు పెట్టుకుని పూలు అమ్ముతున్నట్లు, కస్టమర్లను సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడుతున్నట్లు కలగంటుంది. కస్టమర్లు ప్రశ్నలు అడుగుతుంటే తడబడిపోతూ అవమానానికి గురవుతున్నట్లు అనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. కల అని తెలిసినా ప్రభావతి మనసులో భయం పోదు. 'బాలు గాడు నిజంగానే నన్ను పూలు అమ్మిస్తాడు' అని ఫిక్స్ అయి మరింత ఆందోళనకు గురవుతుంది.

మరుసటి రోజు పూజ కోసం ఇంట్లో అందరూ ఉత్సాహంగా సిద్ధమవుతారు.యాగానికి బయలుదేరే వేళలో బాలు మరోసారి పందెం విషయాన్ని ప్రస్తావిస్తాడు. తన తల్లి ప్రభావతి పందెంలో ఓడిపోయిందని గుర్తుచేస్తూ, 'ఓడిపోయినవారు మాట నిలబెట్టుకోవాలి'అంటూ పూలు అమ్మాలని గట్టిగా పట్టుబడతాడు. ఆశ్చర్యకరంగా ఇంట్లో ఉన్నవాళ్లంతా కూడా మీనాకు మద్దతుగా నిలుస్తారు. చేసేది ఏమీ లేక ప్రభావతి తలపై పూల బుట్ట పెట్టుకుని 'పూలమ్మా పూలు...' అంటూ అరుస్తూ బయటకు రావాల్సి వస్తుంది. ఈ సన్నివేశం ఇంట్లో అందరినీ నవ్వుల్లో ముంచేస్తుంది.

అయితే బాలు ఇక్కడితో ఆగకుండా, ఇకపై ప్రతిరోజూ పూలు అమ్మాల్సిందే అని చెప్పడంతో ప్రభావతి షాక్‌కు గురవుతుంది. 'నేను ఏమిటీ ఇలా?' అని ప్రశ్నించగా, సత్యం గట్టిగా సమాధానం ఇస్తాడు. 'ఒకవేళ మీనా ఓడిపోయి ఉంటే, ఆమెను వంటింట్లో కుందేలులా మార్చేసేవారు కదా!' అంటూ ప్రభావతికి అర్థం అయ్యేలా మాట్లాడుతాడు. ఇంట్లో అందరూ మీనాకు మద్దతు ఇవ్వడంతో ప్రభావతి తలవంచాల్సి వస్తుంది.

అయితే మీనా మాత్రం పెద్ద మనసుతో స్పందిస్తుంది. 'అవసరం లేదు అత్తయ్య... బాలు సరదాగా ఆట పట్టించడానికి ఇలా చేశాడు'అంటూ విషయాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో బాలు చెప్పిన మాటలు ఎపిసోడ్‌కి హైలైట్‌గా నిలుస్తాయి. 'మనము చేసే ప్రతి పనికీ విలువ ఉంటుంది. అన్ని వృత్తులూ సమానమే. పని చిన్నది పెద్దది అన్న తేడా లేదు... చేసే ప్రతి పని దైవం లాంటిది' అంటూ ప్రభావతికి గుణపాఠం చెప్తాడు.

అనంతరం అందరూ కలిసి యాగం కోసం మీనాక్షి ఏర్పాటు చేసిన ఫామ్ హౌస్‌కు బయలుదేరుతారు. అక్కడ మీనాక్షి ఇచ్చే బిల్డప్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేస్తుంది. ఫామ్ హౌస్‌ చూసి బాలు 'చాలా బాగుంది" అనగా, మీనాక్షి వెంటనే 'ఇది మా ఫ్రెండ్‌ది... ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు ఫారెన్ నుంచి తెప్పించిందే' అంటూ గొప్పలు చెప్పడం మొదలుపెడుతుంది. అయితే ప్రభావతి మధ్యలోనే ఆపి 'మరోసారి ఫామ్ హౌస్ మా ఫ్రెండ్‌ది అని చెప్పకూడదు'అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో మీనాక్షి తన స్టైల్ మార్చి మరింత హాస్యాన్ని పంచుతుంది.

ఒకవైపు యాగానికి ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు కొత్త ట్విస్ట్ మొదలవుతుంది. గుణ విద్యకు ఫోన్ చేసి రోహిణితో వెంటనే మాట్లాడాలని అడుగుతాడు. విద్య పరుగెత్తుకుంటూ వెళ్లి రోహిణికి విషయం చెబుతుంది. వెంటనే రోహిణి గుణకు కాల్ చేస్తుంది. ఈ సమయంలో గుణ స్పష్టంగా చెప్పేస్తాడు. 'ఈరోజు ఏమైనా చేసి బాలు ఫోన్ నుంచి వీడియో కావాలి. లేదంటే దినేష్ విషయం నేను పట్టించుకోను' అని హెచ్చరిస్తాడు. దీంతో రోహిణి కూడా ఆవేశపడకుండా, 'ఈరోజు కచ్చితంగా బాలు ఫోన్ నుంచి వీడియో తీసుకుంటాను' అంటూ హామీ ఇస్తుంది. ఇలా యాగం వేడుకల మధ్య మరో కుట్ర పుట్టుకొస్తోంది. రోహిణి బాలు ఫోన్‌ను చేజిక్కించుకునే ప్లాన్ వేస్తుంది.

పూజ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుండగా ఇంట్లో ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇదే సమయంలో మీనాక్షి వచ్చి బాలును 'పూల గంప ఇవ్వు' అని అడుగుతుంది. అందరూ పూల బుట్ట తీసుకొస్తాడని అనుకుంటుండగా, బాలు మాత్రం తనదైన స్టైల్‌లో ట్విస్ట్ ఇస్తాడు. పూలకు బదులుగా మీనాను అమాంతం ఎత్తుకుని వచ్చి మీనాక్షి ముందు దించేస్తాడు. ఈ పనికి అక్కడున్న వారంతా షాక్ అవుతారు.
'ఇలా ఎందుకు చేశావు?'అని మీనాక్షి ప్రశ్నించగా, బాలు చిలిపిగా 'నువ్వే కదా పూలగంప అన్నావ్.. అందుకే తీసుకొచ్చాను' అంటూ సరదాగా క్లారిటీ ఇస్తాడు.

ఇంతలో ప్రభావతి కూడా పూల కోసం వస్తుంది. ఆమె గంపను పట్టుకోగానే బాలు 'పూలమ్మా పూలు...'అంటూ ఆట పట్టిస్తాడు. ఇప్పటికే పందెం విషయంలో మనసులో మంట పెట్టుకున్న ప్రభావతి చిరాకుతో పూల గంపను అక్కడే పడేసి వెళ్లిపోతుంది. అదే సమయంలో సుశీలమ్మ వచ్చి 'నా మాట విలువలేదా? పూలు తీసుకురమ్మంటే ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నావా?' అంటూ ప్రభావతిపై చురకలంటిస్తుంది. చేసేది లేక ప్రభావతి మళ్లీ పూలు తీసుకుని రావాల్సి వస్తుంది.

అయితే ఈ హాస్య వాతావరణం మధ్య ఒక్కసారిగా సీరియస్ మలుపు తిరుగుతుంది. సుశీలమ్మ రోహిణిని పిలిచి, 'ముందు గర్భస్రావం జరిగింది కదా... ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు?' అని ప్రశ్నిస్తుంది. ఈ మాట విన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. 'ఈ విషయం ఎవరు చెప్పారు?' అంటూ మీనా వైపు అనుమానంగా చూస్తుంది. రోహిణి కూడా తనలోనే 'ఈ విషయం మీనా చెప్పి ఉండొచ్చు' అని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో ప్రభావతి కోపంతో మీనాపై నోరు పడేస్తుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండగా సత్యం మధ్యలో కలగజేసుకుని అసలు విషయాన్ని బయటపెడతాడు.

'ఆ విషయం నేనే మా అమ్మకు చెప్పాను' అని స్పష్టంగా చెబుతాడు. దీనిపై ప్రభావతి 'ఇంత చిన్న విషయాన్నీ మీ అమ్మకు చెప్పాలా?'అంటూ ప్రశ్నించగా, సత్యం భావోద్వేగంగా స్పందిస్తాడు. 'మా అమ్మతో నాకు దూరం లేదు. మన ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఆమెతో పంచుకుంటాను. కష్టం వస్తే బాధపడుతుంది.. సంతోషం వస్తే ఆనందపడుతుంది. తల్లి-కొడుకుల మధ్య అంతరాలు ఉండకూడదు' అంటూ తన తల్లిపై ఉన్న అనుబంధాన్ని వెల్లడిస్తాడు. ఈ మాటలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది.

యాగం మధ్యలో వాతావరణం మళ్లీ ఉద్రిక్తంగా మారుతుంది. సుశీలమ్మ ప్రభావతిని ఉద్దేశించి 'ఇలాంటి విషయాలు ముందే తెలిసి ఉంటే ఇంత నిర్లక్ష్యం జరిగేదా?' అంటూ చురకలంటిస్తుంది. ఆ తర్వాత రోహిణిని దగ్గరకు పిలిచి, ' మరోసారి ప్రెగ్నెన్సీ రావాలంటే డాక్టర్ల సలహా తప్పనిసరి. లేదంటే గర్భం నిలవడం కష్టం. ఈ యాగానికి నేను నాకు తెలిసిన డాక్టర్‌ను కూడా పిలిచాను. ఆమె నిన్ను పరీక్షించి సరైన సూచనలు ఇస్తుంది' అంటూ షాకింగ్ న్యూస్ చెబుతుంది. ఈ మాటలు విన్న రోహిణి ఒక్కసారిగా కంగారుపడుతుంది. ఇప్పటికే ఇంట్లో ఎన్నో సమస్యలు తలెత్తుతుండగా, ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయం మరో పెద్ద టెన్షన్‌గా మారుతుందేమోనని ఆందోళన చెందుతుంది. 'ఇది బయటపడితే ఏమవుతుందో?'అన్న భయంతో తల పట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే మరోవైపు కొత్త ట్విస్ట్ మొదలవుతుంది. బాలు తన ఫోన్‌లో బ్యాటరీ తక్కువగా ఉందని గమనించి ఛార్జింగ్‌కు పెడతాడు. ఈ విషయాన్ని రోహిణి గమనిస్తుంది. అందరూ పూజ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో, ఎవరూ చూడనట్లు బాలు ఫోన్‌ను మెల్లగా తీసేసుకుంటుంది. బాలు మాత్రం ఫోన్ పెట్టిన విషయాన్ని మర్చిపోయి యాగం ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటాడు. కొద్ది సేపటి తర్వాత మీనా వచ్చి వంట ఏర్పాట్ల గురించి అడుగుతుంది. బాలు ఆ బాధ్యత రాజేష్‌కు అప్పగించానని చెబుతాడు. 'ఒక్కసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకో' అని మీనా చెప్పడంతో బాలుకు ఫోన్ ఛార్జింగ్‌కు పెట్టిన విషయం గుర్తుకొస్తుంది. వెంటనే వెళ్లి చూసే సరికి అక్కడ ఫోన్ కనిపించదు. ఒక్కసారిగా షాక్ అవుతాడు.

మీనా ఫోన్ నుంచి తన నంబర్‌కు కాల్ చేస్తాడు. అయితే రోహిణి చేతిలో ఉన్న ఫోన్ మోగుతుంటే, ఆమె కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటుంది. దీంతో బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు. 'ఇది మనోజ్- ప్రభావతి ప్లాన్ అయి ఉండొచ్చు' అని అంటాడు. వెంటనే మీనా అడ్డుకుని, అనవసరంగా ఎవరి మీదా నిందలు వేయకండి. ముందు ఫోన్ వెతుకుదాం అని సమాధానంగా చెబుతుంది. ఇద్దరూ కలిసి ఫోన్ కోసం వెతుకుతుండగా, ఒక మూలన రోహిణి చేతిలో బాలు ఫోన్ కనిపిస్తుంది. అది చూసిన మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రోహిణి ప్లాన్ బయటపడుతుందా? ఆ ఫోన్‌లో ఉన్న వీడియో ఏంటి? అన్న ఉత్కంఠతో ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X