Gunde Ninda Gudi Gantalu February 27th Episode: సంజూకి బాలు క్షమాపణ.. మౌనిక శుభవార్త.. రోహిణి ప్లాన్ ఫెయిల్..
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. సంతాన యాగం నేపథ్యంలో బామ్మ సుశీలమ్మ ఎంట్రీ ఇవ్వడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఇంట్లో ప్రభావతి-కోడలు మధ్య జరిగిన వాగ్వాదాన్ని చూసి అసలు విషయం తెలుసుకోవాలని ఆమె పట్టుబట్టింది. ఈ సమయంలో బాలు చాకచక్యంగా పరిస్థితిని హ్యాండిల్ చేస్తూ పందెం విషయాన్ని బయటపెట్టాడు. ప్రభావతి ఓడిపోయిందని, రేపటి నుంచి పూలు అమ్మాలని ప్రకటించడంతో ఇంట్లో వాతావరణం మారిపోయింది. ప్రభావతి షాక్‌కు గురై ఆందోళనలో పడింది. రాత్రికి పూలు అమ్ముతున్నట్టు కలగంటూ మరింత భయపడింది.
మరుసటి రోజు యాగం ఏర్పాట్లలో బాలు మళ్లీ మాట నిలబెట్టుకోవాలని చెప్పడంతో, ఇంట్లో వారంతా మీనాకు మద్దతుగా నిలిచారు. చేసేది లేక ప్రభావతి పూల బుట్టతో బయటకు రావాల్సి వచ్చింది. అయితే మీనా పెద్దమనసుతో విషయాన్ని చల్లార్చింది. 'అన్ని వృత్తులూ సమానమే' అన్న బాలు మాటలు ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఫామ్ హౌస్‌లో మీనాక్షి కామెడీ సందడి చేస్తుండగా, మరోవైపు గుణ-రోహిణి కుట్ర మొదలైంది. బాలు ఫోన్‌లో ఉన్న వీడియో కోసం రోహిణి ప్లాన్ వేసింది. ఇదే సమయంలో సుశీలమ్మ రోహిణి గర్భస్రావం విషయం ప్రస్తావించడంతో ఇంట్లో ఉద్రిక్తత పెరిగింది. సత్యం తన తల్లితో అనుబంధాన్ని వెల్లడించడంతో క్షణిక నిశ్శబ్దం నెలకొంది. క్లైమాక్స్‌లో రోహిణి బాలు ఫోన్ దొంగిలించడం, మీనా గమనించడం కథను సస్పెన్స్ మోడ్‌లోకి తీసుకెళ్లింది.

Photo courtesy: Jio Hotstar
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ మొత్తం బొమ్మల కొలువు, సంతాన ప్రాప్తి యాగం చుట్టూ తిరిగింది. ఇంట్లో పూజా వేడుకల సందడి నడుమ బాలు పనుల్లో బిజీగా ఉండి తన ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి మర్చిపోతాడు. ఇదే అవకాశంగా భావించిన రోహిణి.. బాలు ఫోన్‌లో ఉన్న శివ వీడియోను తనకు షేర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఇంతలో మీనా.. బాలు ఫోన్‌కు కాల్ చేయడంతో ఫోన్ కనిపించకపోవడం సస్పెన్స్‌గా మారుతుంది. ఇదే సమయంలో సంజు-మౌనిక పూజకు రావడంతో అందరూ వారిని ఆహ్వానించేందుకు బయటకు వెళ్తారు. ఆ గందరగోళంలో రోహిణి ఫోన్‌ను ఒకచోట రహస్యంగా దాచిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
వాస్తవానికి సంజుకు ఈ పూజకు రావాలనే ఆసక్తి ఉండదు. కానీ మీనా వార్నింగ్ కారణంగా తప్పనిసరిగా వస్తాడు. పాత గొడవలు మరిచిపోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలని మీనా బాలుకు సూచిస్తుంది. చెల్లెలి సంతోషం కోసం బాలు కూడా సంజుతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. అతన్ని ఆహ్వానించే తీరు, పలకరించే స్టైల్ చూసి సంజు ఆశ్చర్యపోతాడు. అయితే సంజు తన అత్తమామలతో మాట్లాడిన తీరు కాస్త కఠినంగా ఉండటంతో సుశీలమ్మ చురకలంటిస్తుంది. 'వయసు చిన్నదైనా మాటలు పెద్దగా ఉన్నాయి' అంటూ అతనికి సూచనలు ఇస్తుంది.
ఇక పూజ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుండగా, కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. ప్రభావతి శిష్యురాలు చేతికి బాలు ఫోన్ చిక్కుతుంది. సిసింద్రీ లాంటి ఆ పిల్ల మాటలతో అందరినీ మాయ చేస్తూ, బాలు ఫోన్‌తో వీడియోలు తీస్తూ యాగం, కొలువు కార్యక్రమం మొత్తాన్ని రికార్డ్ చేస్తుంది. యాగం వేళ కావడంతో ప్రభావతి తన కోడళ్లను త్వరగా రమ్మని పిలుస్తూ అందర్నీ పద్ధతిగా కూర్చోబెట్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఇల్లు మొత్తం భక్తి వాతావరణంతో నిండిపోతుంది. అయితే ఈ సమయంలో రోహిణికి బాలు ఫోన్ విషయం గుర్తుకొస్తుంది. ఫోన్ తిరిగి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పూజ మధ్యలో లేవడానికి ప్రయత్నించగా, ప్రభావతి గట్టిగా ఆపేస్తుంది. 'పూజ మధ్యలో లేవకూడదు' అంటూ ఆర్డర్ వేయడంతో రోహిణి సైలెంట్‌గా కూర్చోవాల్సి వస్తుంది.
తన ప్లాన్ ఆగిపోవడంతో రోహిణి వెంటనే తన స్నేహితురాలు విద్యకు సమాచారం ఇచ్చి, ఫోన్‌పై కన్నేయమని చెబుతుంది. కొద్ది సేపటికి ఆ ఫోన్ ఒక చిన్నారి చేతిలో కనిపించడంతో రోహిణి షాక్ అవుతుంది. విద్య ఆ పిల్ల నుంచి ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించగా, 'ఇది నా ఫోన్... నేను ఎవరికీ ఇవ్వను. మళ్లీ అడిగితే పోలీసులకు ఫోన్ చేస్తా' అంటూ ఆ చిన్నారి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దీంతో విద్య కంగుతిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక పూజను తన బావ సంజు-చెల్లి మౌనిక చేత ప్రారంభించమని బాలు కోరుతాడు. అయితే బాలు అకస్మాత్తుగా మర్యాదగా ప్రవర్తించడం సంజుకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని మౌనికతో చెప్పగా, 'మా అన్నయ్య నిజంగానే మారాడు' అంటూ ఆమె సమాధానం ఇస్తుంది.పూజ కార్యక్రమం సరదాగా సాగుతుంది. బాలు మధ్య మధ్యలో వేసే చిలిపి డైలాగులు, మీనా అడ్డగింపులు నవ్వులు పూయిస్తాయి. ఇలా యాగం విజయవంతంగా పూర్తవుతుంది.
యాగం అనంతరం బాలు తన బావ సంజుకు జ్యూస్ తీసుకెళ్లి ఇస్తాడు. అనుమానంగా చూసిన సంజు 'ఇందులో ఏమైనా కలిపావా?'అని అడగగా, 'నా ప్రేమను కలిపాను బావ' అంటూ బాలు కూల్‌గా సమాధానం ఇస్తాడు. గత విషయాలు మనసులో పెట్టుకోకుండా క్షమించమని చెప్పి జ్యూస్ చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. ఇక యాగం పూర్తి కాగానే ఇంట్లో భోజనాల సందడి మొదలైంది. ప్రభావతి, సత్యం ఇద్దరూ కలిసి సంజు దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా 'భోజన ఏర్పాట్లు అయ్యాయి... రండి' అంటూ ఆహ్వానిస్తారు. ఇష్టం లేకపోయినా సంజు భోజనానికి కూర్చోవాల్సి వస్తుంది. ఇదే సమయంలో మరోవైపు రోహిణి మాత్రం బాలు ఫోన్ కోసం ఆతురంగా వెతుకుతూనే ఉంటుంది.
తన స్నేహితురాలు దివ్యతో మాట్లాడిన రోహిణి, 'పిల్ల దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నావా?' అని అడుగుతుంది. దివ్య ఆశ్చర్యంగా స్పందిస్తూ, 'ఆ చిన్నది సిసింద్రీలా పేలిపోయింది. ఫోన్ ఇవ్వమంటే నన్నే దొంగ అంటూ బెదిరించింది' అని చెబుతుంది. దీంతో ఇద్దరూ కలిసి ఆ చిన్నారిని వెతకడానికి బయలుదేరుతారు. అయితే మధ్యలో ప్రభావతి అడ్డుపడి, 'ఇది మన ఇంటి ఫంక్షన్. నువ్వు పెద్ద కోడలివి... ఇక్కడే ఉండి భోజన ఏర్పాట్లు చూసుకో'అంటూ గట్టిగా ఆదేశిస్తుంది. ఇష్టం లేకున్నా రోహిణి తిరిగి పనుల్లో నిమగ్నమవుతుంది.
ఇక భోజన సమయంలో బాలు సంజుతో అతిగా ప్రేమగా ప్రవర్తిస్తూ దగ్గరుండి వడ్డిస్తాడు. ఆ మార్పు చూసి సంజు అసహనంగా ఫీలవుతాడు. దే సమయంలో రోహిణి-దివ్యలు ఆ చిన్నారి చేతిలోనే బాలు ఫోన్ ఉందని గమనిస్తారు. వెంటనే వెళ్లి అడిగితే, 'దొంగలకు ఫోన్ ఇవ్వను'అంటూ షాక్ ఇస్తుంది. అంతలోనే బాలు వచ్చి ఆ చిన్నారికి ఐస్క్రీమ్ ఇచ్చి చాకచక్యంగా తన ఫోన్ తీసుకుంటాడు. దానికి ఆ పిల్ల ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 'నాకు ఫోన్ కంటే ఐస్క్రీమ్ అంటే ఇష్టం. ముందే ఇచ్చి ఉంటే అప్పుడే ఇచ్చేదాన్ని' అని చెప్పడంతో షాక్ అవుతారు.
బొమ్మల కొలువు పూజ ఘనంగా ప్రారంభమైన ఈ ఎపిసోడ్ పూర్తిగా వినోదం, భావోద్వేగాలతో నిండిపోయింది. పూజలో తాను పాట పాడతానని ప్రభావతి ప్రకటించగానే పక్కనే ఉన్న మీనాక్షి 'గేట్లు మూసేయండి... లేకపోతే రాళ్లు పట్టుకుని వస్తారు' అంటూ సెటైర్ వేయడంతో నవ్వులు పూశాయి. ప్రభావతి మాత్రం తన గొంతు గొప్పదని, 'నా పాట విని మా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు' అంటూ కౌంటర్ ఇచ్చింది. వెంటనే సుశీలమ్మ 'పెళ్లి తర్వాత పాటలు పాడవద్దనే కండిషన్ పెట్టి చేసుకున్నాం' అంటూ మరో చురక అంటుస్తుంది.
అయినా ప్రభావతి వెనక్కి తగ్గకుండా మైక్ పట్టుకుని కర్ణకఠోరంగా ఆలపించడం ప్రారంభించింది. పాట వినలేక అందరూ ఇబ్బంది పడుతుండగా, మీనాక్షి చెవిలో నుంచి రక్తం వచ్చినట్టు నటించడం మరింత కామెడీని పండించింది. ముందే ప్రమాదాన్ని ఊహించిన సత్యం చెవిలో దూది పెట్టుకోవడం హైలైట్. అందరూ 'ఆపు'అని అడిగినా సత్యం మాత్రం 'వన్స్ మోర్'అంటూ అల్లరి చేయడం నవ్వులు తెప్పించింది. చివరికి బాలు రిక్వెస్ట్ చేయడంతో ప్రభావతి కోపంగా మైక్ వదిలేసింది.ఈ సమయంలో మీనా తల్లి పార్వతి, మీనా మంచి గాయని అని చెప్పడంతో అందరూ ఆమెను ప్రోత్సహించారు. మీనా తన శ్రావ్యమైన స్వరంతో పాట పాడగా, బంధువులంతా ఫిదా అయ్యారు. ప్రశంసల వర్షం కురిసింది.
పూజ అనంతరం ప్రసాదం పంచుతూ బాలు తన బావకు ప్రత్యేకంగా తినిపించడం హృద్యంగా నిలిచింది. అప్పుడే మౌనిక కళ్ళు తిరిగి పడిపోవడంతో కాసేపు టెన్షన్ నెలకొంది. అయితే సుశీలమ్మ నాడి చూసి 'శుభవార్త... సత్యం తాత కాబోతున్నాడు' అంటూ మౌనిక గర్భవతి అని ప్రకటించడంతో కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయింది. బాలు సంతోషానికి అవధులు లేకుండా కుటుంబంతో ఫోటోలు దిగాడు. సంజీవ్ మాత్రం తన తండ్రి ప్లాన్ విఫలమైందని బాధపడ్డాడు. మౌనిక వెళ్లే ముందు భవిష్యత్తులో బంధం కొనసాగాలని సరదాగా మాట ఇచ్చుకుంది. రాత్రి మీనా తాటి బెల్లం పాలు తీసుకొచ్చి బాలుతో భవిష్యత్తు పిల్లల గురించి మాట్లాడడం, ప్రేమగా కౌగిలించుకోవడం ఎపిసోడ్‌ను ప్రశాంతంగా ముగించింది.


Click it and Unblock the Notifications











