Gunde Ninda Gudi Gantalu March 5th Episode: దొరికిపోయిన మేకమామ.. రోహిణి గుట్టురట్టు..శివ జీవితంపై గుణ దెబ్బ..

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, కుటుంబ కలహాలు, సెటైర్లు కలగలిపిన ఆసక్తికర మలుపులతో సాగింది. మౌనిక ప్రెగ్నెంట్ అయితే అమ్మవారికి సారే పెట్టి అన్నదానం చేయిస్తానని ప్రభావతి మొక్కుకున్న విషయం తెలిసిందే. ఆ మొక్కు నెరవేర్చే రోజు వచ్చేసరికి మీనాకు పెద్ద పూల ఆర్డర్ రావడంతో ఆమె గుడికి వెళ్లలేకపోయింది. దీనిని అవకాశం గా తీసుకున్న ప్రభావతి, మీనా కావాలనే బాధ్యత తప్పించుకుందని ఇంట్లో అందరి ముందూ విమర్శించింది. అయితే మీనా గుడికి రాకపోయినా పూజా సామగ్రి, దండలు, అన్నదానం ఏర్పాట్లు అన్నీ ముందుగానే చూసుకుని తన స్నేహితురాలి ద్వారా పంపించింది. పంతులు గారు కూడా మీనా ముందే చెప్పిందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బాలు వెంటనే భార్యను పొగిడాడు. అయినా ప్రభావతి మాత్రం తగ్గకుండా మళ్లీ మీనాను తక్కువ చేసింది. ఈ సమయంలో శృతి సెటైర్లతో కౌంటర్ ఇచ్చింది.

గుడిలో సారే పెట్టే ఆచారం గురించి రోహిణికి తెలియకపోవడంతో సత్యం, బాలు చురకలు వేశారు. ఇదే సమయంలో మరో మహిళ వచ్చి మౌనికకు సారే ఇవ్వడం, అది కూడా మీనా ముందే చెప్పి పంపిందని చెప్పడంతో ప్రభావతి నిశ్శబ్దంగా నిలిచిపోయింది. అన్నదానం ఏర్పాట్లు కూడా మీనా ముందే చేయించిందని తెలిసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.ఇక మరోవైపు మనోజ్ వడ్డీ డబ్బులు తీసుకురావడానికి వెళ్లాలని అనగా రోహిణి ముందుకు వచ్చి తానే వెళ్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. ఇదంతా గమనించిన బాలు స్నేహితుడు రాజేష్ అనుమానంతో బాలు కి ఫోన్ చేసి సుగుణమ్మ, చింటూ కనిపించారని చెప్పాడు. దీంతో బాలు అనుమానంతో వారిని వెతుక్కుంటూ బయలుదేరాడు.ఇదే సమయంలో మౌనిక తన భర్త సంజు తనపై వేసిన అనుమానాలను తలుచుకుని బాధపడుతుండగా, తండ్రి సత్యం ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే నిజం చెప్పకుండా మౌనిక పరిస్థితిని సర్దిచెప్పింది. మరోవైపు రోహిణి తన కొడుకు చింటూను కలవగా, అతడు బాలు-మీనాల మంచితనం గురించి చెప్పిన మాటలు ఆమెను భావోద్వేగానికి గురి చేశాయి. ఇదే సమయంలో బాలు ఆ ఇంటి తలుపు తట్టడం కథను ఉత్కంఠభరితంగా ముగించింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 633 March 5th 2026 here is full story

Photo courtesy: Jio Hotstar

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో కథ ఉత్కంఠభరిత మలుపులతో సాగింది. సుగుణమ్మ, చింటూను వెతుకుతూ బాలు విద్య ఇంటి దగ్గరకు చేరుకోవడం కథకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. బాలు కాలింగ్ బెల్ కొట్టే సమయానికి విద్య అప్రమత్తమై వెంటనే రోహిణికి ఫోన్ చేసి, "బాలు మీకోసం వెతుకుతూ ఇంటి వైపు వచ్చాడు" అని హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా కంగారు పడిన రోహిణి, తలుపు తెరవడానికి వెళ్లిన చింటూను వెంటనే వెనక్కు లాగి డోర్ లాక్ చేసేసింది. బాలు పలుమార్లు కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ బయటకు రాకపోవడంతో కిటికీలోంచి చూసాడు. అక్కడ కూడా ఎవరూ కనిపించకపోవడంతో రాజేష్ తప్పుగా సమాచారం ఇచ్చి ఉండొచ్చని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాలు వెళ్లిపోగానే రోహిణి ఊపిరి పీల్చుకుంది.

ఈ సమయంలో సుగుణమ్మ రోహిణిని తీవ్రంగా మందలించింది. 'నువ్వు చేస్తున్న తప్పులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏదో ఒక రోజు ఆ తప్పులకే బలి అవుతావు. ఆ రోజు నిన్ను కాపాడటానికి ఎవరూ రారు'అంటూ హెచ్చరించింది. అంతలోనే మరోసారి కాలింగ్ బెల్ మోగడంతో రోహిణి మళ్లీ కంగారు పడింది. అయితే ఈసారి వచ్చినది విద్య. ఇంట్లోకి వచ్చిన విద్య, 'నువ్వు ఎక్కడా కనిపించకపోతే మన పని అయిపోయింది అనుకుని చాలా టెన్షన్ పడ్డాను'అని చెప్పింది. దానికి రోహిణి కూడా, 'నువ్వు ఫోన్ చేయడం ఒక్క నిమిషం ఆలస్యం అయినా ఈరోజే మనం దొరికిపోయేవాళ్లం'అంటూ భయంతో చెప్పింది.

ఇక మరోవైపు గుడిలో మేక మామ పొర్లు దండాలు పెడుతూ ఉండగా పొరపాటున ప్రభావతిని ఢీకొట్టాడు. దీంతో ప్రభావతి కింద పడిపోగా, ఆమెను లేపడానికి మేక మామ ప్రయత్నించాడు. ఒక్కసారి ప్రభావతి ముఖం చూసిన వెంటనే అతను కంగారు పడ్డాడు. ప్రభావతి కూడా వెంటనే ప్రశ్నల వర్షం కురిపిస్తూ 'మీరు ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఏం చేస్తున్నారు?' అంటూ నిలదీసింది. అయితే మేక మామ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా నిలిచిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు కూడా 'ఇండియాలో మీకు రోహిణి తప్ప ఇంకెవరు లేరు కదా... మరి ఎందుకు వచ్చారు?' అంటూ ప్రశ్నలు వేయడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది.

అదే సమయంలో ప్రభావతి రోహిణికి ఫోన్ చేసి 'నీ మలేషియా మామయ్య గుడికి వచ్చాడు'అని చెప్పడంతో రోహిణి గుండెల్లో గుబులు మొదలైంది. వెంటనే హడావుడిగా గుడి వైపు పరుగులు పెట్టింది. ఇదే సమయంలో బాలు మేక మామ దగ్గరికి వెళ్లి తన స్టైల్‌లో ప్రశ్నలు మొదలుపెట్టాడు. 'నువ్వు నిజంగా రోహిణి మేనమామ కాదు కదా? నువ్వు ఇండియాలోనే ఉంటావు కదా? మటన్ కొట్టు నడుపుతున్నావు కదా?'అంటూ వరుసగా ప్రశ్నలు సంధించాడు. అయినా మేక మామ మాత్రం నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోయాడు. చివరకు గుడిలో నుంచి తీసుకొచ్చిన హారతిపై ప్రమాణం చేయమని బాలు ఒత్తిడి చేయడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

గుడిలో మేక మామ అసలు విషయం బయటపడబోతున్న వేళ సరిగ్గా అదే సమయంలో రోహిణి ఎంట్రీ ఇవ్వడం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. బాలు మేక మామను హారతి మీద ప్రమాణం చేయమని ఒత్తిడి చేస్తున్న సమయంలో రోహిణి అక్కడికి చేరుకుని 'ఏం చేస్తున్నావ్ బాలు?'అంటూ గట్టిగా ప్రశ్నించింది. దీంతో మేక మామకు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టైంది. బాలు చేతిలో చిక్కుకున్నాననే భయం తొలగిపోయి, అతని ముఖంలో కాస్త ధైర్యం కనిపించింది.

ఈ సమయంలో ప్రభావతి కూడా ఆశ్చర్యంగా మాట్లాడుతూ, "నీ మామయ్య వచ్చాడని మాకు చెప్పనేలేదు. నువ్వు తప్ప ఆయనకు ఇక్కడ ఇంకెవరు లేరు కదా? పైగా ఆయన మౌనవ్రతం పట్టిన వ్యక్తిలా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు" అని చెప్పింది. ఈ మాటలు విన్న వెంటనే రోహిణికి ఒక ఆలోచన వచ్చింది. మాణిక్యం ఇప్పటివరకు నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉన్నాడని గ్రహించింది. వెంటనే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది.

అప్పుడే రోహిణి రెచ్చిపోయినట్టు నటిస్తూ, 'మా మామయ్యను ఇలా అవమానిస్తారా? ఆయన రెండు రోజుల క్రితమే ఫోన్ చేసి వస్తున్నానని చెప్పారు. కానీ మనం బొమ్మల కొలువులో బిజీగా ఉండటంతో మీకు చెప్పలేకపోయాను. పైగా మా మామయ్యకు ప్రతి సంవత్సరం మౌనవ్రతం చేసి గుళ్లు తిరగడం అలవాటు'అని చెప్పి పరిస్థితిని కవర్ చేసేందుకు ప్రయత్నించింది. ఎక్కువసేపు అక్కడ ఉంటే నిజం బయటపడే ప్రమాదం ఉందని భావించిన రోహిణి వెంటనే మాణిక్యం కోసం ఆటో బుక్ చేసి పంపించేందుకు ప్రయత్నించింది.

ఆటోలో కూర్చోబోయే సమయంలో మాణిక్యం మాత్రం రోహిణిని హెచ్చరించాడు. 'ఏంటమ్మా ఇది? పది నిమిషాల్లోనే నాకు చుక్కలు కనిపించాయి. నువ్వు మాత్రం వరుసగా అబద్ధాలు చెబుతున్నావ్. నీ జీవితం చూస్తే మొత్తం తప్పులతో నిండిపోయినట్టుంది. జాగ్రత్త... ఏదో ఒక రోజు నీ నిజం బయటపడుతుంది. అప్పుడు దేవుడే నిన్ను క్షమించడు. ఇప్పటికైనా నిజం చెప్తే వాళ్లు క్షమించే అవకాశం ఉంటుంది. లేకపోతే నీ జీవితం రోడ్డుపాలవుతుంది' అని గట్టిగా చెప్పాడు. ఆ మాటలు రోహిణికి చెంపపెట్టు లాగా తగిలాయి.

ఇక మరోవైపు రోహిణిని అనుమానంతో ఫాలో అయిన బాలు, గుడిలో అందరూ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో 'నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్లావు?' అని ప్రశ్నించాడు. దానికి రోహిణి 'వడ్డీ డబ్బుల కోసం విద్య ఇంటికి వెళ్లాను' అని సమాధానం ఇచ్చింది. వెంటనే బాలు 'నేను కూడా అటు వచ్చాను... మరి కనిపించలేదే?'అని అడగడంతో రోహిణి వెంటనే 'విద్య డబ్బులు ఇవ్వగానే వచ్చేశాను. కావాలంటే ఆ విషయాన్ని మీ అన్నయ్యను అడుగు'అని చెప్పింది. అప్పుడు అక్కడికి వచ్చిన మనోజ్ కూడా 'అవును... ఆ విషయం నిజమే'అంటూ ఆమెకు సపోర్ట్ ఇచ్చాడు. అయినప్పటికీ రోహిణి మాటల్లో ఏదో తేడా ఉందని భావించిన బాలు, 'ఎన్నటికైనా నిజం బయటపడుతుంది'అనే అనుమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కథ మరింత ఉత్కంఠగా మారింది.

మరుసటి రోజు బాలు, మీనాను తీసుకుని ఆమె తల్లిగారి ఇంటికి వెళ్లాడు. వారిద్దరినీ ఒక్కసారిగా చూసిన మీనా చెల్లెలు షాక్ అవుతూ 'చెప్పా పెట్టకుండా ఇలా వచ్చారు అంటే ఏదైనా గొడవ జరిగిందా?' అంటూ వరుసగా ప్రశ్నలు వేసింది. అయితే బాలు వెంటనే స్పందిస్తూ 'నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు. అనవసరంగా కంగారు పడకు, అన్నీ బాగానే ఉన్నాయి' అని చెప్పి ఆమెను నమ్మబలికాడు. ఇదే సమయంలో మీనా మాట్లాడుతూ, తాము చింటూను దత్తత తీసుకోవాలని ఆలోచిస్తున్నామని చెప్పింది. అయితే బొమ్మల కొలువు సమయంలో చింటూ అమ్మమ్మ తమతో అవమానకరంగా మాట్లాడిందని కూడా వివరించింది. ఈ విషయం విన్న మీనా చెల్లెలు మాత్రం తీవ్రంగా స్పందించింది. 'మీరు అనవసరంగా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. మీకు పిల్లలు పుట్టవని ఎవరైనా చెప్పారా? ఎందుకు దత్తత గురించి ఆలోచిస్తున్నారు?' అంటూ కాస్త గట్టిగానే మాట్లాడింది.

ఇంతలోనే శివ డల్లుగా ఇంటికి చేరుకున్నాడు. తన బావ అయిన బాలు ఇంట్లో ఉన్నా పట్టించుకోకుండా నేరుగా లోపలికి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అయితే అతని ముఖంలో బాధ కనిపించడంతో మీనా వెంటనే 'ఎందుకు ఇలా ఉన్నావు? ఏం జరిగింది?'అని ప్రశ్నించింది. అప్పుడు శివ తన బాధను బయటపెట్టాడు. 'నన్ను కాలేజీ నుంచి డీబార్ చేశారు. ఎగ్జామ్స్ కూడా రాయకుండా చేశారు'అని చెప్పి తీవ్రంగా బాధపడాడు. ఎందుకని అడగగా, 'నా బ్యాగ్‌లో నాకు తెలియకుండా ఎవరో మద్యం సీసా పెట్టారు. ఆ విషయం క్లాస్ టీచర్‌కు తెలిసి, తర్వాత ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్లింది. ప్రిన్సిపల్ నన్ను కొట్టి కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు'అని చెప్పాడు.

ఈ విషయం విన్న బాలు కాస్త కఠినంగా స్పందించాడు. 'నేను ముందే చెప్పాను... పాముతో సహవాసం చేస్తే ఇదే జరుగుతుంది. గుణ దగ్గర పని చేస్తున్నంత వరకు నువ్వు అతని చేతిలోనే ఉండేవాడివి. ఇప్పుడు వాడి దగ్గర పని మానేసి కాలేజీకి వెళ్లడం అతనికి నచ్చలేదు. అందుకే నిన్ను కాలేజీ నుంచి డీబార్ చేయించాడు. ఇదంతా గుణ ప్లాన్' అని బాలు స్పష్టంగా చెప్పాడు. అయితే శివ మాత్రం కోపంతో 'వాడు సంగతి నేను చూసుకుంటాను' అంటూ పొగరుగా స్పందించాడు. వెంటనే బాలు అతన్ని ఆపుతూ 'ఇలాంటి విషయాల్లో నువ్వు పడకూడదు. నేను చూసుకుంటాను' అని చెప్పి బావమరిదికి భరోసా ఇచ్చాడు.

ఇక మరోవైపు గుణ తన ప్లాన్ సక్సెస్ అయిందని తెలుసుకుని ఆనందపడుతున్నాడు. శివను కాలేజీ నుంచి డీబార్ చేశారని తెలిసి తన గ్యాంగ్‌కు పెద్ద పార్టీ ఇస్తానంటూ సంబరపడాడు. అయితే అదే సమయంలో బాలు ఆ వైపు వస్తున్నాడని గమనించిన ఒక వ్యక్తి గుణను హెచ్చరించాడు. వెంటనే గుణ భయంతో ప్రాణాలు చేతిలో పెట్టుకుని వెనుక ద్వారం ద్వారా పారిపోయాడు. బాలు అక్కడికి చేరుకునేసరికి అతను తప్పించుకున్నాడు.

అక్కడ ఉన్న గుణ అనుచరులను బాలు తీవ్రంగా ప్రశ్నించాడు. 'శివను కాలేజీ నుంచి డీబార్ చేయించింది మీరేనని నాకు తెలుసు. ఎక్కడ ఉన్నాడు గుణ?' అంటూ గట్టిగా అడిగాడు. అయితే గుణ మనుషులు మాత్రం తమకు ఏమీ తెలియదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలు 'గుణ నా చేతికి చిక్కితే ప్రాణాలతో ఉండడు... జాగ్రత్త'అంటూ తనదైన మాస్ స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కథలో గుణ-బాలు మధ్య ఘర్షణ మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X