Gunde Ninda Gudi Gantalu March 6th Episode: బాలు అరెస్ట్, ఏడేళ్లు జైలు శిక్ష.. అయోమయంలో మీనా.. ప్రభావతి చిచ్చు

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరిత మలుపులతో సాగింది. సుగుణమ్మ, చింటూను వెతుకుతూ బాలు విద్య ఇంటి వద్దకు చేరుకోవడం కథలో కీలక ఘట్టంగా నిలిచింది. అయితే బాలు కాలింగ్ బెల్ కొట్టేలోపే విద్య రోహిణికి ఫోన్ చేసి హెచ్చరించడంతో, రోహిణి వెంటనే చింటూను వెనక్కు లాగి తలుపు లాక్ చేసింది. బాలు పలుమార్లు బెల్ కొట్టినా ఎవరూ బయటకు రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో రోహిణి ఊపిరి పీల్చుకుంది.ఇక గుడిలో మరో డ్రామా జరిగింది. మేక మామ పొరపాటున ప్రభావతిని ఢీకొట్టడంతో అనుమానాలు మొదలయ్యాయి. బాలు మేక మామపై అనుమానం పెంచుకుని వరుసగా ప్రశ్నలు సంధించాడు. హారతి మీద ప్రమాణం చేయమని ఒత్తిడి చేస్తున్న సమయంలో రోహిణి అక్కడికి చేరుకుని పరిస్థితిని కవర్ చేసింది. తన మలేషియా మామయ్య ప్రతి సంవత్సరం మౌనవ్రతం చేసి గుళ్లు తిరుగుతాడని చెప్పి అందరినీ నమ్మించింది. అయితే మాణిక్యం మాత్రం రోహిణికి నిజం చెప్పమని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇదిలా ఉండగా బాలు, మీనాతో కలిసి ఆమె తల్లిగారి ఇంటికి వెళ్లాడు. అక్కడ మీనా చెల్లెలు వారిని చూసి ఆశ్చర్యపోయింది. ఇదే సమయంలో శివ కాలేజీ నుంచి డీబార్ అయ్యాడని చెప్పడంతో ఇంట్లో ఉద్రిక్తత పెరిగింది. గుణ తన బ్యాగ్‌లో మద్యం సీసా పెట్టించి తనను ఇరికించాడని శివ వెల్లడించాడు. దీంతో బాలు గుణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని వదిలిపెట్టనని హెచ్చరించాడు. మరోవైపు గుణ తన ప్లాన్ సక్సెస్ అయిందని పార్టీకి సిద్ధమవుతుండగా, బాలు అక్కడికి వస్తున్నాడని తెలిసి భయంతో పారిపోయాడు. గుణ అనుచరులను బాలు తీవ్రంగా హెచ్చరిస్తూ "గుణ నా చేతికి చిక్కితే ప్రాణాలతో ఉండడు" అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రాబోయే ఎపిసోడ్లలో బాలు-గుణ మధ్య ఘర్షణ మరింత పెరగనున్నట్టు సంకేతాలు కనిపించాయి.

Gunde Ninda Gudi Gantalu serial episode 634 March 6th 2026 here is full story

Photo courtesy: Jio Hotstar

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో కథ ఆసక్తికర మలుపులతో ముందుకు సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలో శృతి పేరుతో ఇంటికి ఒక పార్సిల్ వస్తుంది. అయితే ఆ పార్సిల్‌ను ముందుగా ప్రభావతి తీసుకుంటుంది. అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తితో బాక్స్‌ను ఓపెన్ చేయాలని నిర్ణయిస్తుంది. ఈ సమయంలో మీనా మాత్రం అడ్డుకుంటూ, 'ఇది శృతి వస్తువు. ఆమె అనుమతి లేకుండా బాక్స్ తెరవడం మంచిది కాదు. ఈ విషయం ఆమెకు తెలిసితే ఫీలవుతుంది' అని ముందుగానే హెచ్చరిస్తుంది. అయినప్పటికీ ప్రభావతి మీనా మాటలను పట్టించుకోకుండా పార్సిల్‌ను తెరుస్తుంది. బాక్స్‌ను ఓపెన్ చేయగానే అందులో హెడ్‌ఫోన్స్ కనిపిస్తాయి. వాటిని చూసి ప్రభావతి చాలా ఎగ్జైట్ అవుతుంది. 'ఇలాంటివి నాకు కూడా ఉంటే పాటలు వింటూ ఎంజాయ్ చేసేదాన్ని' అంటూ వాటిని వెంటనే తలకు పెట్టుకుని ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాటిని ఎలా ఆన్ చేయాలో, ఎలా ఉపయోగించాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంది. మీనా సహాయం చేయడానికి ప్రయత్నించినా ప్రభావతి ఆమె మాటలు వినకుండా హెడ్‌ఫోన్స్‌లోని బటన్లను ఇష్టం వచ్చినట్లు నొక్కుతూ ఉంటుంది.

అదే సమయంలో అక్కడికి శృతి వస్తుంది. తన హెడ్‌ఫోన్స్ ప్రభావతి చేతిలో ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే 'ఇవి ఎవరివి? మీరు ఎప్పుడు కొన్నారు?' అని ప్రశ్నిస్తుంది. దానికి ప్రభావతి ఆనందంగా 'ఇవి నీవే. ఇప్పుడే పార్సిల్ వచ్చింది కాబట్టి నేనే తెరిచాను'అని చెప్పడంతో శృతి మరింత కోపానికి గురవుతుంది. 'నా పర్మిషన్ లేకుండా నా వస్తువులను ఎలా ముట్టుకుంటారు? కనీసం అడగాలని కూడా అనిపించలేదా? మా అమ్మ కూడా నా వస్తువులను అడగకుండా ముట్టుకోదు. అలాంటిది మీరు ఇలా చేయడం సరైనది కాదు' అంటూ ప్రభావతిని హెచ్చరిస్తుంది. వెంటనే ఆమె చేతిలో ఉన్న హెడ్‌ఫోన్స్‌ను లాక్కొని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనతో ప్రభావతి కొంతసేపు మాటరానిదిగా నిలిచిపోతుంది.

అయితే తన కోపాన్ని అక్కడితో ఆపకుండా ప్రభావతి మీనా మీదకు మళ్లిస్తుంది. అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లుగా తన కోపాన్ని మీనా మీద చూపుతుంది. ఈ సమయంలో మీనా మాత్రం ప్రశాంతంగా 'నేను ముందే చెప్పాను కదా... శృతి ఫీలవుతుందని'అని చెబుతుంది. తర్వాత ప్రభావతి తన కుమారుడు రవిని బయటకు తీసుకువెళ్లి శృతి ప్రవర్తన గురించి మాట్లాడుతుంది. 'నీ భార్యను కంట్రోల్‌లో పెట్టుకో. లేకపోతే బాలు లాగా నువ్వూ నీ భార్య వెంటే తిరగాల్సి వస్తుంది' అంటూ హెచ్చరిస్తుంది. శృతి రోజురోజుకీ మితిమీరిపోతోందని, దానికి మీనా ప్రభావం కూడా కారణమని చెబుతూ రవికి సూచనలు ఇస్తుంది. ఈ మాటలు విన్న రవి కొంత ఆలోచనలో పడతాడు.

ఈ పరిస్థితిని గమనించిన మీనా రవితో మాట్లాడుతుంది. 'అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు. శృతి మనస్తత్వం నాకు తెలుసు. తన వస్తువులను పర్మిషన్ లేకుండా ముట్టుకున్నారని ఫీలై అలా మాట్లాడింది. ఆమెకు ఎలాంటి దురుద్దేశం లేదు. అమ్మాయి చాలా తెలివైనది. నీ అమ్మ మాటలు పట్టుకుని మీ సంసారాన్ని పాడు చేసుకోవద్దు' అంటూ అతనికి సలహా ఇస్తుంది. మీనా మాటలు విన్న రవి కొంత శాంతించి శృతి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు.

ఇక మరోవైపు కథలో బాలు ట్రాక్ కూడా ఆసక్తికరంగా సాగుతుంది. శివను కాలేజీ నుంచి డీబార్ చేయించిన గుణను ఎలా అయినా పట్టుకోవాలని బాలు నిర్ణయించుకుంటాడు. తన బామ్మర్ది భవిష్యత్తు కోసం గుణ ఆచూకీ కోసం చాలా చోట్ల వెతుకుతాడు. అయితే ఎంత ప్రయత్నించినా గుణ ఎక్కడ ఉన్నాడో మాత్రం తెలుసుకోలేడు. దీంతో కొంత నిరాశ చెందిన బాలు మరో మార్గం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఈ సమయంలో బాలు మీనాకు ఫోన్ చేసి ఒక కొత్త ప్లాన్ గురించి చెబుతాడు. శివ సమస్యను పరిష్కరించాలంటే నేరుగా కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్‌ను కలవాలని నిర్ణయించుకుంటాడు. బాలు చెప్పిన ప్లాన్‌కు మీనా కూడా అంగీకరిస్తుంది. దీంతో ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్‌ను నేరుగా కలిసి మాట్లాడాలని ప్రయత్నిస్తారు.

కానీ అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి ఆశించినట్లు ఉండదు. బాలు, మీనా ప్రిన్సిపల్‌ను కలవడానికి ప్రయత్నించినా ఆయన మాత్రం వారిని పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. వారితో మాట్లాడటానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా తన పనుల్లోకి వెళ్లిపోవడంతో బాలు, మీనా కొంత అసహాయంగా అనిపించుకుంటారు. ఈ సమయంలో అక్కడ ఉన్న ఓ ఫ్యూన్ సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అతనితో మాట్లాడి ప్రిన్సిపల్ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఫ్యూన్ చెప్పిన విషయాలు వారిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రిన్సిపల్‌కు ఒకే ఒక్క కూతురు ఉండేదని, ఎంతో ప్రేమగా పెంచి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాడని చెబుతాడు. కానీ అల్లుడికి తాగుడు అలవాటు ఉండటం వల్ల వారి సంసారం మూడు నెలల్లోనే పాడైపోయిందని వెల్లడిస్తాడు.

దాంతో ప్రిన్సిపల్ కూతురు తిరిగి తండ్రి ఇంటికే వచ్చి ఉంటోందని చెబుతాడు. ఆ సంఘటన తర్వాత ప్రిన్సిపల్‌కు మద్యం తాగే వారంటే అసహ్యం పెరిగిందని కూడా వివరిస్తాడు. అందుకే తాగుడు అలవాటు ఉన్నవారిని ఆయన అసలు సహించరని ఫ్యూన్ చెప్పడంతో బాలు, మీనా పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటారు. అయితే మరోవైపు ప్రిన్సిపల్ గురించి మంచి విషయాలు కూడా చెబుతాడు. చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఆయన ఎంతో ప్రోత్సహిస్తారని, అవసరమైతే వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తారని వెల్లడిస్తాడు. ఈ విషయాలు విన్న బాలు, మీనా ప్రిన్సిపల్ మనసు ఎలా ఉందో అర్థం చేసుకుంటారు. అయినా ఆ రోజు ప్రిన్సిపల్‌ను కలవలేకపోవడంతో బాలు, మీనా ఇద్దరూ కొంత నిరాశతో అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. ఇక శివ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే ఆలోచనలో పడతారు.

మరోవైపు మనోజ్ తన ఫర్నిచర్ బిజినెస్ డల్‌గా ఉండటంతో తీవ్ర ఆందోళన చెందుతూ కనిపిస్తాడు. అమ్మకాలు లేకపోవడంతో వ్యాపారం ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో గతంలో తన షాపుకు వచ్చిన ఒక కస్టమర్ మళ్లీ అక్కడికి చేరుకుంటాడు. అయితే ఈసారి అతని ధోరణి పూర్తిగా మారిపోయి ఉంటుంది. తనకు లక్కీ డ్రాలో బంపర్ ఆఫర్ తగిలిందని, కోట్ల రూపాయలు వచ్చాయని, ఇప్పుడు తాను కోటీశ్వరుడినని గొప్పగా చెప్పుకుంటూ మనోజ్ ముందు బిల్డప్ ఇస్తాడు. ఆ మాటలు విన్న మనోజ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు.

అప్పుడు మనోజ్ వెంటనే ఆ కస్టమర్‌ను గుర్తు చేసుకుని, 'ఆరోజు మీరు ఫర్నిచర్ తీసుకుంటానని చెప్పారు కదా... ఇప్పటికైనా తీసుకోండి' అని వినయంగా రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఆ కస్టమర్ మాత్రం గతంలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకుంటూ గట్టిగా సమాధానం ఇస్తాడు. 'ఆరోజు మీరు మీ బాడీగార్డ్ చేత నన్ను బయటికి పంపించారు. అలా చేయకపోయి ఉంటే ఈరోజు మీ దగ్గర దాదాపు 20 లక్షల విలువైన ఫర్నిచర్ కొనేవాడిని. ఆ అవమానాన్ని నేను ఇంకా మర్చిపోలేదు'అని అంటాడు. ఇక ఇప్పుడు తాను కోటీశ్వరుడినని, అయినప్పటికీ మనోజ్ దగ్గర ఫర్నిచర్ కొనడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేస్తాడు. అంతేకాకుండా 'కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి'అంటూ గట్టి హెచ్చరిక ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో మనోజ్ తీవ్రంగా చిరాకు పడతాడు.

అప్పుడే అక్కడికి మనోజ్‌పార్క్ ఫ్రెండ్ వస్తాడు. ఆ విషయం మొత్తం విని అతడు కూడా మనోజ్‌ను మందలిస్తాడు. 'ఆరోజు ఆయన చెప్పిన మాట వినుంటే నీ బిజినెస్ ఇప్పటికి డెవలప్ అయ్యేది'అని అంటాడు. అయినప్పటికీ ఇప్పటికీ ఆలస్యం కాలేదని ధైర్యం చెప్పాడు. ముంబైలో తనకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడని, అతడు డీలర్షిప్‌లు, కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించేందుకు వ్యక్తులను వెతుకుతున్నాడని చెబుతాడు. ఆ అవకాశాన్ని మనోజ్‌కు వచ్చేలా తాను ప్రయత్నిస్తానని హామీ ఇస్తాడు. దీంతో మనోజ్ కొంత ఆశతో నిండిపోతాడు. ఈ కొత్త అవకాశం వర్కౌట్ అయితే తన బిజినెస్ మళ్లీ పుంజుకుంటుందని ఆశిస్తూ కొత్త ఆశలు పెట్టుకుంటాడు.

మరోవైపు.. శివ సస్పెన్షన్ ఎత్తివేయాలంటే.. ఏం చేయాలని ఆలోచిస్తుండగా.. ఈ సమయంలో బాలుకి ఒక ఐడియా వస్తుంది. ఆ ప్లాన్‌ను మీనాతో చెప్పి ఆమెను కూడా ఒప్పిస్తాడు. రిస్క్ ఉన్నప్పటికీ బామ్మర్ది కోసం బాలు ఆ ప్లాన్‌ను అమలు చేయాలని నిర్ణయించుకుంటాడు. ప్లాన్ ప్రకారం బాలు, మీనా ఇద్దరూ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్తారు. బాలు చేతిలో మద్యం బాటిల్ పట్టుకుని తాగినట్టుగా నటిస్తూ హంగామా చేయడం ప్రారంభిస్తాడు. మీనాపై కోపంగా ప్రవర్తిస్తూ గొడవపడుతున్నట్టు నటిస్తాడు. బాలు మీనాను కొట్టబోతున్నట్టుగా చేయగా, మీనా కూడా అతన్ని తిడుతూ డ్రామాను మరింత రియలిస్టిక్‌గా చూపిస్తుంది. ఈ హంగామా విని ప్రిన్సిపాల్ ఇంటి బయటకు వస్తాడు.

అప్పుడు బాలు 'నా బాటిల్ ఎక్కడ? అది నా దగ్గర ఉండాలి. దాన్ని శివ బ్యాగులో పెట్టాను. ఆ బాటిల్ గురించి అడిగితే ప్రిన్సిపాల్ తీసుకున్నాడని చెబుతున్నారు' అంటూ మత్తులో ఉన్నట్టు అరుస్తూ ఉంటాడు. ఈ మాటలు విన్న ప్రిన్సిపాల్ ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. తాను శివను తప్పుగా అర్థం చేసుకుని శిక్షించానేమో అని బాధపడతాడు. ఇంతలో అక్కడికి శివ వస్తాడు. అయితే బాలు, మీనా ఆడుతున్న డ్రామా గురించి అతనికి తెలియదు. దీంతో శివ బాలును తప్పుగా అర్థం చేసుకుని అతనిపై కోపంగా మాట్లాడతాడు. కానీ ప్రిన్సిపాల్ మాత్రం శివను పిలిచి తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నానని, రేపటి నుంచి రెగ్యులర్‌గా కాలేజ్‌కు రావచ్చని చెబుతాడు. అంతేకాకుండా ఎలాంటి సహాయం కావాలన్నా తనను అడగమని కూడా హామీ ఇస్తాడు. దీంతో శివ ఆనందపడతాడు. బాలు వేసిన ప్లాన్ సక్సెస్ అయినట్టే అనిపిస్తుంది.

అయితే చివరి క్షణంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలు మత్తులో వచ్చి గొడవ చేస్తున్నాడని భావించిన ప్రిన్సిపాల్ ముందుగానే పోలీసులకు ఫోన్ చేసి ఉంటాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాలును అరెస్ట్ చేస్తారు. మీనా ఎంతగా రిక్వెస్ట్ చేసినా పోలీసులు వినకుండా అతడిని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతారు. "ఇలాంటి వారికి మా స్టైల్లో బుద్ధి చెప్తాం. గృహ హింస చట్టం కింద కేసు పెడితే ఏడు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడుతుంది" అంటూ బాలును స్టేషన్‌కు తీసుకెళ్తారు.

ఈ విషయం తెలియని శివ మాత్రం బాలును అరెస్ట్ చేయడం మంచిదేనని భావిస్తాడు. "ఇకనైనా బుద్ధి వస్తుంది" అంటూ తప్పుగా అర్థం చేసుకుంటాడు. దీనితో కోపంగా ఉన్న మీనా అసలు నిజం చెబుతుంది. "ఇదంతా నీకోసమే బాలు ఆడిన డ్రామా. నీ భవిష్యత్తు కోసం ఇలా చేశాడు. కానీ చివరికి పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు" అంటూ బాధపడుతుంది. ఇప్పుడు బాలును ఎలా విడిపించాలో అని మీనా తీవ్ర ఆందోళన చెందుతుంది. ఇలా నేటి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X