Gunde Ninda Gudi Gantalu March 11th Episode: మనోజ్, రోహిణికి మీనా చుక్కులు.. ప్రభావతిపై గృహ హింస కేసు..

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ ఉత్కంఠతో పాటు భావోద్వేగాలతో నిండిపోయింది. బాలు చేసిన పనిపై సత్యం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "ప్రతి పనికీ ఒక పద్ధతి ఉంటుంది. పని తప్పు కాకపోయినా చేసిన విధానం సరైంది కాదు" అంటూ బాలను మందలిస్తాడు. తన నిర్ణయాలు మీనా జీవితంపై కూడా ప్రభావం చూపుతాయని గుర్తు చేస్తూ ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తాడు. తండ్రి మాటలు విన్న బాలు నిశ్శబ్దంగా నిలబడి ఇకపై తప్పు చేయనని హామీ ఇస్తాడు.ఇదిలా ఉండగా శృతి-రవి మధ్య విభేదాలు మొదలవుతాయి. జ్వరంతో బాధపడుతున్న శృతి తనతో ఉండాలని రవిని కోరుతుంది. కానీ హోటల్‌లో వచ్చిన పెద్ద ఆర్డర్ కారణంగా రవి వెళ్లాల్సి వస్తుంది. దీంతో శృతి ఆవేశంతో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

చివరికి రవి సారీ చెప్పి పనికి వెళ్లిపోవడంతో శృతి బాధతో తన పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయిస్తుంది. మీనా, ప్రభావతి ఎంత నచ్చజెప్పినా శృతి వినకుండా తన పుట్టింటికి వెళ్లిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభావతి రవిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుండగా, మీనా మాత్రం రవిని శాంతింపజేస్తూ సమస్యను సర్దుబాటు చేసుకోవాలని సూచిస్తుంది. ఇక మీనా బంధువులు శుభలేఖ ఇవ్వడానికి ఇంటికి రాగానే ప్రభావతి వారిని అవమానిస్తుంది. దీంతో వారు భోజనం చేయకుండా వెళ్లిపోవడంతో మీనా తీవ్రంగా బాధపడుతుంది. ఇదే సమయంలో జలుబుతో వచ్చిన మనోజ్ చికెన్ సూప్ తెమ్మని మీనాకు చెప్పడంతో వాగ్వాదం మొదలవుతుంది. మాటలు పెరగడంతో మనోజ్ మీనాను అవమానకరంగా మాట్లాడతాడు. దీంతో ఆగ్రహించిన మీనా బెల్ట్ తీసుకుని మనోజ్‌పై దాడి చేస్తుంది. ఈ అనూహ్య ఘటనతో ఇంట్లో కలకలం రేగగా ఎపిసోడ్ హైడ్రామాతో ముగుస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 637 March 11th 2026 here is full story

Photo courtesy: Jio Hotstar

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠతో పాటు వినోదాత్మక సన్నివేశాలతో సాగింది. గత ఎపిసోడ్‌లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక మీనా తీవ్ర ఆవేశానికి గురవుతుంది. తనను అవమానించిన మనోజ్, ప్రభావతి పై కోపంతో బెల్ట్ తీసుకుని దాడి చేస్తుంది. మీనా కోపానికి తట్టుకోలేక మనోజ్ ఇంట్లోనే పరుగులు పెడుతుంటే, ప్రభావతి భయంతో డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన రోహిణి కూడా మీనా చేతిలో చిక్కి గట్టిగా దెబ్బలు తింటుంది.

మీనా ఆగ్రహం చూసి ముగ్గురూ భయంతో వణికిపోతారు. ఇకపై తనతో మర్యాదగా మాట్లాడతామని, మళ్లీ ఇలా అవమానించబోమని మోకాళ్లపై కూర్చుని వేడుకుంటారు. టేబుల్ కింద దాక్కున్న ప్రభావతిని కూడా బయటకు పిలిచి మీనా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంట్లో ఒక్కసారిగా పరిస్థితి తారుమారు అయినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇంతలోనే అసలు విషయం బయటపడుతుంది. ఇదంతా నిజంగా జరగలేదు... మీనా ఊహల్లో జరిగిన ఒక కల మాత్రమే.

వాస్తవానికి మీనా ఎవ్వరినీ కొట్టలేదు. కానీ తనకు జరిగిన అవమానం గుర్తుకు రావడంతో వారిని బెల్ట్‌తో కొడుతున్నట్టు ఊహించుకుని పగలబడి నవ్వుకుంటూ ఉంటుంది. మీనా అలా నవ్వుతుండటాన్ని చూసిన ప్రభావతి, రోహిణి, మనోజ్ ముగ్గురూ ఆశ్చర్యపోతారు. అసలు ఏమైందో అర్థం కాక తలలు పట్టుకుంటారు. ఇదే సమయంలో బాలు ఇంటికి వస్తాడు. వెంటనే ప్రభావతి "నీ పెళ్లాం మమ్మల్ని చూసి విచిత్రంగా నవ్వుతోంది" అంటూ ఫిర్యాదు చేస్తుంది.

బాలు మీనాను అడగగా ఆమె తనకు వచ్చిన ఆ కల గురించి చెబుతుంది. ఆ విషయం విన్న బాలు కూడా నవ్వు ఆపుకోలేక పగలబడి నవ్వుతాడు. దీంతో ప్రభావతికి మరింత కోపం వస్తుంది. అసలు ఎందుకు నవ్వుతున్నారో చెప్పమని గట్టిగా ప్రశ్నిస్తుంది. అయితే బాలు ఏం చెప్పాలో తెలియక మళ్లీ నవ్వుతుండటంతో ప్రభావతి అసలు కారణం తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది.

ఇంతలో సత్యం ఇంటికి వస్తాడు. తన కోడలు మొదటిసారి ఇలా మనస్ఫూర్తిగా నవ్వడం చూసి ఆనందపడతాడు. కానీ ప్రభావతి మాత్రం మీనా తమను చూసి ఎగతాళిగా నవ్వుతోందని చెప్పి, ఆమె నవ్వును అనుకరిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది. అయితే సత్యం మాత్రం 'మీనా నవ్వడానికి కారణం ఏదైనా కావచ్చు... కానీ ఆమె ఇలా మనసారా నవ్వడం నాకు సంతోషంగా ఉంది' అంటూ స్పష్టం చేస్తాడు. తన కోడలు అత్తారింటికి వచ్చిన తర్వాత మొదటిసారి ఇలా గలగల నవ్వడం చూసి ఆనందంగా ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఇంట్లో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతుంది.

మరోవైపు శృతి ఒక్కసారిగా లగేజ్ తీసుకుని పుట్టింటికి రావడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. ఎందుకు ఇలా చెప్పాపెట్టకుండా వచ్చిందో అర్థం కాక టెన్షన్ పడుతుంటారు. ఇదే సమయంలో శృతి తన తల్లి దగ్గరకు వచ్చి తలకు బాగా నొప్పిగా ఉందని, కాస్త జ్వరం కూడా ఉన్నట్టు అనిపిస్తోందని చెబుతూ కాఫీ చేయమని అడుగుతుంది. ఆమె పరిస్థితి చూసి తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతారు.

ఈ సమయంలో శృతి తండ్రి నెమ్మదిగా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. 'ఏమైంది అమ్మా? ఇలా ఒక్కసారిగా ఎందుకు వచ్చావు? అత్తవారింట్లో ఏమైనా గొడవ జరిగిందా?' అని ప్రశ్నిస్తాడు. అయితే ఆ ప్రశ్నలు విన్న శృతి వెంటనే చిరాకు పడుతుంది. 'నేను ఇంటికి రాకూడదా? నాకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదా?' అంటూ తండ్రినే ఎదురు ప్రశ్నిస్తుంది. ఆమె మాటలు విన్న తండ్రి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. అక్కడితో ఆగకుండా శృతి మరింత కోపంగా 'ప్రతి విషయం మీకు కారణం చెప్పాలా? మీకు నచ్చకపోతే చెప్పండి... ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను' అంటూ ఆగ్రహంగా తన గదిలోకి వెళ్లిపోతుంది. దీంతో తల్లిదండ్రులు పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో తెలియక కంగారు పడుతుంటారు.

ఇదిలా ఉండగా, మరోవైపు రవి తన భార్యను తీసుకెళ్లేందుకు అత్తవారింటికి వస్తాడు. రవిని చూసిన వెంటనే శృతి తల్లిదండ్రులు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలుకుతారు. కానీ రవి మాత్రం నేరుగా 'శృతి ఎక్కడ ఉంది?'అని అడుగుతాడు. దీనికి ఆమె తల్లి శోభన 'గదిలోకి వెళ్లింది... కాస్త అస్వస్థతగా ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుంటోంది'అని చెబుతుంది. అయితే రవి వచ్చిన తీరును చూసి శృతి తల్లిదండ్రులు చాలా ఎక్సైట్ అవుతారు. అల్లుడు కూడా ఇంటికి వచ్చాడంటే ఇక ఇద్దరూ ఇక్కడే ఉంటారని భావించి ఆనందపడతారు. వారికోసం ప్రత్యేకంగా బెడ్‌రూమ్ కూడా సిద్దం చేయాలని నిర్ణయించుకుంటారు. తమ కోరిక నెరవేరబోతుందనే భావనతో శోభన ఆనందపడుతుంది.

అయితే వెంటనే సీన్ మారిపోతుంది. కోపంతో ఉన్న శృతి గదిలోకి వెళ్లిన రవి ఆమె ఆరోగ్యం గురించి అడుగుతాడు. కానీ శృతి మాత్రం ఇంకా కోపంతోనే ఉండి అతనితో మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. దీంతో రవి తన తప్పు అంగీకరిస్తూ సారీ చెబుతాడు. ఆ రోజు హోటల్‌లో పని ఎక్కువగా ఉండటంతో వెళ్లక తప్పలేదని, తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని వేడుకుంటాడు. అయినప్పటికీ శృతి మొదట అతని మాట వినదు.

ఈ సమయంలో రవి ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చొని డైమండ్ రింగ్ తీసి శృతికి ప్రపోజ్ చేస్తాడు. దీంతో శృతి కాస్త ఇంప్రెస్ అవుతుంది. రింగ్ తీసుకున్న తర్వాత కూడా మొదట తాను రావడం లేదని చెబుతుంది. అయితే ఇకపై ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటానని రవి బతిమిలాడడంతో చివరకు శృతి మనసు మార్చుకుంటుంది. అతనితో కలిసి తిరిగి అత్తవారింటికి వెళ్లడానికి అంగీకరిస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన శృతి తల్లిదండ్రులు మాత్రం నిరాశ చెందుతారు. వారు ఇద్దరూ ఇక్కడే ఉండిపోతారని ఆశపడితే, వచ్చిన కొద్దిసేపటికే తిరిగి వెళ్లిపోవడం వారిని బాధపెడుతుంది. 'ఇవాళ ఇలా వెళ్లిపోతే మళ్లీ మన ఇంటికి ఎప్పుడు వస్తారు?' అని ఆందోళన చెందుతారు. ముఖ్యంగా శోభన మాత్రం వీళ్లిద్దరినీ తమ ఇంట్లోనే ఉంచుకోవాలని భావిస్తూ ఏదైనా కొత్త ప్లాన్ వేయాలని ఆలోచించడం ప్రారంభిస్తుంది.

ఇక రాత్రివేళ డైనింగ్ హాల్‌లో అందరూ భోజనాలకు కూర్చుంటారు. మీనా అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అయితే మనోజ్ దగ్గరకు రాగానే ఆమె కావాలనే అతనికి వడ్డించకుండా రోహిణికి ప్లేట్ ఇస్తుంది. దీంతో మనోజ్ 'నాకు ఎందుకు వడ్డించలేదు?' అని ప్రశ్నిస్తాడు. వెంటనే మీనా ఘాటుగా స్పందిస్తూ 'నీకు నీ భార్య ఉంది కదా.. ఆమె చేతనే పెట్టించుకో. నేను నా అత్తయ్య, మామయ్య, నా భర్తకు మాత్రమే వడ్డిస్తాను. నీకు కాదు' అంటూ కౌంటర్ ఇస్తుంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంటుంది.

ఈ సమయంలో మనోజ్ మళ్లీ అతిగా మాట్లాడుతాడు. కానీ మీనా మాత్రం అతని మాటలను పట్టించుకోకుండా ఒక్కసారిగా నవ్వుకోవడం ప్రారంభిస్తుంది. తనకు వచ్చిన ఆ కల గుర్తుకు రావడంతో నవ్వును ఆపుకోలేకపోతుంది. అదే విషయం బాలుకు చెప్పగా, 'వాళ్లను చూస్తుంటే నీ కల నిజమైనట్టే ఉంది' అంటూ బాలు కూడా నవ్వుతాడు. ఇద్దరూ ఆ కలను గుర్తు చేసుకుంటూ గలగల నవ్వుకుంటుంటారు. అయితే మీనా, బాలు ఎందుకు ఇలా నవ్వుతున్నారో మిగతా కుటుంబ సభ్యులకు మాత్రం అర్థం కావడం లేదు. ముఖ్యంగా ప్రభావతి మాత్రం వారి నవ్వుల వెనక ఉన్న అసలు కారణం తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.

ఇంతలోనే రవి,శృతి ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. మొదట రవి ఒక్కడే ఇంట్లోకి రావడంతో ప్రభావతి సంతోషిస్తుంది. కానీ వెంటనే శృతి కూడా లోపలికి రావడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే శృతిని ప్రశ్నిస్తూ 'ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయావు?'అని అడుగుతుంది. దీనికి శృతి నిర్లక్ష్యంగా 'అప్పుడు వెళ్లాలనిపించింది వెళ్లాను... ఇప్పుడు రావాలనిపించింది వచ్చాను' అంటూ సమాధానం ఇస్తుంది. అంతేకాకుండా 'ఇంట్లోకి రావడానికి ముందు నా పర్మిషన్ తీసుకోవాలి కదా' అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. 'వెళ్లేముందు మీ పర్మిషన్ తీసుకోలేదు... రావాలనిపించింది వచ్చాను అంతే' అంటూ తేలికగా మాట్లాడుతుంది.

ఈ సమయంలో బాలు.. 'నువ్వు తొందరగానే వచ్చావా? మా అమ్మ మీద గృహంస చట్టం కింద కేసు పెడతావని, అదనపు కట్నం పేరుతో వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తావని భావించాను' అంటూ బాలు వెటకారంగా మాట్లాడుతాడు. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఈ సమాధానం విన్న ఇంటి సభ్యులు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ పరిస్థితిని సర్దుబాటు చేయడానికి మీనా ముందుకు వస్తుంది. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా అత్తయ్య మాటను కాదనకూడదని శృతికి హుందాగా సూచిస్తుంది. ఇక సత్యం కూడా మాట్లాడి 'నీ బాధ్యతలను నీ తల్లిదండ్రులు నాకు అప్పగించారు. ఇలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోతే వాళ్లు కంగారు పడతారు. ఇకపై ఇలా చేయకూడదు. ఈ కుటుంబ గౌరవం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది'అని చెప్పి హెచ్చరిస్తాడు. దీనికి శృతి స్పందిస్తూ 'ఇక్కడ జరిగిన విషయం నేను నా ఇంట్లో చెప్పలేదు. వాళ్లు కూడా నేను ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్నారు. ఇదీ నా ఫ్యామిలీ'అంటూ భావోద్వేగంగా చెబుతుంది.

ఈ సమయంలో రోహిణి కూడా మధ్యలోకి వచ్చి చిన్న చిన్న విషయాలకే ఇంటిని వదిలి వెళ్లకూడదని పెద్దలలా సలహా ఇస్తుంది. అయితే వెంటనే బాలు స్పందిస్తూ 'రోహిణి పుట్టిల్లు ఇక్కడా? మలేషియాలో ఉంది కదా... అంతేకాదు ఆమెకు తల్లి లేదు, తండ్రి జైలులో ఉన్నాడు... ఇంకెక్కడికి వెళుతుంది?' అంటూ ఘాటుగా మాట్లాడతాడు. బాలు మాటలు వినగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారుతుంది. ఈ వ్యాఖ్యలతో కుటుంబంలో మరోసారి కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యే సూచనలు కనిపించడంతో ఎపిసోడ్ ఆసక్తికర మలుపు తీసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X