Gunde Ninda Gudi Gantalu March 12th Episode: బాలుకి మత్తుమందు.. రోహిణి ప్లాన్ ఫెయిల్.. మనోజ్‌కి భారీ నష్టం..

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ఉత్కంఠతో పాటు వినోదం కూడా కలిసిపోయాయి. గత ఎపిసోడ్‌లో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకుని మీనా తీవ్ర ఆవేశానికి గురవుతుంది. మనోజ్, ప్రభావతి, రోహిణిపై బెల్ట్‌తో దాడి చేస్తున్నట్లు భావిస్తుంది. అయితే అది నిజం కాదని, మీనా ఊహల్లో జరిగిన కల మాత్రమే అని తర్వాత తెలుస్తుంది. మీనా అలా నవ్వుతుండటాన్ని చూసి ప్రభావతి, రోహిణి, మనోజ్ ఆశ్చర్యపోతారు. బాలు వచ్చిన తర్వాత మీనా తనకు వచ్చిన ఆ కల గురించి చెబుతుంది. అది విన్న బాలు కూడా నవ్వుతాడు. కానీ ప్రభావతికి మాత్రం వారి నవ్వు అసలు నచ్చదు. ఈ సమయంలో ఇంటికి వచ్చిన సత్యం తన కోడలు ఇలా మనస్ఫూర్తిగా నవ్వడం చూసి సంతోషపడతాడు.

ఇక మరోవైపు శృతి ఒక్కసారిగా లగేజ్‌తో పుట్టింటికి రావడంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడతారు. కానీ శృతి మాత్రం తలకు నొప్పి ఉందని చెప్పి కారణం చెప్పకుండా కోపంగా తన గదిలోకి వెళ్లిపోతుంది. కొంతసేపటికి రవి అక్కడికి వచ్చి శృతిని కలుస్తాడు. తన తప్పు అంగీకరిస్తూ క్షమాపణ చెప్పి డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేస్తాడు. దీంతో శృతి మనసు మార్చుకుని అతనితో తిరిగి అత్తవారింటికి వెళ్లడానికి అంగీకరిస్తుంది. రాత్రి భోజన సమయంలో మీనా అందరికీ వడ్డిస్తుంటే, మనోజ్‌కు మాత్రం కావాలనే వడ్డించదు. దీనిపై ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. ఇదే సమయంలో రవి, శృతి ఇంటికి చేరుకుంటారు. శృతి వెళ్లి తిరిగి రావడంపై ప్రభావతి ప్రశ్నించగా, శృతి నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుంది. బాలు వ్యంగ్యంగా మాట్లాడడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. చివరగా రోహిణిపై బాలు చేసిన వ్యాఖ్యలతో కుటుంబంలో మరోసారి కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యే సూచనలతో ఎపిసోడ్ ముగిసింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 638 March 12th 2026 here is full story

Photo courtesy: Jio Hotstar

గురువారం ప్రసారమైన ఎపిసోడ్ కుటుంబ డ్రామా, భావోద్వేగాలతో ఎంతో రసవత్తరంగా సాగింది. రవి, శృతి ఇద్దరూ కలిసి ఇంటికి రావడం చూసి ప్రభావతి మొదట షాక్‌కు గురవుతుంది. శృతి ఒక్కసారిగా పుట్టింటికి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఇలా తిరిగి రావడం ఆమెకు అర్థం కాక ఆశ్చర్యపడుతుంది. ఈ సమయంలో రోహిణి మధ్యలో మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలకే పుట్టింటికి వెళ్లడం మంచిది కాదని శృతికి సలహా ఇస్తుంది. అయితే వెంటనే బాలు స్పందిస్తూ రోహిణిపై సెటైర్ వేస్తాడు. 'పాపం పార్లర్ అమ్మకు పుట్టిల్లు ఎక్కడుంది... అమ్మ లేదు, నాన్న జైల్లో ఉన్నాడు... ఇంకెక్కడికి వెళ్తుంది?' అంటూ ఇండైరెక్ట్‌గా రోహిణిని ఎద్దేవా చేస్తాడు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా అసహజంగా మారుతుంది.

ఇదే సమయంలో ప్రభావతి శృతిని ప్రశ్నిస్తూ, 'అప్పుడు ఎంత అడిగినా ఆగకుండా వెళ్లిపోయావు... ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చావు?'అని నిలదీస్తుంది. దీనికి శృతి నేరుగా సమాధానం ఇస్తూ అసలు విషయాన్ని బయటపెడుతుంది. 'రవి నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు... అంతేకాదు ఈ డైమండ్ రింగ్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు. అందుకే వచ్చాను' అని చెబుతుంది. శృతి చెప్పిన మాటలు విన్న ఇంటి సభ్యులంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే బాలు స్పందిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతాడు. 'పెళ్లాం పుట్టింటికి వెళ్తే ఎవరు ఏడుస్తారు? నువ్వు ఇలా చేస్తే నా పెళ్లాం కూడా మనోజ్ గాడి పెళ్లాం బాగుందని బయటికి వెళ్లిపోతుంది. చిన్న చిన్న గిఫ్టులు సరే... ఇలా ఖరీదైన డైమండ్ రింగ్ ఎందుకు?' అంటూ సెటైర్లు వేస్తాడు.

ఈ పరిస్థితిని చూసిన సత్యం వెంటనే కలగజేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేస్తాడు. 'పుట్టింటికి వెళ్లినా తిరిగి వచ్చింది కదా... ఇక ఈ గొడవకు ఫుల్‌స్టాప్ పెట్టండి' అంటూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడు. అయితే ప్రభావతికి మాత్రం ఆ విషయం అస్సలు నచ్చదు. వెంటనే రవిని బయటకు పిలిచి, 'నువ్వెందుకు శృతిని తీసుకువచ్చావు? ఆమె పుట్టింటికి ఎందుకు వెళ్లావు?'అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో రవి అసలు విషయం బయటపెడతాడు. 'ముందు వెళ్లకూడదనిపించింది. కానీ మీనా వదిన ఫోన్ చేసి శృతి సమస్య గురించి చెప్పింది. ఆమెను తీసుకురమ్మని అడిగింది. అందుకే వెళ్లి తీసుకువచ్చాను" అని చెబుతాడు. ఇది విన్న ప్రభావతి ఒక్కసారిగా కోపంతో ఉడికిపోతుంది. వెంటనే మీనాను పిలిచి, 'నువ్వు ఏమనుకుంటున్నావ్? ఇంట్లో అందరినీ నీ చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నావా?' అంటూ ఆమెపై తీవ్రంగా మండిపడుతుంది.

అసలు విషయం ఏమిటో అర్థం కాక మీనా ప్రశ్నించగా, ప్రభావతి 'రవిని ఎందుకు పంపావు? శృతిని ఎందుకు ఇంటికి తీసుకురమ్మని చెప్పావు?' అంటూ నిలదీస్తుంది. దీనికి మీనా శాంతంగా సమాధానం ఇస్తూ, 'అందరూ కలిసి ఉండాలని నా ఉద్దేశం. చిన్న చిన్న తప్పులు జరుగుతాయి... కానీ వాటిని పెద్ద సమస్యగా మార్చకూడదని అనిపించింది. అందుకే ఇలా చేశాను' అని వివరిస్తుంది. అయితే ప్రభావతి మాత్రం మీనా మాటలను అంగీకరించదు. 'నువ్వెవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి?" అంటూ ఆమెను అవమానించేలా మాట్లాడుతుంది.ఈ పరిస్థితిని గమనించిన సత్యం వెంటనే ముందుకు వచ్చి ప్రభావతికి గట్టి సమాధానం ఇస్తాడు. 'ఈ ఇంటికి బాధ్యతగల కోడలు మీనా. నీ స్థానంలో ఉండి ఈ ఇంటి గౌరవాన్ని కాపాడుతోంది. ఈరోజు నీ కొడుకు సంసారాన్ని నిలబెట్టింది. ఆ విషయం మర్చిపోకు. నీలాగా ప్రతి విషయాన్ని గొడవ చేయాలని కాదు... అందరూ తనవాళ్లేనని భావిస్తుంది' అంటూ ప్రభావతికి గట్టిగా బుద్ధి చెప్తాడు.

ఇక మరోవైపు.. రోహిణి తన ప్లాన్‌ను అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ముందుగా మీనాను మాటల్లో పెట్టి వంటగది నుంచి బయటకు పంపిస్తుంది. ఇదే సరైన సమయమని భావించిన రోహిణి, తన ముందుగానే తెచ్చుకున్న నిద్రమాత్రలను బాలు తాగే పాలలో కలిపేస్తుంది. ఆమె ఊహించినట్టుగానే కొద్దిసేపటికి మీనా ఆ పాలను తీసుకెళ్లి బాలుకి ఇస్తుంది. బాలు ఆ పాలను తాగిన తర్వాత కాసేపటిలోనే గాఢ నిద్రలోకి వెళ్లిపోతాడు. దీంతో తన ప్లాన్ సక్సెస్ అయిందని భావించిన రోహిణి, బాలు ఫోన్‌ను తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆమె ప్రయత్నం మధ్యలోనే అడ్డంకి ఏర్పడుతుంది. బాలు ఫోన్ దగ్గరికి వెళ్లబోతుండగా వెనుక నుంచి ప్రభావతి వచ్చి రోహిణి భుజంపై చేయి వేస్తుంది.

దీంతో ఒక్కసారిగా రోహిణి ఉలిక్కిపడుతుంది. వెనక్కి తిరిగి చూడగా తన అత్త ప్రభావతి ఉండటంతో కాస్త తడబడుతుంది. 'ఈ సమయంలో ఇక్కడ ఏమి చేస్తున్నావు?'అని ప్రభావతి ప్రశ్నించగా, రోహిణి 'తిన్నది జీర్ణం కాలేదని' చెప్పి కవరింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే రోహిణి కూడా 'మీరు ఈ సమయంలో ఇక్కడ ఏమి చేస్తున్నారు?' అని తిరిగి ప్రశ్నిస్తుంది. దీనికి ప్రభావతి తన మనసులో ఉన్న సందేహాన్ని బయటపెడుతుంది. 'మీనా నన్ను చూసి ఎందుకు నవ్వింది? ఆ విషయం అర్థం కాక ఇంతసేపు నిద్ర పట్టలేదు. నువ్వు తిరుగుతున్నావు కదా... నీకు ఏమైనా తెలిసుంటే ఒకసారి మీనాను అడిగి తెలుసుకో'అని సూచిస్తుంది. అంతలోనే సత్యం పిలవడంతో ప్రభావతి తన గదిలోకి వెళ్లిపోతుంది.

ప్రభావతి వెళ్లిన వెంటనే రోహిణి మరోసారి తన ప్లాన్‌ను అమలు చేయాలని చూస్తుంది. మళ్లీ బాలు ఫోన్‌ను తీసుకునేందుకు ముందుకు వెళ్తుండగా, ఈసారి మనోజ్ వెనుక నుంచి వచ్చి ఆమెను ఒక్కసారిగా ఎత్తుకుని బెడ్‌రూమ్‌కు తీసుకెళ్తాడు. దీంతో రోహిణి చిరాకు పడుతుంది. 'నాకు నిద్ర రావడం లేదు... ఎందుకు తీసుకువచ్చావు?' అంటూ కోపపడుతుంది. కానీ మనోజ్ మాత్రం నవ్వుతూ 'నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు' అంటూ ఆమెపై దుప్పటి వేసి గట్టిగా హగ్గు చేసుకుని పడుకుంటాడు. దీంతో రోహిణి వేసిన ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అవుతుంది.

ఇక మరుసటి రోజు ఉదయం మరో ఆసక్తికర సన్నివేశం కనిపిస్తుంది. ప్రభావతి తన డాన్స్ స్కూల్‌లో పిల్లలకు డాన్స్ నేర్పిస్తున్నా, ఆమె మనసు మాత్రం అక్కడ ఉండదు. మీనా తనను చూసి ఎందుకు నవ్విందో అనే ఆలోచన ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. ఆ ఆలోచనల వల్ల డాన్స్ చేస్తూ కూడా తడబడుతుంది. చివరికి అసలు విషయం తెలుసుకోవాలని నిర్ణయించిన ప్రభావతి, మీనాక్షిని పిలిచి తన సందేహాన్ని చెబుతుంది.
మీనాక్షి ద్వారా మీనాకు ఫోన్ చేయిస్తుంది. ఈ సమయంలో మీనా ఫోన్ ఎత్తి మాట్లాడుతుండగా, మీనాక్షి ఆ నవ్వు గురించి అడుగుతుంది. అయితే మీనా నవ్వుతూ 'అది చాలా పెద్ద కథ... ఇప్పుడు చెప్పలేను'అంటూ ఫోన్ కట్ చేస్తుంది. మీనా నుంచి సరైన సమాధానం రాక ప్రభావతి మరింత గందరగోళానికి గురవుతుంది. తనను చూసి మీనా ఎందుకు నవ్విందో అర్థం కాక మరోసారి తల పట్టుకుని ఆలోచిస్తూ ఉండిపోతుంది. దీంతో కథలో ఉత్కంఠ మరింత పెరిగింది.

మరోవైపు మనోజ్ ఫర్నిచర్ వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతుండగా, అనుకోని సమస్య అతనికి పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది. బాలు కారణంగా గాయపడిన బాడీగార్డ్‌కు చికిత్స చేయించాల్సి వచ్చిందని చెప్పుతూ, ఆ బాడీగార్డ్ కొంతమంది వ్యక్తులతో కలిసి నేరుగా మనోజ్ ఫర్నిచర్ షాప్‌కు వస్తాడు. హాస్పిటల్ ఖర్చు దాదాపు రూ.50 వేల వరకు అయ్యిందని, అంతేకాకుండా నెలరోజుల పాటు మంచి ఆహారం కూడా పెట్టాల్సి వస్తుందని చెబుతూ మొత్తం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తారు. లేదంటే పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతామని కూడా హెచ్చరిస్తారు.

అయితే మనోజ్ మాత్రం వారిపై కోపంగా స్పందిస్తాడు. 'వాడిని కొట్టింది నేను కాదు... బాలు. నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి? నా దగ్గర డబ్బులు కూడా లేవు' అంటూ సూటిగా చెప్పేస్తాడు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా నష్టపరిహారం పేరుతో రూ.50 వేల విలువైన ఫర్నిచర్‌ను షాప్ నుంచి బలవంతంగా తీసుకెళ్తారు. దీంతో మనోజ్‌కు ఒక్కసారిగా పెద్ద నష్టం జరుగుతుంది. ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన మనోజ్ ఇంటికి వచ్చి బాలుపై మండిపడతాడు. 'నీ వల్ల నాకు 50 వేల నష్టం వచ్చింది' అంటూ ఇంట్లో గట్టిగా అరుస్తాడు. అయితే అసలు విషయం చెప్పకుండా కేవలం నష్టం జరిగిందని మాత్రమే చెప్పడంతో బాలు కూడా కోపంగా స్పందిస్తాడు. 'ఏం జరిగిందో ముందుగా చెప్పు'అంటూ గట్టిగా ప్రశ్నిస్తాడు. దీంతో మనోజ్ షాప్‌లో జరిగిన సంఘటన మొత్తాన్ని వివరంగా చెబుతాడు.

అది విన్న బాలు మరింత ఘాటుగా స్పందిస్తాడు. 'నన్ను కొట్టడానికి బాడీగార్డ్‌ను తీసుకొచ్చింది నువ్వే. వాడిని నేను కొట్టాను. ఇప్పుడు వాడు నష్టపరిహారం అడిగితే నాకేం సంబంధం? నువ్వు పిరికివాడివి కాబట్టే వాళ్లు నీ దగ్గర నుంచి ఫర్నిచర్ తీసుకెళ్లారు. వాళ్లను నా దగ్గరికి పంపించి ఉంటే నా స్టైల్లో బుద్ధి చెప్పేవాడిని. నీకు జరిగిన నష్టానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు నెలకు ఇవ్వాల్సిన రూ.50 వేల మాత్రం కచ్చితంగా ఇవ్వాలి' అంటూ స్పష్టం చేస్తాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ, 'నీ వల్లే నష్టం జరిగింది. ఈ నెలలో నేను డబ్బులు ఇవ్వలేను'అని చెబుతాడు. ఈ సమయంలో ప్రభావతి తన చిన్నకొడుకు మనోజ్‌కు మద్దతుగా నిలుస్తుంది. 'వాడు పూర్తిగా ఇవ్వను అనడం లేదు కదా... వచ్చే నెలలో ఈ నెల రూ.50 వేలూ, వచ్చే నెల రూ.50 వేలూ కలిపి లక్ష రూపాయలు ఇస్తాడు'అంటూ హామీ ఇస్తుంది.

అయితే బాలు మాత్రం ఆ మాటలను నమ్మడు. వెంటనే మనోజ్ రహస్యాన్ని బయటపెడతాడు. 'నీ దగ్గర డబ్బులు లేవని చెబుతున్నావు... కానీ విద్యకు మూడు రూపాయల వడ్డీకి లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చావు కదా?' అంటూ మనోజ్ వడ్డీ వ్యాపారాన్ని బయటపెడతాడు. ఈ విషయం విన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తనకు ఈ విషయం తెలియకపోవడంతో బాధపడుతుంది. సత్యం కూడా 'ఇంత పెద్ద విషయం ఎందుకు చెప్పలేదు?' అంటూ మనోజ్‌ను ప్రశ్నిస్తాడు. ఈ సమయంలో బాలు మరో నిర్ణయం తీసుకుంటాడు. మీనా ను పిలిచి పెన్, పేపర్ తీసుకురా అంటూ ఆదేశిస్తాడు. తన మాటల ప్రకారం రాయమని మనోజ్ కు చెబుతాడు. ఈ నెలకు ఇవ్వాల్సిన రూ.50 వేలతో పాటు వచ్చే నెల రూ.50 వేలూ కలిపి మొత్తం లక్ష రూపాయలు చెల్లిస్తానని హామీ పత్రం రాయిస్తాడు. ఆ పత్రంపై మొదట సాక్షిగా ప్రభావతితో సంతకం చేయిస్తాడు. తర్వాత సత్యం, మీనా కూడా సాక్షులుగా సంతకం చేస్తారు.

ఈ పరిణామం ఇంట్లో మరో ఉద్రిక్తతను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా రోహిణి మాత్రం ఈ విషయంపై కోపంగా స్పందిస్తుంది. ఈ సంఘటనతో కుటుంబంలో కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మనోజ్ అప్పు వ్యవహారం, బాలు పెట్టిన షరతులు... ఇవన్నీ కలిసి రాబోయే ఎపిసోడ్లలో మరిన్ని ఆసక్తికర ట్విస్ట్‌లకు దారితీయబోతున్నాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X