Gunde NindGudi Gantalu March 13th Episode: 300 కోట్ల డ్రామా..సుమతి పెళ్లిచూపులు.. దినేష్ బ్లాక్ మెయిల్..

Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో రవి, శృతి ఇద్దరూ కలిసి ఇంటికి రావడం చూసి ప్రభావతి ఆశ్చర్యానికి గురవుతుంది. పుట్టింటికి వెళ్లిపోయిన శృతి తిరిగి రావడం ఎందుకని ప్రశ్నించగా, రవి తన దగ్గరకు వచ్చి ఏడ్చి డైమండ్ రింగ్ ఇచ్చాడని శృతి చెబుతుంది. ఈ విషయంపై బాలు వ్యంగ్యంగా మాట్లాడడంతో ఇంట్లో వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. సత్యం మాత్రం మధ్యలో జోక్యం చేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేస్తాడు.అయితే ప్రభావతి కోపంతో రవిని ప్రశ్నించగా, మీనా ఫోన్ చేసి శృతి సమస్య గురించి చెప్పిందని రవి చెబుతాడు. దీంతో ప్రభావతి మీనాపై మండిపడుతుంది. కానీ సత్యం మీనాకు మద్దతుగా నిలబడి, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడుతున్న బాధ్యతగల కోడలు ఆమెనే అని స్పష్టం చేస్తాడు.

ఇదిలా ఉండగా రోహిణి మరో కుట్రకు తెరతీస్తుంది. బాలు తాగే పాలలో నిద్రమాత్రలు కలిపి అతని ఫోన్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ప్రభావతి అనుకోకుండా అక్కడికి రావడంతో ఆమె ప్లాన్ విఫలమవుతుంది. తర్వాత మనోజ్ ఆమెను బెడ్‌రూమ్‌కు తీసుకెళ్లడంతో రోహిణి ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అవుతుంది.మరుసటి రోజు ప్రభావతి మనసులో మాత్రం మీనా నవ్వు గురించి సందేహం వెంటాడుతూనే ఉంటుంది. మరోవైపు మనోజ్ ఫర్నిచర్ షాప్‌లో కొత్త సమస్య తలెత్తుతుంది. బాలు కొట్టిన బాడీగార్డ్ చికిత్స ఖర్చు పేరుతో కొందరు వచ్చి రూ.50 వేల విలువైన ఫర్నిచర్ తీసుకెళ్తారు. దీంతో మనోజ్ బాలుతో గొడవ పడతాడు. అయితే బాలు అతని వడ్డీ వ్యాపారం రహస్యాన్ని బయటపెట్టి, రెండు నెలల రూ.50 వేల చెల్లిస్తానని హామీ పత్రం రాయిస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 639 March 13th 2026 here is full story

Photo courtesy: Jio Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో మీనా కుటుంబంలో పెళ్లి సందడి మొదలవుతూ ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మీనా చెల్లి సుమతికి మంచి సంబంధం రావడంతో ఇంట్లోవాళ్లు పెళ్లి విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయిస్తారు. అయితే సుమతి మాత్రం తొలుత పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. తాను ఇంకా కొంతకాలం జాబ్ చేస్తూ అమ్మకు సహాయం చేయాలని, అలాగే శివకు ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి గురించి ఆలోచించనని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతుంది. దీంతో ఇంట్లో కొద్దిసేపు చర్చ వాతావరణం నెలకొంటుంది.

ఈ సమయంలో మీనా సుమతిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. మనకోసం వచ్చిన మంచి సంబంధాన్ని వదులుకోవద్దని, జీవితంలో కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు వాటిని గౌరవించాల్సిందేనని చెబుతుంది. ఇదే సమయంలో బాలు కూడా సరదాగా మాట్లాడుతూ 'ఎవరైనా ప్రేమిస్తున్నావా చెప్పు... ఉంటే నేనే దగ్గరుండి పెళ్లి చేస్తా' అంటూ సుమతిని ప్రశ్నిస్తాడు. వెంటనే పక్కనే ఉన్న శివ సెటైర్ వేస్తూ, 'అదేం లేదు... ఇప్పటివరకు ఎవడైనా ప్రపోజ్ చేస్తే చెప్పుతోనే తరిమేసింది' అంటూ నవ్విస్తాడు.

అయితే సుమతి మాత్రం తన మనసులోని మాటను చెబుతుంది. తాను ఇంకా కొంతకాలం కుటుంబంతో ఉండాలని అనుకుంటున్నానని చెప్పినా, చివరికి బాలు చెప్పిన మాటలకు ఒప్పుకుంటుంది. అబ్బాయి నచ్చితేనే పెళ్లి అని స్పష్టం చేస్తూ పెళ్లి చూపులకు సిద్ధమవుతుంది. కొద్దిసేపటికే పెళ్లివారు ఇంటికి వచ్చి సుమతిని చూస్తారు. సుమతి, పెళ్లికొడుకు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు చిందించడం ఇంట్లోవారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇద్దరికీ ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశం ఇవ్వాలని భావించిన బాలు, బయటకు వెళ్లి మాట్లాడుకోమని సూచిస్తాడు. బయటకు వెళ్లిన తర్వాత పెళ్లికొడుకు సుమతితో మాట్లాడుతాడు. ఆమె చాలా నచ్చిందని, ముఖ్యంగా ఆమె కుటుంబం చూపించిన ఆతిథ్యం, ఆప్యాయత తమకు బాగా నచ్చాయని చెబుతాడు. ఈ మాటలు విన్న సుమతి కూడా ఆ అబ్బాయి సింప్లిసిటీకి ఇంప్రెస్ అవుతుంది. ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకోవడంతో ఇంట్లోవాళ్లు మొదట కంగారు పడినా, తర్వాత ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నట్టు భావిస్తారు.

తరువాత ఇంట్లోకి వచ్చిన వారు ఈ పెళ్లికి తమ అంగీకారం ఉందని చెబుతారు. దీంతో అందరూ ఆనందపడుతారు. కట్నం, కానుకల విషయాన్ని మీనా తల్లి పార్వతి ప్రస్తావించగా, పెళ్లికొడుకు కుటుంబం మాత్రం తమకు అలాంటి వాటి అవసరం లేదని, సింపుల్‌గా పెళ్లి చేస్తే చాలని చెప్పడంతో అందరూ మరింతగా ఇంప్రెస్ అవుతారు. చివరికి సుమతికి పెళ్లి ఖరారు అవుతుంది.

మరోవైపు.. రోహిణి బాయ్‌ఫ్రెండ్ దినేష్ అకస్మాత్తుగా విద్య ఇంటికి చేరుకుంటాడు. అతన్ని ఒక్కసారిగా చూసిన విద్య షాక్‌కు గురవుతుంది. వెంటనే అతడిని ప్రశ్నిస్తూ, 'ఎందుకు ఇలా వచ్చావు? మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నావు? అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను' అంటూ అమాయకంగా మాట్లాడుతుంది. అయితే దినేష్ మాత్రం ఆ మాటలకు భయపడకుండా రివర్స్‌గా వార్నింగ్ ఇస్తాడు. 'పోలీసులకు కంప్లైంట్ ఇస్తే నీ సంగతి, నీ ఫ్రెండ్ సంగతి అన్నీ బయటపెడతా' అంటూ బెదిరించడంతో విద్య ఒక్కసారిగా సైలెంట్ అవుతుంది.

దీంతో దినేష్ వెంటనే రోహిణికి ఫోన్ చేయమని విద్యకు ఆదేశిస్తాడు. చేసేది లేక విద్య తన స్నేహితురాలు రోహిణికి ఫోన్ చేస్తుంది. అయితే ఆ కాల్‌ను ముందుగా ప్రభావతి లిఫ్ట్ చేస్తుంది. ఈ సమయంలో విద్య 'ఇక్కడ దినేష్ వచ్చాడు'అని చెబుతుంది. ఇంతలోనే అక్కడికి వచ్చిన రోహిణికి ఫోన్ ఇచ్చేస్తుంది. ఫోన్‌లో మాట్లాడిన దినేష్ తీవ్రంగా హెచ్చరిస్తాడు. 'నెలలోపు నాకు డబ్బులు కావాలి. ఈరోజు విద్య ఇంటికి వచ్చాను. నేను చెప్పినట్టు చేయకపోతే రేపు నేరుగా మీ ఇంటికే వస్తాను'అంటూ రోహిణిపై ఒత్తిడి పెంచుతాడు. దీంతో రోహిణి పరిస్థితి గమనించి, ఒక నెలలో డబ్బులు సమకూర్చుతానని మాట ఇస్తుంది.

ఫోన్ కాల్ ముగిసిన వెంటనే ప్రభావతి అనుమానం వ్యక్తం చేస్తుంది. 'ఇంతకీ ఈ దినేష్ ఎవరు?' అని ప్రశ్నిస్తుంది. వెంటనే రోహిణి ఆ విషయం కప్పిపుచ్చేందుకు కథ తయారు చేస్తుంది. 'అతను మా నాన్న అకౌంటెంట్. దుబాయ్ నుంచి వచ్చాడు' అని చెప్పి పరిస్థితిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ప్రభావతి ఆగకుండా మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది. 'అయితే ఇక్కడికి ఎందుకు రాలేదు? విద్య దగ్గరికి ఎందుకు వెళ్లాడు?'అని అడగగా, పెళ్లి కాకముందు విద్యతోనే ఉండేదాన్ని కాబట్టి ఆమె దగ్గరికి వెళ్లాడని రోహిణి సమాధానం ఇస్తుంది. ఇదే సమయంలో ప్రభావతి మరో ప్రశ్న వేస్తుంది. 'మీ నాన్న ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తాడు?' అని అడగగా, మరో నెలలో విడుదల అవుతాడని రోహిణి చెబుతుంది. అప్పుడు ప్రభావతి కాస్త ఆసక్తిగా మాట్లాడుతూ 'మీ నాన్న అకౌంట్లో ఎన్ని కోట్లు ఉంటాయి?'అని ప్రశ్నిస్తుంది.

దానికి రోహిణి 'దాదాపు 300 కోట్ల వరకు ఉండొచ్చు' అని చెప్పడంతో ప్రభావతి ఆశ్చర్యపోతుంది. ఆ మాట విన్న ఆమె ఊహల్లో తేలిపోతూ ఆ డబ్బులతో మనోజ్ పెద్ద వ్యాపారవేత్త అవుతాడని కలలు కంటుంది. ఇంతలో సత్యం అక్కడికి రాగానే ప్రభావతి ఆ విషయాన్ని చెప్పేస్తుంది. 'రోహిణి వాళ్ల నాన్న అకౌంట్లో 300 కోట్లు ఉన్నాయట. అవన్నీ మనోజ్‌కు వస్తే ప్రతి జిల్లాలో షాపులు పెడతా' అంటూ తన కలలను చెబుతుంది. అయితే సత్యం మాత్రం ఆ మాటలు విని కోపంగా స్పందిస్తాడు. "ముందు కలలు కాదు వాస్తవంలో బతుకు. వాళ్ల దగ్గర డబ్బులు ఉంటే నీకేం సంబంధం? ఆ డబ్బులు మనకు వస్తాయని ఎలా అనుకుంటున్నావు?" అంటూ ప్రభావతికి గట్టిగా క్లాస్ పీకుతాడు. దీంతో ప్రభావతి కొంతసేపు సైలెంట్ అయిపోతుంది.

మరోవైపు.. దినేష్ బెదిరింపులతో తీవ్ర ఒత్తిడికి గురైన రోహిణి మరోసారి తన స్నేహితురాలు విద్యతో కలిసి గుణాల దగ్గరకు వెళ్తుంది. అక్కడికి వెళ్లిన వెంటనే గుణను తమ సమస్య గురించి చెప్పి సహాయం కోరుతుంది. అయితే గుణ మాత్రం తాను ముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, "ముందు బాలు దగ్గర ఉన్న వీడియో తీసుకురండి. వీడియో ఇచ్చాకనే మీ పని చేస్తాను" అని స్పష్టంగా చెబుతాడు. దీంతో విద్య వెంటనే స్పందిస్తూ, "ముందుగా దినేష్‌కు ఒక వార్నింగ్ ఇవ్వచ్చు కదా" అంటూ అభ్యర్థిస్తుంది. కానీ గుణ మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని చెబుతాడు. వీడియో తెచ్చి ఇస్తేనే దినేష్ సమస్యను తాను హ్యాండిల్ చేస్తానని గట్టిగా చెప్పేస్తాడు.

దీంతో రోహిణి పరిస్థితి అర్థం చేసుకుని త్వరలోనే ఆ వీడియో తీసుకువస్తానని మాట ఇస్తుంది. అయితే విద్య మాత్రం గుణపై అనుమానం వ్యక్తం చేస్తుంది. "ఇతను నిజంగా దినేష్‌ను హ్యాండిల్ చేయగలడా?" అని సందేహం వ్యక్తం చేస్తుంది. కానీ రోహిణి మాత్రం గుణపై నమ్మకం చూపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలు దగ్గర ఉన్న వీడియోను తెచ్చుకోవడం ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించగలమని, బాలు మరియు దినేష్ ఇద్దరికీ బుద్ధి చెప్పగల వ్యక్తి గుణే అని ఆమె నమ్మకం వ్యక్తం చేస్తుంది.

ఇక మరోవైపు సుమతి పెళ్లి చూపులు సక్సెస్‌ఫుల్‌గా ముగియడంతో బాలు, మీనా ఇద్దరూ కారులో ఇంటికి తిరిగి వస్తుంటారు. ఈ సమయంలో ఇద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటారు. అప్పుడు బాలు సరదాగా ఒక ప్రశ్న అడుగుతాడు. "ప్రతి అమ్మాయికి తనకు కావాల్సిన భర్త గురించి కొన్ని కలలు ఉంటాయి కదా. నీకు అలాంటి కోరికలు ఏమి లేవా?" అని అడుగుతాడు. మొదట మీనా కొంచెం సిగ్గుపడుతూ మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది. కానీ బాలు పట్టుబడడంతో చివరికి తన మనసులోని మాటను చెబుతుంది. తనకు పెళ్లి అయ్యే వ్యక్తి కనీసం డిగ్రీ చదివి ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఉండాలని, ఇంట్లో అత్తను అమ్మలా భావించాలని, తోడుకోడళ్లను అక్కచెల్లెళ్లలా చూడాలని ఎన్నో కలలు కనేదాన్నని మీనా చెబుతుంది. ఆ మాటలు విన్న బాలు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటాడు. "ఈ లక్షణాల్లో ఒక్కటీ నాలో లేదు. నువ్వు కోరుకున్న జీవితాన్ని నేను ఇవ్వలేకపోయాను" అంటూ బాధపడతాడు.

అయితే మీనా వెంటనే అతనిని సమాధానపరుస్తుంది. "ఇవి అన్నీ లేకపోయినా నన్ను అర్థం చేసుకునే భర్త దొరికాడు. నన్ను ఎవరైనా ఒక్క మాట అన్నా సహించని వ్యక్తి నువ్వు. నాకు అది చాలనిపిస్తుంది" అంటూ బాలు పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. తర్వాత బాలు తన కోరికల గురించి చెప్పమని అడగగా, తనకు పెద్దగా కోరికలు ఏవీ లేవని, తన బామ్మ, నాన్న, కుటుంబం ఆనందంగా ఉండడమే తన జీవితమని చెబుతాడు. ఈ భావోద్వేగ సంభాషణతో ఎపిసోడ్‌కు ప్రత్యేకమైన హైలైట్ ఏర్పడింది.

మరోవైపు.. మనోజ్ ఫర్నిచర్ వ్యాపారం ఇటీవల చాలా డల్‌గా సాగుతుండటంతో అతను కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తాడు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు దీనికి అనుసంధానంగా మరో బిజినెస్ పెట్టాలని భావించి ఆ విషయాన్ని రోహిణికి చెబుతాడు. అయితే ఇదే సమయంలో మనోజ్‌కు అనుకోని శుభవార్త అందుతుంది. అతని పార్క్ ఫ్రెండ్ ఒక్కసారిగా వచ్చి ఒక పెద్ద అవకాశం గురించి చెబుతాడు. "నీకు ఒక ఇంటర్నేషనల్ మెగా డీల్ వచ్చేలా చేస్తాను. అది ఓకే అయితే కోట్లల్లో సంపాదించే అవకాశం ఉంది" అని చెబుతాడు. ఈ మాటలు విన్న మనోజ్ మొదట ఆశ్చర్యపోతాడు. "ఇంటర్నేషనల్ డీల్ అంటే పెద్ద మాటలు కదా" అంటూ కొంచెం లైట్‌గా తీసుకుంటాడు. అయితే అతని స్నేహితుడు మాత్రం ఈ అవకాశాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని చెబుతాడు. "నీ గురించి నేను చాలా హైప్ ఇచ్చాను. నీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, నీ సామర్థ్యం గురించి ఆ పార్టీకీ చాలా గొప్పగా చెప్పాను. అందుకే ఈ డీల్ నీకే వచ్చే అవకాశం ఉంది" అని వివరిస్తాడు.

అంతేకాదు, ఆ ఇంటర్నేషనల్ పార్టీ మరో రెండు రోజుల్లో ఇండియాకు రాబోతుందని, వారిని ఇంప్రెస్ చేయడానికి ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయాలని సూచిస్తాడు. కానీ మనోజ్ మాత్రం ఆలోచనలో పడిపోతాడు. ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బు లేదని, ఇలాంటి పార్టీ ఏర్పాటు చేయడం కష్టం అని చెబుతాడు. అయితే రోహిణి మాత్రం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని సూచిస్తుంది. "ఇలాంటి డీల్ జీవితంలో తరచుగా రావు. ఒకసారి ప్రయత్నించాలి" అంటూ పార్టీ ఏర్పాటు చేయడానికి ఒక ఐడియా ఇస్తుంది. ఆమె మాటలకు మనోజ్ కూడా ఒప్పుకుని ఆ ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. దీంతో కథలో మనోజ్ జీవితంలో పెద్ద మార్పు రాబోతుందనే సంకేతాలు కనిపిస్తాయి.

ఇక మరోవైపు ఇంట్లో మరో ఆసక్తికర సన్నివేశం కనిపిస్తుంది. బాలు తన తల్లి ప్రభావతితో వెటకారంగా మాట్లాడుతూ ఉండగా, అకస్మాత్తుగా రవి, శృతి ఇద్దరూ పరుగెత్తుకుంటూ ఇంటికి చేరుకుంటారు. వారిని చూసిన మీనా ఆశ్చర్యపడి "ఏంటి ఇంత తొందరగా వచ్చారు?" అని ప్రశ్నిస్తుంది. దీనికి రవి సమాధానం ఇస్తూ, "మనోజ్ ఫోన్ చేసి ఒక శుభవార్త చెప్పాలని అన్నాడు. అందుకే త్వరగా వచ్చాం" అని చెబుతాడు. ఇంతలోనే మనోజ్, రోహిణి కూడా ఇంట్లోకి వస్తారు. మనోజ్ ముఖం ఆనందంతో మెరుస్తూ కనిపిస్తుంది. "నేను ఒక శుభవార్త చెప్పాలి" అంటూ చెప్పబోతుండగా, బాలు కూడా వెంటనే "ముందు నేను చెబుతా" అంటూ సరదాగా పోటీ పడతాడు. ఇద్దరూ ఇలా ఒకరితో ఒకరు మాటలు కలిపుకుంటూ ఉండగా ప్రభావతి మధ్యలో జోక్యం చేసుకుంటుంది.

ఆమె హేళనగా మాట్లాడుతూ "ఏరా బాలు... నీకు మహా అంటే ఇంకో ట్రిప్పు వచ్చి ఉంటుందేమో. లేకపోతే నీ పెళ్లానికి 50 మూరల బేరం వచ్చి ఉంటుంది. అంతకంటే పెద్ద శుభవార్త ఏముంటుంది?" అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది. దీంతో అక్కడి వాతావరణం కాస్త అసహజంగా మారుతుంది. అయితే వెంటనే సత్యం స్పందిస్తూ ప్రభావతికి చురక అంటిస్తాడు. "నిన్ను అందుకే రోజూ మూడు కోతుల బొమ్మ చూడమని చెబుతాను. అప్పుడైనా నీ మాటలు తిన్నగా వస్తాయి" అంటూ చురకలు అంటిస్తాడు. దీంతో ప్రభావతి కాస్త సైలెంట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X