Gunde Ninda Gudi Gantalu March 16th Episode: బాలుకి 50 కార్లు.. రెస్టారెంట్ ఓనర్‌గా రవి.. ఫ్యామిలీ డ్రామా..
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో మీనా చెల్లి సుమతికి మంచి పెళ్లి సంబంధం రావడంతో ఇంట్లో అందరూ ఆనందపడతారు. అయితే సుమతి మాత్రం వెంటనే పెళ్లికి అంగీకరించదు. తాను ఇంకా కొంతకాలం ఉద్యోగం చేస్తూ కుటుంబానికి సహాయం చేయాలని, ముఖ్యంగా శివకు ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి గురించి ఆలోచించనని చెబుతుంది. దీంతో ఇంట్లో కొంతసేపు చర్చ జరుగుతుంది. మీనా తన చెల్లిని ఓదార్చుతూ మంచి అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి ఒప్పిస్తుంది. బాలు సరదాగా సుమతిని ఆట పట్టించడంతో ఇంట్లో నవ్వులు వెల్లువెత్తుతాయి. తర్వాత సుమతి కూడా ఒక షరతుతో పెళ్లి చూపులకు అంగీకరిస్తుంది. అబ్బాయి నచ్చితేనే పెళ్లి చేస్తానని చెబుతుంది. కొద్దిసేపటికే పెళ్లి చూపులు జరుగుతాయి. సుమతి, అబ్బాయి ఇద్దరూ బయటకు వెళ్లి మాట్లాడుకుంటారు.
ఆమె స్వభావం, కుటుంబం చూపించిన ఆప్యాయత తనకు చాలా నచ్చాయని అబ్బాయి చెబుతాడు. సుమతి కూడా అతని మాటతీరును మెచ్చుకుంటుంది. చివరకు ఇద్దరూ పెళ్లికి అంగీకరించడంతో కుటుంబ సభ్యులందరూ ఆనందపడతారు. కట్నం అవసరం లేదని అబ్బాయి కుటుంబం చెప్పడంతో మీనా కుటుంబం మరింత సంతోషపడుతుంది. ఇక మరోవైపు రోహిణి జీవితంలో టెన్షన్ పెరుగుతుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ దినేష్ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తాడు. ఈ విషయం బయటకు రాకుండా రోహిణి అబద్ధం చెబుతుంది. సమస్యకు పరిష్కారం కోసం గుణను కలిసిన ఆమెకు, బాలు దగ్గర ఉన్న వీడియో తెచ్చితేనే సహాయం చేస్తానని అతడు షరతు పెడతాడు. మరోవైపు సుమతి పెళ్లి ఖరారవడంతో బాలు, మీనా మధ్య భావోద్వేగ సంభాషణ జరుగుతుంది. అదే సమయంలో మనోజ్‌కు ఒక పెద్ద ఇంటర్నేషనల్ డీల్ అవకాశం రావడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

Photo courtesy: Jio Hotstar
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ అనూహ్య మలుపులతో రసవత్తరంగా సాగింది. కథ ప్రారంభంలోనే బాలు, మనోజ్ ఇద్దరూ ఒకేసారి తమ శుభవార్త చెప్పాలని పోటీ పడటం ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో ప్రభావతి మాత్రం తన స్టైల్లో హేళనగా స్పందిస్తూ, 'ఇంకేముంటుంది నీకు... మహా అయితే పెద్ద ట్రిప్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే మీనాకు వంద దండల ఆర్డర్ వచ్చి ఉండొచ్చు'అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది. దాంతో సత్యం మధ్యలో జోక్యం చేసుకుంటూ ప్రభావతిపై చురకలు వేస్తాడు. 'ప్రభా... అందుకే నిన్ను మూడు కోతుల బొమ్మ చూడమంటాను. ఎందుకంటే చెడు చూడవు, చెడు వినవు, చెడు అనవు అని నేర్పుతుంది' అంటూ ఆమెకు గట్టి కౌంటర్ ఇస్తాడు. ఆ తరువాత బాలను చూసి అసలు శుభవార్త ఏమిటో చెప్పమని అడుగుతాడు. దీంతో బాలు ఆనందంగా మాట్లాడుతూ చిన్నగంప మీనా చెల్లెలు సుమతికి పెళ్లి ఫిక్స్ అయ్యిందని చెబుతాడు. ఈ వార్త విన్న కుటుంబ సభ్యులంతా ఆనందం వ్యక్తం చేస్తారు.
అయితే ప్రభావతి మాత్రం మరోసారి తన స్వభావం మార్చుకోకుండా 'ఏ దిక్కుమాలిన సంబంధం వచ్చిందో' అంటూ వ్యాఖ్యానిస్తుంది. దాంతో బాలు కోపంగా స్పందిస్తూ, 'అమ్మా ఈరోజు కూడా నీ నోటి నుంచి మంచి మాట రాదా? అసలు నీ రోగానికి మందే లేదా? మా అమ్మకు ఈ జీవితంలో మంచి బుద్ధి రాదా?' అంటూ తీవ్రంగా విమర్శిస్తాడు. కుటుంబంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంటుంది. ఇదిలా ఉండగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ మనోజ్ స్పందిస్తాడు. 'సుమతి పెళ్లి ఫిక్స్ అయ్యింది అంటే నిజంగా గుడ్ న్యూస్. మనమందరం దగ్గరుండి పెళ్లి పనులు చూసుకోవాలి' అంటూ అనూహ్యంగా మంచి మాటలు చెబుతాడు. మనోజ్ నుంచి అలాంటి స్పందన వస్తుందని ఎవరూ ఊహించలేదు. అతని మాటలు విన్న వెంటనే బాలు షాక్‌కు గురై స్పృహ తప్పి పడిపోతాడు.
అక్కడే ఉన్న మీనా వెంటనే బాలుని ముఖంపై నీళ్లు చల్లి లేపుతుంది. స్పృహలోకి వచ్చిన బాలు మతి తప్పిన వ్యక్తిలా 'ఏంటి ఈ రాజ్యం... నా పరివారం ఎక్కడ?' అంటూ విచిత్రంగా మాట్లాడటం మొదలుపెడుతాడు. తరువాత మనోజ్ చెప్పింది నిజమా అని అడుగుతాడు. అందుకు మనోజ్, రోహిణి ఇద్దరూ 'అవును... మనమందరం సుమతి పెళ్లికి వెళ్లి సహాయం చేద్దాం. అది మన ఇంటి పెళ్లి లాంటిదే'అని చెబుతారు. అయినా బాలు మాత్రం నమ్మలేక "ఇది నమ్మశక్యం కాని నిజం" అంటూ ఆశ్చర్యపడుతాడు. తర్వాత సత్యం మనోజ్ శుభవార్త ఏమిటో అడుగుతాడు. వెంటనే బాలు మధ్యలోకి వచ్చి మళ్లీ వ్యంగ్యంగా మాట్లాడుతూ 'ఇల్లు తాకట్టు పెట్టబోతున్నాడా? లేక అప్పు అడగబోతున్నాడా?'అంటూ పంచ్ వేస్తాడు. దాంతో రోహిణి స్పందిస్తూ మనోజ్‌కు ఇప్పుడు అలాంటి అవసరం లేదని చెబుతుంది.
ఇంతలో మీనా కూడా మొదటిసారి బాలుని ఆపుతూ, 'మీ అన్నయ్య మొదటిసారి మంచి మాటలు మాట్లాడుతున్నారు... కాస్త సైలెంట్‌గా ఉండండి' అని చెబుతుంది. దీంతో మనోజ్ తన అసలు శుభవార్త చెబుతూ, 'వచ్చే శనివారం నా జీవితంలో మర్చిపోలేని రోజు'అంటాడు. వెంటనే బాలు మళ్లీ వ్యంగ్యంగా స్పందిస్తూ 'నీ ఫర్నిచర్ షాప్‌కు వంద రోజులు పూర్తయ్యాయి కదా అదే సెలబ్రేషన్ కదా?'అని అడుగుతాడు. అప్పుడు మీనా అసలు విషయాన్ని బయటపెడుతూ అది వారి మ్యారేజ్ యానివర్సరీ అని చెబుతుంది. రోహిణి కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తుంది. దీంతో బాలు మరోసారి పంచ్ వేస్తూ 'మనోజ్ నోటితో ఒక శుభవార్త కూడా రావడం లేదు కాబట్టి నువ్వే చెప్పించుకున్నావేమో' అంటూ సెటైర్ వేస్తాడు.
తరువాత మనోజ్ మాట్లాడుతూ తమ మ్యారేజ్ యానివర్సరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని చెబుతాడు. అయితే సత్యం మాత్రం ఇంత ఖర్చు అవసరమా అని ప్రశ్నిస్తూ ఇంట్లో సింపుల్‌గా చేసుకుంటే సరిపోతుందని సలహా ఇస్తాడు. దీనికి ప్రభావతి వెంటనే స్పందిస్తూ 'వాళ్ల స్టేటస్‌కు తగ్గట్టే గ్రాండ్‌గా చేయాలి'అంటూ గొప్పలు చెబుతుంది. అయితే మనోజ్ అసలు కారణాన్ని వెల్లడిస్తూ ముంబై నుంచి ఒక ఇంటర్నేషనల్ డీలర్ వస్తున్నాడని, అందుకే గ్రాండ్‌గా మ్యారేజ్ యానివర్సరీ ప్లాన్ చేశామని చెబుతాడు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ గురించి ప్లాన్ చేయాలని రవిని పైకి రావాలని మనోజ్ కోరుతాడు.
అప్పుడు ప్రభావతి మళ్లీ అడ్డుపడుతుంది. దాంతో మీనా కోపంగా స్పందిస్తూ 'ఎందుకు ప్రతి విషయంలో సవతి తల్లిలాగా అడ్డుపడుతున్నారు? మొదటిసారి అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఒక విషయం మాట్లాడుకుంటున్నారు. అది చూసి సంతోషించాలి'అంటూ ప్రభావతికి గట్టి కౌంటర్ ఇస్తుంది. వాటిని పట్టించుకోకుండా మనోజ్ తన తమ్ముళ్లను పై అంతస్తుకు రమ్మని కోరుతాడు. చివరకు బాలు, రవి ఇద్దరూ అతనితో కలిసి పైకి వెళ్లి ప్రోగ్రాం గురించి చర్చ మొదలుపెడతారు. అక్కడికి వెళ్లిన తర్వాత బాలు నేరుగా ప్రశ్నిస్తూ, 'ఏం జరిగింది? ఎందుకింత టెన్షన్ పడుతున్నావ్?' అని అడుగుతాడు.
అప్పుడు మనోజ్ అసలు విషయాన్ని వెల్లడిస్తాడు. 'రేపు ఒక ఫారెన్ డీలర్ ఇండియాకు వస్తున్నాడు. అతడు చాలా పెద్ద బిజినెస్‌మాన్. తన బిజినెస్‌ను ఇంకా విస్తరించడానికి మంచి పార్ట్నర్ కోసం చూస్తున్నాడు. ఆ అవకాశం నాకు దక్కితే నా బిజినెస్ భారీగా అభివృద్ధి చెందుతుంది. కోట్లలో లాభాలు వస్తాయి. మన కుటుంబం సుఖంగా జీవించగలుగుతుంది' అని తన కలను వివరంగా చెబుతాడు. ఇదికాకుండా తాను కుటుంబంలో పెద్ద కొడుకుగా ఎన్నో బాధ్యతలు ఉన్నాయని కూడా మనోజ్ చెబుతాడు. 'ఈ కుటుంబాన్ని నేను సెట్ చేయాలి. ముందు నా బిజినెస్ బాగుంటేనే మన అందరి కోరికలు తీరుతాయి. అమ్మ కూడా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. వాటిని నెరవేర్చాలి. అందుకే ఈ డీల్ నాకు చాలా ముఖ్యమైంది'అంటూ భావోద్వేగంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు.
అయితే రవి సందేహంగా స్పందిస్తూ, 'సరే... ఈ విషయం మాకు ఎందుకు చెబుతున్నావు? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?'అని ప్రశ్నిస్తాడు. దానికి మనోజ్ ఇచ్చిన సమాధానం ఇద్దరికీ షాక్ ఇస్తుంది. 'ఇలాంటి డీల్స్ ఇచ్చేవాళ్లు కేవలం వ్యక్తిని మాత్రమే కాదు... అతని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా చూస్తారు. అందుకే నేను మీ గురించి అబద్ధం చెప్పాను' అని చెబుతాడు. మనోజ్ మాటలు విన్న బాలు ఆశ్చర్యపోతాడు. వెంటనే మనోజ్ వివరంగా చెబుతూ, 'బాలు 50 కార్లకు ఓనర్ అని చెప్పాను. రవిని ఒక పెద్ద రెస్టారెంట్ ఓనర్ అని చెప్పాను. ఇప్పుడు మీ ఇద్దరి సహాయం కావాలి. మీరు కూడా అలా రిచ్‌గా కనిపించాలి' అని తన ప్లాన్‌ను బయటపెడతాడు.
ఇది విన్న వెంటనే బాలు కోపంతో స్పందిస్తూ, 'ఇప్పుడు అర్థమైంది... అందుకేనా సుమతి పెళ్లి విషయంలో అంత సాఫ్ట్‌గా మాట్లాడావు!' అంటూ మనోజ్‌పై మండిపడతాడు. ఇదే సమయంలో రవి కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతాడు. 'మా బ్యాక్‌గ్రౌండ్ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను రెస్టారెంట్‌లో చెఫ్‌గా పని చేస్తున్నాను. బాలు రెంట్ కార్లు నడుపుతున్నాడు. మా వృత్తుల్లో మేము హుందాగా, నిజాయితీగా జీవిస్తున్నాం. ఎవరినీ మోసం చేయడం లేదు' అని అంటాడు. అయితే మనోజ్ మాత్రం తన వాదనను కొనసాగిస్తూ, 'మీ నిజమైన బ్యాక్‌గ్రౌండ్ చెప్పితే ఆ డీల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అబద్ధం చెప్పాను. ఇప్పుడు మీరు ఇద్దరూ రిచ్‌గా కనిపిస్తే చాలు. మిగతా అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. కనీసం మన కుటుంబం కోసం ఈ చిన్న సహాయం చేయండి' అంటూ వేడుకుంటాడు.
అంతేకాదు, తన మాటలను మరింత బలపరచడానికి బాలను ఆకట్టుకునే ఆఫర్ కూడా ఇస్తాడు. "నన్ను పొగిడిన ప్రతిసారి నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను" అంటూ బాలకు లంచం లాంటి ఆఫర్ చేస్తాడు. దాంతో బాలు కూడా తన స్టైల్లో స్పందిస్తూ, "సరేలే... కనీసం వెయ్యి రూపాయల కోసం అయినా ఒప్పుకుంటా" అంటూ మనోజ్ అభ్యర్థనను అంగీకరిస్తాడు. ఇలా మనోజ్ బిజినెస్ డీల్ కోసం అన్నదమ్ముల సహాయం కోరడం, వారి మధ్య జరిగిన వాదనలు, చివరికి బాలు అంగీకరించడం వంటి సన్నివేశాలతో ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది.
ఇక మరోవైపు మనోజ్ ప్లాన్‌ను సక్సెస్ చేయడానికి రోహిణి కూడా తనవంతు ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ విషయంపై తన తోడికోడలు మీనాను ఒప్పించాలని ప్రయత్నిస్తూ సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. అయితే మీనా మాత్రం మొదట నుంచే అబద్ధాలు చెప్పడం తనకు ఇష్టం లేదని స్పష్టంగా చెబుతుంది. 'ఇలా అబద్ధం చెప్పి ఇతరులను మోసం చేయడం నాకు నచ్చదు'అంటూ తేల్చి చెబుతుంది. అయితే రోహిణి మాత్రం తగ్గేది లేదన్నట్టు పట్టు పడుతుంది. 'ఇది మన కుటుంబం కోసం చేస్తున్న పని. మనమందరం కలిసికట్టుగా ఉంటేనే ఈ పని సక్సెస్ అవుతుంది' అంటూ ఒక మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంది. కుటుంబం కోసం చిన్న సహాయం చేయడం తప్పు కాదని చెప్పి మీనాను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది.
అంతలోనే మనోజ్ ఫోన్ చేసి మరో షాక్ ఇస్తాడు.'మనకు సహాయం చేయడానికి బాలు, రవి ఇద్దరూ ఇప్పటికే ఒప్పుకున్నారు' అని చెబుతాడు. ఈ మాట విన్న మీనా మొదట షాక్ అవుతుంది. కానీ బాలు కూడా ఈ ప్లాన్‌కు ఒప్పుకున్నాడని తెలిసిన తర్వాత తాను కూడా అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్లాన్ సక్సెస్ కావాలంటే అందరూ రిచ్ లుక్‌లో కనిపించాలంటూ రోహిణి మరో ప్లాన్ చెబుతుంది. అందరికీ తానే ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ తీసుకొస్తానని, మేకప్ కూడా తానే చూసుకుంటానని హామీ ఇస్తుంది. ఇలా గ్రాండ్‌గా కనిపిస్తేనే ఫారెన్ డీలర్‌ను ఇంప్రెస్ చేయగలమని చెప్పి అందరినీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
అయితే మీనా మనసులో మాత్రం సందేహాలు తీరవు.'మనం మోసం చేస్తున్నామనే ఫీలింగ్ వస్తోంది. అబద్ధం చెప్పడం నాకు నచ్చడం లేదు. నిజం లేకుండా ఉన్నట్లు నటించడం తప్పు. ఇలా చేసి మనకు కావాల్సినది రావడం సరైనది కాదు' అని తన ఆందోళన వ్యక్తం చేస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవారికి ఈ విషయం తెలిసితే ఖచ్చితంగా కోప్పడతారని కూడా చెబుతుంది. కానీ రోహిణి మాత్రం మళ్లీ మళ్లీ రిక్వెస్ట్ చేస్తూ, 'బాలు, రవి కూడా కుటుంబం కోసం ఒప్పుకున్నారు. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మన పని అయిపోతుంది'అంటూ ఒప్పిస్తుంది. చివరకు రోహిణి పట్టుదల ముందు మీనా, శృతి ఇద్దరూ కూడా సహాయం చేయడానికి అంగీకరిస్తారు. ఇదే సమయంలో శృతి తన స్టైల్లో పంచ్ వేస్తూ 'ఇదేనేమో బిల్డప్ ఎక్కువ... బిజినెస్ తక్కువ' అంటూ వ్యాఖ్యానించడం హైలెట్‌గా మారుతుంది. దీంతో ఈ మొత్తం సన్నివేశం ఒక ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకులను నవ్విస్తుంది.
ఇదిలా ఉండగా రాత్రి సమయంలో బాలు ఒంటరిగా కూర్చొని జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ కనిపిస్తాడు. అప్పుడే మీనా అక్కడికి వచ్చి బాలుకు నమస్కారం చేస్తూ కాళ్లకు మొక్కుతుంది. ఇది చూసి ఆశ్చర్యపోయిన బాలు 'ఏంటి ఇలా కాళ్లకు మొక్కుతున్నావ్?' అని అడుగుతాడు. దానికి మీనా వ్యంగ్యంగా స్పందిస్తూ 'మీరు ఇప్పుడు 50 కార్లకు ఓనర్ కదా... అందుకే మొక్కుతున్నా'అని సెటైర్ వేస్తుంది. వెంటనే బాలు కూడా తన స్టైల్లో కౌంటర్ ఇస్తూ 'నువ్వు కూడా 50 కార్ల ఓనర్ పిల్లవే కదా' అంటూ పంచ్ వేస్తాడు. అయితే మీనా వెంటనే అసలు విషయాన్ని ప్రస్తావిస్తూ "ఇదంతా ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు?" అని సందేహంగా అడుగుతుంది. దానికి బాలు స్పందిస్తూ 'వాడు తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు. ఇలా డ్రామాలు చేయడం వాళ్లకు కొత్త కాదు'అని చెబుతాడు.
అయినా మీరు ఎలా ఒప్పుకున్నారు అని మీనా అడగడంతో బాలు అసలు విషయం చెబుతాడు. "ఇది మోసం కాదు... బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పి నన్ను ఒప్పించాడు" అని చెబుతాడు. దానికి మీనా కూడా తన మనసులోని మాట బయటపెడుతుంది. "నాకు కూడా ఇలా మోసం చేయడం ఇష్టం లేదు. కానీ మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీ మీద నమ్మకంతో నేనూ ఒప్పుకున్నా" అని చెబుతుంది. ఇక చివరగా బాలు కూడా "ఈ డ్రామాలో నిజం బయటపడకుండా ఎంతసేపు వర్కౌట్ చేస్తానో ఆ దేవుడికే తెలుసు" అంటూ దేవుడిని ప్రార్థించడం ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఇలా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ డిస్కషన్‌తో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇక వచ్చే ఎపిసోడ్‌లో రోహిణి తన ప్లాన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. గ్రాండ్ మ్యారేజ్ యానివర్సరీ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేస్తూ, అదే సమయంలో బాలుని నుంచి ఫోన్ కొట్టేయాలనే మరో కుట్రను కూడా సిద్ధం చేస్తుంది. ఈ యానివర్సరీ ప్రోగ్రామ్‌కు అందరూ రాయల్ లుక్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఈ అబద్ధాల డ్రామా ఎంతవరకు సాఫీగా సాగుతుంది? ఎక్కడైనా నిజం బయటపడుతుందా? అన్న ఉత్కంఠతో ప్రేక్షకులు తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











