Gunde Ninda Gudi Gantalu March 17th Episode: ప్రభావతి,సత్యం డ్యూయెట్.. బాలుపై కుట్ర, మనోజ్ ప్లాన్ రివీల్..
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్ అనూహ్య మలుపులతో ఆసక్తికరంగా సాగింది. ప్రారంభంలోనే బాలు, మనోజ్ తమ శుభవార్త చెప్పేందుకు పోటీ పడగా, ప్రభావతి తన వ్యంగ్యంతో వాతావరణాన్ని మార్చింది. అయితే సత్యం ఆమెకు కౌంటర్ ఇస్తూ పరిస్థితిని సమతుల్యం చేశాడు. అనంతరం బాలు సుమతి పెళ్లి ఫిక్స్ అయ్యిందని చెప్పడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ప్రభావతి మరోసారి నెగెటివ్‌గా స్పందించడంతో బాలు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో మనోజ్ అనూహ్యంగా పాజిటివ్‌గా స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని మాటలు విని బాలు షాక్ అవుతూ కాసేపు విచిత్రంగా ప్రవర్తించడం ఎపిసోడ్‌కు హాస్యాన్ని జోడించింది.
తరువాత మనోజ్ తన మ్యారేజ్ యానివర్సరీని గ్రాండ్‌గా చేయాలని చెప్పగా, దాని వెనుక అసలు కారణం బయటపడింది. ముంబై నుంచి వచ్చే ఇంటర్నేషనల్ డీలర్‌ను ఇంప్రెస్ చేయడానికి ఈ ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించాడు. కీలకంగా, ఆ డీల్ కోసం తన ఫ్యామిలీని రిచ్‌గా చూపించాలని మనోజ్ చెప్పడం ట్విస్ట్‌గా మారింది. బాలు, రవి తమ నిజాయితీపై నిలబడినా, చివరకు కుటుంబం కోసం సహాయం చేయడానికి అంగీకరించారు. మరోవైపు రోహిణి కూడా మీనాను ఒప్పించడానికి ప్రయత్నించగా, మొదట నిరాకరించిన మీనా చివరికి ఒప్పుకుంది. చివరిలో బాలు-మీనాల మధ్య జరిగిన సంభాషణ భావోద్వేగంతో పాటు హాస్యాన్ని కలిపింది. అబద్ధాలపై మీనా సందేహాలు, బాలు ఆందోళన ఎపిసోడ్‌కు బలం చేకూర్చాయి. మొత్తం మీద ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఎమోషన్స్ మేళవింపుగా మారింది.

Photo courtesy: Jio Hotstar
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో కథ మరింత ఉత్కంఠభరితంగా మలుపులు తిరిగింది. ఎపిసోడ్ ప్రారంభంలో బాలు, మీనా ఇద్దరూ మనోజ్-రోహిణి వేస్తున్న నాటకాల గురించి ఆలోచిస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా బాలు మాత్రం ఈ డ్రామాలో తాను ఎంతసేపు కంట్రోల్‌లో ఉండగలనో తెలియదని, 'ఎలా హ్యాండిల్ చేస్తానో ఆ దేవుడికే తెలుసు'అంటూ తన ఆందోళనను వ్యక్తం చేస్తాడు. ఈ సన్నివేశం కథలో టెన్షన్‌ను పెంచుతుంది.
మరుసటి రోజు మనోజ్-రోహిణిలు తమ మ్యారేజ్ యానివర్సరీతో పాటు ఫర్నిచర్ షాప్ 100 రోజుల వేడుకలను గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీగా ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఫ్లెక్సీలు, హోల్డింగ్స్‌తో ఆర్భాటంగా ప్లాన్ చేస్తారు. ముఖ్యంగా వారి డ్రెస్సింగ్, లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. ఒక్కొక్కరు కోటీశ్వరుల్లా కనిపించడం ఈ ఎపిసోడ్‌కు ప్రత్యేక హైలెట్‌గా నిలుస్తుంది. ఈ వేడుకకు రోహిణి ఫ్రెండ్ విద్య కూడా హాజరవుతుంది. ఫంక్షన్ గ్రాండ్యూర్ చూసి ఆశ్చర్యపోయిన విద్య, 'ఇంత రాయల్‌గా అందరినీ కోటీశ్వరుల్లా మార్చేసావ్?'అంటూ ప్రశ్నిస్తుంది. దీనికి రోహిణి అసలు ప్లాన్‌ను బయటపెడుతుంది. 'మనోజ్‌కు ఒక ఇంటర్నేషనల్ డీల్ రాబోతోంది. అది కుదిరితే లైఫ్ మొత్తం సెటిల్. అందుకే డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డులు, లోన్స్ తీసుకుని ఈ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాం'అని చెబుతుంది.
ఇది విన్న విద్య కూడా షాక్ అవుతూ, 'ఒక్క రూపాయి ఖర్చు చేయని మనోజ్ ఇలా చేయడం నిజంగా సాహసమే' అంటుంది. అయితే రోహిణి మాత్రం 'లక్షల్లో ఖర్చు పెడితే కోట్లలో రాబడి వస్తుంది'అంటూ అసలు గేమ్ ప్లాన్‌ను వెల్లడిస్తుంది. ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. పార్టీ విషయం పక్కన పెట్టి, బాలు దగ్గర ఉన్న ఫోన్‌ను ఎలా దొంగిలించాలో ఆలోచించమని రోహిణి విద్యకు చెబుతుంది. 'ఈ ఛాన్స్ మిస్ అయితే చాలా నష్టం'అంటూ ఆమె హెచ్చరిస్తుంది. దీనికి విద్య కూడా అంగీకరిస్తూ, 'ఈసారి ఏదైనా చేసి బాలు దగ్గర నుంచి ఆ ఫోన్ తీసుకువస్తాను'అని హామీ ఇస్తుంది.
మరోవైపు.. గ్రాండ్ ఈవెంట్‌కు వచ్చిన అతిథులను మనోజ్ స్వయంగా రిసీవ్ చేస్తూ పెద్ద బిజినెస్‌మాన్‌లా బిల్డప్ ఇస్తాడు. అతని స్టైల్, కాన్ఫిడెన్స్ చూసి రోహిణి ఇంప్రెస్ అవుతుండగా, మనోజ్ వెంటనే ఆమెను హగ్ చేసుకుని పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఈ సన్నివేశాన్ని గమనించిన విద్య సరదాగా 'ఇది సినిమా డైలాగ్స్‌లా ఉంది' అంటూ పంచ్ వేయడం నవ్వులు పూయిస్తుంది. ఈ సందర్భంగా మనోజ్ 'ఈ డీల్ ఓకే అయితే మనం కోటీశ్వరులు అవుతాం. ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ పోతాయి' అంటూ భావోద్వేగంగా చెబుతాడు. దీనికి విద్య కూడా 'ఇదే మాట రోహిణి కూడా ముందే చెప్పింది'అని అంటుంది. అయితే వెంటనే మనోజ్ 'బాలు కాస్త డేంజర్... అతడిపై ఒక కంట పెట్టాలి'అని చెబుతాడు.
ఇక మరోవైపు ప్రభావతి గ్రాండ్, రాయల్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమెను చూసిన మీనాక్షి పొగడ్తలతో ముంచెత్తగా, ప్రభావతి కూడా మరింత బిల్డప్ ఇస్తూ 'మనోజ్ ఫంక్షన్ అంటే ఇలానే ఉంటుంది... అతను నా కొడుకు కదా!' అంటూ గర్వంగా చెప్పుకొస్తుంది. మీనాక్షి కూడా సరదాగా 'ఈ లుక్‌లో చూస్తే అన్నయ్య మళ్లీ పెళ్లి చేసుకుని హనీమూన్‌కు వెళ్తాడు'అంటూ ఆటపట్టిస్తుంది. ఈ సమయంలో సత్యం ఎంట్రీ ఇవ్వడం కథకు కొత్త మజా తెస్తుంది. ప్రభావతి అతడిని ఆటపట్టించాలని వెనక నుంచి కళ్ళు మూసేస్తుంది. అయితే సత్యం కూడా తన స్టైల్లో 'హైమావతి... ప్రేమావతి...' అంటూ అసలు పేరు చెప్పకుండా ఆటపట్టిస్తాడు. దీంతో ప్రభావతి కాస్త అసహనానికి గురవుతుంది.
అయినా ఆగకుండా సత్యం మరింతగా ఆటపట్టిస్తూ, 'ఇంత అందమైన అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు... మీరు ఏ సినిమాలో హీరోయిన్?'అంటూ గుర్తుపట్టనట్లు నటిస్తాడు. చివరకు ప్రభావతి తనే అని చెప్పగానే, 'పబ్బి నువ్వేనా... అస్సలు గుర్తుపట్టలేకపోయాను'అంటూ సత్యం ఆశ్చర్యపోయినట్టు నటిస్తాడు. దీంతో ప్రభావతి ఆనందంలో తేలిపోతుంది.
ఇక ఈ సన్నివేశాన్ని చూసిన మీనాక్షి, వీరిద్దరూ డ్యూయెట్ పాటకు డాన్స్ చేస్తున్నట్టుగా ఊహించుకోవడం మరో హైలెట్‌గా నిలుస్తుంది. తరువాత సత్యం మీనాక్షితో మాట్లాడుతూ, 'డ్రెస్ మాత్రమే కాదు మనసు కూడా అందంగా ఉండాలి' అంటూ ప్రభావతిపై మరోసారి చురకలు వేయడం ఎపిసోడ్‌కు ముగింపు టచ్ ఇస్తుంది.
ఫైవ్ స్టార్ హోటల్‌లో జరుగుతున్న గ్రాండ్ ఫంక్షన్‌కు అందరూ స్టైలిష్ లుక్స్‌తో ఎంట్రీ ఇస్తారు. అయితే అందరి కంటే కాస్త లేటుగా బాలు, మీనా రావడం గమనార్హం. ఇదే సమయంలో ప్రభావతి తన స్వభావానికి తగ్గట్టుగా 'వాళ్లు రాకుండా ఎగ్గొట్టినట్లున్నారు... వచ్చినా పెరుగన్నం, సద్దన్నంలా ఉంటారు'అంటూ హేళన చేస్తుంది. అయితే ఆమె మాటలకు పూర్తి విరుద్ధంగా, బాలు హీరోలా - మీనా హీరోయిన్‌లా గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. ఇద్దరూ చేతులు పట్టుకుని స్టైలిష్‌గా వాక్ చేస్తూ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వారిని చూసి అక్కడ ఉన్నవారంతా ఫిదా అవుతారు. ప్రభావతి కూడా కాసేపు మాట రాక మూగబోయినట్టే అవుతుంది. మీనాక్షి అయితే ఇదే సమయంలో 'ఎవ్వరూ పెరుగన్నం అనుకున్నావు కదా... ఇప్పుడు చూడు'అంటూ ప్రభావతికి కౌంటర్ ఇస్తుంది.
మనోజ్ కూడా బాలుని లుక్ చూసి షాక్ అవుతూ 'వాడిని చూస్తే కార్ల కంపెనీ ఓనర్‌లా ఉన్నాడు' అంటూ పొగిడేస్తాడు. సత్యం దీనిపై ప్రశ్నించగా, మనోజ్ వెంటనే టాపిక్‌ను డైవర్ట్ చేస్తూ తప్పించుకుంటాడు. అందరూ బాలు-మీనాలను ప్రశంసల్లో ముంచెత్తినా, ప్రభావతి మాత్రం తన స్టైల్ మార్చుకోకుండా 'ఎంత రెడీ అయినా వాడు డ్రైవింగ్ చేయాల్సిందే' అంటూ మళ్లీ సెటైర్ వేస్తుంది. ఇక బాలు తన స్టైల్లో ప్రభావతిని ఆటపట్టిస్తూ 'ఇంతకీ మీరు ఎవరు... ఏ బస్సులో వచ్చారు?' అని పంచ్ వేయడంతో అక్కడ ఉన్నవాళ్లంతా నవ్వుల్లో మునిగిపోతారు. మీనా పరిస్థితిని సర్దిచెప్పుతూ ప్రభావతిని పొగిడే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్యలో బాలు-మీనాల మధ్య రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఒకరినొకరు పొగిడుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తారు.
ఇదే సమయంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. మనోజ్ తొందరలో బాలును ఢీ కొట్టడంతో ఫోన్ కింద పడుతుంది. వెంటనే విద్య ఆ ఫోన్‌పై ఆసక్తి చూపిస్తూ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ బాలు మాత్రం తన ఫోన్ ఇవ్వకుండా కఠినంగా స్పందించడంతో, రోహిణి-విద్య ప్లాన్ మరోసారి ఫెయిల్ అవుతుంది. ఇక రాబోయే ఎపిసోడ్‌లో కథ మరింత ఉత్కంఠకు చేరనుంది. పార్టీ మూడ్‌లో అన్నదమ్ములు ఫారిన్ డీలర్‌తో కలిసి మద్యం సేవించే సన్నివేశాలు కనిపించనున్నాయి. మద్యం మత్తులో బాలు అసలు నిజం బయటపెట్టేలా కనిపించడం పెద్ద ట్విస్ట్‌గా మారింది.
ఈ పరిణామాలతో మనోజ్ ఆశపడుతున్న ఇంటర్నేషనల్ డీల్ కుదురుతుందా? బాలు చెప్పే నిజం వల్ల ప్లాన్ మొత్తం తారుమారవుతుందా? ఈ విషయం సత్యంకు తెలిసితే అతని రియాక్షన్ ఎలా ఉంటుందనే అంశాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కుటుంబంలో కొత్త వివాదాలకు దారితీసే ఈ ట్విస్టులతో రాబోయే ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications










