Gunde Ninda Gudi Gantalu March 19th Episode: మత్తులో డీల్ క్యాన్సిల్.. 50 లక్షల నష్టం.. బాలుతో మనోజ్ కష్టాలు
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్‌లో మనోజ్-రోహిణి అనివర్సరీ పార్టీ హంగామా మరింత ఉత్కంఠగా కొనసాగింది. ఫైవ్ స్టార్ హోటల్‌లో జరుగుతున్న ఈ గ్రాండ్ వేడుకలో ప్రతి సన్నివేశం ట్విస్టులతో ఆకట్టుకుంది. ప్రారంభంలో బాలు-మీనా కలిసి సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే, రోహిణి వారి ఫోన్ దొంగిలించాలనే ప్లాన్‌తో దగ్గరవుతుంది. కానీ బాలు తెలివిగా స్పందించి అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె ప్రయత్నం మళ్లీ విఫలమవుతుంది. దీంతో విద్యతో కోపంగా మాట్లాడిన రోహిణి, ఎలాగైనా ఫోన్ దక్కించుకోవాలని పట్టుదల చూపుతుంది.ఇక ముంబై నుంచి వచ్చిన డీలర్ ముఖేష్ ఎంట్రీతో కథకు కొత్త మలుపు తిరుగుతుంది. మనోజ్ తన ఫ్యామిలీని అతని ముందుకు గొప్పగా ప్రెజెంట్ చేస్తూ భారీ బిల్డప్ ఇస్తాడు.
సత్యంను గొప్ప తండ్రిగా, ప్రభావతిని ప్రముఖ డాన్సర్‌గా పరిచయం చేయడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు బాలు, మీనా, శృతి, రవి సరదాగా ప్రవర్తించడం మనోజ్‌కు నచ్చక, వారిని లో క్లాస్‌గా చూపించే ప్రయత్నం చేస్తాడు. తర్వాత కేక్ కటింగ్ సందర్భంగా సత్యం ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అతని మాటలకు ఇంప్రెస్ అయిన ముఖేష్, మనోజ్‌కు డీలర్‌షిప్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో కుటుంబం ఆనందంలో మునిగిపోతుంది. అయితే మరోవైపు బాలు ఫారెన్ లిక్కర్ విషయంలో తొలుత వెనుకంజ వేసినా, చివరకు తాగాలని నిర్ణయించుకోవడం కొత్త టెన్షన్‌కు దారితీసింది. మీనా ఇంటికి వెళ్లాలని కోరినా, పరిస్థితులు మారిపోవడంతో అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ పరిణామాలతో రాబోయే ఎపిసోడ్‌లో బాలు వల్ల పెద్ద ట్విస్ట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Photo courtesy: Jio Hotstar
గురువారం ఎపిసోడ్ పూర్తిగా హై డ్రామా, ఉత్కంఠతో సాగింది. మనోజ్-రోహిణి వెడ్డింగ్ అనివర్సరీ పార్టీ మరింత గ్రాండ్‌గా కొనసాగుతుండగా, ముంబై నుంచి వచ్చిన చీఫ్ గెస్ట్ ముఖేష్ కోసం ప్రత్యేకంగా మందు పార్టీ ఏర్పాటు చేయడం కథకు కీలక మలుపుగా మారింది. ఈ సందర్భంగా ముఖేష్, మనోజ్‌ను బలవంతంగా తాగమని ఒత్తిడి చేస్తాడు. 'మీరు తాగితేనే డీల్... లేకపోతే క్యాన్సిల్' అంటూ కండిషన్ పెట్టడంతో, ఇష్టం లేకపోయినా మనోజ్ పెగ్గు వేయాల్సి వస్తుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన రవిని కూడా ముఖేష్ వదిలిపెట్టడు. మొదట రవి సందేహంగా ఉన్నా, 'గెస్ట్ ను అవమానించకూడదు" అంటూ చెప్పిన మాటలకు లోబడి అతడూ మద్యం తాగడం ప్రారంభిస్తాడు. కొద్దిసేపటికే ఇద్దరూ మత్తులోకి వెళ్లిపోవడం పార్టీ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
ఇక మరోవైపు బాలు మాత్రం తన తండ్రి ఇచ్చిన మాట ప్రకారం పార్టీకి దూరంగా ఉంటాడు. కానీ రవి కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తే, అక్కడ మద్యం విందు జోరుగా సాగుతుండటం గమనిస్తాడు. ఆ పరిస్థితిని చూసి కంగారుపడిన బాలు, తనను తాను కంట్రోల్ చేసుకోవడం కష్టమని భావిస్తాడు. ఈ సమయంలో ఆనందంలో ఉన్న ముఖేష్, మనోజ్‌కు భారీ కాంట్రాక్ట్ డీల్ ప్రకటిస్తూ, వెంటనే అగ్రిమెంట్‌పై సైన్ చేయమని చెబుతాడు. అయితే బాలు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ 'మత్తులో సైన్ చేయడం మంచిది కాదు' అని చెప్పినా, మనోజ్ పట్టించుకోకుండా డాక్యుమెంట్ చదవకుండానే సైన్ చేస్తాడు.
తర్వాత బాలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించగా, ముఖేష్ అతడిని కూడా తాగమని బలవంతం చేస్తాడు. మొదట సింపుల్‌గా పెగ్గు వేసిన బాలు, ఆ తర్వాత కంట్రోల్ కోల్పోయి బాటిల్ ఎత్తి వరుసగా తాగడం ప్రారంభిస్తాడు. అతడి చూసి అక్కడున్న అతిథులంతా షాక్ అవుతారు. ఇక మద్యం పార్టీ హంగామా మధ్య మనోజ్ ఫ్రెండ్ మణికంఠ పూర్తిగా మత్తులో తూలుతూ బయటకు వెళ్లడం హాస్యాన్ని పంచింది. అతని పరిస్థితిని చూసి బాలు, రవి ఇద్దరూ సరదాగా కామెంట్లు చేసుకుంటుండగా, ముఖేష్ వారికి అనుమానం వచ్చి 'నా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా?' అని ప్రశ్నిస్తాడు. వెంటనే బాలు పరిస్థితిని సర్దిచెప్పేందుకు అతడిని పొగడ్తలతో ముంచెత్తుతూ "మీరు మా పాలేటి దైవం... మనోజ్ జీవితాన్ని మార్చిన వ్యక్తి" అంటూ టాపిక్‌ను డైవర్ట్ చేస్తాడు.
ఈ సందర్భంలో ముఖేష్ బాలును పాట పాడమని ఫోర్స్ చేయడంతో, బాలు మాస్ స్టైల్‌లో పాట పాడుతూ స్టెప్పులు వేస్తాడు. అతని ఎంటర్‌టైన్‌మెంట్ చూసి గెస్ట్‌లందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. దీంతో ఇంప్రెస్ అయిన ముఖేష్ 'మీ లాంటి ఫ్రెండ్స్ దొరకడం అదృష్టం' అంటూ ప్రశంసలు కురిపిస్తాడు. సత్యం గురించి కూడా గొప్పగా మాట్లాడుతూ అతనిపై గౌరవాన్ని వ్యక్తం చేస్తాడు. అయితే ఈ ఆనంద వాతావరణంలోనే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.
మద్యం మత్తులో ఉన్న బాలు ఒక్కసారిగా నిజాలు బయటపెడుతూ, 'నాకు 40 కార్లు లేవు... రెండు మాత్రమే ఉన్నాయి. మీనా పూల తోటలు కాదు, పూలు అమ్ముతుంది. రవి రెస్టారెంట్ ఓనర్ కాదు, చెఫ్ మాత్రమే' అంటూ అసలు పరిస్థితిని చెబుతాడు. ఈ మాటలు విన్న ముఖేష్ షాక్ అవుతూ మనోజ్‌ను ప్రశ్నించగా, అతడు కూడా నిజమేనని ఒప్పుకుంటాడు. దీంతో కోపంతో ముఖేష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ మిగతా వాళ్లు మత్తులో ఉండటంతో ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకోరు.
ఇదే సమయంలో మీనా వచ్చి బాలును తాగి ఉండటం చూసి షాక్ అవుతుంది. అయినా పరిస్థితిని కంట్రోల్ చేస్తూ ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. శృతి రవిని, రోహిణి మనోజ్‌ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే మత్తులో ఉన్న వారు అదుపు తప్పి ప్రవర్తిస్తుంటారు. ఈ గందరగోళంలోనే రోహిణి తన ప్లాన్‌ను అమలు చేస్తుంది. ఇదే సరైన ఛాన్స్‌గా భావించి, బాలు కోట్‌లోని ఫోన్‌ను దొంగిలించి మనోజ్ కోట్‌లో వేస్తుంది. దీంతో కథ మరో కీలక మలుపు తిరుగుతుంది.
ఇక శృతి క్యాబ్ బుక్ చేసి అందరినీ ఇంటికి తీసుకువచ్చే సమయంలో, మద్యం మత్తులో ఉన్న బాలు, రవి, మనోజ్ గేటు దగ్గరే హంగామా సృష్టిస్తారు. ఒక్కోసారి "నాన్న", "మామయ్య", "అంకుల్", "బాబాయి" అంటూ సత్యంను పిలుస్తూ నవ్వులు పూయిస్తారు. ఈ అల్లరి విన్న సత్యం బయటికి వచ్చి చూసే సరికి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్టు కనిపిస్తుంది. ఇదే సమయంలో ప్రభావతి కూడా బయటికి రావడంతో సన్నివేశం మరింత ఫన్నీగా మారుతుంది. రవి "ఆంటీ వచ్చేసింది" అంటూ అరవడం, నైటీ కావాలని అర్థంలేని మాటలు మాట్లాడడం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది. అయితే తన కొడుకులు మద్యం తాగి రావడం చూసి సత్యం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతాడు.
ఇక రాబోయే ఎపిసోడ్‌లో అసలు ట్విస్ట్ మొదలుకానుంది. బాలు చెప్పిన నిజాల వల్ల ముంబై డీలర్ ముఖేష్ కాంట్రాక్ట్‌ను క్యాన్సిల్ చేస్తాడు. అంతేకాకుండా అగ్రిమెంట్ ప్రకారం, డీల్ క్యాన్సిల్ అయితే ₹50 లక్షలు చెల్లించాలనే షరతు ఉండటంతో, మనోజ్‌కు నోటీసులు పంపించబడతాయి. దీంతో మనోజ్ కోపంతో బాలును నిలదీస్తాడు. "ఏం చెప్పావురా?" అని ప్రశ్నించగా, బాలు "మనమాడిన అబద్ధాలన్నీ బయటపెట్టాను" అని సమాధానం ఇవ్వడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తుంది.
ఈ విషయం తెలిసిన సత్యం మరోసారి కోపంతో రగిలిపోతాడు. ఇక ప్రభావతి రియాక్షన్ ఎలా ఉంటుందో, మనోజ్ ₹50 లక్షలు ఎలా చెల్లిస్తాడు, బాలు తదుపరి ఏం చేస్తాడు అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు రోహిణి బాలు ఫోన్ నుంచి పంపించుకుంటుందా? అన్నది కూడా సస్పెన్స్‌గా మారింది. ఇలా ఎన్నో ట్విస్టులతో రాబోయే ఎపిసోడ్లు మరింత ఉత్కంఠభరితంగా ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications











