Gudigantalu March 24th Episode: గుణతో రోహిణి డీల్, దినేష్ కిడ్నాప్, మీనాకు ప్రాణగండం, ప్రభావతి ఉగ్రతాండవం

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలో ఇంటి పెద్ద సత్యం తన కుమారులు బాలు, రవి, మనోజ్‌ను తాగిన విషయంపై గట్టిగా నిలదీస్తాడు. మనోజ్ బలవంతంగా "పార్టీ కల్చర్" పేరుతో తాగించాడని వారు చెప్పడంతో సత్యం తీవ్రంగా ఆగ్రహిస్తాడు. కుటుంబ విలువలను మరిచి ఇలా ప్రవర్తించడం తప్పని మందలిస్తాడు. అయితే మనోజ్ మాత్రం తాగడం వల్లే తనకు డీలర్‌షిప్ దొరికిందని గర్వంగా చెబుతాడు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. మద్యం మత్తులో బాలు, రవి చెప్పిన నిజాలు మనోజ్‌కు గుర్తుకువచ్చి వారిని ప్రశ్నిస్తాడు. అప్పుడే అసలు నిజం బయటపడుతుంది. డీలర్‌కు అబద్ధాలు చెప్పామని, తమ దగ్గర ఉన్న ఆస్తుల గురించి అతిశయంగా చెప్పామని వారు ఒప్పుకుంటారు. దీంతో షాక్‌కు గురైన మనోజ్ కోపంతో ఊగిపోతాడు.

ఇదే సమయంలో డాక్యుమెంట్స్‌లో డీల్ క్యాన్సిల్ అయితే 50 లక్షల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని తెలుసుకుని మరింత ఆందోళనకు గురవుతాడు. ఇక ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ప్రభావతి బాలుపై మండిపడగా, మనోజ్ తీవ్ర నిరాశలోకి వెళ్తాడు. ఈ సమయంలో రోహిణి ధైర్యం చెబుతూ అతనిని సాంత్వన పరుస్తుంది. కానీ ఆమె బాలుని ఫోన్ దొంగిలించడం కొత్త సస్పెన్స్‌కు దారితీస్తుంది. తర్వాత డీలర్ ముఖేష్ ఇంటికి వచ్చి మనోజ్‌ను నిలదీస్తాడు. అబద్ధాలు చెప్పినందుకు డీల్ రద్దు చేస్తానని చెప్పినా, సత్యం, బాలు నిజాయితీగా క్షమాపణ కోరడంతో అతని మనసు మారుతుంది. చివరికి 50 లక్షల ఫైన్‌ను మాఫీ చేసి డీలర్‌షిప్ ఇస్తానని ప్రకటిస్తాడు. కుటుంబం ఆనందంలో మునిగిపోతుండగా, బాలు ఫోన్‌లో ఉన్న ముఖ్యమైన వీడియో కథలో కొత్త సస్పెన్స్‌ను రేకెత్తిస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 646 March 24th 2026 here is full story

Photo courtesy: Jio HotstarGundeninda

మంగళవారం ఎపిసోడ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభం నుంచే బాలు తన ఫోన్ కోసం ఆత్రుతగా వెతుకుతుండడం కథలో టెన్షన్‌ను పెంచింది. తన ఫోన్ కనిపించిందా అని మీనాను ప్రశ్నించగా, ఆమె కూడా తనకు తెలియదని చెప్పి అతనితో కలిసి ఇంటి మొత్తం వెతకడం ప్రారంభిస్తుంది. గది గది తిరిగి, ప్రతి మూలను జల్లెడ పట్టినా ఫోన్ మాత్రం దొరకదు. ఈ సమయంలో రోహిణి అక్కడికి వచ్చి ఏం జరిగిందో తెలియనట్టుగా నటిస్తూ, "ఏం వెతుకుతున్నారు?" అని అడుగుతుంది.

మీనా ఫోన్ పోయిందని చెప్పగానే, రోహిణి వ్యంగ్యంగా మాట్లాడుతూ బాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో బాలు కోపంగా స్పందిస్తూ "మాటలు జాగ్రత్తగా మాట్లాడండి" అని హెచ్చరిస్తాడు. బయటకు శాంతంగా కనిపించినా, లోపల మాత్రం బాలు తీవ్ర ఆందోళనలో ఉంటాడు. ఎందుకంటే ఆ ఫోన్‌లో ఉన్న "శివ వీడియో" బయటపడితే కుటుంబంలో పెద్ద సమస్యలు వస్తాయని అతనికి భయం.

అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది. బాలు తెలియకుండా రోహిణి ఆ ఫోన్‌ను దొంగిలించి, అందులోని వీడియోను గుణకు పంపిస్తుంది. బాలు-మీనా మధ్య విభేదాలు పెంచాలనే ఉద్దేశంతో ఆమె ఈ కుట్ర పన్నినట్లు స్పష్టమవుతుంది. ఇక బాలు తన ఫ్రెండ్ రాజేష్‌కు కాల్ చేసి ఫోన్ గురించి చెబుతాడు. ఫోన్‌లో ఉన్న వీడియో గురించి చెప్పడంతో రాజేష్ ఫంక్షన్ హాల్‌లో వెతుకుదామని సూచిస్తాడు. ఈ మాటలు విన్న మీనా ఆ వీడియో గురించి అడిగినా, బాలు నిజం దాచిపెట్టి "డేటా మాత్రమే ఉంది" అని తప్పించుకుంటాడు. సత్యం కూడా అతనిని కూల్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ బాలు మాత్రం భయంతో తడబడుతూనే ఉంటాడు.

చివరికి ఫంక్షన్ హాల్‌కి వెళ్లి వెతికినా ఫోన్ దొరకకపోవడంతో బాలు మరింత నిరాశ చెందుతాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని రాజేష్ చెప్పినా, వీడియో బయటపడే భయంతో బాలు అంగీకరించడు. "శివ మారుతున్నాడు... ఈ వీడియో బయటపడకూడదు" అంటూ దేవుడిని ప్రార్థిస్తాడు.

మరోవైపు రోహిణి తన అసలు రూపాన్ని పూర్తిగా బయటపెట్టింది. గుణను కలిసిన రోహిణి, తన దగ్గర శివకు సంబంధించిన కీలక వీడియో ఉందని గర్వంగా చెబుతుంది. ఆమె ముఖం చూస్తూనే ప్లాన్ సక్సెస్ అయిందని అర్థం చేసుకున్న గుణ, ఆమెను పొగుడుతాడు. అయితే రోహిణి మాత్రం తనకు కావాల్సిన పని పూర్తయితేనే వీడియో ఇస్తానని కండిషన్ పెడుతుంది.

ఈ నేపథ్యంలో దినేష్ అనే వ్యక్తిని టార్గెట్ చేస్తూ రోహిణి అతని వివరాలను గుణకు పంపిస్తుంది. వెంటనే గుణ తన గ్యాంగ్‌కు ఆర్డర్ ఇచ్చి దినేష్‌ను కిడ్నాప్ చేయమని చెబుతాడు. కొద్దిసేపటికే గుణ అనుచరులు దినేష్‌ను కిడ్నాప్ చేసి అతని ముందు తీసుకొస్తారు. కానీ దినేష్ తనను గుర్తిస్తాడనే భయంతో రోహిణి కర్టెన్ వెనుక దాక్కొని ఈ సీన్‌ను గమనిస్తుంది.

దినేష్ మాత్రం ఏం జరిగిందో అర్థం కాక భయంతో "నన్నెందుకు తీసుకువచ్చారు?" అని అడుగుతాడు. కానీ గుణ అసలు విషయం చెప్పకుండా అతనిపై ఒత్తిడి పెంచుతూ టార్చర్ చేయిస్తాడు. ఆ తర్వాత అతనిని ఒక చీకటి గదిలో బంధించాలని తన అనుచరులకు ఆదేశిస్తాడు. గుణ తన మాట నిలబెట్టుకున్న తర్వాత, రోహిణి కూడా తన వాగ్దానం ప్రకారం శివ వీడియోను అతనికి పంపిస్తుంది.

ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ బయటపడుతుంది. దినేష్‌కు ఏం చేస్తారని అడిగిన రోహిణికి, గుణ "వాడిని ఇక్కడ లేకుండా చేస్తా" అని చెప్పడం టెన్షన్‌ను పెంచుతుంది. అయితే చంపడం కాదని, కానీ ఎక్కడికో పంపిస్తానని చెప్పడంతో రోహిణి కొంత రిలాక్స్ అవుతుంది. ఇదిలా ఉండగా, తన ప్లాన్ సక్సెస్ అయిందనే ఆనందంలో రోహిణి మునిగిపోతుంది. బాలు-మీనా జీవితాల్లో కల్లోలం సృష్టించడమే తన లక్ష్యమని స్పష్టంగా చెబుతుంది.

ఈ సమయంలో ఆమె స్నేహితురాలు దివ్య, "పాపం మీనాను ఎందుకు బలి చేస్తున్నావు?" అని ప్రశ్నించగా, రోహిణి మరింత షాకింగ్‌గా స్పందిస్తుంది. "ఈ సమాజంలో ఒకరు సంతోషంగా ఉండాలంటే మరొకరు బాధపడాలి" అంటూ తన క్రూరమైన ఆలోచనలను బయటపెడుతుంది. తన సంతోషం కోసం ఎలాంటి హద్దులు దాటడానికైనా సిద్ధమని చెప్పడం ద్వారా రోహిణి పాత్ర పూర్తిగా నెగటివ్ షేడ్స్‌లోకి వెళ్లిపోయింది.

మరో వైపు ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంది. తిరుపతి ట్రిప్ కారణంగా బాలు హడావుడిగా బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అతని మనసంతా మాత్రం పోయిన ఫోన్‌పైనే ఉంటుంది. ఆ ఫోన్‌లో ఉన్న "శివ వీడియో" బయటపడితే పెద్ద సమస్యలు వస్తాయని అతను తీవ్రంగా ఆందోళన చెందుతాడు. ఈ సమయంలో మీనా తన ఫోన్ తీసుకెళ్లమని చెప్పగా, సత్యం కూడా తన ఫోన్ ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. కానీ బాలు మాత్రం అసహనంగా ఉండి, ఆలోచనలతోనే తలమునకలైపోతాడు. ఇదే సమయంలో ప్రభావతి వచ్చి వెటకారంగా మాట్లాడటంతో మీనా గట్టిగా ఎదురుదాడి చేస్తుంది. దీంతో ప్రభావతి సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోవడం సన్నివేశానికి హైలైట్‌గా నిలుస్తుంది. చివరకు బాలు మీనాకు జాగ్రత్తలు చెప్పి ట్రిప్‌కు బయలుదేరిపోతాడు.

ఇక మరోవైపు గుణ తన ప్రతీకారాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తాడు. బాలు-మీనా-శివ జీవితాలు ఇప్పుడు తన చేతిలో ఉన్నాయని భావిస్తూ, వారిని ఒక్కొక్కరిని ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తాడు. ఆలోచించినట్టుగానే శివ వీడియోను తన ఫ్రెండ్‌కు పంపించి, అది మరింత మందికి షేర్ చేయాలని ఆదేశిస్తాడు. దీంతో ఈ వీడియో ఇంటి పరువు తీసే స్థాయికి చేరుకుంటుందని స్పష్టమవుతోంది.

అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో మరిన్ని షాకింగ్ సన్నివేశాలు కనిపించనున్నాయి. మీనా మీద బల్లి పడటంతో ఆమె భయంతో విసిరేయగా అది ప్రభావతి మీద పడుతుంది. దీంతో ఇంట్లో అందరూ కంగారు పడతారు. ఈ సమయంలో మనోజ్ "బల్లి శాస్త్రం" గురించి చెప్పడం ఆసక్తికరంగా మారుతుంది. నెత్తిపై పడితే ప్రమాదం, భుజంపై పడితే అదృష్టం అని చెప్పడంతో మీనా భయాందోళనకు గురవుతుంది.

ఇదే సమయంలో రోహిణి తన ప్లాన్‌ను అమలు చేస్తూ శివ వీడియోను ఇంట్లో అందరికీ పంపిస్తుంది. ఆ వీడియో చూసిన ప్రభావతి ఉగ్రరూపం దాల్చి "నా అసలు స్వరూపం చూపిస్తా" అంటూ హెచ్చరిస్తుంది. దీంతో రాబోయే రోజుల్లో బాలు, మీనా జీవితాల్లో భారీ తుఫాన్ రాబోతుందని అర్థమవుతోంది.ఇలా ఎపిసోడ్ మరింత థ్రిల్లింగ్‌గా మారింది. ఇక ఈ సమస్యల నుంచి బాలు ఎలా బయటపడతాడు? రోహిణి ఇంకా ఎలాంటి ప్లాన్లు వేస్తుంది? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X