Gundeninda Gudigantalu March 25th Episode: శివ వీడియో వైరల్, చెప్పుతో కొట్టిన ప్రభావతి, మీనాపై రోహిణి కుట్ర..
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే బాలు తన ఫోన్ కోసం ఆత్రుతగా వెతకడం కథలో టెన్షన్ పెంచింది. మీనాతో కలిసి ఇంటి మొత్తం వెతికినా ఫోన్ దొరకదు. ఈ సమయంలో రోహిణి అనుమానం రాకుండా నటిస్తూ, మాటలతో బాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ ఫోన్‌లో ఉన్న "శివ వీడియో" బయటపడితే పెద్ద సమస్యలు వస్తాయని బాలు భయంతో ఉండటం కథకు కీలకంగా మారింది.అసలు ట్విస్ట్ ఏమిటంటే, రోహిణే ఆ ఫోన్‌ను దొంగిలించి, అందులోని వీడియోను గుణకు పంపిస్తుంది. బాలు-మీనా మధ్య విభేదాలు సృష్టించాలనే ఉద్దేశంతో ఆమె ఈ కుట్ర పన్నినట్టు తెలుస్తుంది.
ఫోన్ కోసం బాలు తన ఫ్రెండ్ రాజేష్ సహాయం కోరినా, వీడియో బయటపడే భయంతో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధం కాడు. ఇక రోహిణి గుణను కలసి తన ప్లాన్‌ను అమలు చేస్తుంది. దినేష్‌ను టార్గెట్ చేస్తూ అతడిని కిడ్నాప్ చేయిస్తుంది. గుణ అనుచరులు దినేష్‌ను బంధించడంతో కథ మరింత సీరియస్ మలుపు తిరుగుతుంది. మరోవైపు రోహిణి తన క్రూర స్వభావాన్ని బయటపెడుతూ, "ఒకరు సంతోషంగా ఉండాలంటే మరొకరు బాధపడాలి" అని చెప్పడం షాకింగ్‌గా నిలుస్తుంది. ఇంట్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతాయి. బాలు ట్రిప్‌కు బయలుదేరినా, అతని ఆలోచనలు మాత్రం ఫోన్‌పైనే ఉంటాయి. ఇదిలా ఉండగా గుణ శివ వీడియోను మరింత మందికి పంపించే ప్లాన్ చేస్తాడు. దీంతో ఈ వీడియో కుటుంబ పరువు తీసే స్థాయికి చేరుతుందనే టెన్షన్ మరింత పెరుగుతోంది.

Photo courtesy: Jio Hotstar
బుధవారం ఎపిసోడ్‌లో కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది. బాలు ఫోన్ మిస్సింగ్ విషయంతో టెన్షన్‌లో ఉన్న మీనా, ఆ విషయం గురించే ఆలోచిస్తూ కనిపిస్తుంది. 'ఎవరో కావాలని ఫోన్ తీసి ఉంటారు... ఎంత తాగినా బాలు ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉంటాడు' అని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ అనుమానం కథలో మరింత సస్పెన్స్‌ను పెంచుతుంది. ఇదే సమయంలో ఇంట్లో ఒక విచిత్ర సంఘటన జరుగుతుంది. అకస్మాత్తుగా మీనా మీద బల్లి పడటంతో ఆమె కంగారులో దాన్ని విసిరేయగా అది ప్రభావతి మీద పడుతుంది. అక్కడి నుంచి రోహిణి, తర్వాత మనోజ్‌పై పడుతూ బల్లి అందర్నీ గందరగోళానికి గురిచేస్తుంది. ఈ సన్నివేశం ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేపుతుంది. దీంతో ప్రభావతి కోపంతో మీనాను తప్పుపడుతూ వెంటనే స్నానం చేసి పూజ చేయాలని భయపడుతుంది.
ఈ సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది రోహిణి. మనోజ్ ఫోన్‌లో "బల్లి శాస్త్రం" చూస్తానని చెప్పి, అసలు లేని విషయాలను చెప్పడం ప్రారంభిస్తుంది. ప్రభావతికి త్వరలో డబ్బు, నగలు, గౌరవం వస్తాయని చెప్పడంతో ఆమె ఆనందపడుతుంది. తనకైతే భర్త ప్రేమ పెరుగుతుందని చెప్పి నమ్మిస్తుంది. మనోజ్‌కు వ్యాపారంలో లాభాలు వస్తాయని చెప్పడంతో అతడు కూడా సంతోషపడతాడు. అయితే మీనా విషయంలో మాత్రం రోహిణి షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది. "నీకు నెత్తి మీద పడింది కాబట్టి ప్రాణగండం ఉంది... ప్రమాదాలు ఎదురవుతాయి" అంటూ భయపెడుతుంది. దీంతో మీనా తీవ్రంగా కంగారు పడుతుంది. రోహిణి మాటలు విన్న తర్వాత ఆమె మనసులో భయం మరింత పెరుగుతుంది.
ఇదిలా ఉండగా సుమతి ఫోన్ చేయడం మరో ఆసక్తికర మలుపు. కానీ మీనా తొందరలో అది బాలు ఫోన్ అనుకుని మాట్లాడుతుంది. తర్వాత విషయం తెలిసి బాలు ఫోన్ పోయిందని చెబుతుంది. వెంటనే సుమతి కొత్త ఫోన్ తీసుకోవాలని సూచిస్తూ, శివను కలవమని సలహా ఇస్తుంది. దీంతో మీనా కూడా శివను సంప్రదించాలని నిర్ణయిస్తుంది. ఇక పూల ఆర్డర్ రావడంతో మీనా హడావుడిగా బయటికి వెళ్తుంది. అదే సమయంలో బాలు వేరే వ్యక్తి ఫోన్ నుంచి మీనాకు కాల్ చేస్తాడు. మీనా భావోద్వేగంగా మాట్లాడుతూ "మీ గురించి చాలా ఆలోచిస్తున్నా... చాలా మిస్ అవుతున్నా, ఎప్పుడు వస్తారు?" అని అడుగుతుంది. దీనికి బాలు కూడా "నాకూ అదే ఫీలింగ్... త్వరలోనే నీ దగ్గరకు వస్తా" అంటూ సమాధానం ఇస్తాడు.
ఈ సందర్భంగా బాలు తన ఫోన్ ఎలా పోయిందన్న విషయంపై కీలక అనుమానం వ్యక్తం చేస్తాడు. "మనోజ్ ఇచ్చిన కోట్ వేసుకున్నాను... ఫోన్ అందులోనే ఉంది. ఎవరో కావాలనే తీసేసారు" అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు. ఒకవేళ దొంగ ఎవరో తెలిసితే పరిస్థితి తీవ్రంగా మారుతుందని హెచ్చరిస్తాడు. ఇదే సమయంలో మీనా తనపై బల్లి పడిన విషయం, తనకు ప్రాణగండం ఉందని చెబుతుంది. దీనికి బాలు నవ్వుతూ "ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకు... బల్లి మనిషికి ఏమి చేయదు" అంటూ ఆమెను కూల్ చేస్తాడు.
ఇక మరోవైపు మీనా తన తమ్ముడు శివతో కలిసి బాలు కోసం కొత్త ఫోన్ కొనడానికి మొబైల్ షాప్‌కి వెళ్తుంది. అయితే అక్కడే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. శివ చేసిన దొంగతనం వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షాప్‌లో ఉన్న వ్యక్తి శివను గుర్తించి, ఆ వీడియోను పోలీసులకు ట్యాగ్ చేస్తాడు. అయితే ఈ విషయమంతా మీనా, శివకు తెలియదు. ఆ మాటలు వినిపించినా, అవి తన గురించి కావని శివ అనుకుంటాడు. కానీ బయట మాత్రం పరిస్థితి వేడెక్కుతుంది. "వాడిని పట్టుకోవాలి... కఠినంగా శిక్షించాలి" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శివ దొంగతనం వీడియో కీలక మలుపు తీసుకుంది. ఆ వీడియో విద్య కంటపడటంతో వెంటనే విద్య ఆ వీడియోను రోహిణికి చూపిస్తూ "చూసావా... శివ వీడియో ట్రెండింగ్ అవుతోంది" అని చెబుతుంది. అయితే ఈ విషయం చూసిన రోహిణి ఆనందంతో మునిగిపోతుంది. కానీ విద్య మాత్రం "పాపం వాళ్ల పరిస్థితి చూసి జాలేస్తోంది" అంటూ స్పందిస్తుంది. దీనికి రోహిణి కఠినంగా, "వాడు దొంగతనం చేశాడు... శిక్ష పడాలి" అని చెప్పడం షాకింగ్‌గా మారుతుంది. వెంటనే విద్య ఆమెను ప్రశ్నిస్తూ, "నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్?" అని అడుగుతుంది. ఈ సమయంలో రోహిణి అసలు నిజాన్ని బయటపెడుతుంది. "నేను అనుకున్నట్టే ఈ వీడియో బయటికి వచ్చింది... నాకు చాలా సంతోషంగా ఉంది" అంటూ తన ప్లాన్ సక్సెస్ అయినందుకు గర్వంగా చెబుతుంది.
ఇంకా ముందుకు వెళ్లి, ఈ వీడియో వల్ల ఇంట్లో పెద్ద కల్లోలం సృష్టించాలనేది తన లక్ష్యమని వెల్లడిస్తుంది. "మా అత్తయ్య ఈ వీడియో చూసిన తర్వాత ప్రళయం సృష్టిస్తుంది... బాలు, మీనాలను ఇంటి నుంచి గెంటేస్తుంది" అని చెప్పడం కథలో పెద్ద ట్విస్ట్‌గా మారింది. అయితే విద్య మాత్రం దీనిని తీవ్రంగా ఖండిస్తూ, "తప్పు చేసింది శివ... వాళ్ల జీవితాలతో ఆడుకోవడం సరికాదు" అంటూ రోహిణిని ఆపేందుకు ప్రయత్నిస్తుంది.
కానీ రోహిణి మాత్రం మరింత దారుణంగా స్పందిస్తుంది. "నా సంతోషం కోసం ఏదైనా చేస్తా... ఎంతవరకైనా వెళ్తా" అంటూ తన అసలు స్వభావాన్ని బయటపెడుతుంది. బాలు ఇంట్లో ఉంటే తన రహస్యాలు బయటపడతాయని, అందుకే వాళ్లను ఇంటి నుంచి పంపించాలనుకుంటున్నానని స్పష్టం చేస్తుంది. అంతేకాదు, చింటూని దత్తత తీసుకోవాలనే ప్రయత్నం కూడా తనకు నచ్చలేదని చెబుతుంది.
ఇక ఈ వీడియో ప్రభావం అక్కడితో ఆగలేదు. శృతి తల్లి కూడా ఈ వీడియో చూసి, రవి-శృతిని ఇంటి నుంచి తీసుకెళ్లే నిర్ణయం తీసుకుంటుంది. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ గందరగోళం మధ్య రోహిణి మాత్రం "ఇక నేను, మనోజ్ ఆ ఇంట్లో హాయిగా ఉంటాం" అంటూ తన అసలు ఉద్దేశాన్ని పూర్తిగా బయటపెడుతుంది. మొత్తానికి శివ వీడియో వైరల్ అవడం కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు... దాని వెనుక ఉన్న రోహిణి కుట్ర కుటుంబాన్ని మొత్తం కుదిపేస్తోంది.
ఇప్పటికే శివ వీడియో వైరల్ కావడంతో రోహిణి తన తదుపరి ప్లాన్‌ను అమలు చేస్తుంది. తన స్నేహితురాలు విద్యతో కలిసి ఒక లెటర్ తయారు చేయిస్తుంది. అందులో "మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది" అని హెచ్చరికలా రాసి, దాన్ని మనోజ్ చేతికి చేరేలా ప్లాన్ చేస్తుంది. రోహిణి అమాయకంగా నటిస్తూ, "ఎవరో తెలియని వ్యక్తి ఈ లెటర్ ఇచ్చి వెళ్లిపోయాడు" అని చెప్పడంతో మనోజ్ కంగారు పడతాడు. వెంటనే లెటర్ చదివి, తనకు సంబంధించిన ఏదైనా వీడియో బయటపడిందేమోనని భయంతో వీడియో ఓపెన్ చేస్తాడు. కానీ అందులో శివ లక్ష రూపాయలు దొంగతనం చేసిన వీడియో ఉండటం చూసి షాక్ అవుతాడు.
ఈ సమయంలో రోహిణి మళ్లీ తన డ్రామాను కొనసాగిస్తూ, 'ఈ వీడియో బయటపెడితే ఇంట్లో గొడవలు పెరుగుతాయి... బాలు, మీనాలను గెంటేస్తారు' అంటూ నాటకం ఆడుతుంది. కానీ మనోజ్ మాత్రం తనకు రోజూ అవమానం జరుగుతుందనే కోపంతో, వెంటనే ఈ వీడియోను తల్లి ప్రభావతికి చూపించాలని నిర్ణయించుకుంటాడు. ఈ విధంగా రోహిణి తన ప్లాన్‌ను విజయవంతంగా అమలు చేస్తుంది. ఇక మరోవైపు ప్రభావతి డాన్స్ స్కూల్‌లో కోపంగా కనిపించడం కూడా కథలో హైలైట్‌గా నిలిచింది. ప్రేమ్ కుమార్‌ను కఠినంగా మందలిస్తూ, శిక్షగా గుంజులు తీయమని చెప్పడం ఆమె కోపాన్ని చూపిస్తుంది.
అయితే అసలు డ్రామా అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ప్రారంభమవుతుంది. రోహిణి ప్లాన్ ప్రకారం ప్రభావతికి శివ వీడియో చూపించడంతో ఆమె కోపంతో ఊగిపోతూ నేరుగా మీనా ఇంటికి చేరుతుంది. అక్కడ శివను తీవ్రంగా మందలిస్తూ, చెప్పుతో కొట్టడం షాకింగ్ ట్విస్ట్‌గా మారుతుంది. మీనా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుతుంది. ఈ సమయంలో వీడియో చూసిన మీనా షాక్ అవ్వడం, పార్వతి కుప్పకూలిపోవడం సన్నివేశాన్ని మరింత ఎమోషనల్‌గా మార్చుతుంది. ప్రభావతి "నీ అంత చూస్తా" అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోవడం కథలో మరింత టెన్షన్‌ను పెంచింది.
మొత్తానికి రోహిణి కుట్రలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. శివ వీడియోతో మొదలైన ఈ డ్రామా ఇప్పుడు కుటుంబాల మధ్య పెద్ద యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఇక బాలు ఏ నిర్ణయం తీసుకుంటాడు? మీనా పరిస్థితి ఏమవుతుంది? శివ అరెస్ట్ అవుతాడా? సుమతి పెళ్లి జరుగుతుందా లేదా ఆగిపోతుందా? రోహిణి ప్లాన్ పూర్తిగా సక్సెస్ అవుతుందా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.


Click it and Unblock the Notifications











