Gunde Ninda Gudi Gantalu March 26th Episode: శివ తప్పుకు మీనాకు శిక్ష.. రోహిణీ సైకోయిజం.. ప్రభావతి ప్రతీకారం..

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్‌లో కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది. బాలు ఫోన్ మిస్సింగ్ కావడంతో మీనా తీవ్ర ఆందోళనలో పడుతుంది. బాలు ఎంత తాగినా ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉంటాడని భావించిన ఆమె, ఎవరో కావాలనే ఫోన్ తీసి ఉంటారని అనుమానిస్తుంది. ఇదే సమయంలో ఇంట్లో జరిగిన బల్లి సంఘటన కలకలం రేపుతుంది. మీనా మీద పడిన బల్లి ప్రభావతి, రోహిణి, మనోజ్‌లపై పడుతూ గందరగోళం సృష్టిస్తుంది. ప్రభావతి భయంతో పూజలు చేయాలని ఆగ్రహిస్తుంది. ఈ పరిస్థితిని రోహిణి తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. "బల్లి శాస్త్రం" పేరుతో అబద్ధాలు చెప్పి, ప్రభావతికి డబ్బు, గౌరవం వస్తాయని, మనోజ్‌కు వ్యాపార లాభాలు ఉంటాయని చెబుతుంది. కానీ మీనాకు మాత్రం ప్రాణగండం ఉందని భయపెడుతుంది. దీంతో మీనా మరింత కంగారు పడుతుంది.

అయితే బాలు మాత్రం ఈ మూఢనమ్మకాలను ఖండిస్తూ ఆమెను ధైర్యం చెబుతాడు.ఇక మరోవైపు శివతో కలిసి బాలు కోసం కొత్త ఫోన్ కొనడానికి వెళ్లిన మీనాకు తెలియకుండా పెద్ద ట్విస్ట్ జరుగుతుంది. శివ దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని చూసిన రోహిణి ఆనందపడుతూ, ఇదే తన ప్లాన్ అని వెల్లడిస్తుంది. ఈ వీడియో ద్వారా ఇంట్లో పెద్ద కలహం సృష్టించి, బాలు-మీనాలను బయటకు పంపించాలనేదే తన లక్ష్యమని చెబుతుంది. తర్వాత రోహిణి లెటర్ డ్రామాతో మనోజ్‌ను మభ్యపెట్టి వీడియో చూపిస్తుంది. మనోజ్ కోపంతో ఆ వీడియోను ప్రభావతికి చూపించాలని నిర్ణయించుకుంటాడు. దీంతో కుటుంబంలో పెద్ద తుఫాన్ రాబోతోందనే సూచనలు కనిపిస్తున్నాయి.

Gunde Ninda Gudi Gantalu serial episode 648 March 26th 2026 here is full story

Photo courtesy: Jio Hotstar

గురువారం ఎపిసోడ్‌లో ప్రభావతి కుటుంబంలో కుదిపేసేలా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటగా ప్రభావతి తన డాన్స్ క్లాస్‌లో పిల్లలకు డాన్స్ స్టెప్స్ నేర్పిస్తూ కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రేమ్ కుమార్ ప్రవర్తన ఆమెకు నచ్చక, కఠినంగా మందలిస్తుంది. 'ఇలా ఉంటే ఇక్కడ ఉండలేవు' అంటూ హెచ్చరించిన ఆమె, శిక్షగా 100 గుంజులు తీయమని ఆదేశిస్తుంది. దీనికి ప్రేమ్ కుమార్, 'నేను రెడీ మేడమ్..100 గుంజులు తీస్తా' అంటూ పనిష్మెంట్ తీసుకోవడానికి సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది.

ఇక మరోవైపు ఇంట్లో రోహిణి తన కుట్రలో ముందుగానే ప్లాన్ చేసినట్టుగా, తన అత్తయ్య ప్రభావతి డాన్స్ స్కూల్‌కి వెళ్తుంది. 'ఒక ముఖ్యమైన వీడియో చూపించాలి' అంటూ తర్వగా రమ్మని చెప్పడంతో ప్రభావతి అక్కడికి చేరుతుంది. అక్కడ రోహిణి చూపించిన వీడియో చూసి ఆమె షాక్‌కు గురవుతుంది. ఆ వీడియోలో శివ లక్ష రూపాయలు దొంగతనం చేస్తున్న దృశ్యాలు ఉండటంతో అసలు నిజం బయటపడుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది. శివ చేసిన తప్పును మాత్రమే కాకుండా, మీనా కుటుంబాన్ని మొత్తం లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తుంది. 'ఇది దొంగల కుటుంబం... మీనాకీ ఇదే బుద్ధి' అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది.

అంతేకాదు, ఈ విషయమంతా మీనాకు ముందే తెలిసి ఉండి కూడా దాచిందని అనుమానిస్తుంది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. ఈ సందర్భంగా ప్రభావతి గతంలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటుంది. అదే లక్ష రూపాయల కారణంగా తాను ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చిన విషయం, డబ్బులు ఇచ్చిన వ్యక్తి తనను అవమానించిన ఘటన గుర్తు చేసుకుంటుంది. ఈ అవమానానికి కారణం మీనా కుటుంబమే అని భావించిన ప్రభావతి, ఇప్పుడు వారికి గట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయిస్తుంది. ఇక రోహిణి ఈ పరిస్థితిని మరింత రెచ్చగొడుతూ, 'ఇవాళే పోలీసులకు అప్పగిద్దాం' అంటూ ప్రభావతిని ప్రేరేపిస్తుంది. వెంటనే ప్రభావతి ఆగ్రహంతో మీనా పుట్టింటికి వెళ్లాలని నిర్ణయిస్తుంది. 'ఈరోజు వాళ్లకు నా ఉగ్రరూపం చూపిస్తా' అంటూ కోపంతో బయలుదేరుతుంది.

మరోవైపు.. గుణ ముందుగానే ప్లాన్ ప్రకారం శివను అడ్డుకుని, అతనిపై మానసిక ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దొంగతనం వీడియోను చూపిస్తాడు. దీంతో శివ కోపంలో గుణ కాలర్ పట్టుకుంటాడు. అయినా గుణ మాత్రం ఏమి తెలియనట్టు.. 'ఇది అంతా బాలు వల్లే జరిగింది... అతడే నీ వీడియో బయటకు తీసుకొచ్చాడు' అంటూ నింద వేస్తాడు. అంతేకాదు, 'ఇప్పటికైనా నాతో చేతులు కలుపు... ఈ వీడియో వైరల్ కాకుండా నేను చూసుకుంటా'అంటూ మాయమాటలు చెప్పి శివను తన వైపు తిప్పుకోవాలని చూస్తాడు. కానీ శివ మాత్రం గుణ మాటలకు లొంగకుండా, భయంతో అక్కడినుంచి వెళ్లిపోతాడు.

ఇక ఇంటి సన్నివేశం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. శివ ఇంటికి చేరుకునే సమయానికి, అతని కుటుంబం తండ్రి సంవత్సరికం ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటుంది. ఈ సందర్భంలో మీనా తన కుటుంబం మళ్లీ సంతోషంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేస్తుంది. 'శివ ఇప్పుడు బుద్ధిగా చదువుకుంటున్నాడు... త్వరలో జాబ్ వస్తుంది. సుమతికి కూడా మంచి సంబంధం వచ్చింది' అంటూ తన ఆశలను పంచుకుంటుంది. ఇంతలోనే ప్రభావతి, రోహిణితో కలిసి అక్కడికి చేరుకోవడం కథను ఒక్కసారిగా మలుపుతిప్పుతుంది.

ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతూ, 'ఎక్కడ నీ తమ్ముడు... ఎక్కడ ఆ దొంగ వెధవ?' అంటూ గట్టిగా అరుస్తుంది. మీనా ఏం జరిగిందని అడిగినా పట్టించుకోకుండా నేరుగా శివ దగ్గరకు వెళ్లి అతనిపై దాడి చేస్తుంది. మొదట చేతులతో కొట్టిన ప్రభావతి, ఆపై చెప్పుతో కూడా దారుణంగా కొట్టడం షాకింగ్‌గా మారుతుంది. శివపై ఈ విధంగా దాడి జరగడంతో మీనా అడ్డుపడుతుంది.'ఎందుకు మా తమ్ముణ్ని కొడుతున్నారు? ఇప్పటివరకు నేను సహించాను... కానీ నా కుటుంబాన్ని నా ముందే అవమానిస్తే ఊరుకోను' అంటూ ధైర్యంగా ఎదురు నిలుస్తుంది. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది.

ఇదే సమయంలో రోహిణి ఈ గొడవను మరింత పెంచేలా ప్రవర్తిస్తుంది. 'అత్తయ్య ఏ కారణం లేకుండా ఎవరినీ నిందించదు... నీకు కూడా తెలుసు.. శివ తప్పు చేశాడు. 'అంటూ మీనాను మరింత ప్రేరేపించేలా మాట్లాడుతుంది. ఇలా ఒకవైపు ప్రభావతి ఉగ్రరూపం, మరోవైపు రోహిణి కుట్ర హై టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలో ప్రభావతి ఆగ్రహంతో 'ఒక్కసారి ఆ దొంగతనం వీడియో చూపించు' అని రోహిణిని ఆదేశించగా, ఆమె వెంటనే శివ దొంగతనం చేసిన వీడియోను ఇంట్లో ఉన్న అందరికీ చూపిస్తుంది. ఆ దృశ్యాలు చూసిన వెంటనే ఇంటిల్లిపాదిక ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. పరిస్థితి క్షణాల్లో ఉద్రిక్తంగా మారిపోతుంది.

వీడియో చూసిన ప్రభావతి తీవ్రంగా స్పందిస్తూ, 'ఇందులో ఎవరి వాటా ఎంత? ఎవరు ఎంత తీసుకున్నారు?' అంటూ గట్టిగా నిలదీయడం ప్రారంభిస్తుంది. ఈ మాటలు విన్న మీనా తల్లి పార్వతి తీవ్ర మనోవేదనతో కుప్పకూలుతుంది. ఆవేదనతో, 'ఒక్క ఆరోపణ వచ్చినా మీ నాన్న ఆత్మగౌరవం కోసం ప్రాణాలు తీసుకున్నాడు... కానీ నువ్వు ఇలా దొంగతనం చేస్తావా?'అంటూ శివపై తీవ్రంగా మండిపడుతుంది. ఆమె మాటలు కుటుంబం అంతా కన్నీటి పర్యంతం చేస్తాయి.

ఇక మీనా కూడా ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేక, శివపై కోపంతో విరుచుకుపడుతుంది. 'నీ కోసం, ఈ కుటుంబం కోసం ఎన్నో అవమానాలు భరించానో తెలుసా? నీ భవిష్యత్తు కోసం జీవచ్ఛవంలా బ్రతుకుతున్నా... నువ్వేమో దొంగతనం చేసి మా కుటుంబానికి మచ్చ తెచ్చావ్' అంటూ కన్నీళ్లతో అతన్ని కొడుతుంది. సుమతి కూడా 'ఇంటి పరువు మొత్తం తీసేశావ్'అంటూ బాధపడుతూ శివపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇంత జరిగినా ప్రభావతి కోపం చల్లారదు. 'ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు' అంటూ శివను బయటకు లాగుతూ తీసుకెళ్తుంది. ఈ సన్నివేశం పార్వతి కుటుంబాన్ని కలిచివేస్తుంది. ఇలా హై వోల్టేజ్ ఎమోషన్స్‌తో ఎపిసోడ్ ముగియడం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచింది.

ఇక రాబోయే ఎపిసోడ్‌లో పరిస్థితి మరింత తీవ్రమవనున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభావతి, మీనా కుటుంబాన్ని బహిరంగంగా అవమానిస్తూ 'ఇది దొంగల కుటుంబం... నా దగ్గరే లక్ష రూపాయలు దొంగతనం చేశారు' అంటూ వారిని పోలీసులకు అప్పగించడానికి ప్రయత్నిస్తుంది. మీనా అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె ఆగకుండా శివను లాక్కెళ్తుంది. ఇక మరోవైపు బాలు ఇంటికి చేరుకున్నప్పుడు అసలు పరిస్థితి బయటపడుతుంది. 'ఇకపై మీనా ఈ ఇంట్లోకి రాదు' అని ప్రభావతి కఠినంగా చెప్పడం, మనోజ్ కూడా వీడియో విషయాన్ని ప్రస్తావించడం కథలో కీలక మలుపు. 'దొంగల కుటుంబం నుంచి వచ్చిన కోడలు నాకు అవసరం లేదు' అంటూ ప్రభావతి వార్నింగ్ ఇవ్వడంతో మీనా భవిష్యత్తు అనిశ్చితిలో పడుతుంది. మొత్తానికి రోహిణి వేసిన కుట్రతో మీనా కుటుంబం రోడ్డుమీద పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? మీనా జీవితంలో ఏమి జరుగుతుంది? సుమతి పెళ్లి ఆగిపోతుందా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X