Gundeninda Gudigantalu March 31th Episode: శివపై ప్రభావతి కేసు, రోహిణిపై సత్యం ఆగ్రహం, పార్వతి-సుమతి అరెస్ట్

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. బాలు ఇంటికి చేరుకున్న వెంటనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శివ దొంగతనం వీడియో బయటపడటంతో కుటుంబ సభ్యులు బాలుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా మనోజ్ కఠినంగా ప్రశ్నించడంతో వాతావరణం వేడెక్కింది. ప్రభావతి కూడా మీనా, బాలు మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఈ క్రమంలో బాలు ఇంటి నుంచి వెళ్లిపోతూ మీనాను తిరిగి తీసుకొస్తానని సవాల్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో పోలీసులు రంగంలోకి దిగి శివ కోసం గాలింపు ప్రారంభించారు. మీనా ఇంట్లో భయాందోళనలు నెలకొనగా, బాలు అక్కడికి చేరుకుని ఆమెను ఓదార్చాడు. శివ తప్పు వెనుక గుణ ప్రభావం ఉందని వెల్లడిస్తూ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.

ఇదే సమయంలో పోలీసులు మీనా ఇంటికి చేరుకుని శివను అరెస్ట్ చేయాలని ప్రయత్నించగా, బాలు ఇది కుటుంబ సమస్య అని వివరించాడు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. శివ ఆత్మహత్యకు ప్రయత్నించడం కథలో కీలక మలుపు. భవనం పై నుంచి దూకేందుకు సిద్ధమైన శివను బాలు సమయస్ఫూర్తితో అడ్డుకుని కాపాడాడు. అనంతరం అతడిని స్నేహితుడు రాజేష్ వద్ద దాచిపెట్టాడు. మరోవైపు మీనాను ఇంటికి తీసుకువచ్చిన బాలు, కుటుంబ సభ్యుల ఎదుట గట్టిగా నిలబడి గత దొంగతనాల విషయాలను బయటపెట్టాడు. చివరగా శివ ఆత్మహత్య యత్నం గురించి తెలిసిన సత్యం షాక్‌కు గురవడంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 651 March31th 2026 here is full story

మంగళవారం ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగింది. శివ దొంగతనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభావతి ఇంట్లో తీవ్ర కల్లోలం నెలకొంది. కుటుంబ పరువు దెబ్బతిన్నదన్న ఆగ్రహంతో ప్రభావతి, మీనానే బాధ్యురాలిగా భావించి ఆమెను ఇంటి నుంచి పంపించాలని కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో బాలు ముందుకు వచ్చి తన తండ్రి సత్యం దగ్గరకు వెళ్లి జరిగిన అసలు విషయాన్ని వివరించాడు. శివ కావాలని దొంగతనం చేయలేదని, అతనిపై అన్యాయంగా దొంగ ముద్ర వేయడంతో ఆవేశంలో అలా చేశాడని, తర్వాత తన తప్పు తెలుసుకుని డబ్బులు తిరిగి ఇచ్చేశాడని బాలు స్పష్టం చేశాడు. ఈ గొడవ ఇంత పెద్దదిగా మారడానికి అసలు కారణం ప్రభావతేనని చెప్పడంతో సత్యం ఆగ్రహంగా ఆమె వైపు చూడగా, ప్రభావతి కొద్దిసేపు మౌనంగా నిలిచిపోయింది.

Also Read
Dhurandhar 2 Day 12 Collections: ''ధురంధర్ 2' కలెక్షన్స్ సునామీ .. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Dhurandhar 2 Day 12 Collections: ''ధురంధర్ 2' కలెక్షన్స్ సునామీ .. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

అయితే పరిస్థితిని మనోజ్ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడాడు. శివ దొంగనే అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ విషయాన్ని మళ్లీ పెద్దది చేయాలని ప్రయత్నించాడు. దీనికి బాలు గట్టిగా ఎదురు నిలిచి, 'వాడు నీలా డబ్బు ఎత్తుకెళ్లలేదు... తన తప్పు తెలుసుకుని తిరిగి ఇచ్చేశాడు'అంటూ మనోజ్‌ను నిలదీశాడు. ఈ సమయంలో రోహిణి కూడా మనోజ్ వైపు నిలబడి, అతను కూడా డబ్బులు తిరిగి ఇస్తున్నాడని సమర్థించడానికి ప్రయత్నించింది. దీనికి బాలు కఠినంగా స్పందిస్తూ, 'పెద్దవాళ్లు తప్పు చేస్తే సర్దిచెప్పి, చిన్నవాళ్లపై మాత్రం దొంగ ముద్ర వేయడం న్యాయమా?' అంటూ ప్రశ్నించాడు.

ఈ ఉద్రిక్తత మధ్యలో మీనా భావోద్వేగంతో మాట్లాడింది. 'మా తమ్ముడు చేసినది తప్పే... నేను సమర్థించడం లేదు. కానీ ఒక్కసారి చేసిన తప్పుకు మా నాన్న ప్రాణం పోయింది. ఇప్పుడు మళ్లీ అదే తప్పుకు మా కుటుంబాన్ని అవమానించడం సరైనదేనా?" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 'వాడు నా తమ్ముడిగా పుట్టడం నా పాపమా? నేను అతనికి అక్కగా ఉండటం నా నేరమా?'అంటూ ప్రశ్నించిన మీనా మాటలు అందరినీ కదిలించాయి. ఇంతలోనే పోలీసులు ప్రభావతి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మరింత సీరియస్‌గా మారింది.

Recommended For You
'నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో..' సుధీర్-కావ్య కెమిస్ట్రీ మామూలు కాదు...
'నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో..' సుధీర్-కావ్య కెమిస్ట్రీ మామూలు కాదు...

అక్కడ బాలును చూసిన పోలీసులు, 'ఇంతకుముందు మీరు అక్కడ ఉన్నారు కదా... మళ్లీ ఇక్కడ ఎలా?'అని ప్రశ్నించగా, బాలు 'ఇది మా ఇల్లు' అంటూ సమాధానం ఇచ్చాడు. ఇదే అవకాశంగా భావించిన మనోజ్ వెంటనే రంగంలోకి దిగుతూ, 'శివ దొంగతనం చేసింది మా అమ్మ బ్యాగ్ నుంచే'అని పోలీసులకు చెబుతాడు. దీంతో పోలీసులు కూడా తమ వైఖరిని స్పష్టం చేస్తూ, 'ఇది ఫ్యామిలీ మ్యాటర్ అనుకుని అప్పటివరకు మేము సైలెంట్‌గా ఉన్నాం. కానీ వీడియో వైరల్ కావడంతో ఇది ఇప్పుడు పబ్లిక్ కేసు అయింది'అంటూ వివరణ ఇస్తారు. అయితే కేసు నమోదు కాకుండా ఉండాలంటే కంప్లైంట్ ఇవ్వొద్దని లెటర్ రాయాలని సూచిస్తారు.

ఈ సమయంలో ప్రభావతి ఒక్కసారిగా ఆగ్రహంతో రెచ్చిపోతుంది. 'ఇది ఫ్యామిలీ సమస్య కాదు... వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. వాడు నా డబ్బులు దొంగలించాడు' అంటూ కఠినంగా స్పందిస్తూ పోలీసులకు అధికారికంగా కంప్లైంట్ రాసి ఇస్తుంది. మీనా, బాలు ఎంతగా వేడుకున్నా ఆమె వెనక్కి తగ్గదు. 'ఈ కేసుతో వాడి జీవితం నాశనం అవుతుంది' అని బాలు హెచ్చరించినా ప్రభావతి మాత్రం కఠినంగా తన నిర్ణయాన్ని నిలబెట్టుకుంటుంది. దీంతో పరిస్థితి మరింత భావోద్వేగంగా మారుతుంది.

You May Also Like
 'సుధీర్‌ను అలా మిస్ అయ్యా.. ఆ విషయంలో చాలా బాధపడ్డా '
'సుధీర్‌ను అలా మిస్ అయ్యా.. ఆ విషయంలో చాలా బాధపడ్డా '

ఇదే సమయంలో బాలు తీవ్రంగా స్పందిస్తూ, 'శివ తన తప్పు తెలుసుకుని డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇప్పటికే శిక్ష పడింది. వాడి చేతు విరగొట్టాను. మళ్లీ ఎందుకు కేసు పెడుతున్నావు?' అని ప్రశ్నిస్తాడు. తర్వాత మీనాను ఇంట్లోకి వెళ్లమని చెప్పగా, ప్రభావతి అడ్డుకుంటూ 'ఇది నా ఇల్లు... నువ్వు ఇక్కడ ఉండలేవు' అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది. వెంటనే సత్యం ఆగ్రహంతో స్పందిస్తూ, 'ఎందుకు ఉండదు? ఇది నా కోడలు... ఇక్కడే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ 'నా ఇల్లు' అంటున్నావు... నువ్వు కట్టిందా ఈ ఇల్లు?' అంటూ ఘాటుగా ప్రశ్నిస్తాడు. 'అంతగా నచ్చకపోతే నువ్వే వెళ్లిపో... ఎక్కువ మాట్లాడితే నిన్నే గెంటేస్తా'అని హెచ్చరిస్తాడు.

సత్యం మాటలకు ప్రభావతి షాక్‌కు గురవుతుంది. 'నన్నే ఇంటి నుంచి పంపిస్తారా?'అంటూ బాధపడుతుంటే, సత్యం మరింత స్పష్టంగా 'నా మాట వినకపోతే అదే జరుగుతుంది. మీనా నా కోడలు... ఆమెకు ఇక్కడ పూర్తి హక్కు ఉంది' అని తేల్చి చెబుతాడు. దీంతో ప్రభావతి, ' ఈ ఇంట్లో మీనా ఉంటే నేను ఉండను' అంటూ కోపంగా తన లగేజ్ సర్దుకుని ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. మీనా, బాలు అడ్డుకోవడానికి ప్రయత్నించినా, 'మీనా ఉన్న చోట నేను ఉండను... నన్నెవ్వరూ ఆపొద్దు' అంటూ కఠినంగా చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనతో కుటుంబంలో విభేదాలు మరింత తీవ్రతరమవుతాయి.

రామ్ చరణ్ కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్.. సుకుమార్ ప్లాన్ మాములుగా లేదుగా..
రామ్ చరణ్ కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్.. సుకుమార్ ప్లాన్ మాములుగా లేదుగా..

ఇంట్లో జరిగిన ఘర్షణతో ఆవేశానికి లోనైన ప్రభావతి, తన సామాన్లు సర్దుకుని నేరుగా మీనాక్షి ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే శివ దొంగతనం వీడియో చూసిన మీనాక్షి, మీనాను ఇంటి నుంచి పంపించి ఉంటారని ఊహిస్తుంది. కానీ అనూహ్యంగా ప్రభావతే తన లగేజ్‌తో రావడంతో ఆమె ఆశ్చర్యానికి గురవుతుంది. 'ఏంటి ఇలా వచ్చావు?' అని ప్రశ్నించగా, ప్రభావతి తీవ్రంగా స్పందిస్తూ 'మీన ఉన్న చోట నేను ఉండలేను... దొంగలు ఉన్న కుటుంబంలో నేను ఉండను' అంటూ తన కోపాన్ని వ్యక్తం చేస్తుంది. దీనికి మీనాక్షి నవ్వుతూ కౌంటర్ ఇస్తూ, 'దొంగల గురించి నువ్వే మాట్లాడుతున్నావా?' అంటూ మనోజ్ గతాన్ని గుర్తు చేస్తుంది. అంతేకాకుండా, 'మిగతా కోడళ్లు ఏదో ఉన్నారు... కానీ నీకు నిజంగా అవసరమైనప్పుడు నీళ్లు పట్టేవాళ్లు కూడా ఉండరు. అలాంటి వాళ్లకు సపోర్ట్ ఇచ్చి మీనాను బయటకు పంపించాలనుకోవడం నీ పెద్ద తప్పు' అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది.

మీనాక్షి మాటలు ప్రభావతిని కుదిపేస్తాయి. 'నీకు బుద్ధి రావాలి... నువ్వు చేస్తున్న తప్పుకు భవిష్యత్తులో తప్పకుండా ఫలితం అనుభవిస్తావు' అంటూ ఆమె స్పష్టం చేస్తుంది. ప్రభావతి కూడా 'నేను ఇక్కడ ఉండాలని వస్తే ఇలా అవమానిస్తావా? నేను గొడవలు పెట్టను... అక్కడే చూసుకుంటా'అంటూ వెళ్లిపోవాలని ప్రయత్నించగా, మీనాక్షి వెంటనే మరో చురక వేస్తూ 'ఇప్పుడు బయట పోలీసులు ఉండనివ్వడం లేదు. గుళ్లలో ఉన్నా తన్ని తరుముతున్నారు' అని అంటుంది. దీంతో ప్రభావతి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. చివరికి మీనాక్షి తన మనసు మార్చుకుని, 'పోనీ... వెళ్లి ఆ రూమ్‌లో కొంచెం విశ్రాంతి తీసుకో'అంటూ ఆమెకు తన ఇంట్లో చోటు ఇస్తుంది. ఈ సన్నివేశం ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగాలను, నిజాయితీతో కూడిన హెచ్చరికలను స్పష్టంగా చూపిస్తుంది.

Peddi: పెద్ది కోసం రామ్ చరణ్ ఇంత కష్టపడ్డాడా?
Peddi: పెద్ది కోసం రామ్ చరణ్ ఇంత కష్టపడ్డాడా?

మరోవైపు, మీనా మాత్రం తీవ్ర మనస్తాపంతో కుంగిపోతుంది. తనపై జరిగిన అవమానం, తన తమ్ముడు శివ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ పరిస్థితిని గమనించిన బాలు ఆమెను ఓదార్చేందుకు ముందుకొస్తాడు. "అనవసరంగా కంగారు పడకు... అన్నీ నేను చూసుకుంటా" అంటూ ధైర్యం చెబుతాడు. ఈ సమయంలో మీనా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తూ, "మనమిద్దరం ఈ ఇంటి నుంచి వెళ్లిపోదామా?" అని అడుగుతుంది. అయితే బాలు మాత్రం ఆ ఆలోచనను పూర్తిగా ఖండిస్తూ, "అలాంటి నిర్ణయాలు తీసుకోకు... ఒక కొడుకు తన తండ్రికి అండగా ఉండాలి, అదే నేను నేర్చుకున్న విలువ" అంటూ తన భావాలను తెలియజేస్తాడు.

బాలు ఇంకా చెబుతూ, "అమ్మ ఏదో కోపంతో మాట్లాడుతుంది కాబట్టి మనం ఇంటిని వదిలి వెళ్లిపోవడం సరైంది కాదు. ప్రతి విషయంలో నాన్న మనకు అండగా ఉన్నాడు... ఆయన ఉన్నంత వరకు మనకు ఎలాంటి భయం అవసరం లేదు" అంటూ మీనాకు నమ్మకం కలిగిస్తాడు. చివరగా "ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో" అంటూ ఆమెను ఓదార్చుతాడు.

1800 కోసం అలాంటి పనులు చేశా.. ఈ క్షణమైన చనిపోవడానికి సిద్దమే..
1800 కోసం అలాంటి పనులు చేశా.. ఈ క్షణమైన చనిపోవడానికి సిద్దమే..

ఇక మరుసటి రోజు కథ మరింత ఆసక్తికర మలుపు తిరిగింది. శృతి తల్లి శోభన ఇంటికి రావడంతో సీన్ మారిపోయింది. హాల్లో కూర్చున్న సత్యాన్ని చూసిన శోభన, "రవి వాళ్ల అమ్మ ఎక్కడ?" అని ప్రశ్నించగా, వెంటనే సత్యం ఆమె మాటను సరిదిద్దుతూ "రవి వాళ్ల అమ్మ కాదు... మా ఇంటి పెద్ద" అని చెప్పడం గమనార్హం. దీంతో శోభన మళ్లీ "మా వియ్యపురాలు ప్రభావతి ఎక్కడ?" అని అడుగుతుంది. దానికి సత్యం ప్రశాంతంగా స్పందిస్తూ, "ప్రస్తుతం ఆమె ఇక్కడ లేదు... తన ఫ్రెండ్ మీనాక్షి ఇంటికి వెళ్లింది. మీరు కావాలంటే మీ కూతురు శృతి గదిలో ఉంది, వెళ్లి మాట్లాడండి" అని చెబుతాడు.

ఇంతలోనే రోహిణి అక్కడికి వచ్చి పరిస్థితిని మరింత కుదిపేసింది. "అత్తయ్య ఇంట్లో లేదు... అలిగి మీనాక్షి ఇంటికి వెళ్లింది. మీనా తమ్ముడు శివ దొంగతనం చేసిన వీడియో చూసారు కదా... అందుకే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది" అంటూ ఇంటి గుట్టును బయటపెట్టింది. ఆ మాటలు విన్న శోభన ఒక్కసారిగా ఆశ్చర్యపోయినా, ఆసక్తిగా వినడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో మీనా అక్కడికి రావడంతో, రోహిణి నీళ్లు ఇవ్వమని చెప్పగా, మీనా కాస్త వ్యంగ్యంగా "ఇప్పటిదాకా ఇంటి గుట్టు మొత్తం చెప్పేసావా?" అంటూ పంచ్ వేస్తుంది.

అయితే శోభన మాత్రం రోహిణికి సపోర్ట్ చేస్తూ, "ఉన్నదే చెప్పింది కదా" అంటూ మీనాను సూటిగా టార్గెట్ చేస్తుంది. ఈ సమయంలో బాలు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మరింత హై టెన్షన్‌కు చేరుతుంది. తనదైన స్టైల్‌లో బాలు, "ఈసారి చెక్కులు తీసుకువచ్చారా? ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు?" అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తాడు. అంతేకాకుండా, "మా ఇంటి విషయాలు మాత్రమే చెబుతున్నారు... మీ ఇంట్లో జరుగుతున్నవి కూడా చెప్పారా?" అంటూ వరుసగా కౌంటర్లు వేస్తూ, వారి కుటుంబ రహస్యాలను బయటపెడతాడు. "మలేషియాలో మీ పరిస్థితి, మనోజ్ బిజినెస్ నష్టాలు... ఇంకా మీ ఇంట్లో జరుగుతున్నవి" అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు. చివరగా, "ఇంకెవరైనా నా లాంటి వాళ్లు ఎదురైతే సమస్యలు వస్తాయి... జాగ్రత్త" అంటూ వార్నింగ్ ఇస్తాడు.

నా బట్టలు నా ఇష్టం.. ఏం వేసుకోవాలో తెలుసు.. ప్రియాంక జైన్ ఆగ్రహం!
నా బట్టలు నా ఇష్టం.. ఏం వేసుకోవాలో తెలుసు.. ప్రియాంక జైన్ ఆగ్రహం!

బాలు మాటలకు శోభన తీవ్రంగా బాధపడుతుంది. "ఇంటికి వచ్చిన వాళ్లతో ఇలానే మాట్లాడుతారా?" అంటూ అవమానంగా ఫీల్ అవుతుంది. ఈ సమయంలో సత్యం కూడా జోక్యం చేసుకుంటూ, "ముందే చెప్పాను... మీరు నేరుగా మీ కూతురు దగ్గరకు వెళ్లి మాట్లాడితే గౌరవం దక్కేది" అంటూ స్పష్టం చేస్తాడు. "ఇప్పటికైనా మీ కూతురు దగ్గరకు వెళ్లండి" అని చెప్పడంతో శోభన కోపంతో అక్కడినుంచి నేరుగా శృతి గదిలోకి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిన వెంటనే సత్యం రోహిణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "ఇంటి విషయాలు బయటపెట్టడం సరైనదేనా?" అంటూ గట్టిగా మందలిస్తాడు. బాలు కూడా తన స్టైల్‌లో పంచులు వేయడంతో రోహిణి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరోవైపు శృతి గదిలో శోభన తన కూతుర్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. "ఇలాంటి ఇంట్లో ఉండడం మంచిది కాదు... పుట్టింటికి రండి" అంటూ కోరుతుంది. కానీ శృతి మాత్రం గట్టిగా ఎదురు నిలిచి, "శివ చేసిన తప్పుకు మాకు ఏం సంబంధం? మా జీవితం మాది" అంటూ స్పష్టం చేస్తుంది. రవి కూడా "మేమెప్పుడైనా మీ సహాయం అడిగామా?" అంటూ కఠినంగా స్పందించడంతో శోభనకు సమాధానం లేక నిశ్శబ్దంగా వెళ్లిపోవాల్సి వస్తుంది.

ఇక మరోవైపు కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. శివ కోసం గాలిస్తున్న పోలీసులు పార్వతి, సుమతిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తారు. ఈ విషయం తెలిసి మీనా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. సుమతి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పడంతో మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అదే సమయంలో బాలు వచ్చి విషయం తెలుసుకుని, "ఏం టెన్షన్ పడకు... నేను పోలీస్ స్టేషన్‌కు వస్తున్నాను" అంటూ ధైర్యం చెప్పి అక్కడికి వెళ్లిపోతాడు. పోలీస్ స్టేషన్‌లో తల్లి పార్వతి ఆవేదనతో విలపించడం కథను మరింత భావోద్వేగంగా మార్చుతుంది. కుటుంబం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం ఎలా ముగుస్తుందో అన్న ఉత్కంఠతో ఎపిసోడ్ ముగియగా, రాబోయే భాగంపై ఆసక్తి మరింత పెరుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X