Gundeninda Gudigantalu April 3rd Episode: చిక్కుల్లో రోహిణి..సత్యంకు మళ్లి పెళ్లి.. ప్రభావతికి బాలు షాక్..
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతూ కుటుంబంలో ఉన్న విభేదాలను మరింత తీవ్రమయ్యేలా చూపించింది. శివ కేసు విషయంలో సత్యం ఎంత ప్రయత్నించినా ప్రభావతి మాత్రం తన మొండితనాన్ని వదలకుండా, "బాలు-మీనా ఇంటి నుంచి వెళ్లిపోతేనే కేసు వెనక్కి తీసుకుంటాను" అని షరతు పెట్టడం కథకు కీలక మలుపు తీసుకొచ్చింది. దీనిపై సత్యం ఆగ్రహంతో స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోవడం భావోద్వేగాన్ని పెంచింది. ఇదే సమయంలో మనోజ్, రోహిణి వచ్చి పరిస్థితిని మరింత వేడెక్కించగా, మీనాక్షి మనోజ్ గతాన్ని బయటపెట్టి అతడిని సైలెంట్ చేయడం సన్నివేశానికి బలం చేకూర్చింది.
మరోవైపు బాలు, మీనా శివను కాపాడేందుకు ప్రాణపణంగా ప్రయత్నాలు చేస్తారు. లాయర్ సూచనతో ఐదు లక్షలు అవసరమవడంతో, బాలు అప్పులు చేసి, స్నేహితుల సహాయం తీసుకుని, తాము దాచుకున్న డబ్బు కూడా ఖర్చు పెట్టి మొత్తంగా నాలుగు లక్షల యాభై వేల రూపాయలు సేకరించడం వారి త్యాగాన్ని చూపిస్తుంది. సత్యం కూడా తన వంతు సహాయం చేయడం కుటుంబ బంధాలను మరింత హైలైట్ చేసింది. ఇక కథలో కీలక మలుపు లాయర్ ప్రవేశంతో వచ్చింది. ప్రభావతిని చాకచక్యంగా ఒత్తిడి చేస్తూ, కేసు కొనసాగితే శివకు జైలు శిక్షతో పాటు ఆమెకూ సమస్యలు వస్తాయని చెప్పి భయపెట్టాడు.

photo courtesy jiohotstar
చివరకు రెండు లక్షల రూపాయల సెటిల్మెంట్‌తో ప్రభావతి కేసు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోవడం పెద్ద ట్విస్ట్‌గా మారింది. అయితే ఈ డీల్ గోప్యంగా ఉంచాలని ఆమె షరతు పెట్టడం మరో ఆసక్తికర అంశం. చివరగా లాయర్ నుంచి శుభవార్త విన్న బాలు, మీనా ఆనందపడగా, ఇంట్లో మాత్రం కొంత అనుమానం కొనసాగుతుంది. అయినప్పటికీ శివ ఇంటికి తిరిగి రావడం, ప్రభావతి ఎమోషనల్ అవుతూ బాలకు కృతజ్ఞతలు చెప్పడం ఎపిసోడ్‌ను హ్యాపీ ఎండింగ్‌తో ముగించింది. అయితే ఈ సీక్రెట్ బయటపడితే పరిస్థితి ఎలా మారుతుందో అనేది ఆసక్తిగా మారింది.
శుక్రవారం ఎపిసోడ్ కొత్త ట్విస్టులతో మరింత ఆసక్తికరంగా సాగింది. శివపై ప్రభావతి పెట్టిన కేసు వెనక్కి తీసుకోవడంతో పార్వతి కుటుంబంలో ఆనందం నెలకొంది. ఎన్నో రోజులు భయంతో గడిపిన శివ, చివరకు బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సందర్భంలో శివ తన తప్పును గ్రహించి, మొదట తల్లి పార్వతి కాళ్లపై పడుతూ క్షమాపణలు కోరడం ఎపిసోడ్‌లో హర్ట్ టచ్చింగ్ మారింది. "ఇకపై చెడు సావాసాలు చేయను" అంటూ ఇచ్చిన మాటతో తనలో వచ్చిన మార్పును చూపించాడు. పార్వతి కూడా కన్నీళ్లతో స్పందిస్తూ, "నీ కోసం నీ బావ బాలు ఎంత కష్టపడ్డాడో తెలుసా... నీ భవిష్యత్తు కోసం కేసు కూడా రాకుండా చూసుకున్నాడు" అని చెప్పడం ద్వారా బాలు చేసిన త్యాగాన్ని గుర్తు చేసింది. దీంతో శివ వెంటనే బాలు దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు చెబుతాడు. ఈ సమయంలో కుటుంబం మొత్తం కలిసి ప్రభావతిని కలిసి క్షమాపణలు చెప్పాలని నిర్ణయించడం కథను కొత్త దిశగా తీసుకెళ్లే సంకేతాలు ఇచ్చింది.
ఇక మరోవైపు గుణ ట్రాక్‌లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. శివకు కనీసం కొంతకాలం జైలు శిక్ష పడుతుందని భావించిన గుణ, కేసు ఒక్కసారిగా వెనక్కి తీసుకోవడంతో షాక్ అవుతాడు. 'ఇది సాధారణ విషయం కాదు... బాలు లేదా మీనా ఏదో పెద్ద ప్లాన్ చేశారు" అని అనుమానం వ్యక్తం చేస్తాడు. దీంతో అతను మరింత అప్రమత్తంగా మారడం కథలో సస్పెన్స్‌ను పెంచింది. ఇంతలో దినేష్ బయటికి పంపించమని గుణను అడగడంతో పరిస్థితి కాస్త టెన్షన్‌గా మారుతుంది. గుణ అతనిపై కోపంగా స్పందిస్తూ, ఇంకా తన ప్లాన్ పూర్తికాలేదని సంకేతాలు ఇస్తాడు. వెంటనే రోహిణికి కాల్ చేసి రెండు లక్షల రూపాయలు వెంటనే ఏర్పాటు చేయమని ఒత్తిడి తెచ్చాడు. దీంతో రోహిణి ఒక్కసారిగా కంగారు పడుతుంది. బయటకు "అరేంజ్ చేస్తున్నాను" అని చెప్పినా, లోపల మాత్రం తీవ్ర ఆందోళనలో పడుతుంది.
ఇక రోహిణి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఒకవైపు గుణ ఒత్తిడి, మరోవైపు ప్రభావతి కేసు ఎందుకు వెనక్కి తీసుకుందో తెలియక అనుమానాల్లో మునిగిపోతుంది. "అసలు ఏం జరిగింది?" అన్న ప్రశ్న ఆమెను వెంటాడుతుంది. ఈ విషయం తెలుసుకోవడానికి ఆమె తనదైన ప్రయత్నాలు మొదలు పెట్టడం కథలో మరో ఆసక్తికర ట్రాక్‌గా మారింది. అంతేకాకుండా రెండు లక్షల రూపాయలు ఎలా సమకూర్చాలి అన్న ఆలోచనలో రోహిణి చిక్కుకుంది. గుణకు డబ్బు ఇవ్వకపోతే ఏమవుతుందో అన్న భయంతో ఆమె మానసికంగా ఒత్తిడికి లోనవుతుంది.
మరోవైపు బాలు, మీనా తో పాటు పార్వతి కుటుంబం మొత్తం కలిసి ప్రభావతి వద్దకు రావడం సన్నివేశానికి కీలక మలుపు తీసుకొచ్చింది. వారిని చూసిన వెంటనే ప్రభావతి ఆగ్రహంతో రగిలిపోవడం, ఇంకా తన కోపం తగ్గలేదని స్పష్టంగా తెలుస్తుంది. అయితే పార్వతి మాత్రం ఎంతో వినమ్రంగా స్పందిస్తూ, "నా కొడుకు చేసిన తప్పుకు మీరు పెద్ద మనసుతో క్షమించి కేసు వెనక్కి తీసుకున్నారు... ఈ ఉపకారం జీవితాంతం మర్చిపోము" అంటూ కృతజ్ఞతలు తెలపడం పరిస్థితిని కొంత సాఫీ చేయడానికి ప్రయత్నించింది. ఇక శివ కూడా ముందుకు వచ్చి తన తప్పును అంగీకరిస్తూ, ప్రభావతి కాళ్లకు పడిపోవడానికి సిద్ధమవుతాడు. కానీ ఆ క్షణంలో ప్రభావతి ..శివ తనపై కత్తితో దాడి చేస్తున్నట్టు భ్రమపడుతూ ఒక్కసారిగా భయంతో వణికిపోవడం సన్నివేశాన్ని షాకింగ్‌గా మార్చింది.
ఈ భయం కారణంగా ఆమె తన వైఖరిని కొద్దిగా మార్చుకుని, "నీ భవిష్యత్తు కోసం క్షమించాను... పో ఇప్పుడు" అంటూ కాస్త గట్టిగా స్పందించినా, లోపల భయం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో బాలు పరిస్థితిని కంట్రోల్ చేస్తూ, "అమ్మ మిమ్మల్ని క్షమించింది... ఇక మీరు వెళ్లిపోండి" అని చెప్పి పార్వతి కుటుంబాన్ని పంపిస్తాడు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. బాలు ఒక్కసారిగా కొత్త డ్రామా మొదలు పెడతాడు. ప్రభావతిని షాక్‌కు గురిచేస్తూ, "నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం బామ్మకు తెలిసిపోయింది... అందుకే నాన్నకు రెండో పెళ్లి చేయాలని ఫిక్స్ అయింది" అని చెప్పడం పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. అంతేకాకుండా "నీలవేణి అనే నాన్న మాజీ లవర్ కూడా పెళ్లికి రెడీగా ఉంది... నాన్న కూడా బామ్మ మాటకు ఒప్పుకుంటున్నాడు" అని చెప్పడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఈ సమయంలో మీనా కూడా ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యపోతుంది. కానీ బాలు మాత్రం తన నటనను మరింత పెంచుతూ సెంటిమెంట్ డైలాగ్స్‌తో పరిస్థితిని తనవైపు తిప్పుకుంటాడు. "ఇది చివరిసారి అమ్మ అని పిలుస్తున్నాను... ఇకపై ఇంటి బాధ్యతలు అన్నీ నీలవేణి చేతిలోకి వెళ్తాయి" అంటూ ప్రభావతిలో భయాన్ని పెంచేలా మాట్లాడుతాడు. అంతేకాకుండా "పెళ్లి ఏర్పాట్లన్నీ బామ్మ నాకే అప్పగించింది" అని చెప్పి మరింత షాక్ ఇస్తాడు. బాలు చెప్పిన ప్రతి మాట ప్రభావతి మనసులో కలకలం రేపుతుంది. బయటకు మాత్రం తన గౌరవం కాపాడుకోవడానికి ప్రయత్నించినా, లోపల మాత్రం అసహనం, భయం, ఆందోళన అన్ని కనిపిస్తాయి. ఈ డ్రామాతో బాలు తన తల్లిని తిరిగి ఇంటికి రప్పించడానికి మానసికంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.
బాలు వేసిన "రెండో పెళ్లి" డ్రామా ప్రభావతిపై బాగా పని చేయడం కథలో కీలక మలుపుగా మారింది. మొదట ఆ విషయం విన్న ప్రభావతి షాక్ అవుతూ, "నిజంగానే నా భర్తకు మరో పెళ్లి జరుగుతుందా?" అనే భయంతో కంగారుపడుతుంది. అదే సమయంలో మీనాక్షి కూడా తన బంధువుల ఉదాహరణ చెప్పి పరిస్థితిని మరింత భయంకరంగా చూపించడం వల్ల ప్రభావతి పూర్తిగా మెంటల్‌గా డిస్టర్బ్ అవుతుంది. "నేను లేకపోతే నా జీవితమే మారిపోతుంది" అన్న ఆలోచన ఆమెను వెంటాడుతుంది. దీంతో ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని బ్యాగ్ సర్దుకుంటుంది.
ఇక మరోవైపు రోహిణి ట్రాక్‌లో టెన్షన్ పెరుగుతుంది. గుణ ఇచ్చిన వార్నింగ్‌తో ఆమె పూర్తిగా టెన్షన్‌లో పడిపోతుంది. తన దగ్గర ఉన్న 50 వేల రూపాయలతో సరిపోదని, మిగతా 1.5 లక్షలు ఎలా సమకూర్చాలి అనే ఆందోళనలో పడిపోతుంది. అదే సమయంలో ప్రభావతి కేసు ఎందుకు వెనక్కి తీసుకుందో తెలుసుకోవాలని కూడా ప్రయత్నిస్తుంది. ఇక ప్రభావతి తన ఇంటికి వచ్చి, మనోజ్-రోహిణిని బయటకు పిలిచి ఒక ప్లాన్ చెబుతుంది. "నేను స్వయంగా వస్తే నన్ను తక్కువగా చూస్తారు... మీరు బలవంతంగా తీసుకువచ్చినట్టు నటించండి" అని చెప్పడం ఆమె ఈగోను స్పష్టంగా చూపించింది. దీంతో మనోజ్ కూడా డ్రామా స్టార్ట్ చేసి, "మేమే అమ్మను తీసుకువచ్చాం" అంటూ ఇంట్లోకి తీసుకురావడం సన్నివేశానికి ఫన్ టచ్ ఇచ్చింది.
కానీ ఇక్కడ బాలు ఎంట్రీతో సీన్ పూర్తిగా టర్న్ అవుతుంది. "లాక్కొచ్చారా... లేక లాక్కొచ్చామని చెప్పమన్నదా?" అంటూ ఒకే డైలాగ్‌తో వారి డ్రామాను ఎక్స్‌పోజ్ చేయడం హైలైట్ అయింది. అంతేకాకుండా "ఇంటిని వదిలి వెళ్లిన వారికి ఇక్కడ ఏం పని? నాన్నకు రెండో పెళ్లి జరుగుతోంది" అంటూ వెటకారంగా మాట్లాడటం నవ్వులు పూయించింది. తన తండ్రికి కన్ను కొట్టి, ప్లాన్ కొనసాగించమని సిగ్నల్ ఇవ్వడం మరింత ఫన్నీగా అనిపించింది. సత్యం కూడా అదే డ్రామాలో భాగమై "నేను ఎప్పటివరకు ఒంటరిగా ఉండాలి?" అని చెప్పడం సీన్‌ను కామెడీగా మార్చింది.
ఇక క్లైమాక్స్‌లో బాలు తన తల్లిని ఇంట్లోకి పిలిపిస్తూ, "ఇదిగో మా నాన్నను మళ్లీ నీకు అప్పగిస్తున్నా... నీళ్లలో ముంచినా నువ్వే, పాలలో ముంచినా నువ్వే చూసుకో" అంటూ చెప్పిన డైలాగ్ హాస్యంతో పాటు ఎమోషన్‌ను కలిపి చూపించింది. కానీ బాలు ఓవర్ యాక్టింగ్ చేయడంతో చివరికి ప్రభావతి కోపంతో అతడిని కొట్టడం సీన్‌కు పీక్ కామెడీని తీసుకొచ్చింది. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో బాలు ప్లాన్ సక్సెస్ అవుతూ, ప్రభావతి ఇంటికి తిరిగి రావడం ఒకవైపు రిలీఫ్ ఇవ్వగా, మరోవైపు ఫుల్ కామెడీ ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రేక్షకులను అలరించింది.
అయితే.. ప్రభావతి ఇంట్లోకి తిరిగి వచ్చిన వెంటనే కథ మళ్లీ సీరియస్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. శివను క్షమించినప్పటికీ, ఆమె ఒక్కసారిగా కఠినమైన షరతు పెట్టడం అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. "ఇకపై మీనా పుట్టింటి వాళ్లు ఈ ఇంట్లో అడుగుపెట్టకూడదు" అని స్పష్టంగా చెప్పడం సన్నివేశాన్ని ఉద్రిక్తంగా మార్చింది. ఈ మాటలు విన్న వెంటనే బాలు కోపంతో రగిలిపోతాడు. సత్యం కూడా ప్రభావతి వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తాడు. కానీ ఈ సమయంలో అందరినీ ఆశ్చర్యపరిచేలా మీనా స్పందిస్తుంది. ఎంతో ఆత్మగౌరవంతో మాట్లాడుతూ, "నా పుట్టింటి వాళ్లను ఇక్కడ ఎప్పుడూ గౌరవంగా చూడలేదు... వాళ్లు రావడం కంటే దూరంగా ఉండడమే మంచిది" అని భావోద్వేగానికి లోనవుతుంది.
తన తల్లిదండ్రులు అవమానాలు ఎదుర్కొనడం తనకు ఇష్టం లేదని చెప్పి ప్రభావతి పెట్టిన షరతును అంగీకరించడం ద్వారా మీనా తన వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపిస్తుంది. ఆమె మాటలు విన్న ప్రభావతి కూడా కాసేపు సైలెంట్ అవుతుంది. అయితే బయటకు మాత్రం "ఆమె ఒప్పుకుంది కాబట్టి ఎవ్వరూ ఈ విషయం గురించి మాట్లాడవద్దు" అంటూ తన ఈగోను కొనసాగిస్తుంది. ఈ సంఘటన తర్వాత రోహిణి మనసులో అనుమానాలు మొదలవుతాయి. "ఎంత అడిగినా రాని అత్తయ్య, ఇప్పుడు ఒక్కసారిగా ఎలా వచ్చింది? శివపై అంత కోపం ఉన్న ఆమె కేసు ఎందుకు వెనక్కి తీసుకుంది?" అనే ప్రశ్నలు ఆమెను వెంటాడుతాయి. ఈ మిస్టరీని తెలుసుకోవాలంటే మీనాక్షి దగ్గరే క్లూ ఉంటుందని భావించి, ఆమెను కలవాలని నిర్ణయించుకోవడం కథలో కొత్త సస్పెన్స్ ట్రాక్‌ను ప్రారంభిస్తుంది.
ఇక మరోవైపు బాలు-మీనా మధ్య భావోద్వేగ సంభాషణ చోటుచేసుకుంటుంది. "అమ్మ పెట్టిన షరతుకు ఎందుకు ఒప్పుకున్నావు?" అని బాలు అడగగా, మీనా చాలా స్పష్టంగా తన మనసులోని మాట చెబుతుంది. "నేను ఇక్కడ ఉండేది భార్యగా... ఇల్లు నా బాధ్యత. కానీ నా అమ్మా నాన్నను అవమానపరిచే హక్కు ఎవరికీ లేదు" అని చెప్పడం ద్వారా తన కుటుంబంపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. ఈ మాటలు బాలను కూడా కాస్త ఆలోచింపజేస్తాయి. చివరకు ఆమె నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని భావిస్తాడు. అంతేకాకుండా, కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై కూడా మీనా దృష్టి పెడుతుంది. అప్పుల నుంచి బయటపడాలంటే కొత్త మార్గం అవసరమని చెప్పి, "పెళ్లిళ్లు, ఈవెంట్స్‌కు డెకరేషన్ ఆర్డర్స్ తీసుకుందాం" అనే కొత్త బిజినెస్ ఐడియాను ముందుకు తెస్తుంది. ఇది కథలో కొత్త ట్రాక్‌కు నాంది పలుకుతుంది. బాలు ఈ ఐడియాను అంగీకరిస్తాడా? లేక మరో సమస్య ఎదురవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











