Gundeninda Gudigantalu April 7th Episode: ప్రభావతి ఫ్యామిలీ డ్రామా, 2 లక్షల గుట్టురట్టు, మనోజ్ కన్నింగ్ ప్లాన్
photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడిగంటలు సిరియల్ సోమవారం ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముందుగా మీనా కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పూల వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయిస్తుంది. పెళ్లిళ్లు, వేడుకలకు డెకరేషన్ చేస్తే మంచి ఆదాయం వస్తుందని బాలును ఒప్పిస్తుంది. ఆమె క్రియేటివిటీ చూసి బాలు కూడా వెంటనే సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేయాలని సూచిస్తాడు. శృతి ఎంట్రీతో మీనా బిజినెస్ మరింత ప్రొఫెషనల్‌గా మారుతుంది. మోడ్రన్ లుక్, యాడ్ షూట్, ర్యాంప్ వాక్ ట్రైనింగ్‌తో మీనా కొత్త అవతారంలో కనిపిస్తుంది. ఇక మరోవైపు కథలో ఉత్కంఠ పెంచిన రోహిణి ట్రాక్ కీలకంగా మారింది. ప్రభావతి అకస్మాత్తుగా తన నిర్ణయం మార్చుకోవడం వెనుక డబ్బు కారణమని రోహిణి తెలుసుకుంటుంది.
శివ కేసు ఉపసంహరణకు రూ.2 లక్షలు తీసుకున్నట్లు మీనాక్షి చెప్పడంతో షాక్ అవుతుంది. ఇదే సమయంలో గుణ నుంచి వచ్చిన బెదిరింపులతో రోహిణి మరింత ఆందోళన చెందుతుంది. తన సమస్య పరిష్కారం కోసం స్నేహితురాలు విద్యతో కలిసి ప్లాన్ వేసి, ప్రభావతిని డాన్స్‌లో బిజీగా పెట్టి ఆమె దగ్గర దాచిన డబ్బును తెలివిగా దొంగిలిస్తుంది. ఇక బాలు సరదాగా మీనాను "ముంబై నుంచి వచ్చిన నా కొత్త లవర్"గా పరిచయం చేయడం వల్ల ప్రభావతి కోపంతో ఊగిపోతుంది. చివరకు అది మీనానే అని తెలిసి షాక్ అవుతుంది. ఈ సంఘటనతో మీనాపై ప్రభావతికి ఉన్న ప్రేమ బయటపడుతుంది. చివరగా రోహిణి గుణకు డబ్బు ఇచ్చి సమస్య ముగిసిందని అనుకుంటుంది. కానీ గుణ-దినేష్ కలిసి ఆమెను మోసం చేస్తూ మరింత డబ్బు దోచుకోవాలని ప్లాన్ చేయడం కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.

మంగళవారం ఎపిసోడ్ చాలా ఫన్నీగా సాగింది. ముఖ్యంగా మనోజ్ ఫర్నిచర్ షాప్ ప్రమోషన్ ట్రాక్ పుల్ ఎంటర్టైమెంట్ గా మారింది. ముంబై నుంచి ముఖేష్ ఫోన్ చేసి షాప్ కోసం యాడ్ ఫిల్మ్ చేయాలని సూచించడం కథకు కొత్త మలుపు తీసుకువచ్చింది. మొదట మనోజ్ పెద్ద సెలబ్రిటీతో యాడ్ చేయాలని ఆలోచిస్తాడు. అయితే ముఖేష్ మాత్రం "ఇప్పుడు ట్రెండ్ మారింది... షాప్ ఓనర్‌నే బ్రాండ్ అంబాసిడర్‌గా చూపిస్తే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది" అంటూ కొత్త ఐడియా ఇస్తాడు. ఇక అక్కడితో ఆగకుండా, "మీ ఇంట్లో బాలు ఎక్స్‌ప్రెషన్స్ బాగుంటాయి, మీనా నేచురల్‌గా కనిపిస్తుంది. మొత్తం మీ ఫ్యామిలీ గుడ్ లుకింగ్... అందుకే మీరే యాడ్‌లో నటిస్తే బాగుంటుంది" అంటూ ప్లాన్ చెబుతాడు. ప్రతి జంటకు రూ.50,000 చొప్పున రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పడంతో మనోజ్‌కు ఒక్కసారిగా షాక్ తగిలినట్టవుతుంది. బయటకు ఒప్పుకున్నా లోపల మాత్రం .. ఖర్చు గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడతాడు.
అదే సమయంలో రోహిణి మాత్రం ఈ ఐడియాపై ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. "మన వాళ్లకే డబ్బులు వస్తున్నాయి... అందులో ఫీల్ అవ్వాల్సిందేముంది?" అంటూ సింపుల్‌గా తీసుకుంటుంది. కానీ మనోజ్ మాత్రం ఖర్చు తగ్గించడానికి ప్లాన్ వేస్తాడు. "వాళ్లు ప్రొఫెషనల్ యాక్టర్లు కాదుగా... ఎందుకు అంత డబ్బులు ఇవ్వాలి? మా అమ్మకు పదివేలు ఇస్తే సరిపోతుంది" అంటూ ముఖేష్ ఇచ్చే మొత్తాన్ని తగ్గించి మిగిలిన డబ్బును తన దగ్గరే ఉంచుకోవాలని ప్రయత్నిస్తాడు. మనోజ్ ఆలోచనలు విన్న రోహిణి మనసులో మాత్రం మరో లెక్క నడుస్తుంది. "నేను రెండు లక్షలు దొంగిలిస్తే... నా మొగుడు ఇంకో రెండు లక్షల కోసం ప్లాన్ చేస్తున్నాడు... నిజంగా నాకు తగిన మొగుడే దొరికాడు" అంటూ తనలో తాను అనుకోవడం ఈ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది.
ఇక ఫర్నిచర్ షాప్ ప్రమోషన్ కోసం యాడ్ షూట్ చేయాలని నిర్ణయించిన మనోజ్, ఇంటికి వెళ్లగానే అందరినీ హాల్లోకి పిలుస్తాడు. అయితే విషయం చెప్పకముందే బాలు సెటైర్ వేస్తూ "మళ్లీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? అందరికీ కుచ్చుటోపి పెట్టాలనుకుంటున్నావా?" అంటూ సరదాగా కామెంట్ చేస్తాడు. దీంతో రోహిణి వెంటనే బాలు మాటలను అడ్డుకుంటూ "ముందు విను, తర్వాత మాట్లాడవచ్చు" అంటూ పరిస్థితిని కంట్రోల్ చేస్తుంది. తర్వాత మనోజ్ అసలు విషయం బయటపెడుతూ, ముంబై నుంచి ముఖేష్ కాల్ చేసి తమ ఫర్నిచర్ షాప్‌కు ప్రమోషన్ కోసం యాడ్ చేయాలని సూచించాడని చెబుతాడు. ఇందులో కుటుంబ సభ్యులే నటించాలని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. బాలు, మీనా ఇద్దరూ "మాకు యాక్టింగ్ రాదు" అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రభావతి కూడా "నాకు డాన్స్ వస్తుంది కానీ యాక్టింగ్ మాత్రం రాదు" అని చెప్పడంతో బాలు ఆమెపై సెటైర్‌గా "మహానటి" అని కామెంట్ చేయడం నవ్వులు పూయిస్తుంది.
ఇక శృతి మాత్రం ముందుకు వచ్చి "నేను డబ్బింగ్ చేస్తుంటాను కాబట్టి యాక్టింగ్ ఓకే" అంటూ రెడీ అవుతుంది. రవి తన స్టైల్‌లో "నేను చిన్న అబద్ధం చెప్పినా పట్టుబడిపోతా" అంటూ వెనక్కి తగ్గుతాడు. అయితే మీనా మాత్రం మొదట నిరాకరించినా, తర్వాత "ఏ పాత్రైనా నేను చేయగలను" అంటూ సవాల్‌గా మాట్లాడుతుంది. ఈ సమయంలో ప్రభావతి మీనాపై వ్యంగ్యంగా మాట్లాడడం పరిస్థితిని టెన్షన్‌గా మారుస్తుంది. దీంతో మీనా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గతంలో జరిగిన విషయాలను గుర్తు చేస్తుంది. "మనోజ్ డబ్బులు తీసుకున్నప్పుడు, నా నగలు తాకట్టు పెట్టినప్పుడు, రోహిణి ఇంటి పత్రాలు పెట్టినప్పుడు మీరేం తెలియనట్టుగా నటించలేదా?" అంటూ ప్రభావతిని గట్టిగా నిలదీస్తుంది. ఈ డైలాగ్స్ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి.
చివరికి "అత్తయ్య నన్ను అడిగితేనే నటిస్తా" అని మీనా చెప్పడంతో, మనోజ్ తన తల్లిని ఒప్పిస్తాడు. ప్రభావతి ఇష్టంలేకపోయినా చివరకు మీనాను రిక్వెస్ట్ చేయడంతో ఆమె ఒప్పుకుంటుంది. దీంతో కుటుంబం మొత్తం యాడ్ షూట్‌కు సిద్ధమవుతుంది. అయితే మరో ట్విస్ట్‌గా బాలు "నటిస్తే డబ్బులు ఇవ్వరు?" అని ప్రశ్నించగా, మనోజ్ "ఇది మన షాప్... మన మధ్య డబ్బుల మాటేంటి?" అంటూ కవరింగ్ ఇస్తాడు. కానీ మీనా మాత్రం అనుమానం వ్యక్తం చేస్తూ ముఖేష్ లాంటి వారు ఫ్రీగా పని చేయించరని చెబుతుంది. ఇక చివర్లో మనోజ్ తన తల్లికి రూ.10,000 ఇచ్చి "ఇది యాడ్‌లో నటించినందుకు రెమ్యునరేషన్" అని చెప్పడం మరింత సందేహాలకు తావిస్తుంది. "ముఖేష్ డబ్బులు ఇవ్వడంలేదన్నావు... ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి?" అని ప్రభావతి అడిగితే, "ఇవి నా సొంత డబ్బులు" అంటూ తప్పించుకుంటాడు. అయితే డబ్బులు చేతికి రావడంతో ప్రభావతి మాత్రం ఆనందంలో మునిగిపోతూ "ఇలా రోజూ నటిస్తే కోటీశ్వరురాలిని అవుతా" అంటూ కలలు కంటుంది.
ఇక మరుసటి రోజు.. యాడ్ షూటింగ్ కోసం కుటుంబ సభ్యులంతా షాప్‌కు చేరుకోగా, ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి డైరెక్టర్ ముక్కోటి ముకుంద గురించి హెచ్చరిస్తాడు. "ఆయనకు కోపం ఎక్కువ... కోపం వచ్చినప్పుడల్లా తిడతాడు" అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే బాలుని అందరినీ సైలెంట్‌గా ఉండాలని, ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదని రిక్వెస్ట్ చేస్తాడు. ఈ పరిస్థితిలో మీనా ఒక తెలివైన ఐడియా ఇస్తుంది. బాలు కోపంగా మారినప్పుడల్లా "బాలు... చాలు" అనే కోడ్ వర్డ్ వాడి అతన్ని కంట్రోల్ చేద్దామని నిర్ణయిస్తారు. ఇదే కోడ్ షూటింగ్ మొత్తం హైలైట్‌గా మారుతుంది.
ఇక డైరెక్టర్ ముక్కోటి ముకుంద ఎంట్రీతోనే సెట్స్‌లో హడావిడి మొదలవుతుంది. చిన్న విషయానికే ఆగ్రహంగా స్పందిస్తూ అందరిపై అరవడం మొదలుపెడతాడు. మనోజ్ తన కుటుంబాన్ని పరిచయం చేయగా, డైరెక్టర్ పాత్రలు కేటాయిస్తూ సత్యం-ప్రభావతిని ఓనర్స్‌గా, మనోజ్-రోహిణిని ఏ క్లాస్ కస్టమర్లుగా, రవి-శృతిని బీ క్లాస్‌గా, బాలు-మీనాలను సీ క్లాస్ కస్టమర్లుగా చూపిస్తాడు. ఈ విధంగా తక్కువ చేసి చూపించడం బాలుకు నచ్చదు. వెంటనే అలిగి వెళ్లిపోతాడు.దీంతో సత్యం, మీనా వెళ్లి అతన్ని ఒప్పించి మళ్లీ సెట్స్‌కు తీసుకొస్తారు. అయితే డైరెక్టర్ ప్రవర్తన మాత్రం మారదు. ప్రతి సన్నివేశంలో కోపంగా అరిచేస్తూ, సరైన వివరణ ఇవ్వకుండా షూట్ చేయించడం బాలుకు అసహనం కలిగిస్తుంది.
ఒక దశలో తన తండ్రిపై కూడా డైరెక్టర్ అరవడంతో బాలు కంట్రోల్ కోల్పోతాడు. ఆ సమయంలో మీనా వెంటనే "బాలు... చాలు" అంటూ కోడ్ వాడి పరిస్థితిని సర్దుబాటు చేస్తుంది. ఇక మరోసారి డైరెక్టర్ అదే విధంగా ప్రవర్తించడంతో బాలు తట్టుకోలేక అతనితో వాదనకు దిగుతాడు. "మా నాన్న కూడా డైరెక్టరే... మా ఇంట్లో అందరినీ ఆయన డైరెక్షన్‌లోనే నడిపిస్తాడు" అంటూ కౌంటర్ ఇవ్వడం ఫన్నీగా మారుతుంది. ఈ క్రమంలో బాలు-డైరెక్టర్ మధ్య జరిగే మాటల యుద్ధం నవ్వులు పూయిస్తుంది. చివరగా యాడ్ పూర్తవుతున్న సమయంలో మరో ట్విస్ట్ వస్తుంది. లాస్ట్ షాట్‌లో బాలు కెమెరా వైపు చూడకుండా వేరే వైపు చూడడంతో డైరెక్టర్ ఆగ్రహంతో తిడతాడు. దీంతో బాలు కూడా ఆగకుండా "ఫ్రీగా నటిస్తే ఓవర్ చేస్తున్నావ్ ఏంటీ?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. డైరెక్టర్ కోపంతో "ఎవరు ఫ్రీగా నటిస్తున్నారు? ఈ యాడ్ కోసం రెండు లక్షలు ఖర్చు చేశారు... ప్రతి ఒక్కరికి 25,000 ఇస్తున్నారు" అని చెప్పేస్తాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ మనోజ్ వైపు చూస్తారు. ఇప్పటివరకు డబ్బులు ఇవ్వడం లేదని చెప్పిన మనోజ్ అసలు ప్లాన్ బయటపడుతుంది. ఈ సీన్‌తో ఎపిసోడ్‌కు క్లైమాక్స్ రాగా, రాబోయే ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. మనోజ్ చేసిన మోసం బయటపడిన తర్వాత బాలు ఎలా రియాక్ట్ అవుతాడు? కుటుంబంలో కొత్త గొడవలు ఎలా మొదలవుతాయి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications









