Gundeninda Gudigantalu April 14th Episode: మీనా vs ప్రభావతి.. 5 లక్షల డిమాండ్.. తాళిబొట్టు అమ్మేసిన రోహిణి
photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడిగంటలు సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేసింది. మీనా కిడ్నాప్ ట్రాక్ కథకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. దుండగుల చేతిలో చిక్కుకున్న మీనా భయంతో దేవుణ్ని ప్రార్థిస్తూ కనిపించగా, మరోవైపు బాలు ఆమె కోసం ఆత్రంగా వెతుకుతుంటాడు. వృద్ధ దంపతులు చెప్పిన క్లూ నాగుపాము గుర్తు ఉన్న కారు కథను కీలక మలుపు తిప్పుతుంది. ఈ ఆధారంతో బాలు తన డ్రైవర్ గ్రూప్ సహాయాన్ని కోరడం, వందలాది మంది డ్రైవర్లు అండగా నిలవడం ఎమోషనల్‌గా హైలైట్‌గా నిలిచింది. రామాలయం ప్రాంతంలో అనుమానాస్పద కారు కనిపించడంతో బాలు, రాజేష్ అక్కడికి చేరుకుంటారు. మీనా చీర ఆనవాళ్లు కనిపించడం టెన్షన్‌ను మరింత పెంచుతుంది. ఇదే సమయంలో రాజేష్ కారును ఫాలో అవుతూ లైవ్ లొకేషన్ షేర్ చేయడం కథలో మాస్ ట్విస్ట్. వందల మంది కలిసి మీనాను కాపాడేందుకు రావడం గూస్‌బంప్స్ సీన్‌గా నిలిచింది.
దినేష్ మీనాను బెదిరిస్తూ వేళ్లు కట్ చేయాలని ప్రయత్నించే సమయంలో బాలు చేరుకుని ఆమెను రక్షించడం ఎపిసోడ్ క్లైమాక్స్ హైలైట్. అయితే కిడ్నాప్ డ్రామా ముగిసిన వెంటనే కథ కుటుంబ రహస్యాల వైపు మళ్లింది. మీనాపై దొంగతనం ఆరోపణల విషయం బయటకు రావడంతో బాలు, మీనా కలిసి నిజం తెలుసుకునేందుకు ముందుకు వస్తారు. మీనాక్షిని ప్రశ్నించగా, అసలు డబ్బు ప్రభావతి దాచిందని షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. శివ కేసు విత్‌డ్రా కోసం తీసుకున్న డబ్బు అని తెలిసి పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత మీనా ధైర్యంగా ప్రభావతిని ఎదిరించడం, వరుస ప్రశ్నలతో మూలకు నెట్టడం ఎపిసోడ్‌కు మరో హై పాయింట్. సత్యం కూడా మీనాకు సపోర్ట్ ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారుతుంది. చివరికి "మీరు చెప్తారా? లేక నేను చెప్పనా?" అంటూ మీనా సవాల్ చేయడం ఎపిసోడ్‌ను క్లైమాక్స్ మూడ్‌లో నిలిపింది. తదుపరి ఎపిసోడ్‌పై భారీ ఆసక్తి పెరిగింది.

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ కథలో భారీ మలుపులతో రసవత్తరంగా సాగింది. మీనా కిడ్నాప్ డ్రామా తర్వాత కథ పూర్తిగా కుటుంబంలో దాగి ఉన్న రహస్యాల వైపు మళ్లింది. బాలు, మీనా నేరుగా ఇంటికి చేరుకుని రెండు లక్షల రూపాయల దొంగతనం వ్యవహారంపై ప్రభావతిని నిలదీయడం ఎపిసోడ్‌కు హైలెట్ గా మారింది. 'ఆ డబ్బులు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి డబ్బులు?" అంటూ బాలు సూటిగా ప్రశ్నించగా, మీనా కూడా " మీనాక్షి ఇంట్లో డబ్బులు పోతే నా మీద ఎందుకు నింద వేశారు?" అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బందిపడిన ప్రభావతి చివరకు నోరు జారి "మీ తమ్ముడు దొంగతనం చేశాడు కదా... నువ్వూ చేసి ఉండొచ్చు అనుకుని నింద వేశాను" అని చెప్పడంతో సీన్ ఒక్కసారిగా హీట్ ఎక్కుతుంది.
ఈ మాటలు విన్న బాలు తీవ్ర ఆగ్రహంతో తన తల్లి గతాన్ని బయటపెడతాడు. "మీరు దొంగలు కాదా? మీరు దొంగతనాలు చేయలేదా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. మీనా కూడా వెనక్కి తగ్గకుండా "దొంగల కుటుంబం" అంటూ తీవ్రంగా విమర్శిస్తుంది. దీంతో ప్రభావతి పూర్తిగా మాటలు రాక నిలిచిపోతుంది. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న మనోజ్, రోహిణి కూడా తమ తమ రహస్యాలు బయటపడతాయేమోనని భయంతో కంగారు పడుతుంటారు. ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే బయటపడుతుంది. మీనా వెల్లడించిన షాకింగ్ నిజం అందరినీ కుదిపేస్తుంది.
శివపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసేందుకు ప్రభావతి లాయర్ దగ్గర నుంచి రెండు లక్షలు తీసుకుందని బయటపడుతుంది. పైకి త్యాగమూర్తిలా కనిపించిన ప్రభావతి అసలు స్వరూపం బయటపడటంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. శృతి కూడా "ఇంత దారుణంగా డబ్బులు తీసుకుంటారా?" అంటూ తీవ్రంగా విమర్శిస్తుంది. సత్యం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభావతిని గట్టిగా నిలదీస్తాడు. చివరకు ప్రభావతి తన తప్పును ఒప్పుకుంటూ "లాయర్ ఆశ చూపడంతో డబ్బులు తీసుకున్నాను" అని చెబుతుంది. దీంతో సత్యం ఆగ్రహంతో "ఇంటి నుంచి వెళ్లిపో" అని హెచ్చరిస్తాడు. ఇదే సమయంలో బాలు కూడా ఈ వ్యవహారంపై కేసు పెట్టాలని, లేకపోతే ఐదు లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. సత్యం కూడా బాలుకు మద్దతు ఇవ్వడంతో ప్రభావతి పూర్తిగా షాక్ అవుతుంది. డబ్బులు ఎలా ఇవ్వాలో అర్థం కాక తల పట్టుకుంటుంది. "డబ్బులు ఇస్తేనే ఈ ఇంట్లో ఉండాలి" అని సత్యం కఠినంగా చెప్పడంతో ప్రభావతి గౌరవం పూర్తిగా దెబ్బతింటుంది.
ఇలా రెండు లక్షల వ్యవహారం బయటపడిన తర్వాత ప్రభావతి తీవ్ర ఒత్తిడిలో పడుతుంది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తన భర్త సత్యం తనను ఇంటి నుంచి పంపిస్తాడనే భయం ఆమెను వెంటాడుతుంది. ఈ పరిస్థితిలో ఏదో ఒక మార్గం కనుక్కోవాలని నిర్ణయించుకున్న ప్రభావతి, తన పెద్ద కొడుకు మనోజ్ దగ్గరకు వెళ్లి సహాయం కోరుతుంది. "ఇప్పుడు నువ్వు సహాయం చేయకపోతే నేను పూర్తిగా నాశనం అవుతాను" అంటూ వేడుకుంటుంది. అయితే మనోజ్ మాత్రం తన బిజినెస్ సమస్యలు చెప్పుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. "డబ్బులు డీలర్లకు కట్టాలి... లేకపోతే సరుకు రాదు" అంటూ సూటిగా సహాయం చేయలేనని చెప్పేస్తాడు. దీంతో తల్లి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవని కొడుకు అంటూ ప్రభావతి భావోద్వేగానికి లోనవుతుంది.
ఇదే సమయంలో అక్కడే ఉన్న రోహిణిని సాయం కోరుతుంది. ' నువ్వు మీ నాన్నకు ఫోన్ చేసి డబ్బులు అడగండి" అని చెప్పి పరిస్థితిని తిప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ రోహిణి ..ఇప్పటికే ఫోన్ చేసినా లైన్ కలవలేదని చెప్పడంతో, మరోసారి డెడ్ ఎండ్ ఏర్పడుతుంది. దీంతో ఒక్కసారిగా ప్రభావతి కొత్త ప్లాన్ బయటపెడుతుంది. "మనమే మలేషియా వెళ్దాం... వారిని చూసినట్టు అవుతుంది, వచ్చేటప్పుడు కోటి, రెండు కోట్లు తీసుకురాగలం" అంటూ పెద్ద ప్లాన్ చెబుతుంది. ఈ ఆలోచనతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
అయితే తన తెలివితో వెంటనే పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు రోహిణి ప్రయత్నిస్తుంది. "ఇప్పుడే నాన్న మీద కేసులు ఉన్నాయి... మనం వెళ్లితే మనమూ ఇరుక్కుంటాం" అంటూ భయపెడుతుంది. మరోవైపు మనోజ్ కూడా "మలేషియా వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసా కావాలి" అని చెప్పడంతో ప్లాన్ కాస్త కుదేలవుతుంది. కానీ ప్రభావతి మాత్రం ఆగకుండా "అవి రోహిణి చూసుకుంటుంది" అంటూ పట్టుదలగా నిలుస్తుంది. ఈ సమయంలో రోహిణి పరిస్థితిని మరింత సాఫ్ట్‌గా హ్యాండిల్ చేస్తూ "ఇప్పుడు వెళ్లడం రిస్క్... వేరే మార్గం చూసుకుందాం" అంటూ ప్రభావతిని అక్కడి నుంచి పంపిస్తుంది.
మనోజ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభావతికి అతను సహాయం చేయకపోవడం పెద్ద షాక్‌గా మారుతుంది. చివరకు తీవ్ర నిరాశలో "ఆ రెండు లక్షల కోసం కేసు పెడతా" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో రోహిణి కంగారు పడుతుంది. అత్తయ్య ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోకుండా అడ్డుకునేందుకు కొత్త ప్లాన్ ఆలోచించడం ప్రారంభిస్తుంది.
మరోవైపు.. బాలు, మీనా మధ్య జరిగిన ఈ సన్నివేశం ఎమోషన్‌తో పాటు ప్రేమను అద్భుతంగా చూపించింది. ఇంట్లో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల తర్వాత ఇద్దరూ ఒంటరిగా ఉన్న సమయంలో, మీనా తన మనసులోని భావాలను బయటపెట్టడం సీన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదట బాలను చూసినప్పుడు అతను రౌడీలా అనిపించాడని, కానీ ఇప్పుడు అతడే తన జీవిత హీరో అని మీనా చెప్పడం ఆమె ప్రేమ ఎంత లోతైనదో చూపించింది. నిద్రలో ఉన్న బాలు గుండెలపై తలవేసుకుని పడుకోవడం, అతనిపై తనకున్న ఆప్యాయతను చక్కగా వ్యక్తపరిచింది. మీనా స్పర్శతో మేల్కొన్న బాలు, "ఇంకా నిద్రపోలేదా?" అని ఆప్యాయంగా అడగడం సీన్‌ను మరింత సహజంగా మార్చింది.
ఈ సమయంలో మీనా తన బాధను వ్యక్తం చేస్తూ, "మీరు ఎంతో ప్రేమగా ఇచ్చిన చీర పోయింది" అని చెప్పడం ఎమోషనల్ టచ్ ఇచ్చింది. దీనికి బాలు నవ్వుతూ "చీరే కదా... బాధపడకు" అని సరదాగా చెప్పినా, మీనా మాత్రం ఆ చీర వెనక ఉన్న ప్రేమను గుర్తుచేస్తుంది. "ఆడవాళ్లకు భర్త ఇచ్చిన చిన్న బహుమతి కూడా చాలా విలువైనదే" అని చెప్పడం ద్వారా భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంతో హృద్యంగా చూపించారు. ఈ సన్నివేశంతో బాలు, మీనా మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబ సమస్యల మధ్య కూడా వారి ప్రేమ నిలకడగా ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక మరోవైపు.. రోహిణి ట్రాక్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇంట్లో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల తర్వాత, రోహిణి తన స్నేహితురాలు విద్యను కలిసి మొత్తం విషయం చెబుతుంది. తన అత్తయ్య ప్రభావతి కేసు పెట్టే పరిస్థితి వరకు వెళ్లిందని చెప్పడంతో విద్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. "ఇదే కర్మ సిద్ధాంతం... నువ్వు వేసుకున్న గోతిలో నువ్వే పడుతున్నావ్" అంటూ రోహిణికి గట్టిగా క్లాస్ తీసుకుంటుంది. గతంలో బాలు, మీనాలను ఇంటి నుంచి పంపించేందుకు చేసిన ప్రయత్నాలు, వీడియో బయట పెట్టిన ఘటనలు అన్ని ఇప్పుడు ఆమెకు తిరిగి సమస్యలుగా మారాయని హెచ్చరిస్తుంది.
అయితే రోహిణి మాత్రం తన తప్పును ఒప్పుకోకుండా, "నాకు గతం అవసరం లేదు... ఇప్పుడు ఎలా బయటపడాలో చెప్పు" అంటూ విద్య మాటలను తిరస్కరిస్తుంది. దీంతో విద్య "తప్పు మీద తప్పు చేస్తూ పోతున్నావ్... ఒక రోజు పెద్దగా దొరుకుతావ్" అంటూ చివరిసారి హెచ్చరిస్తుంది. కానీ రోహిణి మాత్రం తన మాస్టర్ ప్లాన్‌ను బయటపెడుతుంది. "నా తాళిబొట్టును తాకట్టు పెట్టి రెండు లక్షలు తీసుకుని ఈ సమస్య నుంచి బయటపడతాను" అని నిర్ణయించుకుంటుంది. అనుకున్నట్టుగానే రోహిణి తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని, మెడలో రోల్డ్ గోల్డ్ వేసుకుని మీనాక్షి ఇంటికి చేరుతుంది. అక్కడ ఆమె మాటలతో మీనాక్షిని పూర్తిగా మాయ చేస్తుంది. "మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుంది" అంటూ భావోద్వేగంగా దగ్గరవుతుంది. తరువాత ఇంట్లో జరిగిన పరిస్థితిని వివరించి, "నా అత్తయ్య చాలా అమాయకురాలు... ఆమె కోసం నేను తాళిబొట్టు తాకట్టు పెట్టి ఈ డబ్బులు తెచ్చాను" అంటూ గొప్పగా చెప్పుతుంది.
ఇదంతా విన్న మీనాక్షి ఆశ్చర్యపోతూ "నువ్వే ఎందుకు ఇస్తున్నావ్? నేరుగా ఇవ్వకుండా నాకు ఎందుకు ఇస్తున్నావ్?" అని ప్రశ్నిస్తుంది. దీనికి రోహిణి తెలివిగా సమాధానం ఇస్తూ, "నేను ఇస్తే సహాయం చేసినట్టు అవుతుంది... ఆ పేరు నాకు వద్దు. మీరు దొరికినట్టు ఇచ్చేయండి" అంటూ అసలు ప్లాన్‌ను అమలు చేస్తుంది. అలాగే "ఇది మా ఇంటి పరువు సమస్య... బయటకు వెళ్లకూడదు" అంటూ ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని మాట తీసుకుంటుంది. చివరికి మీనాక్షి కూడా రోహిణి మాటలకు ఒప్పుకుని, డబ్బులు దొరికినట్టు ఇంట్లో అందరి ముందు ఇవ్వడానికి అంగీకరిస్తుంది. ఈ సన్నివేశం ద్వారా రోహిణి తెలివితేటలు, అలాగే తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లే స్వభావం స్పష్టంగా చూపించారు.
ఇక మరోవైపు.. బాలు, మీనా తమ పనుల్లో బిజీగా ఉండగా జరిగిన చిన్న సంఘటన కూడా పెద్ద టర్న్‌గా మారింది. తొందరలో వెళ్తున్న సమయంలో బాలు అనుకోకుండా మీనాకు డాష్ ఇవ్వడంతో ఆమె చేతిలో ఉన్న పూలన్నీ కింద పడిపోతాయి. "చూసుకుని వెళ్లలేరా?" అంటూ మీనా కాస్త అసహనం వ్యక్తం చేస్తుంది. సాధారణంగా కనిపించిన ఈ సీన్, వెంటనే పెద్ద డ్రామాకు దారితీసింది.
ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రభావతిని గమనించిన బాలు, తన మాటలతో ఇండైరెక్ట్‌గా కౌంటర్ వేస్తాడు. 'ఇక మనం కష్టపడాల్సిన అవసరం లేదు... పాత కేసులన్నీ బయటకు తీసి ఒకరి మీద కేసులు పెడదాం, వాళ్లే మనకు డబ్బులు తెస్తారు' అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం సన్నివేశానికి హై వోల్టేజ్ ఇచ్చింది. ఈ మాటలు విన్న ప్రభావతి ఒక్కసారిగా ఆగ్రహంతో "ఏం మాట్లాడుతున్నావ్? మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా" అంటూ గట్టిగా స్పందిస్తుంది.
ఇంట్లో జరిగిన ఉద్రిక్తతను గమనించి కుటుంబ సభ్యులంతా హాల్‌లోకి చేరుతారు. పరిస్థితి మరింత సీరియస్‌గా మారుతున్న సమయంలో, కథలో మరో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. అదే సమయంలో మీనాక్షి రెండు లక్షల రూపాయలతో ఇంటికి రావడం సీన్‌ను ఒక్కసారిగా షాక్ మోడ్‌లోకి తీసుకెళ్తుంది. ఆమె ఎంట్రీతో అందరూ ఆశ్చర్యపోతూ నిలిచిపోతారు. ఈ ఎపిసోడ్ ఇక్కడే ముగియడంతో, తదుపరి భాగంపై భారీ ఆసక్తి నెలకొంది. మీనాక్షి తీసుకొచ్చిన డబ్బుల వెనక ఉన్న అసలు నిజం బాలు తెలుసుకుంటాడా? రోహిణి వేసిన ప్లాన్ బయటపడుతుందా? ఒకవేళ నిజం బయటపడితే కుటుంబంలో పరిస్థితి ఎలా మారుతుంది? అనే ప్రశ్నలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా బాలు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాడు అనేది వచ్చే ఎపిసోడ్‌ను మరింత థ్రిల్లింగ్‌గా మార్చనున్నాయి.


Click it and Unblock the Notifications











