Gundeninda Gudigantalu April 15th Episode: ప్రభావతికి మనోజ్ షాక్, సత్యం నిర్ణయం సంచలనం, బాలు మాస్టర్ ప్లాన్

photo courtesy jiohotstar

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడిగంటలు మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ కథను పూర్తిగా మలుపు తిప్పింది. మీనా కిడ్నాప్ ఘటన తర్వాత కుటుంబంలో దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాలు, మీనా ఇంటికి వచ్చి రెండు లక్షల దొంగతనం విషయంపై ప్రభావతిని నిలదీయడంతో కథ హై వోల్టేజ్ డ్రామాగా మారింది. "ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?" అని బాలు ప్రశ్నించగా, మీనా కూడా తనపై వేసిన నిందపై గట్టిగా నిలబడింది. చివరకు ప్రభావతి నోరు జారడంతో అసలు నిజం బయటపడింది.శివపై పెట్టిన కేసు విత్‌డ్రా చేయడానికి ప్రభావతి లాయర్ నుంచి డబ్బులు తీసుకుందనే విషయం బయటపడటంతో కుటుంబం మొత్తం షాక్ అయింది. సత్యం తీవ్ర ఆగ్రహంతో ఆమెను ఇంటి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించిస్తాడు.

మరోవైపు బాలు తనకు డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదా కేసు వేస్తానని డిమాండ్ చేశాడు. దీంతో ప్రభావతి తీవ్ర ఒత్తిడిలో పడిపోయి తన కొడుకు మనోజ్ వద్ద సహాయం కోరినా, అతను తప్పించుకోవడం ఆమెకు మరో షాక్‌గా మారింది.ఇక రోహిణి ట్రాక్‌లో ట్విస్ట్ మరింత ఆసక్తికరంగా నిలిచింది. పరిస్థితిని తన తెలివితో హ్యాండిల్ చేస్తూ, తాళిబొట్టు తాకట్టు పెట్టి రెండు లక్షలు తెచ్చి మీనాక్షి చేతుల మీదుగా డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. తన సహాయం బయటపడకుండా, మీనాక్షి ద్వారా డబ్బులు ఇచ్చేలా ప్లాన్ చేయడం ఆమె క్యారెక్టర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మరోవైపు బాలు-మీనా మధ్య ఎమోషనల్ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కుటుంబ సమస్యల మధ్య కూడా వారి ప్రేమ మరింత బలపడటం హృద్యంగా చూపించారు. చివర్లో మీనాక్షి రెండు లక్షలతో ఇంటికి రావడం ఎపిసోడ్‌కు భారీ ట్విస్ట్ ఇచ్చి, వచ్చే ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 662 April 15th 2026 here is full story

బుధవారం ఎపిసోడ్ లో మీనాక్షి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా సన్నివేశం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఆమెను చూసిన వెంటనే ప్రభావతి "ఇక్కడికి ఎందుకు వచ్చావ్?" అని ప్రశ్నించగా, బాలు మాత్రం తనదైన స్టైల్లో సెటైర్ వేస్తూ "మళ్లీ ఏ సెటిల్మెంట్ కోసం వచ్చారు?" అంటూ కౌంటర్ ఇచ్చాడు. మీనా కూడా తగ్గకుండా "మళ్లీ మా మీద నింద వేయడానికి వచ్చారా?" అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో బాలు మరింతగా చురకలు వేస్తూ "పోలీసులతో సీసీ కెమెరాలు పెట్టిస్తాం" అని చెప్పడం సన్నివేశాన్ని మరింత హై వోల్టేజ్‌గా మార్చింది. ఈ వ్యాఖ్యలతో మీనాక్షి గందరగోళానికి గురై, "మీ అమ్మకు సహాయం చేయాలనుకున్నా నా సంసారం ముక్కలైంది" అంటూ భావోద్వేగంగా స్పందించింది. అయితే బాలు మాత్రం ఆగకుండా అసలు విషయం చెప్పమని గట్టిగా అడిగాడు.

దీంతో మీనాక్షి అసలు ట్విస్ట్ బయటపెట్టింది. "కందిపప్పు డబ్బా, పెసరపప్పు డబ్బా కన్ఫ్యూజన్‌లో డబ్బులు మారిపోయాయి. రెండు లక్షలు పోయాయని అనుకున్నాం కానీ అవే మరో డబ్బాలో దొరికాయి" అంటూ చెప్పి, అందరి ముందే రెండు లక్షల రూపాయలు ఇస్తుంది. ఈ మాటలు విన్న ఇంటి సభ్యులంతా షాక్‌కు గురయ్యారు. సత్యం కూడా ఆశ్చర్యంగా "డబ్బులు దొరికాయా?" అని ప్రశ్నించగా, మీనాక్షి అదే నిజమని చెప్పింది. అయితే ఇక్కడ బాలు "అయితే నా భార్యను ఎందుకు దొంగ అని నింద వేశారు?" అని ప్రశ్నించగా, మీనాక్షి వెంటనే బాధ్యతను తప్పించుకుంటూ "అది అంతా మీ అమ్మే చేసింది" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం సీన్‌కు మరో మలుపు తీసుకొచ్చింది.

ఇక మీనాక్షి వెళ్లిన వెంటనే కథ మరోసారి హై వోల్టేజ్ డ్రామాగా మారింది. బాలు తన ఉగ్రరూపాన్ని చూపిస్తూ ప్రభావతిని గట్టిగా నిలదీశాడు. "ఆరోజు నా భార్యను దొంగని ఎందుకు నింద వేశావ్?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. సత్యం కూడా అదే దిశగా స్పందిస్తూ, "పేద ఇంటి నుంచి వచ్చిందని మీనా మీద ముద్ర వేసావ్... మరి రోహిణి తండ్రి జైలులో ఉన్నాడు కదా, ఆమెను కూడా అదేలా అనుకుంటావా?" అంటూ కఠిన వ్యాఖ్యలు చేశాడు. ఈ సమయంలో మనోజ్ పరిస్థితిని సాఫ్ట్ చేయాలని ప్రయత్నిస్తూ "ఇప్పుడు డబ్బులు దొరికాయి కదా, ఇక్కడితో వదిలేయండి" అని చెప్పినా, బాలు మాత్రం తగ్గలేదు. "ఒక అమ్మాయిపై తప్పుడు నింద వేయడం క్షమించరాని నేరం" అంటూ తీవ్రంగా స్పందించాడు. ఇదే సమయంలో మనోజ్ "ఆ ఇంట్లో మీనా తప్ప మరెవరు లేరు కాబట్టి అనుమానం వచ్చింది" అని చెప్పడంతో, సత్యం అసలు నిజాన్ని బయటపెట్టాడు.

రోహిణి ముందే మీనాక్షి ఇంటికి వెళ్లి, తన స్నేహితురాలు విద్యతో కలిసి అక్కడ జరిగిన విషయాలపై పందెం కూడా వేసిందని, వీడియోలు తీసిందని సత్యం చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో రోహిణి "వెళ్లాను కానీ దొంగతనం చేయలేదు" అని అంటుంది. ఆ సమాధానంతో బాలు మీనాలకు ఆమెపై కాస్తా అనుమానం కలుగుతోంది. ఇక డబ్బులు తిరిగి వచ్చిన తర్వాత కూడా వివాదం ఆగలేదు. బాలు "నీ వల్ల నాకు ఐదు లక్షల అప్పు అయ్యింది... మిగతా మూడు లక్షలు ఎవరు ఇస్తారు?" అంటూ ప్రభావతిని నిలదీశాడు. సత్యం, శృతి, రవి కూడా బాలకు మద్దతు ఇవ్వడంతో ప్రభావతి పూర్తిగా ఇరుక్కుపోయింది. చివరకు ప్రామిసరీ నోటు రాయాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే ఇక్కడ మరో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సాక్షిగా మనోజ్ సంతకం పెట్టమంటే, "అది అమ్మ చేసిన అప్పు... నాకేం సంబంధం లేదు" అంటూ స్పష్టంగా తిరస్కరించాడు. ఈ మాటలు విన్న ప్రభావతి ఆగ్రహంతో మనోజ్ చెంప చెళ్లుమనిపించడం సీన్‌కు క్లైమాక్స్‌లా మారింది. దీంతో సత్యం "నీ పెద్ద కొడుకు నిజ స్వరూపం ఇప్పుడు కనిపించింది... ఇప్పటికైనా కళ్లు తెరువు" అంటూ హెచ్చరించడంతో, ప్రభావతి తీవ్ర నిరాశలో మునిగిపోయింది. కుటుంబంలో సంబంధాలు మరింత దిగజారుతున్నాయి అని తెలుస్తోంది.

మరో వైపు .. రెండు లక్షల రూపాయలు తిరిగి అందుకున్న బాలు, తనకు అవసరమైన సమయంలో సహాయం చేసిన వారందరికీ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఒక్కొక్కరికి ఇచ్చిన అప్పులు తీర్చుతూ తన నిజాయితీని చూపిస్తాడు. ఈ సందర్భంలో మీనా తన మామయ్య సత్యం గురించి గొప్పగా మాట్లాడుతుంది. "ఆయన లేకపోతే నేను ఈ ఇంట్లో ఉండేదాన్ని కాదు" అంటూ తన గత కష్టాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనవుతుంది. ఈ మాటలు సత్యం విని లోలోపల కదిలిపోతాడు.

తన కొడుకు, కోడలు కోసం ఏదైనా చేయాలనే నిర్ణయానికి వచ్చిన సత్యం, మరుసటి రోజు తన స్నేహితుడు రంగారావును ఇంటికి పిలిపిస్తాడు. రంగారావు ఎంట్రీతో ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా సీరియస్‌గా మారుతుంది. "ఏంటి మామయ్య ఇలా వచ్చారు?" అని బాలు అడగగా, "నీ నాన్ననే పిలిచాడు" అని రంగారావు చెప్పడం ద్వారా అసలు విషయం బయటపడుతుంది.

అందరి ముందూ మాట్లాడాలని నిర్ణయించుకున్న సత్యం, "నాకు ఐదు లక్షల అప్పు అయ్యింది... ఆ అప్పు తీర్చడానికి నేను ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను" అని ప్రకటిస్తాడు. ఈ మాటలు విన్న ఇంటి సభ్యులంతా షాక్‌కు గురవుతారు. రంగారావు కూడా ఆశ్చర్యపోతూ "ముగ్గురు కొడుకులు, కోడళ్లు ఉన్నప్పుడు నువ్వు పని చేయడం ఎందుకు?" అని ప్రశ్నిస్తాడు. దీనికి సత్యం, "నా భార్య చేసిన తప్పు కూడా నా బాధ్యతే... ఆ అప్పు నేను తీర్చాలి" అని స్పష్టంగా చెబుతాడు.

అయితే ఈ సమయంలో మనోజ్ మాట్లాడిన మాటలు అందరినీ షాక్‌కు గురి చేస్తాయి. "ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే పని చేయడం మంచిదే" అంటూ తండ్రి పరిస్థితిని తక్కువ చేసి మాట్లాడటం కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం రేపుతుంది. శృతి వెంటనే స్పందిస్తూ, "ఈ వయసులో మీ నాన్న పని చేస్తే మీకు బాధగా అనిపించదా?" అంటూ మనోజ్‌ను నిలదీస్తుంది. మరోవైపు బాలు కూడా తన అభిప్రాయం వెల్లడిస్తూ, "మీరు నా కోసం అప్పు తీర్చడం నాకు ఇష్టం లేదు" అని చెప్పినా, సత్యం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఏదైనా చేసి అప్పు తీర్చాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు.

ఇక మరోవైపు రోహిణి ట్రాక్‌లో మరింత టెన్షన్‌ను పెంచే విధంగా సాగింది. ఇంట్లో జరుగుతున్న పరిణామాల మధ్య, రోహిణి తన తల్లి సుగుణమ్మతో పాటు కొడుకు చింటూను మరో ఇంటికి మార్చడం కీలక మలుపుగా మారింది. కొత్త ఇంటికి వెళ్లిన వెంటనే చింటూ ఆనందంతో "ఇకపై నువ్వు మాతోనే ఉంటావా?" అని అమాయకంగా అడగడం సన్నివేశాన్ని భావోద్వేగంగా మార్చింది. అయితే రోహిణి మాత్రం ఏం చెప్పాలో తెలియక ఇబ్బందిపడుతూ, "నాకు హాలిడేస్ ఉండవు... కానీ వారంలో రెండు రోజులు తప్పకుండా వస్తాను" అంటూ మాట ఇస్తుంది. ఈ సమాధానం విన్న చింటూ నిశ్శబ్దంగా వెళ్లిపోవడం హృదయాన్ని తాకేలా చూపించారు.

ఇక్కడితో ఆగకుండా, రోహిణి తన నియంత్రణను మరింత కఠినంగా అమలు చేస్తుంది. చింటూను బయటికి వెళ్లనివ్వకుండా, "ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడుకో" అని చెప్పి అతడిని ఒకరకంగా బందీలా ఉంచుతుంది. సుగుణమ్మకు కూడా కఠిన ఆదేశాలు జారీ చేస్తూ, "బయటికి వెళ్లొద్దు, టీవీ శబ్దం తగ్గించండి, త్వరగా లైట్స్ ఆఫ్ చేయండి... మీరు ఈ ఇంట్లో ఉన్నా లేనట్టే ఉండాలి" అంటూ నానా షరతులు పెడుతుంది. ఈ వ్యవహారం చూసిన సుగుణమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, "ఇదికంటే జైలులో ఉంటే బాగుండేది" అంటూ తన బాధను బయటపెడుతుంది.

దీనికి రోహిణి తన కోణాన్ని వివరించే ప్రయత్నం చేస్తూ, "బాలు లేదా మీనా ఎవరికైనా మీరు ఇక్కడ ఉన్నట్టు తెలిసితే నాకు పెద్ద సమస్య అవుతుంది... అందుకే ఇలా జాగ్రత్త పడుతున్నాను" అని చెబుతుంది. అయినా పరిస్థితి సద్దుమణగలేదు. ఈ సమయంలో విద్య కూడా రంగంలోకి దిగి, "ఎన్ని రోజులు ఇలా దాచుకుంటావ్? ఒకరోజు నిజం బయటపడుతుంది" అంటూ ప్రశ్నిస్తుంది. సుగుణమ్మ కూడా అదే భావనను వ్యక్తం చేస్తూ, "ఎప్పటికైనా నిజం బయటపడుతుంది" అని చెప్పడంతో, రోహిణి అసహనానికి లోనవుతుంది. తన ప్లాన్ ఎక్కడైనా బయటపడుతుందేమోనన్న భయంతో మరింత ఆందోళన చెందుతుంది. ఈ సన్నివేశాలతో రోహిణి పాత్రలోని భయం, ఒత్తిడి, తన రహస్యాన్ని కాపాడుకోవాలనే తపన స్పష్టంగా కనిపించగా, భవిష్యత్తులో పెద్ద ట్విస్ట్‌కు ఇది బాటలు వేస్తుందనే సంకేతాలు ఇచ్చారు.

ఒకవైపు ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా, మరోవైపు బాలు తీసుకున్న నిర్ణయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలు నేరుగా మీనాక్షి ఇంటికి వెళ్లి, తన నాన్న సత్యం స్నేహితుడు రంగారావుతో కీలకంగా మాట్లాడాడు. "నాన్న ఈ వయసులో ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఇది. కానీ అమ్మ చేసిన అప్పు వల్ల ఆయన పని చేయాలని నిర్ణయించుకున్నారు" అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే వెంటనే ఒక మార్గం కూడా సూచించాడు. "ఒకరి కింద పని చేసే పరిస్థితి రాకుండా, మీరు ఏదైనా కమ్యూనిటీ హాల్‌లో పిల్లలకు నీతి కథలు చెప్పే పని ఏర్పాటు చేయండి. వారి తల్లిదండ్రులు డబ్బులు ఇస్తున్నట్లుగా నేను ప్రతి నెలా మీకు ఇస్తాను. అదే మీరు వారికి ఇచ్చినట్లు చూపించండి" అని చెప్పి, తన తండ్రి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు.

బాలు మాటలు విన్న రంగారావు కదిలిపోయి, "నువ్వు చెప్పినట్లే చేస్తాను" అంటూ మాట ఇచ్చాడు. బాలు వెళ్లిన తర్వాత మీనాక్షి కూడా అతని గురించి ప్రశంసిస్తూ, "ఇలాంటి కొడుకు మనకూ ఉంటే బాగుండేది" అని అనడం గమనార్హం. దీనికి రంగారావు కూడా సమ్మతిస్తూ బాలు గొప్పతనాన్ని వివరించాడు. అయితే వెంటనే మీనాక్షి తన స్టైల్లో సెటైరికల్‌గా "భార్య అప్పులు చేస్తే భర్తలు పార్ట్‌టైం జాబ్ చేయాలా?" అని అడగగా, రంగారావు "చెప్పు తెగుతుంది" అంటూ పంచ్ వేయడం సన్నివేశానికి హాస్యాన్ని జోడించింది.

చివరికి మీనాక్షి సరదాగా స్పందిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సీన్ ముగిసింది. ఇలా భావోద్వేగం, హాస్యం, కుటుంబ విలువల మేళవింపుతో నేటి ఎపిసోడ్ ముగిసింది. ఇక రానున్న ఎపిసోడ్లలో బాలు, మీనాలకు రోహిణిపై అనుమానం వస్తుందా? ఆమె దాచిన నిజాలు బయటపడతాయా? ప్రభావతి తన తప్పులను గ్రహించి మారుతుందా? మనోజ్ అసలు స్వరూపం తెలిసిన తర్వాత కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X