Gundeninda Gudigantalu April 17th Episode: బాలు ఫోన్ మిస్టరీ, విద్య మోసం, చిక్కుల్లో రోహిణి, మనోజ్ పై చేతబడి

photo courtesy jiohotstar

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ భావోద్వేగాలు, సస్పెన్స్, కుటుంబ ఘర్షణలతో రసవత్తరంగా సాగింది. ఉద్యోగం కోసం బయటికి వెళ్లిన సత్యం ఆలస్యంగా ఇంటికి రాకపోవడంతో ప్రభావతి ఆందోళన చెందుతుంది. మనోజ్ మాత్రం నిర్లక్ష్యంగా స్పందించగా, బాలు తల్లిని సమాధానపరుస్తాడు. కాసేపటికే సత్యం ఉద్యోగం దొరికిందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపడతారు. అయితే అతను పార్కులో పిల్లలకు నీతి కథలు చెప్పే పని చేస్తున్నానని చెప్పడం ఇంట్లో మిశ్రమ స్పందనకు దారి తీస్తుంది. ఈ క్రమంలో బాలు, మనోజ్ మధ్య సెటైర్లు, మాటల యుద్ధం హీట్ పెంచుతుంది.

సత్యం తన పని గౌరవాన్ని వివరించగా, ప్రభావతి మాత్రం బాలును తప్పుపడుతుంది. కానీ అసలు ట్విస్ట్ పార్క్‌లో వెలుగులోకి వస్తుంది. సత్యం చెప్పే కథలకు ప్రజలు ప్రశంసలు కురిపించడంతో పాటు, ఇది ఫ్రీ సర్వీస్ అని చెప్పడం అతనిలో అనుమానాలు కలిగిస్తుంది. చివరకు రంగారావు ద్వారా నిజం బయటపడుతుంది. సత్యం గౌరవం దెబ్బతినకూడదని బాలు నకిలీ ఉద్యోగాన్ని సృష్టించి, తనే డబ్బులు ఇస్తున్నాడని తెలిసి సత్యం ఎమోషనల్ అవుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 664 April 17th 2026 here is full story

మరోవైపు చింటూ విషయంపై బాలు అనుమానాలు పెంచుకుంటాడు. అతని ఊరికి వెళ్లి ఇల్లు ఖాళీగా ఉండటం చూసి షాక్ అవుతాడు. సుగుణమ్మతో మాట్లాడినప్పుడు ఆమె ప్రవర్తనలో తేడా గమనించి, వెనుక ఏదో రహస్యం ఉందని భావిస్తాడు. ఈ విషయాన్ని మీనాతో పంచుకున్నప్పటికీ, ఆమె పెద్దగా పట్టించుకోదు. అయితే రోహిణి మాత్రం ఈ సంభాషణ విని భయపడుతుంది. ఇక క్లైమాక్స్‌లో సత్యం బాలును కౌగిలించుకుని తన ప్రేమను వ్యక్తం చేయడం హృదయాన్ని తాకుతుంది. దీనికి విరుద్ధంగా మనోజ్ చేసిన వ్యాఖ్యలకు ప్రభావతి చెంపదెబ్బ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. చివరగా బాలు తన చిన్ననాటి బాధలను చెప్పుకోవడంతో ఎపిసోడ్ ఎమోషనల్‌గా ముగిసింది.

photo courtesy jiohotstar

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠభరితంగా ఆకట్టుకుంది. కథలో భావోద్వేగాలు, ట్విస్టులు కలిసిపోతూ ఆసక్తిని మరింత పెంచాయి. బాలు ఎంతగా చెప్పినా వినకుండా సత్యం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ, తన ఫ్రెండ్ రంగారావు సూచనతో ఒక స్కూల్‌కి వెళ్లాడు. అక్కడి మేనేజ్‌మెంట్‌తో మాట్లాడిన సత్యం, తన గతాన్ని నిజాయితీగా వివరించాడు. ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టంలేదని, శక్తి ఉన్నంతవరకు ఏదైనా పని చేయాలని తన అభిప్రాయాన్ని చెప్పాడు. అతని ఆత్మవిశ్వాసం, పని పట్ల ఉన్న నిబద్ధత మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకుంది.

సత్యం మాటలతో ఇంప్రెస్ అయిన స్కూల్ యాజమాన్యం అతనికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం వారానికి ఒకసారి రావాలని, త్వరలో ఓపెన్ కానున్న కొత్త బ్రాంచ్‌లో రెగ్యులర్‌గా పని చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇలా సత్యంకి అకౌంటెంట్‌గా జాబ్ దక్కడం కథలో ఒక సానుకూల మలుపు తీసుకువచ్చింది. ఇక మరోవైపు అదే స్కూల్‌లోకి రోహిణి తన కొడుకు చింటూని అడ్మిషన్ కోసం తీసుకువచ్చింది. స్కూల్ వాతావరణం చింటూకి ఎంతో నచ్చింది. అయితే ఫీజులు ఎక్కువగా ఉంటాయేమో అని సుగుణమ్మ సందేహం వ్యక్తం చేయగా, రోహిణి మాత్రం "నా కొడుకు భవిష్యత్తు కోసం ఏదైనా చేస్తాను" అంటూ భావోద్వేగంగా స్పందించింది. అయితే ఈ ఎపిసోడ్‌లో అసలు ట్విస్ట్ ఏమిటంటే... సత్యం స్కూల్ నుంచి బయటికి వస్తున్న సమయంలో, రోహిణి లోపలికి వెళ్లడం. ఇద్దరూ ఒకే ప్రదేశంలో ఉన్నా, ఎదురుపడకుండా మిస్ అవడం కథలో ఉత్కంఠను పెంచింది. ఈ పరిస్థితి చూస్తుంటే, త్వరలోనే రోహిణి నిజస్వరూపం సత్యంకి తెలిసేలా కథ మరింత ఆసక్తికరంగా మారబోతుంది.

ఒకవైపు సత్యం ఉద్యోగం ట్రాక్ సాగుతుండగా, మరోవైపు మీనా జీవితంలో అనుకోని ప్రమాద సూచనలు కనిపించడం కథకు కొత్త టెన్షన్‌ను జోడించింది. మీనాను ఓ అనుమానాస్పద వ్యక్తి ఫాలో అవడం ఈ ఎపిసోడ్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచింది. మొదట్లో అది యాదృచ్ఛికమని భావించిన మీనా, కొంతసేపటికి అతను కావాలనే వెంటపడుతున్నాడని గుర్తిస్తుంది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురవుతుంది. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందేమోనన్న భయంతో, వెంటాడుతున్న వ్యక్తి నుంచి తప్పించుకోవడానికి మీనా వేగంగా బైక్ నడిపిస్తూ అక్కడి నుంచి దూరమవుతుంది.

ఈ క్రమంలో సురక్షితమైన ప్రదేశంగా భావించి విద్య ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే అక్కడ రోహిణి ఉండడం కథలో కీలక మలుపు తీసుకొస్తుంది. ఇదే సమయంలో విద్య, బాలు ఫోన్‌లో ఉన్న ఫోటోలను చూస్తూ వారి జంటను మెచ్చుకుంటూ మాట్లాడుతుంది. ఈ మాటలు రోహిణికి అస్సలు నచ్చవు. వెంటనే కోపంతో విద్యపై మండిపడుతూ, "ఆ ఫోన్‌ను జాగ్రత్తగా దాచమని చెప్పాను కదా" అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది. ఒకవేళ ఆ ఫోన్ మీనా లేదా బాలు చేతికి పడితే తమ ప్లాన్ మొత్తం బయటపడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తుంది.

ఇంతలో మీనా తలుపు తడుతుంది. విద్య సరదాగా "నిజంగా మీనా అయి ఉండొచ్చు" అంటూ డోర్ ఓపెన్ చేస్తే, మీనా కంగారుగా లోపలికి రావడం చూసి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీనా పరిస్థితి గమనించిన ఇద్దరూ ఏమైందని అడగగా, మొదట ఆమె స్పష్టంగా చెప్పలేకపోయినా, కాస్త రిలాక్స్ అయిన తర్వాత తనను ఒక వ్యక్తి ఫాలో అవుతున్నాడని చెబుతుంది. దీనిపై రోహిణి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, "నువ్వు పెద్ద పెద్ద రౌడీలను ఎదిరించినవు.. ఇప్పుడు ఒక వ్యక్తి ఫాలో అవుతుంటే ఎందుకు భయపడుతున్నావ్?" అని ప్రశ్నిస్తుంది. దీనికి మీనా సమాధానంగా, "ప్రాణాల మీదికి వస్తే ఎంతైనా ఎదురిస్తా.. కానీ ఎందుకో ఈసారి కంగారు వేసింది" అని చెబుతుంది. అయితే ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని రోహిణిని కోరుతుంది.

మీనాకు కాస్త ధైర్యం వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ అసలు డ్రామా ఆమె వెళ్లిన తర్వాత మొదలవుతుంది. వెంటనే రోహిణి, విద్యపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. "ఫోన్‌ను ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దని ముందే చెప్పాను.. నువ్వు కావాలనే మీనా ముందు టేబుల్ మీద పెట్టావ్" అంటూ మందలిస్తుంది. అదృష్టవశాత్తూ మీనా ఆ ఫోన్‌ను గమనించలేదని, ఒకవేళ చూసి ఉంటే తమ పరిస్థితి పూర్తిగా మారిపోయేదని ఆమె అంటుంది. ఇకపై అలాంటి పొరపాట్లు జరగకూడదని గట్టిగా హెచ్చరిస్తూ, ఆ ఫోన్‌ను వెంటనే తీసుకెళ్లి ఎక్కడైనా చెరువులో పడేయాలని విద్యకు ఆదేశిస్తుంది. రోహిణి మాటలతో భయపడిన విద్య కూడా తప్పని పరిస్థితిలో అంగీకరిస్తుంది.

మరోవైపు.. బాలు తన ఫ్రెండ్స్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉండే సన్నివేశాలు ఎంటర్టైనింగ్‌గా సాగాయి. ఈ సమయంలో ఒక ఫ్రెండ్ తన తమ్ముడిని పరిచయం చేస్తూ, అతను సాఫ్ట్‌వేర్‌లో మంచి జాబ్ సంపాదించాడని, ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడని చెప్పాడు. ఈ మాటలు విన్న బాలు వెంటనే "లవ్ గురు"గా మారి తన స్టైల్లో ప్రేమ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే ముందుగా ఒక టాలెంట్ ఉండాలని, డైరెక్ట్‌గా పేరు అడగకుండా మాటలతో ఆకట్టుకోవాలని, సరైన మూమెంట్ చూసుకుని ఆమెను ఫాలో అవ్వాలని బాలు ఇచ్చిన సలహాలు అక్కడ నవ్వులు పూయించాయి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే... ఆ వ్యక్తి ఫాలో అవుతున్న అమ్మాయి మరెవరో కాదు, బాలు భార్య మీనానే! ఈ విషయం బాలుకు తెలియకపోవడం కథలో పెద్ద సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ ఇది బయటపడితే పరిస్థితి ఎంత ఘోరంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక మరోవైపు రోహిణి చెప్పినట్టు విద్య కంగారుగా బయలుదేరుతుంది. అయితే దారిలోనే ఆమెకు ఇబ్బందులు మొదలవుతాయి. ముందుగా ఆమె బైక్ చెడిపోవడంతో దాన్ని షోరూంలో ఇచ్చి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు, మధ్యలో కాలి చెప్పు కూడా తెగిపోవడం ఆమెను మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. "రోహిణి వల్ల నేను కూడా ఇంత కష్టాలు పడాల్సి వస్తుందా?" అంటూ తన పరిస్థితిపై బాధపడుతుంది. ఈ సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఓ ముసలి దంపతుల వద్దకు వెళ్లి చెప్పు కుట్టించుకుంటుంది. వారు సహాయం చేయడంతో కొంత ఊపిరి పీల్చుకున్న విద్య, వెంటనే ఆటో ఎక్కి త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ కంగారులో ఒక పెద్ద తప్పు చేస్తుంది బాలు ఫోన్ ఆమె చేతిలో నుంచి జారిపడుతుంది.

ఆ విషయాన్ని గమనించిన ముసలి దంపతులు వెంటనే విద్యను పిలిచినా, ఆమెకు వినిపించకుండా వెళ్లిపోతుంది. దీంతో ఆ ఫోన్ వారి చేతికి చేరుతుంది. ఇలా కీలకమైన బాలు ఫోన్ ఇప్పుడు అనుకోని ముసలి దంపతుల చేతుల్లో పడటం కథలో కొత్త మలుపుకు దారి తీసింది. ఇంతలో రోహిణి, విద్యకు ఫోన్ చేసి "బాలు ఫోన్ చెరువులో పడేసావా?" అని అడుగుతుంది. ఫోన్ మిస్సయిందని చెప్పడానికి భయపడిన విద్య, "ఇప్పుడే చెరువులో పడేశాను" అంటూ అబద్ధం చెబుతుంది. దీంతో రోహిణి ఒక పెద్ద సమస్య ముగిసిందని ఊపిరి పీల్చుకుంటుంది. అయితే విద్య మాత్రం లోలోపల తీవ్ర ఆందోళనకు గురవుతుంది. "ఒక అబద్ధం చెప్పినందుకే ఇంత టెన్షన్ అయితే... రోహిణి రోజూ ఇన్ని అబద్ధాలు ఎలా మేనేజ్ చేస్తుంది?" అంటూ తనలో తాను అనుకుంటుంది. ముఖ్యంగా బాలు ఫోన్ మిస్సైన విషయం అతనికి తెలియకపోతే చాలని దేవుణ్ణి కోరుకుంటుంది.

మరోవైపు మనోజ్ తన బిజినెస్‌ను విస్తరించే పనుల్లో బిజీగా ఉండగా, మరోవైపు రోహిణి చుట్టూ అనుమానాల మేఘాలు కమ్ముకోవడం కథను కీలక మలుపు వైపు తీసుకెళ్లింది. మనోజ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్‌తో ఫుల్ బిజీగా ఉండే సమయంలో, రోహిణి ఆలస్యంగా ఇంటికి రావడం అతనికి అనుమానం కలిగిస్తుంది. "ఎక్కడికి వెళ్లావు?" అని ప్రశ్నించగా, రోహిణి ఒక క్లైంట్‌ను కలవడానికి వెళ్లానని చెప్పి పరిస్థితిని కవర్ చేస్తుంది. అయితే మనోజ్ ఇకపై బయట తిరగాల్సిన అవసరం లేదని, షాప్‌లోనే ఉండి బిజినెస్ చూసుకోవాలని ఆదేశిస్తాడు. బయటకి ఏమీ అనకపోయినా, ఈ మాటలు రోహిణికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంతలో షాప్‌కీపర్ ఒక బ్యాగ్ తీసుకొచ్చి, "షాప్ తెరవకముందే ఇది కనిపించింది" అంటూ అందిస్తాడు. దాంట్లో డబ్బులు ఉంటాయని భావించిన మనోజ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే... అందులో కోడిగుడ్లు కనిపించడం అతన్ని షాక్‌కు గురిచేస్తుంది. ఎందుకింత విచిత్రంగా కోడిగుడ్లు పెట్టారో అర్థంకాక ఆశ్చర్యపోతాడు.

అయితే వెంటనే మరో షాప్‌కీపర్ వచ్చి, "అవి మామూలు గుడ్లు కావు... వాటిపై ఉన్న గుర్తులు చూస్తే చేతబడి చేసిన గుడ్లలా ఉన్నాయి" అని చెప్పడంతో పరిస్థితి ఒక్కసారిగా టెన్షన్‌గా మారుతుంది. దీంతో మనోజ్ తీవ్రంగా భయపడుతూ, "నా బిజినెస్ ఎదుగుతున్నందుకు ఎవరో అడ్డుకోవాలని ఇలా చేశారు" అని అనుమానపడతాడు. ఇంతలో మనోజ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఆ గుడ్లను చూసి మరింత భయపెడతాడు. "ఇది చిన్న విషయం కాదు... నీ బిజినెస్ ఇక్కడితో ముగిసినట్టే" అంటూ నెగటివ్‌గా మాట్లాడడంతో మనోజ్ పూర్తిగా ఆందోళనలో పడిపోతాడు. అతని భయం మరింత పెరుగుతుంది.కానీ ఈ సమయంలో రోహిణి మాత్రం శాంతంగా స్పందిస్తూ, "ఇలాంటి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు... బిజినెస్ మీద దృష్టి పెట్టండి" అంటూ పరిస్థితిని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే మనోజ్ ఫ్రెండ్ మాత్రం ఈ విషయాన్ని లైట్‌గా తీసుకోవద్దని చెప్పి, తనకు తెలిసిన ఓ స్వామీజీ దగ్గరకు తీసుకెళ్తానని ఒత్తిడి చేస్తాడు.

దీంతో మనోజ్, రోహిణి కలిసి ఆ స్వామీజీ వద్దకు వెళ్తారు. అక్కడ ఆ గుడ్లను పరిశీలించిన స్వామీజీ, "ఇవి నిజంగా చేతబడి చేసినవే... మీపై ఎవరో పగబట్టి చేశారు" అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేస్తాడు. అంతేకాదు, "మీ జీవితం ఇక్కడితో ముగిసినట్టే... మీ బిజినెస్ దివాలా తీస్తుంది" అంటూ మరింత భయపెట్టేలా మాట్లాడతాడు. ఈ మాటలు విన్న మనోజ్ పూర్తిగా కంగారు పడిపోతాడు. కానీ రోహిణి మాత్రం ఆ మాటలను నమ్మకుండా ప్రశ్నిస్తుంది. దీంతో స్వామీజీ మరింత సీరియస్‌గా, "నేను ఎన్నో సంవత్సరాలుగా భవిష్యత్తు చెబుతున్నాను... మీ గతం, భవిష్యత్తు అన్నీ నాకు తెలుసు... చెప్పమంటారా?" అంటూ రోహిణిని సూటిగా ప్రశ్నిస్తాడు. ఈ మాటలు విన్న రోహిణి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. ఆమె ముఖంలో కనిపించిన ఆందోళన, భయం... ఏదో పెద్ద రహస్యాన్ని దాచిపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడే ఎపిసోడ్ ముగియడంతో, ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక వచ్చే ఎపిసోడ్లలో రోహిణి బాగోతం బయటపడుతుందా? స్వామీజీ నిజంగా ఏమైనా తెలుసుకుని చెప్పబోతున్నాడా? లేక ఇది మరో కొత్త డ్రామాకి నాంది మాత్రమేనా? అన్న ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాబోయే ట్విస్టులు ఎలా ఉంటాయో చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X