Gundeninda Gudigantalu April 22th Episode: మేకమామ వార్నింగ్, ప్రభావతి-మనోజ్ వింత అవతారం, పరువు తీసిన బాలు

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ వినోదం, భావోద్వేగం, సస్పెన్స్ కలయికగా సాగింది. గతంలో జరిగిన కరెంట్ షాక్ ఘటన ప్రభావం ఇంకా ఇంట్లో కనిపించింది. మీనా సమయస్ఫూర్తితో అందరినీ కాపాడినా, ప్రభావతి మాత్రం చేతి నొప్పితో బాధపడుతూ కనిపించింది. ఇదే సమయంలో మనోజ్, రోహిణి కలిసి ఇంట్లో జరుగుతున్న సమస్యలన్నీ చేతబడి కారణమని నమ్మించి పూజలు చేయించాలని ప్రభావతిని ఒప్పించారు. మరోవైపు మీనా జీవితంలో ఆనంద క్షణం చోటుచేసుకుంది. ఆమె ప్రారంభించిన డెకరేషన్ బిజినెస్‌కు తొలి ఆర్డర్ రావడంతో ఉప్పొంగిపోయింది. ఫంక్షన్ హాల్ యజమాని ఆమె పనిపై నమ్మకం వ్యక్తం చేస్తూ రూ.10 వేల అడ్వాన్స్ ఇచ్చాడు. ఇంటికి చేరిన మీనా స్వీట్లు పంచుతూ ఈ శుభవార్త చెప్పగా, ప్రభావతి హేళనగా మాట్లాడింది. అయితే సత్యం మాత్రం మీనాను అభినందిస్తూ ప్రభావతికి పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. రవి, శృతి కూడా మీనాకు మద్దతుగా నిలిచారు.

ఇక బాలు ఇంటికి రాగానే ఈ సంతోషాన్ని బిర్యానీతో సెలబ్రేట్ చేద్దామని ప్రకటించాడు. కానీ అదే రోజు ఉపవాసం పేరుతో ప్రభావతి బిర్యానీ వండనివ్వకుండా అడ్డుకుంది. బాలు మాత్రం బయట వండుకుంటామని చెప్పి సెటైర్లు వేయడంతో ఇంట్లో నవ్వులు పూశాయి. చివరికి బాలు, మీనా, రవి, శృతి కలిసి బిర్యానీ వండి అందరితో కలిసి తిన్నారు. ప్రభావతి, మనోజ్ మాత్రం పస్తులే మిగిలారు. ఇదే సమయంలో కథలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. మటన్ కొనడానికి వెళ్లిన మీనాను చూసి షాప్ యజమాని మాణిక్యం ముఖం దాచుకోవడం అనుమానాలకు తావిచ్చింది. తరువాత రోహిణితో మాట్లాడిన మేక మామ, "మటన్ మా షాప్ నుంచే వెళ్లింది.. మీ నాన్నే తీసుకొచ్చాడు" అని చెప్పడంతో రోహిణి షాక్ అయ్యింది. దీంతో రాబోయే ఎపిసోడ్‌లో రోహిణి గతం బయటపడుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 667 April 22th 2026 here is full story

photo courtesy jiohotstar
Also Read
టెస్టీ తేజకు బిగ్ బాస్ బ్యూటీ మ్యారేజ్ ప్రపోజల్.. కానీ, ఆ కండిషన్!
టెస్టీ తేజకు బిగ్ బాస్ బ్యూటీ మ్యారేజ్ ప్రపోజల్.. కానీ, ఆ కండిషన్!

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా రోహిణి దాచిపెట్టిన గతం బయటపడే సూచనలు కనిపించడంతో కథ మరింత ఉత్కంఠగా మారింది. మటన్ కొట్టు మాణిక్యం పాత్ర చుట్టూ తిరిగిన సన్నివేశాలు ఈ ఎపిసోడ్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ఎపిసోడ్ ప్రారంభంలో మటన్ కొట్టు మాణిక్యం తీవ్ర ఆందోళనతో విద్య, రోహిణి ఎదుట తన బాధను వెల్లగక్కాడు. మీనా తన షాప్‌కు వచ్చి మటన్ తీసుకెళ్లిందని, తాను ఆమె కంట పడకుండా ముఖానికి గుడ్డ కట్టుకుని తప్పించుకున్నానని చెప్పాడు. అక్కడ ఇంకొద్దిసేపు ఉన్నా తన గురించి ఆమె గుర్తించి ఉండేదని, అందుకే భయంతో అక్కడి నుంచి పారిపోయానని వివరించాడు. ఇకపై అబద్ధాలు చెప్పడం తన వల్ల కాదని మాణిక్యం తెగేసి చెప్పాడు. మీరు పరిచయం అయినప్పటి నుంచి తనతో ఎన్నో అబద్ధాలు ఆడించారని, రాజమౌళి సినిమాలో వేషం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఈ డ్రామాలో పాత్రధారిని చేశారని మండిపడ్డాడు.

Recommended For You
మా ఇద్దరి మధ్య సంబంధం అదే.. సుడిగాలి సుధీర్ విషయంలో ఇంద్రజ కన్నీళ్లు!
మా ఇద్దరి మధ్య సంబంధం అదే.. సుడిగాలి సుధీర్ విషయంలో ఇంద్రజ కన్నీళ్లు!

తమకు తనతో ఎలాంటి సంబంధం లేదని, ఇకపై సహకరించనని స్పష్టం చేశాడు. ఒకవేళ మీనా నిజం తెలుసుకుంటే తానే కష్టాల్లో పడతానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితిని సర్దిచెప్పేందుకు రోహిణి ఓ ఐడియా చెప్పింది. తన షాప్‌ను అక్కడి నుంచి మార్చి వేరే చోట పెట్టుకోవాలని సూచించింది. అయితే ఈ మాటలకు మాణిక్యం ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. తాతల కాలం నుంచి వస్తున్న వ్యాపారాన్ని మీ కోసం వదులుకోవాలా? నా షాప్ ఆ ఏరియాకే గుర్తింపు అని ఘాటుగా స్పందించాడు. ఇకపై మీనా తన షాప్‌కు వస్తే మొత్తం నిజం బయటపెడతానని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో రోహిణి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. " నేను సుఖంగా ఉండాలని చేసిన పనులే ఇప్పుడు నా జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేశాయి" అంటూ విచిత్రంగా మాట్లాడింది. ఇది చూసిన విద్య, రోహిణికి పిచ్చి పట్టిందా అంటూ ఆశ్చర్యపోయింది.

You May Also Like
నటి హేమ విషయంలో తప్పు చేశా.. తమన్నా క్షమాపణలు!
నటి హేమ విషయంలో తప్పు చేశా.. తమన్నా క్షమాపణలు!

మరోవైపు.. మీనా బిజినెస్ ఎదగాలని బాలు చూపించిన శ్రద్ధ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. భార్య విజయాన్ని తన విజయంగా భావించే భర్తగా బాలు మరోసారి ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇప్పటికే డెకరేషన్ బిజినెస్‌లో తొలి ఆర్డర్ సాధించి ఆనందంలో ఉన్న మీనాకు బాలు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆలోచించిన బాలు, ప్రత్యేకంగా విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. వాటిని మీనా చేతిలో పెట్టి చూపించగా, ఒక్కసారిగా ఆమె ఆశ్చర్యానికి గురైంది. "ఏందండీ ఇవన్నీ?" అంటూ అమాయకంగా ప్రశ్నించింది. దీనికి బాలు "ఈ రోజుల్లో బిజినెస్ ఎదగాలంటే చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకోవాలి. మనకు తెలిసిన వాళ్లకు ఈ కార్డ్స్ ఇస్తే, వారికి అవసరం వచ్చినప్పుడు మన గురించే గుర్తుకు వస్తుంది. అప్పుడు ఆర్డర్లు మన దగ్గరకే వస్తాయి. ఇదే బిజినెస్‌లో తెలివి" అంటూ వివరించాడు.

అంతేకాకుండా తన కస్టమర్లకు, పరిచయస్తులకు కూడా మీనా వ్యాపారం గురించి చెబుతూ ఈ కార్డ్స్ పంచుతానని చెప్పాడు. భర్త మాటలు విన్న మీనా కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. "ఎవరి భర్త అయినా తన గురించి ఆలోచిస్తాడు. కానీ మీరు మాత్రం నేను ఎదగాలని ఇంతగా పరితపిస్తున్నారు. నిజంగా మీరు నాకు దొరకడం నా అదృష్టం" అంటూ భావోద్వేగానికి లోనైంది. ఇక బాలు "నీ బిజినెస్ రోజురోజుకు పెరగాలి. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో నీ బ్రాండ్ పేరు మారుమోగాలి" అంటూ ఆశీర్వదించాడు. ఈ మాటలు మీనాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. చివరగా మీనా, "ఈ విజిటింగ్ కార్డ్స్‌ను రేపు గుడికి తీసుకెళ్లి పూజ చేయిద్దాం" అని చెప్పగా, బాలు కూడా చిరునవ్వుతో అంగీకరించాడు.

రామ్ చరణ్‌కు క్షమాపణ చెప్పిన శ్రీహరి భార్య.. ఆ విషయంలో తప్పు చేశానంటూ..
రామ్ చరణ్‌కు క్షమాపణ చెప్పిన శ్రీహరి భార్య.. ఆ విషయంలో తప్పు చేశానంటూ..

మరోవైపు.. మనోజ్ తనపై ఎవరో చేతబడి చేశారనే అనుమానంతో గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ పరిహారంలో భాగంగా ప్రభావతిని కూడా తనతో తీసుకెళ్లాడు. పూజా నియమాల ప్రకారం ప్రభావతి పసుపు రంగు చీర కట్టుకుని, మెడలో పూలమాల, వేపాకుల మాల ధరించి, నడుముకు వేపాకులు కట్టుకుని వింతగా తయారైంది. మనోజ్ కూడా నడుముకు వేపాకులు కట్టుకుని ఆదివాసిలా కనిపించాడు. తన పరిస్థితి చూసుకుని ప్రభావతి "నా కొడుకు నన్నెక్కడికో తీసుకెళ్తాడని కలలు కన్నాను.. చివరికి ఇలా గుడిలో వింత వేషాలు వేయిస్తున్నాడు" అంటూ బాధపడుతుంది. . దీనికి మనోజ్ మాత్రం "ఇదంతా నీ కోసమే అమ్మ.. చేతబడి పవర్ పోవాలంటే స్వామీజీ చెప్పినట్లు చేయాలి" అంటూ సెంటిమెంట్ డైలాగులు కొట్టాడు.

OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి క్రేజీ సినిమాలు.. ఆ మూవీస్ అస్సలు మిస్‌ కాకండి..
OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి క్రేజీ సినిమాలు.. ఆ మూవీస్ అస్సలు మిస్‌ కాకండి..

ఇంతలో మరో ట్విస్ట్‌గా చేతిలో నిప్పుల కుంపటి పట్టుకుని ప్రదక్షిణ చేయాలని చెప్పడంతో ప్రభావతి షాక్ అయింది. మొదట భయపడినా, కొడుకు కోసం కష్టాన్ని భరించింది. మనోజ్ కూడా నిప్పుల కుంపటి పట్టుకుని అవస్థలు పడుతూ తిరిగాడు. పూజ ఆపితే చేతబడి ప్రభావం పెరుగుతుందని మనోజ్ ఫ్రెండ్ భయపెట్టడంతో ఇద్దరూ నానా తిప్పలు పడ్డారు. అదే సమయంలో బాలు, మీనా తమ విజిటింగ్ కార్డ్స్‌కు పూజ చేయించేందుకు అదే గుడికి చేరుకున్నారు. అక్కడ ప్రభావతిని చూసిన మీనా షాక్ అయ్యింది. మొదట గుర్తుపట్టని బాలు, "ఎవరు ఆ వింత జీవి?" అంటూ సరదాగా అన్నాడు. మీనా చెప్పగానే మరోసారి చూసి షాక్ అయ్యాడు. మనోజ్‌ను చూసి "మేకలు వచ్చి ఆ వేపాకులు తింటే మా వాడి పరిస్థితి ఏంటి?" అంటూ పంచ్ వేశాడు. తర్వాత బాలు తెలివిగా వారి అవతారాలను వీడియో తీసి ఇంట్లో చూపిస్తానన్నాడు. చివరికి మూఢనమ్మకాలతో మనోజ్, ప్రభావతి పడిన తిప్పలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాయి.

ఇక మరోవైపు.. మొదటగా బాలు ఇంటికి చేరుకొని, "ఈరోజు మీ అందరికీ ఆదిమ కాలం నాటి మనుషుల చరిత్ర చూపిస్తా.. రాతియుగం నాటి వింత ఆచారాలు చూపిస్తా" అంటూ అందరినీ హాల్‌లోకి పిలిచాడు. శృతి వెంటనే ల్యాప్‌టాప్ తీసుకొచ్చి సిద్ధం చేసింది. ఇదే సమయంలో మనోజ్, ప్రభావతి, రోహిణి ఏమీ తెలియనట్లుగా వచ్చి కూర్చున్నారు. బాలు మాటలు విన్న ప్రభావతి "ఎప్పుడూ ఏదో పనికిమాలిన పని చేస్తుంటావ్" అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇంతలో బాలు గుడిలో తాను చిత్రీకరించిన వీడియోను ప్లే చేశాడు. అందులో వేపాకులు కట్టుకుని, నిప్పుల కుంపటితో ప్రదక్షిణలు చేస్తున్న మనోజ్, ప్రభావతి కనిపించడంతో ఇంట్లో ఉన్న వారంతా షాక్ అయ్యారు. కొందరు ఆశ్చర్యపోగా, మరికొందరు గట్టిగా నవ్వేశారు. దీంతో మనోజ్, ప్రభావతి, రోహిణి ముగ్గురూ మాట రాక సైలెంట్ అయ్యారు.

బిగ్ బాస్‌లో నా భర్త నరకం చూశాడు.. సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్‌లో నా భర్త నరకం చూశాడు.. సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్

అయితే.. ఈ వ్యవహారాన్ని సత్యం మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు. "ఈ కాలంలో ఉండి ఇలాంటి పనులా? నీ అమ్మ చదవకపోయినా నువ్వు చదివావ్ కదా.. నీకైనా బుద్ధి ఉండాలి" అంటూ మనోజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభావతి కూడా "ఇదంతా మనోజ్ వల్లే.. వాడే నన్ను ఇలా తయారు చేశాడు" అంటూ తన కొడుకుపై నెట్టేసింది. దీనికి మనోజ్ అసలు కారణం చెబుతూ, షాప్ ముందు చేతబడి చేసిన కోడిగుడ్లు దొరికాయని, స్వామీజీ ప్రమాదం ఉందని చెప్పడంతో ఈ పూజ చేశామని చెప్పాడు. వెంటనే బాలు "ఆ దొంగ బాబా అడ్రస్ చెప్పు.. చెప్పులు వేసుకోకుండా చేస్తా" అంటూ ఫైర్ అయ్యాడు.ఇంతలో షాప్ కీపర్ వచ్చి అసలు నిజం బయటపెట్టాడు. ఆ కోడిగుడ్లు చేతబడి కోసం పెట్టినవి కాదని, పక్కనే ఉన్న ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ మనుమడు వాటిపై బొమ్మలు గీశి అక్కడే మరిచిపోయాడని చెప్పాడు. దీంతో ఇంట్లో ఉన్న వారంతా గొల్లుమని నవ్వేశారు.

'మా నాన్నకు బ్రేకప్.. నాకు బ్రేకప్.. ఇద్దరం కలిసి అలా బాధను పంచుకొంటాం'
'మా నాన్నకు బ్రేకప్.. నాకు బ్రేకప్.. ఇద్దరం కలిసి అలా బాధను పంచుకొంటాం'

నిజం తెలిసిన ప్రభావతి, "నీ పిచ్చి అనుమానాలతో నన్ను గుడి చుట్టూ తిప్పించావ్" అంటూ మనోజ్‌పై మండిపడింది. చివరగా సత్యం, "ఇకనైనా రాతియుగం మనుషుల్లా కాకుండా తెలివిగా ఆలోచించు" అంటూ క్లాస్ పీకుతాడు. మరోవైపు.. మీనాను ఎవరో యువకుడు ఫాలో అవుతున్న సన్నివేశం ఆసక్తిని రేకెత్తించింది. మరోవైపు తన బిజినెస్ పనులతో బిజీగా ఉన్న మీనా బయటకు వెళ్లిన సమయంలో ఓ యువకుడు ఆమెను గమనిస్తూ కనిపించాడు. అతడు బాలు ఫ్రెండ్ కుటుంబానికి చెందిన వ్యక్తి అని సంకేతాలు ఇచ్చారు. కొంతకాలంగా మీనాను గమనిస్తూ వస్తున్న అతడు, ఈసారి నేరుగా ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దీంతో మీనా ఒక్కసారిగా కంగారుపడింది.

'అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది'.. సుడిగాలి సుధీర్‌కి స్టార్ యాంకర్ ప్రపోజల్‌!
'అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది'.. సుడిగాలి సుధీర్‌కి స్టార్ యాంకర్ ప్రపోజల్‌!

ఆ యువకుడు మీనాతో మాట్లాడుతూ, "నిన్ను చూస్తే నాకు అదృష్టం కలిసి వస్తుంది. ఆ రోజు నిన్ను చూసిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది. నీ అసలు పేరు తెలియదు కానీ నేను మాత్రం నీకు 'లక్కీ' అని పేరు పెట్టుకున్నా" అంటూ అసభ్యంగా, అతిగా చనువుగా మాట్లాడాడు. అతడి ప్రవర్తనతో మీనా భయంతో పాటు అసహనానికి గురైంది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించని మీనా వెంటనే బాలుకు ఫోన్ చేసింది. ఎవరో వ్యక్తి తనను ప్రతిరోజూ ఫాలో అవుతున్నాడని, ఇప్పుడు దగ్గరకు వచ్చి అసభ్యంగా మాట్లాడాడని ఆందోళనగా తెలిపింది. మీనా మాటలు విన్న బాలు ఒక్కసారిగా ఆగ్రహంతో ఉరకలేశాడు. తన భార్యను ఇబ్బంది పెట్టే వ్యక్తి ఎవరన్న ఆలోచనలో పడిపోయాడు.ఇక్కడితో ఎపిసోడ్ ముగియడంతో ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. రాబోయే ఎపిసోడ్‌లో బాలు అతడికి ఎలా బుద్ధి చెప్తాడు? మీనా ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది? అన్న ప్రశ్నలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక మరోవైపు రోహిణి రహస్యాల ట్రాక్ కూడా కొనసాగుతుండటంతో రాబోయే ఎపిసోడ్‌లు మరింత ఎంటర్‌టైనింగ్‌గా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X