Gundeninda Gudigantalu April 29th Episode: మీనా కన్నీళ్లు, బాలు క్షమాపణ, మనోజ్‌ అత్యాశ, సత్యం హెచ్చరిక

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, కుటుంబ విభేదాలు, దాంపత్యంలో చిన్న మాటలే పెద్ద సమస్యలుగా మారే విధానాన్ని హైలైట్ చేసింది. మీనా తన మొదటి పూల డెకరేషన్ ఆర్డర్ విజయవంతంగా పూర్తి చేసి ఆనందంగా ఇంటికి చేరుతుంది. సత్యం ఆమెను అభినందిస్తాడు కానీ ప్రభావతి మాత్రం స్వీట్లు పెట్టిందని కారణంగా గొడవ మొదలుపెడుతుంది. బాలు కూడా మొదట మీనాను ప్రోత్సహించినా, తర్వాత పరిస్థితులు మారిపోతాయి. కస్టమర్ ముందు తనను చిన్నచూపు చూసిన ఘటన, ప్రభావతి వ్యంగ్యాలు బాలుని మనసుకు గుచ్చుకుంటాయి.

అదే సమయంలో మీనా సరదాగా "మీ కంటే నేను ఎక్కువ సంపాదిస్తా" అన్న మాట అతనిలో అహంకారాన్ని తాకుతుంది.తర్వాత కస్టమర్ మీనాతోనే మాట్లాడి అడ్వాన్స్ డబ్బులు ఇవ్వడం, బాలును పట్టించుకోకపోవడం అతనికి అవమానంగా అనిపిస్తుంది. మీనా ఆనందంలో మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావించడంతో బాలు మరింత బాధపడతాడు. చివరకు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోతాడు.బాలు ఫోన్ కూడా ఎత్తకపోవడంతో మీనా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. సత్యం ఆమెకు అండగా నిలుస్తాడు కానీ ప్రభావతి మాత్రం విషపు మాటలతో పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఇక ఎపిసోడ్ చివర్లో బాలు ఎక్కడ ఉన్నాడు? తిరిగి వస్తాడా? అనే ఉత్కంఠతో కథ ముగుస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 672 April 29th 2026 here is full story

photo courtesy jiohotstar

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠ, భావోద్వేగాలు, కుటుంబ విభేదాలు అన్ని కలగలిపి ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా బాలు ఇంటికి రాకపోవడం, ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో మీనా పడిన ఆందోళన ఈ ఎపిసోడ్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఉదయం నుంచి పలుమార్లు ఫోన్ చేసినా బాలు స్పందించకపోవడం, చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మీనా తీవ్రంగా కంగారు పడుతుంది. భర్తకు ఏమైనా జరిగిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అనే అనుమానాలతో ఆమె మనసు గందరగోళంలో పడుతుంది. దాబా మీద కూర్చుని నిరంతరం కాల్స్ చేస్తూ ఎదురుచూస్తున్న మీనా పరిస్థితి ప్రేక్షకులను కదిలించింది.

ఇక ఈ పరిస్థితిలో మద్దతుగా నిలవాల్సిన ప్రభావతి మాత్రం మరోసారి తన స్వభావాన్ని చూపిస్తుంది. కోడలు బాధను అర్థం చేసుకోకుండా, వెటకారంగా మాట్లాడుతూ మీనా మనసును మరింత గాయపరుస్తుంది. దీంతో సత్యం ఆగ్రహానికి లోనై, ప్రభావతిపై గట్టిగా విరుచుకుపడతాడు. "ఈ సమయంలో కోడలికి ధైర్యం చెప్పాలి గానీ, ఇంకా బాధ పెట్టడం ఏమిటి?" అంటూ ఆమెను మందలిస్తాడు. సత్యం మాటలు వినిపించినా ప్రభావతి తన తీరును మార్చుకోకుండా మళ్లీ వ్యంగ్యంగా మాట్లాడడం ఇంట్లో ఉద్రిక్తతను పెంచుతుంది.

ఇంతలో ఆకలేసిందని చెప్పుకుంటూ కూడా ప్రభావతి కోడలిపై విమర్శలు చేస్తుండగా, సత్యం మరోసారి కౌంటర్ ఇస్తాడు. "నీకు ఆకలైతే వెళ్లి తిను, అనవసరంగా నోరు పారేయకు" అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు. అప్పుడు ప్రభావతి అకస్మాత్తుగా స్వరాన్ని మార్చి తాను వడ్డిస్తానని చెప్పడం సత్యానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే సత్యం వ్యంగ్యంగా స్పందిస్తూ, ప్రేమతో వడ్డించిన భోజనం విలువ వేరే ఉంటుందని చెప్పడం సన్నివేశానికి ఒక భావోద్వేగ టచ్ ఇచ్చింది.

ఇదే సమయంలో బాలు సైలెంట్‌గా ఇంటికి చేరుకోవడం కథలో కీలక మలుపుగా మారింది. వెంటనే సత్యం అతడిని ప్రశ్నిస్తూ, "ఎక్కడికి వెళ్లావ్? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు?" అని నిలదీస్తాడు. బాలు మాత్రం తప్పించుకునేలా "బిజీగా ఉన్నాను" అని సమాధానం ఇస్తాడు. కానీ సత్యం ఆ సమాధానాన్ని నమ్మకుండా, "నీ కోసం కోడలు ఏం తినకుండా ఎదురు చూస్తోంది" అంటూ గట్టిగా మందలిస్తాడు. వెంటనే మీనా దగ్గరకు వెళ్లి ఇద్దరూ కలిసి తినాలని ఆదేశిస్తాడు.

ఇక ఈ ఎపిసోడ్‌లో అత్యంత భావోద్వేగభరితంగా నిలిచిన సన్నివేశం బాలు-మీనా మధ్య జరిగిన ఈ ఘట్టమే. బాలు ఇంటికి తిరిగి వచ్చి మీనా దగ్గరకు వెళ్లే క్షణం నుంచే కథలో టెన్షన్ పీక్‌కు చేరుతుంది. ఉదయం నుంచి భర్త కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న మీనా, బాలు కనిపించగానే ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఆమె నిరీక్షణకు ముగింపు వచ్చినట్టే అనిపిస్తుంది. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవదు. బాలు మాత్రం తన మనసులో పేరుకుపోయిన అపార్థంతో, "నీకంటే నేను ఎక్కువ సంపాదించాను" అంటూ టాక్సీ నడిపి సంపాదించిన డబ్బును ఆమె చేతిలో పెడతాడు. ఈ ఒక్క మాటతో మీనా షాక్‌కు గురవుతుంది.

బాలు ప్రవర్తన అర్థంకాక మీనా ప్రశ్నించగా, ఉదయం ఆమె చెప్పిన మాటను పట్టుకుని తన అహంకారంతో ఇలా చేశానని చెబుతాడు. దీంతో మీనా గుండె ముక్కలవుతుంది. "మీరు ఇలా మాట్లాడతారని అనుకోలేదు. నేను ఎదుగుతుంటే మీరు నన్ను ప్రోత్సహిస్తారని అనుకున్నా, కానీ మీరు ఇలా మారిపోతారని ఊహించలేదు" అంటూ బాధను బయటపెడుతుంది. తన వ్యాపారానికి మొదటి అడుగు వేసేలా చేసినది బాలు అనే విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు అదే వ్యక్తి తన ఎదుగుదలని ఓర్చుకోలేకపోవడం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చివరకు తట్టుకోలేక గదిలోకి వెళ్లి ఏడుస్తుంది.

మీనా బాధను చూసిన తర్వాత బాలు తన తప్పును గ్రహిస్తాడు. తనే అపార్థం చేసుకుని ఆమెను బాధపెట్టానని లోలోపల బాధపడతాడు. వెంటనే మీనా దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరుతాడు. మొదట మీనా కాస్త కఠినంగా స్పందించినా, బాలు తన మాటలతో ఆమెను నెమ్మదిగా కూల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రేమగా మాట్లాడి, తాను తప్పు చేశానని ఒప్పుకుంటూ ఆమె మనసును గెలుచుకుంటాడు. ఇక ఈ సన్నివేశంలో మరో ముఖ్యమైన అంశం భోజనం చుట్టూ తిరుగుతుంది. బాలు కోపంతో ఉదయం నుంచి ఏమీ తినకపోయినా, "నేను తిన్నాను" అని అబద్ధం చెబుతాడు. కానీ మీనా చేసిన వంటల వాసనతో తన నిజం బయటపడుతుంది. "నీ కోసం అన్నం తక్కువ అవుతుందనుకుని అలా చెప్పాను" అని నిజం చెప్పడంతో మీనా మనసు కరిగిపోతుంది. వెంటనే హాట్‌బాక్స్‌లో పెట్టిన భోజనం తీసుకుని బాలుకు ఇస్తుంది.

ఇక్కడ బాలు చిన్నగా అలకపోయినట్లు నటిస్తూ, "నువ్వు కోపంగా ఉన్నప్పుడు నేను ఎలా నిన్ను తినిపించానో, నువ్వూ నన్ను అలా తినిపించు" అని చెబుతాడు. దీంతో మీనా ప్రేమగా అతనికి ముద్దలు పెట్టి తినిపిస్తుంది. ఈ సమయంలో బాలు మళ్లీ తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణ కోరుతాడు. దానికి మీనా "మనిద్దరం ఎప్పుడూ వేరుకాదు" అని చెప్పడం ద్వారా వారి బంధం మరింత బలపడుతుంది.చివరగా బాలు "అమ్మ చేతి గోరుముద్దలు కాకపోయినా, నా భార్య చేతిలో ముద్దలు తింటున్నాను... నాకంటే అదృష్టవంతుడు ఎవరు లేరు" అని చెప్పడం హైలెట్.

ఇక మరోవైపు.. మనోజ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఎప్పుడూ పూజలకి దూరంగా ఉండే మనోజ్, అకస్మాత్తుగా పూజ గదిలోకి వెళ్లి దీపారాధన చేయడం ఇంట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అతడు దేవుడికి కాదు, తన తల్లి ఫోటోకు పూజలు చేస్తుండటం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ సన్నివేశాన్ని గమనించిన రోహిణి, "ఏమైంది నీకు? నీ అమ్మ ఫోటోకు ఇలా పూజలు చేస్తే చూస్తే గొడవ అవుతుంది" అంటూ హెచ్చరిస్తుంది. కానీ మనోజ్ మాత్రం తన తల్లి గొప్పతనాన్ని పొగిడుతూ, "నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది మా అమ్మ ఆశీర్వాదమే" అంటూ భావోద్వేగంగా స్పందిస్తాడు.ఇంతలో ప్రభావతి అక్కడికి రావడంతో మనోజ్ వెంటనే అప్రమత్తమై, ఫోటో దాచేసి దేవుడికి పూజ చేస్తున్నట్టు నటిస్తాడు. ఈ విషయాన్ని తెలియని ప్రభావతి, తన కొడుకులో వచ్చిన మార్పు చూసి ఆనందంతో మురిసిపోతుంది.

"నా కొడుకు అందరికంటే ఎత్తుకు ఎదగాలి" అంటూ ఆశీర్వదించడం ద్వారా ఆమె ఆశలు మరింత పెరిగినట్టు చూపించారు. కానీ మనోజ్ అకస్మాత్తుగా పూజలు చేయడం సత్యం సహా ఇంట్లో వాళ్లందరికీ అనుమానంగా అనిపిస్తుంది.ఈ సమయంలో బాలు ఎంట్రీ ఇవ్వడం కథలో మరో ట్విస్ట్ తీసుకొచ్చింది. ఇంట్లో పొగ ఎక్కువగా ఉండటంతో ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని అనుకున్న బాలు, విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. "మనోజ్ లాంటి వాడు పూజలు చేస్తున్నాడంటే ఏదో పెద్ద విషయం జరిగి ఉంటుంది" అంటూ వెటకారంగా మాట్లాడతాడు. మనోజ్ కూడా "నాకు దేవుడిపై విశ్వాసం వచ్చింది" అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతడు చెప్పిన "సర్వేంద్రియానం నయనం ప్రధానం" అనే సూక్తిని తప్పుగా ఉపయోగించడంతో ఇంట్లో వాళ్లు నవ్వుతారు. వెంటనే సత్యం దానికి సరైన అర్థం చెబుతూ మనోజ్‌ను సైలెంట్ చేస్తాడు.

ఇదే సమయంలో మనోజ్ అసలు విషయాన్ని బయటపెడతాడు. రాజమండ్రి దగ్గర ఓ విల్లాను కొనాలని నిర్ణయించుకున్నానని, ఐదు కోట్ల విలువ ఉన్న ఆ విల్లాను మూడు కోట్లకే ఇస్తున్నారని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ప్రభావతి మాత్రం ఆనందంతో ఊగిపోతూ, తాను త్వరలో విల్లాలో ఉండబోతున్నానని కలలు కంటుంది. కానీ సత్యం, బాలు సహా మిగతావారు మాత్రం ఇది ఏదో మోసం కావచ్చని అనుమానిస్తారు. "ఇంత పెద్ద తగ్గింపు అంటే తప్పకుండా ఏదో లోపం ఉంటుంది" అంటూ సందేహం వ్యక్తం చేస్తారు. బాలు అయితే మరింత ముందుకెళ్లి, "ఆ ఇంట్లో ఏదైనా కీడు జరిగి ఉండొచ్చు, లేదా మోసం ఉండొచ్చు" అని హెచ్చరిస్తాడు.అయితే మనోజ్ మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా, ఇప్పటికే కొంత డబ్బు సమకూర్చుకున్నానని, త్వరలోనే అడ్వాన్స్ ఇవ్వబోతున్నానని చెబుతాడు. ప్రభావతి కూడా తన కొడుకును పూర్తిగా నమ్ముతూ అతని నిర్ణయాన్ని సమర్థిస్తుంది. కానీ సత్యం మాత్రం అత్యాశకు పోవద్దని గట్టిగా హెచ్చరిస్తాడు.

ఇక చివర్లో జరిగిన తుమ్ముల సన్నివేశం కథలో చిన్న హాస్యాన్ని తీసుకొచ్చినా, అదే సమయంలో సస్పెన్స్‌ను కూడా పెంచింది. మీనా తుమ్మడంతో అపశకునంగా భావించి కాసేపు ఆగాలని సూచిస్తుంది. తర్వాత అందరూ వరుసగా తుమ్మడం, చివరకు ఎండుమిరపకాయల వల్లే అది జరిగిందని సత్యం చెప్పడం నవ్వులు పూయించింది. అయినప్పటికీ మీనా మనసులో అనుమానం మాత్రం తగ్గదు. "ఇది ఏదో సంకేతం కావచ్చు" అంటూ ఆలోచనలో పడుతుంది. మొత్తానికి ఈ ట్రాక్ చివర్లో పెద్ద సస్పెన్స్‌ను వదిలింది. మనోజ్ నిజంగా మంచి డీల్ చేస్తున్నాడా? లేక మోసగాళ్ల బారిన పడబోతున్నాడా? బాలు చెప్పిన అనుమానాలు నిజమవుతాయా? ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనే ప్రశ్నలతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. రాబోయే ఎపిసోడ్‌పై ఉత్కంఠ పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X