Gundeninda Gudigantalu May 4th Episode: విల్లాలో దెయ్యాల వేట, మనోజ్‌కు ప్రభావతి షాక్, రోహిణిపై మీనాకు అనుమానం
photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో కథ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. ఒకవైపు చింతామణి వేసిన వ్యూహాలు, మరోవైపు మనోజ్ కుటుంబం విల్లాలోకి ప్రవేశించడం కథలో కొత్త మలుపులను తీసుకొచ్చాయి. మీనాకు రావాల్సిన పెళ్లి ఆర్డర్‌ను దొంగిలించేందుకు చింతామణి సగం ధరకు కోట్ ఇచ్చి ముందుగా ఆర్డర్‌ను దక్కించుకుంది. అయితే ఆమె అసలు ప్లాన్ పెళ్లికి ముందు రోజు పూలు లేవని చెప్పి అధిక ధరలు వసూలు చేయడమే. ఈ విషయం తెలుసుకున్న మీనా తీవ్రంగా షాక్ అవుతుంది. "ఆమె ఎప్పుడూ ఇలా చేస్తుంది" అన్న మాటలు మీనాలో అనుమానాలను మరింత పెంచాయి. ఇక మరోవైపు ప్రభావతి విల్లాకు వెళ్లేందుకు చీర ఎంపికలో గడిపిన సన్నివేశాలు హాస్యాన్ని పండించాయి. సత్యం వేసిన సరదా కౌంటర్లు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. చివరకు రోహిణి సెలెక్ట్ చేసిన చీరలను చూసి ప్రభావతి సంతోషపడటం ఫ్యామిలీ ఎమోషన్‌ను చూపించింది.
మనోజ్ కుటుంబం విల్లాకు చేరిన తర్వాత కథ మరింత సస్పెన్స్ వైపు మళ్లింది. విల్లా అందాలు అందరినీ ఆకట్టుకున్నప్పటికీ, ఓనర్స్ ప్రవర్తన రవి, శ్రుతికి అనుమానంగా అనిపిస్తుంది. అయినా మనోజ్ రూ.25 లక్షల అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ సైన్ చేయడం కీలకంగా మారింది. డబ్బు తీసుకున్న వెంటనే ఓనర్స్ వెళ్లిపోవడం అనుమానాలను మరింత పెంచింది. బాలు మాత్రం ఈ వ్యవహారంపై అప్రమత్తంగా ఉండి ప్రశ్నలు వేయడం కథలో టెన్షన్ పెంచింది. ఇదే సమయంలో న్యూమరాలజిస్ట్ ఎంట్రీతో మరో ట్విస్ట్ వచ్చింది. మనోజ్ పేరుపై షాకింగ్ కామెంట్స్ చేసి 'రోమతి' అనే వింత పేరు సూచించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ సస్పెన్స్, ఎమోషన్, కామెడీ మిక్స్‌గా సాగుతూ తర్వాతి భాగాలపై ఆసక్తిని పెంచింది.

photo courtesy jiohotstar
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ఇంట్లోకి వచ్చిన న్యూమరాలజిస్ట్ తన స్టైల్‌లోనే డ్రామా మొదలు పెట్టాడు. "రోమతి" అనే మూడు అక్షరాల పేరును సూచిస్తూ, దానికి భారీగా ₹20,000 ఛార్జ్ చెప్పడంతో ఇంట్లో ఒక్కసారిగా షాక్ వాతావరణం నెలకొంది. బాలు డిస్కౌంట్ గురించి అడిగినా, అతడు తనకు ఎమ్మెల్యే ఇంట్లో అపాయింట్మెంట్ ఉందని, అక్కడ కుక్కకు పేరు పెట్టాల్సి ఉందని చెప్పి మరింత అహంకారంగా ప్రవర్తించాడు. చివరికి మనోజ్ భయంతో ఆ మొత్తం చెల్లించడంతో పరిస్థితి మరింత హాస్యాస్పదంగా మారింది.
ఆ న్యూమరాలజిస్ట్ వెళ్లిపోగానే గోస్ట్ హంటర్ ఎంట్రీ ఇచ్చింది. ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని, వాటిని తాను పోగొడతానని చెప్పడంతో సన్నివేశం మరింత ఆసక్తికరంగా మారింది. కానీ, సత్యం మాత్రం ఈ మూఢనమ్మకాలను పూర్తిగా ఖండిస్తూ, తనకు ఇవేమీ నమ్మకం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడం కథలో వాస్తవానికి దగ్గరగా అనిపించింది. బాలు కూడా మనోజ్ చేస్తున్న పనులను తప్పుపడుతూ, ఇలాంటి పిచ్చి నమ్మకాలతో డబ్బులు వృథా చేయొద్దని హెచ్చరించాడు. అయితే మనోజ్ మాత్రం బాలు మాటలను తప్పుగా అర్థం చేసుకుని, తన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాడని అనుకోవడం కథలో చిన్నపాటి ఎమోషనల్ టచ్‌ను తెచ్చింది.
ఇదే సమయంలో గోస్ట్ హంటర్ ప్రవర్తనలో ఉన్న అనుమానాస్పద అంశాలను గమనించిన మీనా, ఆమె మాటలపై సందేహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఆమె మాట్లాడే కభాష స్టైల్‌ను గుర్తించి, ఏదో తేడా ఉందని బాలు దృష్టికి తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో బాలు తనదైన శైలిలో గోస్ట్ హంటర్‌కు బుద్ధి చెప్పాలని ప్లాన్ చేస్తాడు. ఇంట్లో లైట్లు ఆన్-ఆఫ్ చేస్తూ భయపెట్టే సీన్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. అయితే గోస్ట్ హంటర్ కూడా తగ్గకుండా, తాను వచ్చానంటే ₹20,000 ఇవ్వాలని, లేదంటే దెయ్యాలను తీసుకువచ్చి వదిలేస్తానని బెదిరించడం మరో హైలైట్‌గా నిలిచింది. చివరికి మనోజ్ మళ్లీ భయంతో డబ్బులు ఇస్తాడు.
ఇక ప్రభావతి తన కడుపులో "ఎలుకలు పరిగెడుతున్నాయి" అంటూ చెప్పడంతో బాలు వెంటనే తనదైన కామెడీ స్టైల్‌లో సెట్టర్లు పేల్చాడు. "దయ్యాలు పోయి ఇప్పుడు ఎలుకలూ వచ్చాయా... అవి మా అమ్మ కడుపులోకి వెళ్లాలా?" అంటూ బాలు నవ్విస్తాడు. అదే సమయంలో మీనా వచ్చి, ప్రభావతి చెప్పిందేమిటంటే ఆమెకు ఆకలి వేసిందని వివరణ ఇవ్వడంతో సీన్ మరింత హాస్యంగా మారింది. "అది డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా!" అంటూ బాలు చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక సత్యం వచ్చి "అందరికీ ఆకలే ఉంది కానీ ఎవరూ బయటకు చెప్పడం లేదు" అంటూ బాలను బయటికి వెళ్లి ఆహారం తీసుకురావాలని చెప్పాడు. అయితే ఇక్కడ కూడా మనోజ్ తనకు స్పెషల్‌గా మటన్ బిర్యానీ ఆర్డర్ చేశానని చెప్పడంతో బాలు తనదైన స్టైల్ లో షాక్ ఇస్తాడు. దీంతో "నాకు స్పెషల్ అవసరం లేదు... అందరికీ నచ్చినది తీసుకురా" అంటాడు. ఇక పుడ్ తీసుకరావడానికి బాలు బయటకు వెళ్లాడు.
అలా బాలు బయటకు వెళ్లిన వెంటనే కథలో కీలక మలుపు చోటు చేసుకుంది. బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి, మనోజ్ చూపించిన ఇంటి డాక్యుమెంట్స్‌ను పరిశీలిస్తారు. ఇంటి విలువ సుమారు 5 కోట్లు ఉన్నప్పటికీ, తమ బ్యాంక్ నుండి మాత్రం కేవలం 2 లక్షలు మాత్రమే ఇవ్వగలమని చెబుతారు. దీంతో మనోజ్ - రోహిణి ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. ఈ సమయంలో ప్రభావతి మాత్రం అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా అమాయకంగా స్పందిస్తూ, "నా కొడుకుని చూసి రెండు కోట్లు ఇస్తున్నారు" అంటూ మీనాక్షికి చెప్పడం మరో ఫన్నీ హైలైట్‌గా నిలిచింది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం గంభీరంగా మారింది. మనోజ్, రోహిణి ఇద్దరూ కలిసి 70 లక్షలు ఎలా సమకూర్చుకోవాలనే ఆలోచనలో పడతారు. ఈ క్రమంలో రోహిణి ఒక సీక్రెట్ ప్లాన్‌ను మనోజ్‌కు చెబుతుంది. అందుకు మనోజ్ కూడా ఒప్పుకుంటాడు.
ఇక బాలు బయట నుంచి అందరికీ బిర్యానీ తీసుకుని వచ్చాడు. ఇంట్లో ఎవ్వరూ స్పందించకపోవడంతో గట్టిగా పిలిచాడు. దీనికి ప్రభావతి "ఏరా ఎందుకు పిలిచావు?" అని అడగగా, బాలు తనదైన కామెడీ టైమింగ్‌తో "నీ కోసం ఎలుకల మందు తీసుకవచ్చా... వచ్చి తిను" అంటూ సెటైర్ వేశాడు. వెంటనే షాక్ అయిన ప్రభావతి "నన్ను చంపేయాలనుకుంటున్నావా?" అని ప్రశ్నించగా, "నువ్వే కదా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అన్నావు" అంటూ బాలు చెప్పడం సన్నివేశాన్ని నవ్వులతో నింపింది. అందరూ కలిసి భోజనం చేయడానికి సిద్ధమవుతుండగానే మనోజ్, రోహిణి తమ ప్లాన్‌తో ఎంట్రీ ఇస్తారు. "ఒక్క నిమిషం... మీతో అర్జెంట్‌గా మాట్లాడాలి" అని రోహిణి చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా సీరియస్ అవుతుంది.
మనోజ్ మాత్రం తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడాలనుకుంటూ మిగతావారిని బయటకు పంపాలని ప్రయత్నిస్తాడు. కానీ బాలు "ఏమున్నా ఇక్కడే చెప్పు" అంటూ అడ్డుకుంటాడు. సత్యం కూడా "మనది ఉమ్మడి కుటుంబం... మంచైనా చెడైనా అందరం కలిసి వినాలి" అని చెప్పడంతో మనోజ్ తప్పనిసరిగా అసలు విషయాన్ని బయటపెడతాడు. ఇంటి డాక్యుమెంట్స్‌పై బ్యాంక్ కేవలం రెండు కోట్లు మాత్రమే లోన్ ఇస్తుందని, ఇంకా 70 లక్షలు కావాలని, అందుకే మన ఇంటిని అమ్మేద్దాం అని మనోజ్ చెప్పడం అందరికీ షాక్ కలిగిస్తుంది. ఈ మాటలు విన్న వెంటనే బాలు కోపంతో ఊగిపోతాడు. "మనిషివేనా.. అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? ఉన్న ఇంటిని అమ్మేస్తావా?" అంటూ ఘాటుగా ప్రశ్నిస్తూ తన నిర్ణయాన్ని స్పష్టం చేస్తాడు.
అయితే మనోజ్ మాత్రం తన ప్లాన్‌ను సమర్థించుకుంటూ, "ఇంటి డబ్బులతో అందరం బిజినెస్ మొదలుపెడదాం" అంటూ బాలు గ్యారేజ్, రవి హోటల్ వంటి ఐడియాలను చెబుతాడు. ఇక్కడ రవి భావోద్వేగంతో స్పందిస్తూ, "అది ఇల్లు మాత్రమే కాదు... మన జ్ఞాపకాల నిలయం. అమ్మానాన్నలు ఎక్కడ ఉంటారు?" అంటూ ప్రశ్నించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. బాలు కూడా "ఇల్లు అమ్మేసి అమ్మానాన్నలను వారాల వారీగా పంచుకోవాలనుకుంటున్నావా?" అంటూ మనోజ్ అసలు ఆలోచనను బయటపెడతాడు. ఈ మాటలతో కోపోద్రిక్తుడైన మనోజ్, బాలు ఎదుగుదలను ఓర్వలేక ఇలా చేస్తున్నాడని ఆరోపణలు చేయడం ఘర్షణను మరింత పెంచింది.
ఈ ఉద్రిక్తతలో బాలు మనోజ్ కాలర్ పట్టుకుని కొట్టడానికి ప్రయత్నించగా, మనోజ్ కూడా ఎదురు దాడికి దిగుతాడు. వెంటనే సత్యం మధ్యలోకి వచ్చి వారిని ఆపేస్తాడు. "ఇంకా చిన్నపిల్లలు కాదు... ఈ ఇంటిపై హక్కు మీ అందరికంటే మీ అమ్మకే ఎక్కువ. ఆమె నిర్ణయమే ఫైనల్" అని చెప్పడంతో అందరి చూపులు ప్రభావతిపై పడతాయి. ఈ సమయంలో ప్రభావతి భావోద్వేగంతో స్పందిస్తూ, "అది నా తండ్రి జ్ఞాపకం... ఎవరి కోసం అయినా అమ్మను. ఆ ఇల్లు అమ్మడం కుదరదు" అని స్పష్టం చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. ముఖ్యంగా మనోజ్ తన తల్లి నుంచి ఇలా తిరస్కరణ వస్తుందని ఊహించక షాక్ అవుతాడు. బాలు కూడా తల్లి తీసుకున్న ఈ గట్టి నిర్ణయాన్ని చూసి ఆశ్చర్యపోతాడు.
ఇలా మనోజ్ ప్లాన్ విఫలమవుతుందనే పరిస్థితి ఏర్పడడంతో, రోహిణి ఎలాగైనా తన ఆలోచనను అమలు చేయాలని పట్టుదలగా కనిపించింది. "ఈ ఇంటిని అమ్మకపోతే మనం ఆ విల్లా ఎలా కొనగలుగుతాం?" అంటూ ఆమె దయనీయంగా ప్రశ్నించగా, ప్రభావతి మాత్రం పూర్తిగా భిన్నమైన ఆలోచనను ముందుకు తెచ్చింది. "ఇల్లు అమ్మకుండానే కూడా మనం విల్లా కొనవచ్చు" అంటూ ఆమె చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ప్రభావతి, రోహిణిని నేరుగా ఆమె తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడగమని ఒత్తిడి చేయడం కథలో మరో మలుపుగా మారింది. "మీరు సంతోషంగా ఉండాలంటే మీ నాన్న డబ్బులు ఎందుకు ఇవ్వడు?" అంటూ ఆమె బలంగా అడగడంతో, రోహిణి ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడింది. పరిస్థితి నుంచి బయటపడేందుకు రోహిణి "మా నాన్న జైలులో ఉన్నాడు... అతని ఆస్తి మొత్తం ఫ్రీజ్ అయింది" అంటూ కొత్త కథ చెప్పడం షాక్‌కు గురిచేసింది.
అయితే ప్రభావతి అక్కడితో ఆగకుండా, "మలేషియాలో ఉన్న మీ మామయ్యకు ఫోన్ చేయి" అంటూ మళ్లీ ఒత్తిడి చేయడంతో, రోహిణి తప్పించుకోలేని పరిస్థితిలో పడింది. కానీ నిజానికి ఆమె మామయ్యకు కాల్ చేయకుండా, తన స్నేహితురాలు విద్యకు ఫోన్ చేసి, ₹70 లక్షలు కావాలని అడిగినట్టు నటిస్తుంది. ఫోన్‌లో ప్రశ్నలు, సమాధానాలు అన్నీ తానే చెబుతూ డ్రామా ఆడడం ద్వారా, మామయ్య వద్ద డబ్బు లేదని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఫోన్ డ్రామాను ప్రభావతి, మనోజ్ ఇద్దరూ నిజమేనని నమ్మిపోతారు. కానీ మీనా మాత్రం రోహిణి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తుంది. "ఫోన్‌లో రోహిణి తానే ప్రశ్న అడిగి, తానే సమాధానం చెప్పింది... ఇది కాస్త డౌట్‌గా అనిపిస్తోంది" అంటూ బాలకు చెప్పడం కథలో కొత్త సస్పెన్స్‌ను తెస్తుంది.
మీనా మాటలు విన్న బాలు కూడా విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటాడు. "నువ్వు గమనించినది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు... త్వరలోనే అసలు విషయం బయటకు తీసుకుందాం" అంటూ స్పందిస్తాడు. దీంతో రోహిణి ప్లాన్ వెనుక ఉన్న నిజం ఏమిటి? ఆమె ఎందుకు ఇలా మోసం చేస్తోంది? అన్న ఆసక్తి మరింత పెరుగుతుంది. మొత్తానికి ఈ కీలకమైన ట్విస్ట్‌తో ఎపిసోడ్ ముగియగా, రాబోయే భాగాల్లో కుటుంబంలో మరింత ఘర్షణలు, నిజాలు బయటపడే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











