Gundeninda Gudigantalu May 6th Episode: విల్లా ఓనర్ ఎంట్రీతో షాక్, బయటపడ్డ 30 లక్షల మోసం, పోలీసులతో గెంటివేత!

photo courtesy jiohotstar

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ ఉత్కంఠభరిత మలుపులతో సాగింది. ప్రారంభంలో మీనా-బాలు సంభాషణ కథకు కీలకంగా మారింది. రోహిణి ఫోన్ కాల్ వ్యవహారంపై మీనా అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమె తానే ప్రశ్నలు అడిగి తానే సమాధానాలు చెప్పిందని గుర్తు చేస్తుంది. దీనిపై బాలు కూడా సీరియస్‌గా స్పందించి, త్వరలో నిజం బయటపడుతుందని చెబుతాడు. ఇక రవి-శృతి ట్రాక్‌లో మనోజ్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. శృతి ముందుగానే అలర్ట్ చేసినట్లే మనోజ్ వచ్చి డబ్బులు అడగగా, రవి తన పరిమితులు చెప్పి తిరస్కరిస్తాడు. కానీ మనోజ్ శృతి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ డబ్బులు తెప్పించమని ఒత్తిడి చేయడంతో ఉద్రిక్తత పెరుగుతుంది. దీనిపై శృతి ఘాటుగా స్పందించి, ఆస్తి విషయాలు తమ కుటుంబానికి చెందినవని స్పష్టం చేస్తుంది. రవి కూడా బాలు చేసిన సహాయాలను గుర్తుచేసి మనోజ్‌కు కౌంటర్ ఇస్తాడు.

ఆ తర్వాత కోపంతో బయటకు వెళ్లిన మనోజ్, రోహిణితో కలిసి కొత్త ప్లాన్ వేస్తాడు. "ముంబై ముఖేష్‌ను ఇంప్రెస్ చేసి బిజినెస్ పెంచుకుందాం" అని నిర్ణయిస్తాడు. ఇదే సమయంలో బాలు-మీనా మధ్య కుటుంబ విలువలపై హృద్యమైన సంభాషణ సాగుతుంది. ఎపిసోడ్ హైలెట్‌గా ప్రభావతి-రోహిణి సన్నివేశం నిలుస్తుంది. రోహిణి అబద్ధాలను బయటపెడుతూ తీవ్రంగా నిలదీయడం, చివరకు ఆమె నిజం చెప్పే సన్నివేశం ఉత్కంఠ రేపుతుంది. అయితే అది కల అని తేలడంతో ట్విస్ట్ మరింత ఆసక్తిని పెంచింది. మరోవైపు బాలు ఎయిర్‌పోర్ట్ నుంచి కస్టమర్‌ను తీసుకువస్తాడు. ఆమె గతంలో ₹45 లక్షలు మోసపోయిన విషయాన్ని చెప్పడం కథలో కొత్త మలుపుకు సంకేతమిచ్చింది. ఈ ఇల్లు-మనోజ్ డీల్‌కు సంబంధం ఉందా అన్న ఆసక్తితో ఎపిసోడ్ ముగిసింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 677 May 6th 2026 here is full story

photo courtesy jiohotstar

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ కథలో ఆసక్తికర మలుపులతో ముందుకు సాగింది. ప్రారంభంలోనే ప్రభావతి-సత్యం ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉదయం వాకింగ్‌కు బయటకు వచ్చిన ఈ జంట, కొత్త ప్రాంతంలో కనిపించిన విలాసవంతమైన ఇళ్లను చూసి విభిన్నంగా స్పందిస్తుంది. ముఖ్యంగా ప్రభావతి అక్కడి వాతావరణం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసి మురిసిపోతూ "మనమూ ఇక్కడివాళ్లలా రిచ్‌గా ఉండాలి" అని చెబుతుంది. ఆమె మాటల్లో కనిపించిన ఆశలు, ఆకాంక్షలు సత్యానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పటివరకు సాధారణ జీవనశైలిని మెచ్చుకున్న ప్రభావతి ఒక్కసారిగా పాత ఇంటిని తక్కువ చేసి మాట్లాడడం సత్యానికి నచ్చదు. "ఒడ్డు చేరాక తిప్పను తన్నేసినట్టు మన ఇల్లు గురించి ఇలా మాట్లాడడం సరైంది కాదు" అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు. అయితే ప్రభావతి మాత్రం ఆగకుండా, "మన ఆలోచనలు పెద్దగా ఉండాలి... మనోజ్ వల్ల మనం కూడా పెద్ద వాళ్లం అవుతాం" అంటూ తన కొడుకుపై నమ్మకం వ్యక్తం చేస్తుంది.

ఇక సత్యం కుటుంబ విలువలను గుర్తుచేస్తూ, "మన ఇల్లు జ్ఞాపకాలతో నిండినది... మనం నాటిన చెట్టు, మన పిల్లలు పూలు లాంటివాళ్లు" అని చెప్పడం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. కానీ ప్రభావతి మాత్రం "నేను నీ భార్యగా కాకుండా కోట్లాది సంపాదించే మనోజ్ తల్లిగా ఉండడమే ఇష్టం" అంటూ అతడిని చిన్నచూపు చూడడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది. ఈ సన్నివేశం ఆశలు-అత్యాశ మధ్య తేడాను బలంగా చూపించింది. తర్వాత సత్యం వాతావరణాన్ని కూల్ చేయడానికి కొబ్బరి బొండాలు తాగుదామని తీసుకెళ్తాడు. అక్కడ కూడా ప్రభావతి తన స్టేటస్ చూపించేందుకు "మేము ఇక్కడ ఐదు కోట్ల విలువైన ఇల్లు కొన్నాం" అని గొప్పగా చెప్పడం హాస్యంతో పాటు వ్యంగ్యాన్ని కలిగించింది. వెంటనే సత్యం నిజాన్ని చెప్పి పరిస్థితిని సర్దుబాటు చేస్తాడు. ధర విషయంపై ప్రభావతి ప్రశ్నించగా, సత్యం "ఇప్పుడు ఇవి అవసరం లేదు... హుందాగా ఉండాలి" అంటూ ఆమెకు క్లాస్ ఇవ్వడం మరో హైలైట్‌గా నిలిచింది. అయితే ఈ సన్నివేశంలోనే కీలక ట్విస్ట్ దాగి ఉంది. వారు వెళ్లిన వెంటనే కొబ్బరి బొండాల వ్యాపారి అసలు ఇంటి యజమానికి ఫోన్ చేసి "మీ ఇంట్లో కొత్త వాళ్లు ఉన్నారు" అని చెబుతాడు.

మరోవైపు.. బాలు-కల్పన-మనోజ్ మధ్య జరిగిన సన్నివేశాలు కథకు కొత్త ట్విస్ట్ ఇచ్చాయి. కథనం ప్రకారం, బాలు తన కస్టమర్ అయిన కల్పనను రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు తీసుకెళ్తాడు. అక్కడికి చేరుకున్న తర్వాత కల్పన "లోపల పని ఉంది... అరగంట పడుతుంది" అని చెప్పి, బాలను బయటే వేచి ఉండమంటుంది. బాలు కూడా తన సహజమైన సరళతతో "పర్లేదు మేడం... నేను ఇక్కడే వెయిట్ చేస్తా" అని సమాధానం ఇస్తాడు. అయితే ఇక్కడే కథలో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. అదే సమయంలో మనోజ్-రోహిణి-మణికంఠ కూడా అదే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వస్తారు. మణికంఠ బాలను గుర్తించి పలకరించగా, మనోజ్ మాత్రం తనదైన అహంకారంతో "కొత్త బిల్డింగ్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చాం" అంటూ ఓవర్ బిల్డప్ ఇస్తాడు. దీనికి రోహిణి కూడా సపోర్ట్ చేస్తూ "ఇప్పటి రోజుల్లో స్పీడ్ లేకపోతే వెనకపడిపోతాం" అంటూ బాలను చిన్నచూపు చూస్తుంది. బాలు మాత్రం తన స్టైల్‌లోనే కౌంటర్ ఇస్తూ, "ముందు పని చూసుకోండి... తర్వాత మాట్లాడుకుందాం" అంటూ పరిస్థితిని హ్యాండిల్ చేస్తాడు. మణికంఠ లోపలికి రావాలని పిలిచినా, మనోజ్ వెటకారంగా మాట్లాడడంతో బాలు కూడా గట్టిగానే రిప్లై ఇచ్చి వారిని పంపేస్తాడు.

ఇక అసలు ట్విస్ట్ లోపల ఉన్న కల్పనకు మనోజ్ వాయిస్ వినిపించడంతో ఒక్కసారిగా టెన్షన్ పెరుగుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి మనోజ్ కనిపించడంతో ఆమె కంగారుపడి వెంటనే బయటకు వచ్చేస్తుంది. బాలను పిలిచి "మూడ్ బాగోలేదు... మరో రోజు రిజిస్ట్రేషన్ చేసుకుందాం" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ సన్నివేశం కల్పన-మనోజ్ మధ్య గతంలో ఉన్న సంబంధానికి సంకేతంగా నిలిచింది. కల్పన ప్రవర్తనలో మార్పు గమనించిన బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు. కానీ కల్పన "సమయం వచ్చినప్పుడు చెప్తా" అంటూ విషయం తప్పించుకుంటుంది. ఇంటికి చేరుకున్న తర్వాత బాలకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం మరో ఆసక్తికర అంశంగా మారింది. అయితే బాలు తన హాస్యంతో "ఇవి తీసుకెళ్తే నా భార్య కోపపడుతుంది" అంటూ సరదాగా మాట్లాడటం సన్నివేశాన్ని లైట్‌గా మార్చింది.

మరోవైపు.. న్యూమరాలజిస్ట్ సూచించిన "రోమతి" పేరుతో విల్లాకు నేమ్ బోర్డ్ పెట్టాలని మనోజ్ ఆర్డర్ ఇవ్వడం ఈ ట్రాక్‌కు స్టార్ట్ అయింది. ఆ నేమ్ బోర్డ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో రోహిణి కాఫీ తీసుకువచ్చి మనోజ్‌తో తన ఆనందాన్ని పంచుకుంటుంది. "మన జీవితం ఒక్కరాత్రిలోనే మారిపోయింది... ఇప్పుడు మనం ఓనర్స్ అయ్యాం... ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలి" అంటూ ఆమె కలలలో తేలిపోతుంది. మనోజ్ కూడా అదే ధోరణిలో "నా ఎదుగుదలని చూసి ఓర్వలేకపోతున్నారు... ఒకరోజు అందరినీ మించి నిలబడతాను" అంటూ అహంకారంగా మాట్లాడడం సన్నివేశానికి బలం ఇచ్చింది.

అయితే ఇదే సమయంలో కథలో అసలు ట్విస్ట్ ఎంట్రీ ఇచ్చింది. నిజమైన విల్లా యజమాని అక్కడికి రావడం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఆ విషయం తెలియని మనోజ్, ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు పిలిచి "సర్ప్రైజ్" అంటూ గొప్పగా మాట్లాడతాడు. కానీ వారిని చూసిన అసలు ఓనర్ మాత్రం షాక్‌కు గురై వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తాడు. ఇంకా అసలు విషయాన్ని అర్థం చేసుకోని మనోజ్, అతడిని సాధారణ పనివాడిలా చూసి "నేమ్ బోర్డ్ తీసుకురా" అంటూ ఆదేశాలు ఇవ్వడం సన్నివేశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. దీనికి ఆ వ్యక్తి కోపంతో "నేనెవరో తెలుసా?" అని ప్రశ్నించినా, మనోజ్ మాత్రం తన అహంకారంలోనే "నువ్వెవరైతే నాకేంటి" అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడతాడు.

ఇక్కడే మీనా అనుమానం కీలకంగా మారుతుంది. ఆ వ్యక్తి డ్రెస్సింగ్, ప్రవర్తన చూసి "ఇతడే అసలు ఓనర్ కావచ్చు" అని బాలకు చెబుతుంది. బాలు కూడా ఆమె మాటలను సీరియస్‌గా తీసుకుని "నువ్వు అనుకున్నది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు... చూద్దాం" అని స్పందిస్తాడు. విల్లా దగ్గరికి వచ్చిన అసలు యజమాని, మనోజ్ అహంకారపు మాటలకు ఆగ్రహంతో స్పందిస్తూ "ఈ ఇల్లు నాది... మీరు ఎవరి దగ్గర కొనుగోలు చేశారు?" అని ప్రశ్నించడంతో సన్నివేశం ఉత్కంఠభరితంగా మారింది. రోహిణి మాత్రం మొదట నమ్మకుండా "మేము మరో వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాం" అని చెప్పినా, ఓనర్ తన పేరుపై ఉన్న డాక్యుమెంట్స్‌ను చెక్ చేయమని చెప్పడంతో అనుమానాలు మరింత పెరిగాయి.

మనోజ్ వెంటనే ఆ మధ్యవర్తికి ఫోన్ చేయగా, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. అప్పుడే అసలు నిజం బయటపడింది-ఆ వ్యక్తి కేవలం ఈ ఇంట్లో అద్దెకు ఉంటూ, రెండు నెలలుగా రెంట్ కూడా చెల్లించని మోసగాడని ఓనర్ వెల్లడించాడు. ఈ విషయం విన్న వెంటనే అందరూ షాక్‌కు గురయ్యారు. అయినా ప్రభావతి "మేము 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం... ఈ ఇల్లు మాది" అంటూ అమాయకంగా మాట్లాడడం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. కానీ ఓనర్ మాత్రం గట్టిగా "మర్యాదగా ఖాళీ చేయండి... లేదంటే పోలీసులతో గెంటించాల్సి వస్తుంది" అంటూ హెచ్చరించాడు. ఈ పరిస్థితిలో మీనా, రవి ముందుకొచ్చి "మనం మనమే బయటికి వెళ్లిపోవడం మంచిది" అని చెప్పడంతో కుటుంబం లగేజీ సర్దుకుని బయటకు వస్తుంది.

ఇంతలో పోలీసులు వచ్చి విచారణ చేపడతారు. ఓనర్ జరిగిన మోసం వివరించగా, ఎస్ఐ మనోజ్‌ను తీవ్రంగా మందలిస్తూ "తక్కువ రేటుకు వస్తుందని చూసి విచారణ చేయకుండా నమ్మితే ఇలాగే మోసపోతారు" అంటూ గట్టి క్లాస్ ఇస్తాడు. ఈ మాటలు కుటుంబానికి పెద్ద షాక్‌గా మారాయి. ఇక సత్యం భావోద్వేగంతో "అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకున్నాం" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మనోజ్ కూడా తన తప్పు గ్రహించి మౌనంగా మారిపోతాడు. చివరికి 30 లక్షలు కోల్పోయిన ప్రభావతి కుటుంబం నిస్సహాయంగా తమ పాత ఇంటికి తిరిగి వెళ్లడం ఎపిసోడ్‌ను మరింత హృదయవిదారకంగా మారింది.

విల్లా మోసం బయటపడిన తర్వాత నిస్సహాయ స్థితిలో పాత ఇంటికి చేరుకున్న ప్రభావతి కుటుంబం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇంట్లోకి అడుగుపెట్టిన మనోజ్‌పై బాలు తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ సన్నివేశాన్ని మరింత కఠినంగా మార్చాడు. "ఐదుకు మూడు... ఐదుకు మూడు" అంటూ మనోజ్‌పై ఎగతాళి చేసిన బాలు, ప్రభావతిని ఉద్దేశించి "విల్లావతి... మా చిన్న ఇంట్లో నువ్వు ఉండగలవా?" అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. అంతేకాకుండా రోహిణిని కూడా టార్గెట్ చేస్తూ "మా ఇల్లు మీ కిచెన్ కంటే చిన్నది... ఇక్కడ మీరు ఎలా ఉంటారు?" అంటూ కఠిన వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి.

ఇలాంటి సమయంలో సత్యం వెంటనే జోక్యం చేసుకుని "ఇప్పుడు ఇవి మాట్లాడే సమయం కాదు... ముందు లోపలికి వెళ్లి కూర్చుందాం" అంటూ అందరినీ శాంతింపజేశాడు. కానీ ఇంట్లో వాతావరణం మాత్రం భారంగా మారింది. అందరూ మోసపోయిన బాధలో మౌనంగా ఉండగా, బాలు మాత్రం తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక "నేను ముందే చెప్పాను... వాళ్లు కేటుగాళ్లు అని. అప్పు చేసి 30 లక్షలు తీసుకెళ్లి వాళ్ల చేతుల్లో పెట్టావు కదా" అంటూ మనోజ్‌ను నిలదీశాడు. దీనికి మనోజ్ "ఇది నా సమస్య... మీకేం సంబంధం లేదు" అంటూ తిరగబడ్డాడు. అయితే రవి వెంటనే స్పందిస్తూ "నువ్వు మా మనిషివి కాదా? నువ్వు మా అన్నయ్య కదా... ఒకరికి జరిగిన నష్టం అందరికీ జరిగినట్టే" అంటూ కుటుంబ బంధాన్ని గుర్తు చేశాడు.

ఇక సత్యం మాత్రం తన జీవిత అనుభవంతో మనోజ్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. "ఏ పని చేసినా ముందు వెనుక ఆలోచించాలి... కానీ నువ్వు ఒక్క రోజు కూడా తెలివిగా ఆలోచించలేదు. 30 లక్షలు అంటే నా జీవితకాల సంపాదన. అప్పులు చేసి ఇలాంటి పనులు చేయొద్దని ముందే చెప్పాను" అంటూ గట్టిగా క్లాస్ పీకాడు. సత్యం మాటల్లో కనిపించిన బాధ, నిరాశ కుటుంబ పరిస్థితిని మరింత హృదయవిదారకంగా మార్చింది. ఇక రాబోయే ఎపిసోడ్లలో మనోజ్ ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతాడు? కుటుంబం మళ్లీ ఎలా నిలబడుతుంది? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X