Gundeninda Gudigantalu May 11th Episode: పుట్టింటికి రోహిణి, మనోజ్‌కు ప్రభావతి వార్నింగ్, నిప్పు రాజేసిన శోభన

photo courtesy jiohotstar

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, కుటుంబ ఘర్షణలు, షాకింగ్ ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంతకాలంగా ఇంట్లో అందరికీ అనుమానంగా ఉన్న 40 లక్షల వ్యవహారం చివరకు బయటపడటంతో కథ కీలక మలుపు తిరిగింది. బాలు నేరుగా మనోజ్‌ను ప్రశ్నించగా అతడు తడబడిపోయాడు. రోహిణి సాక్ష్యాలు అడగగా, బాలు "సాక్ష్యం చెప్పేవాళ్లు కూడా వస్తారు" అంటూ మనోజ్ మాజీ ప్రేయసి కల్పనను ఇంట్లోకి తీసుకురావడం ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది.కల్పన ఎంట్రీతో ఇంట్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆమె సత్యం, ప్రభావతిలకు క్షమాపణలు చెప్పినా.. అసలు షాక్ అప్పుడే మొదలైంది.

"నేను తీసుకెళ్లిన 40 లక్షలు ఎప్పుడో తిరిగి ఇచ్చేశాను.. అదికూడా 45 లక్షలు" అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ డబ్బులు మనోజ్, రోహిణికే ఇచ్చానని, వడ్డీ పేరుతో మరో 5 లక్షలు కూడా తీసుకున్నారని వెల్లడించింది. పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్‌కు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించడంతో మనోజ్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఇక రవి, శృతి, మీనా ఒక్కొక్కరు మనోజ్, రోహిణిలను నిలదీయడం ఎమోషనల్‌గా మారింది. సత్యం "నువ్వు నా కొడుకనే చెప్పుకోవడానికి అసహ్యం వేస్తోంది" అంటూ ఆవేదన వ్యక్తం చేయడం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. చివరకు మనోజ్ నిజం ఒప్పుకుంటూ "ఇదంతా రోహిణి ప్లాన్" అని చెప్పడంతో అందరి చూపులు రోహిణిపై పడ్డాయి. ప్రభావతి కూడా తీవ్ర ఆగ్రహంతో రోహిణిపై విరుచుకుపడింది. ఎపిసోడ్ చివర్లో మనోజ్, రోహిణిల మధ్య గొడవ మరింత పెరగడంతో కథ మరో ఆసక్తికర మలుపు తిరిగింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 680 May 11th 2026 here is full story

photo courtesy jiohotstar

సోమవారం ఎపిసోడ్ భావోద్వేగాలతో నిండిపోయింది. గత కొన్ని రోజులుగా సాగుతున్న 40 లక్షల రూపాయల మోసం వ్యవహారం ఈరోజు ఇంట్లో పెద్ద తుఫాన్‌లా మారింది. ఆ డబ్బుల విషయం కుటుంబ సభ్యులందరికీ తెలిసిపోవడంతో ఒక్కసారిగా ఇంటి వాతావరణం మారిపోయింది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు రోహిణినే నిందించడం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యుల మాటలు, అనుమానాలు, విమర్శలతో రోహిణి పూర్తిగా మానసికంగా కుంగిపోతుంది.

అయితే ఈ సమయంలో తనకు అండగా నిలుస్తాడని భావించిన మనోజ్ కూడా ఆమెను తప్పుపట్టడం రోహిణిని మరింతగా బాధిస్తుంది. "అంతా నీ వల్లే జరిగింది" అంటూ మనోజ్ మాట్లాడటం ఆమెకు షాక్ ఇస్తుంది. తనను అర్థం చేసుకునే వ్యక్తి కూడా ఇలా మాట్లాడటంతో రోహిణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే మనోజ్ కూడా తన కోణంలో చాలా కాలంగా మనసులో దాచుకున్న బాధను బయటపెడతాడు. "నువ్వు ఎప్పుడూ నన్ను తక్కువ చేసి మాట్లాడావు. నేను ఎంతో కష్టపడి చదివాను. కానీ అందరి ముందు నన్ను అసమర్థుడిలా చూపించడం నాకు నచ్చలేదు" అంటూ కోపంగా స్పందిస్తాడు.

Also Read
ఆ 6 నెలలు నరకం చూశా.. రామ్ చరణ్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్
ఆ 6 నెలలు నరకం చూశా.. రామ్ చరణ్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్

మనోజ్ మాటలకు రోహిణి కూడా కౌంటర్ ఇస్తుంది. "నీ డిగ్రీలు ఏం పనికొచ్చాయి? ఇంటి ముందు దిష్టిబొమ్మలా పెట్టుకోవడానికే తప్ప వాటితో ఏమైనా సాధించావా? జాబ్ చేస్తున్నానని అందరినీ మోసం చేశావు కదా" అంటూ తీవ్రంగా విమర్శిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతుంది. "నీవల్ల ఏదీ కాదు... చేతగాడివి" అంటూ రోహిణి మాట్లాడటం మనోజ్‌ను తీవ్రంగా కలిచివేస్తుంది. దీనికి మనోజ్ కూడా తగ్గకుండా స్పందిస్తాడు. "ఆ షోరూమ్ ఐడియా నాది... నేను కష్టపడ్డానుకాబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం" అంటూ తన కృషిని గుర్తు చేస్తాడు. కానీ రోహిణి మాత్రం అక్కడ కూడా వెనక్కి తగ్గదు. "ఆలోచనలు అందరికీ ఉంటాయి... కానీ వాటిని అమలు చేసే సత్తా కూడా ఉండాలి" అంటూ మనోజ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తుంది.

ఇక ఈ గొడవలో అసలు భావోద్వేగ ఘట్టం తర్వాతే కనిపిస్తుంది. "మీ అమ్మ నన్ను కొట్టినప్పుడు కూడా నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం నాకు సపోర్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు అర్థమవుతోంది... నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో" అంటూ రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. "నిన్ను నమ్మి ఎన్నో చేశాను. కానీ చివరికి తప్పు మొత్తం నా మీదే వేస్తున్నావు. నన్ను అర్థం చేసుకోలేని వ్యక్తుల మధ్య నేను ఉండలేను" అంటూ తీవ్ర భావోద్వేగంతో మాట్లాడుతుంది. ఆ తర్వాత రోహిణి వెంటనే తన బ్యాగ్స్ సర్దుకుని ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమెను ఆపడానికి మనోజ్ ప్రయత్నించినా రోహిణి మాత్రం వినిపించుకోదు. మనోజ్ ఎంత అడ్డుకున్నా ఆమె వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది.

Recommended For You
14 నెలలు నరకం చూశా.. ఆ నిర్మాత వల్ల జీవితం నాశనం..
14 నెలలు నరకం చూశా.. ఆ నిర్మాత వల్ల జీవితం నాశనం..

మరోవైపు సత్యం-ప్రభావతి మధ్య జరిగిన ఘర్షణ కుటుంబంలో మరింత ఉద్రిక్తతను పెంచింది. రోహిణి చేసిన 40 లక్షల మోసం వ్యవహారం బయటపడిన తర్వాత ఇంట్లో అందరూ ఆమెనే తప్పుబడుతుండగా, ఈ విషయంలో ప్రభావతి ప్రవర్తనపై సత్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రోహిణిని అందరి ముందు కొట్టడం సరైంది కాదంటూ సత్యం నేరుగా ప్రభావతిని ప్రశ్నించాడు. "నువ్వు చేసింది కరెక్ట్ కాదు" అంటూ సత్యం గట్టిగా మాట్లాడగా.. ప్రభావతి మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. "అది అబద్ధం చెప్పింది. నేను దాన్ని ఎంతగానో నమ్మాను. ఇంట్లో అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. కానీ చివరికి నన్నే మోసం చేసింది. అందుకే కోపంలో కొట్టాను" అంటూ ప్రభావతి తన బాధను బయటపెట్టింది.

అంతేకాదు, "కేవలం కొడుకులను మందలించడమే కాదు.. కోడళ్లు తప్పు చేస్తే వారిని కూడా దండించే హక్కు నాకు ఉంది" అంటూ ఘాటుగా స్పందించింది. అయితే ప్రభావతి మాటలకు సత్యం వెంటనే కౌంటర్ ఇచ్చాడు. "ఈ తప్పులో మనోజ్ పాత్ర కూడా ఉంది కదా.. మరి వాడిని ఎందుకు శిక్షించలేదు? ఎందుకు ఒక్క మాట కూడా అనలేదు?" అంటూ ప్రశ్నించాడు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఇంకో న్యాయం చేయడం కరెక్ట్ కాదని సత్యం స్పష్టం చేశాడు. కానీ ప్రభావతి మాత్రం తన కొడుకు మనోజ్‌ను వెనుకేసుకుని వచ్చింది. "వాడు ఒట్టి అమాయకుడు. వాడి జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ వాడిని మోసం చేస్తూనే ఉన్నారు. ఆరోజు కల్పన.. ఈరోజు రోహిణి.. ఇలా ప్రతిసారీ ఎవరో ఒకరు వాడిని మోసం చేస్తున్నారు" అంటూ భావోద్వేగంగా మాట్లాడింది.

You May Also Like
'ఆ క్షణమే చనిపోవాలనిపించింది'.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్
'ఆ క్షణమే చనిపోవాలనిపించింది'.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్

దీనికి సత్యం మరింత ఘాటుగా స్పందించాడు. "వాడు అసమర్థుడిగా తయారవ్వడానికి అసలు కారణం నువ్వే. నువ్వు ఎప్పుడూ 'నువ్వు గొప్పవాడివి' అంటూ వాడిని నిజజీవితాన్ని ఎదుర్కొనేలా పెంచలేదు. అందుకే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది" అంటూ ప్రభావతి పెంపకంపైనే నేరుగా విమర్శలు చేశాడు. సత్యం మాటలకు ప్రభావతి కూడా తగ్గలేదు. "నేను నా కొడుకును బాగానే పెంచాను. వాడు గొప్పవాడే అవుతాడు. కానీ రోహిణి జీవితంలోకి వచ్చిన తర్వాతే వాడు ఇలా మారిపోయాడు" అంటూ మొత్తం తప్పును రోహిణిపైనే మోపింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమవుతున్న సమయంలో మనోజ్ అక్కడికి వచ్చి షాకింగ్ విషయం చెబుతాడు. "రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది" అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్‌కు గురవుతుంది. కానీ ఆందోళన చూపాల్సిన చోట కూడా ప్రభావతి తన ఈగోను వదలదు. "ఇంత పెద్ద తప్పు చేసి కూడా తన తప్పు ఒప్పుకోకుండా వెళ్లిపోతుందా? కనీసం నాకు ఒక మాటైనా చెప్పలేదా?" అంటూ కోపంగా మాట్లాడుతుంది.

ఇక ఈ మాటలు విన్న సత్యం మరింత ఆగ్రహానికి గురవుతాడు. "నువ్వెందుకు ఆపలేదురా?" అంటూ మనోజ్‌ను నిలదీస్తాడు. అయితే మనోజ్ కూడా తన మనసులోని బాధను బయటపెడతాడు. "రోహిణి అన్న మాటలు నాకు చాలా నచ్చలేదు. అందుకే నేను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు" అంటాడు. దీంతో సత్యం పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో గుర్తుచేస్తూ, "ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలియదు. వెంటనే వెళ్లి వెతికి ఇంటికి తీసుకురా" అని మనోజ్‌కు చెబుతాడు. కానీ ఇక్కడ కూడా ప్రభావతి అడ్డుగా నిలుస్తుంది. "అది ఏమైనా చెప్పి వెళ్లిందా? అదే తిరిగి వస్తుంది. నా మాట కాదని వెళ్లిపోయింది కాబట్టి కొంచెం తెలిసొస్తుంది" అంటూ మనోజ్‌ను వెళ్లనివ్వదు. తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న ఈ వాదనలు, రోహిణిపై వస్తున్న ఆరోపణలు, తన అసమర్థతపై వినిపిస్తున్న మాటలతో మనోజ్ పూర్తిగా విసిగిపోతాడు. చివరకు "మీ చావు మీరు చావండి... మీకు నచ్చినట్లు చేసుకోండి" అంటూ తీవ్ర అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త .. 'కల్కి 2' విడుదల అప్పుడేనా?
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త .. 'కల్కి 2' విడుదల అప్పుడేనా?

ఇక ఇంట్లో జరిగిన ఘర్షణ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన రోహిణి నేరుగా తన తల్లి సుమతి దగ్గరకు చేరుకుంటుంది. ఇంట్లో తనపై జరిగిన అవమానాలు, ప్రభావతి ప్రవర్తన, మనోజ్ తనకు సపోర్ట్ చేయకపోవడం వంటి విషయాలన్నింటినీ కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లికి చెప్పుకుంటుంది. చివరికి చిన్నపిల్లలా తన తల్లి ఒడిలో పడుకుని బాగా ఏడుస్తుంది. ఈ సీన్ ప్రేక్షకులను కూడా ఎమోషనల్‌కు గురిచేసింది. అయితే రోహిణి ఊహించినట్లుగా సుమతి ఆమెను ఓదార్చలేదు. కూతురు చేసిన తప్పును సమర్థించకుండా, ఆమెను కఠినంగా మందలించింది. "నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పే" అంటూ మొదలుపెట్టిన సుమతి, "ఏ భార్య అయినా తన భర్తను అందరి ముందు అసమర్థుడు అని అవమానించడం సరైంది కాదు. భర్త తప్పు చేసినా, అప్పులు చేసినా.. ఆ సమయంలో అతనికి అండగా నిలబడాల్సిన బాధ్యత భార్యదే" అంటూ స్పష్టంగా చెప్పింది.

తల్లి మాటలు విన్న రోహిణి మరింత బాధపడుతుంది. "నేను నీ దగ్గరకు ఓదార్పు కోసం వచ్చాను.. కానీ నువ్వు కూడా నన్నే తప్పుపడుతున్నావు" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. కానీ సుమతి మాత్రం తన మాటల్లో ఏమాత్రం తగ్గదు. "నా దగ్గర సానుభూతి లేదు. నీ తప్పులను సమర్థిస్తూ నిన్ను ఓదార్చేవాళ్లు కావాలంటే విద్య దగ్గరకు వెళ్లు" అంటూ సూటిగా చెబుతుంది. దీంతో రోహిణి ఆశ్చర్యపోతూ, "నా తల్లిగా నువ్వు నన్ను ఓదార్చలేవా?" అని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నకు సుమతి ఇచ్చిన సమాధానం మాత్రం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. "ఈ లోకంలో కూతురు తప్పు చేస్తే సమర్థించే తల్లులు ఉండొచ్చు. కానీ కోడలు తప్పు చేస్తే సమర్థించే అత్తలు ఉండరు. నువ్వు చేసినవి ఒక్కటి కాదు.. వంద తప్పులు చేశావు" అంటూ ఘాటుగా స్పందించింది.

Peddi: ఓవర్సీస్‌ లో రామ్ చరణ్ సంచలనం. 'పెద్ది' టికెట్ ధర 40 డాలర్లా?
Peddi: ఓవర్సీస్‌ లో రామ్ చరణ్ సంచలనం. 'పెద్ది' టికెట్ ధర 40 డాలర్లా?

తల్లి మాటలు విన్న రోహిణి కోపంతో ఊగిపోతుంది. "అంతా నీవల్లే జరిగింది. నువ్వు చేసిన ఒక తప్పు వల్లే నా జీవితం ఇలా అయిపోయింది" అంటూ భావోద్వేగానికి లోనవుతుంది. దీనికి సుమతి కూడా తన గతాన్ని గుర్తుచేసుకుంటూ స్పందిస్తుంది. "నేను ఒక తప్పు మాత్రమే చేశాను. కానీ నువ్వు మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూ ఇతరులను మోసం చేస్తూనే ఉన్నావు. అలాంటివి ఎప్పటికైనా బయటపడతాయి" అంటూ హెచ్చరిస్తుంది. ఇక్కడితో ఆగకుండా సుమతి మరో షాకింగ్ వ్యాఖ్య చేస్తుంది. "ఇప్పుడు విషయం కేవలం డబ్బుల గురించే కాబట్టి.. నీ అత్తమామలు నిన్ను క్షమించే అవకాశం ఉంది. కానీ నువ్వు చేసిన మిగతా తప్పులు బయటపడితే.. ఆ దేవుడే నిన్ను క్షమించడు" అంటూ గట్టిగా చెబుతుంది. ఈ మాటలు విన్న రోహిణి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది.

అయినా రోహిణి తన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. "నేనేమైనా నా కోసం చేశానా? మనోజ్ బావ కోసమే చేశాను కదా" అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుంది. కానీ సుమతి మాత్రం ఆమె వాదనను పూర్తిగా తిప్పికొడుతుంది. "ఇంట్లో వాళ్లందరి డబ్బులు కాజేసి.. ఇప్పుడు కూడా నిన్ను నువ్వే సమర్థించుకుంటున్నావా?" అంటూ నిలదీస్తుంది. ఆ తర్వాత కూతురికి ఓపిక, ఆలోచన అవసరమని సలహా ఇస్తుంది. "ఇది నీకు అగ్ని పరీక్ష లాంటిది. ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకు. చాలా ఓర్పుతో ఆలోచించు. వెంటనే ఇంటికి వెళ్లి నీ అత్తమామల్ని క్షమించమని అడుగు. వాళ్లు నిన్ను క్షమించే అవకాశం ఉంది" అంటూ తల్లిగా చివరికి మంచి మాటలు చెబుతుంది. తల్లి మాటల్లోని నిజాన్ని అర్థం చేసుకున్న రోహిణి కూడా కాస్త శాంతిస్తుంది. ఇక ఎలాంటి గొడవలు వద్దనుకుని తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. "సరే" అంటూ కన్నీళ్లతోనే అక్కడి నుంచి బయలుదేరుతుంది.

విజయ్ పార్టీలోకి ఆర్కే రోజా? క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి
విజయ్ పార్టీలోకి ఆర్కే రోజా? క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి

మరోవైపు కొంత కామెడీ, మరోవైపు భారీ ఎమోషనల్ డ్రామా.. రోహిణి ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో అందరి మూడ్ పూర్తిగా సీరియస్‌గా మారిపోయింది. ముఖ్యంగా మనోజ్ మాత్రం తీవ్ర ఆందోళనలో కనిపించాడు. రోహిణి ఎక్కడికి వెళ్లింది? తిరిగి వస్తుందా? రాదా? అనే ఆలోచనలతో హాల్లో ఒంటరిగా కూర్చొని ఆమె కోసం ఎదురుచూస్తూ కనిపించాడు. ఇక ఇదే సమయంలో ఇంట్లో మరోవైపు తోడికోడళ్లు మీనా, శృతి మాత్రం మొబైల్‌లో కామెడీ వీడియోలు చూస్తూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఒకవైపు పెద్ద సమస్య నడుస్తుండగా వీళ్లిద్దరి నిర్లక్ష్య వైఖరి తర్వాత పెద్ద వివాదానికి దారితీసింది. ఇంతలో ప్రభావతి హాల్లోకి వచ్చి మనోజ్‌ను గమనిస్తుంది. "ఏంటి ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావ్?" అంటూ ప్రశ్నించగా.. "రోహిణి కోసం వెయిట్ చేస్తున్నా" అని మనోజ్ బాధగా సమాధానం ఇస్తాడు. అయితే ప్రభావతి మాత్రం తన కోపాన్ని ఏమాత్రం తగ్గించుకోదు. "అది ఏమైనా చెప్పి వెళ్లిందా? నిజంగా భయం, గౌరవం ఉంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్లేది కాదు. దానంతట అదే వెళ్లిపోయింది కాబట్టి తిరిగి అదే వస్తుంది. అనవసరంగా దాని గురించి ఆలోచించకు" అంటూ కఠినంగా మాట్లాడుతుంది.

ఇక తల్లి-కొడుకుల మధ్య ఇంత సీరియస్ చర్చ జరుగుతుండగా.. పక్కనే మీనా, శృతి మాత్రం వీడియోలు చూస్తూ పెద్దగా నవ్వుకుంటూ ఉండటం ప్రభావతికి మరింత కోపం తెప్పిస్తుంది. వెంటనే వారి దగ్గరకు వెళ్లి, "ఇంట్లో ఇంత పెద్ద సమస్య నడుస్తుంటే మీకు నవ్వులా? మీకు అసలు బాధ అనిపించడం లేదా?" అంటూ కోడళ్లపై ఫైర్ అవుతుంది. దీంతో శృతి కూడా తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తుంది. "తప్పు చేసింది రోహిణి.. కొట్టింది మీరు.. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగే విషయాల్లో మేమెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి" అంటూ స్ట్రాంగ్ పంచ్ వేస్తుంది. శృతి మాటలు విన్న ప్రభావతి మరింత ఆగ్రహానికి గురవుతుంది. "అది నాకు ఏమైనా చెప్పి వెళ్లిందా? తిరిగి వస్తే మాత్రం దాన్ని బాగా నిలదీస్తా" అంటూ ఘాటుగా మాట్లాడుతుండగానే.. రోహిణి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఆమెను చూసి ఇంట్లో ఒక్కసారిగా సైలెన్స్ నెలకొంటుంది. రోహిణి కూడా తలదించుకుని నేరుగా ప్రభావతి దగ్గరకు వెళ్లి, "నన్ను క్షమించండి" అంటూ వేడుకుంటుంది.

TVK Vijay: దళపతి విజయ్ కార్లన్నింటికీ 0277 నంబరే.. దాని వెనుక గుండెల్ని పిండేసే కథ
TVK Vijay: దళపతి విజయ్ కార్లన్నింటికీ 0277 నంబరే.. దాని వెనుక గుండెల్ని పిండేసే కథ

కానీ ప్రభావతి మాత్రం తన నిర్ణయంలో ఏమాత్రం మార్పు చూపించదు. "నేను నిన్ను అస్సలు క్షమించను. నువ్వు నాకు కోడలు కాదు.. నేను నీకు అత్తను కాదు. నా పర్మిషన్ లేకుండా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయావు?" అంటూ తీవ్రంగా మందలిస్తుంది. ఈ మాటలు విన్న రోహిణి మరింత బాధతో కళ్లలో నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోతుంది. ఇక రోహిణి పరిస్థితి చూసి మనోజ్ మనసు కరిగిపోతుంది. ఆమెను ఓదార్చాలని గదివైపు వెళ్లబోతాడు. కానీ అక్కడ కూడా ప్రభావతి అడ్డుగా నిలుస్తుంది. "నా పర్మిషన్ లేకుండా నువ్వు రోహిణిని కలిస్తే బాగోదు. ఈ ఇంట్లో నా మాటే శాసనం. నేను చెప్పింది వినకపోతే ఈ ఇంట్లో నుంచి నిన్ను కూడా వెళ్లగొడతా" అంటూ మనోజ్‌కు సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ప్రభావతి మాటలు విన్న మనోజ్ పూర్తిగా షాక్‌కు గురవుతాడు. మరోవైపు ఈ సన్నివేశం అంతా చూసిన శృతి, మీనా కూడా ఒకరినొకరు చూసుకుంటూ షాకవుతారు. "మనమూ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే మన కాపురాలను కూడా ఇలా కూల్చేస్తుంది" అంటూ భయపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

మరోవైపు.. ఇంట్లో అందరూ దూరంగా చూస్తున్న పరిస్థితుల్లో రోహిణి ధైర్యం చేసి ప్రభావతి దగ్గరకు వెళ్లి క్షమించమని వేడుకుంటుంది. "అత్తయ్య.. నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ ప్రభావతి మాత్రం తన కోపాన్ని తగ్గించుకోదు. "తప్పు చేస్తున్నప్పుడు నీకు తెలియలేదా? నన్నే మోసం చేస్తావా? ఇంట్లో అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమించాను. అలాంటి నన్ను మోసం చేయడానికి నీకు ఎలా మనసొచ్చింది?" అంటూ సూటిగా నిలదీస్తుంది. దీంతో రోహిణి కూడా తన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. "మొదటి నుంచే నిజం చెప్పాలని అనుకున్నాను. కానీ ఇంట్లో గొడవలు జరుగుతాయేమో అని భయపడ్డాను. అయినా నేను చేసింది మీ కొడుకు భవిష్యత్తు కోసమే కదా. ఈరోజు ఆయన ఫర్నిచర్ షాప్ పెట్టి సంపాదిస్తున్నాడంటే దానికి కారణం నేనే" అంటూ మాట్లాడుతుంది.

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ చీటింగ్ ... కోట్ల రూపాయాలు మోసపోయా!
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ చీటింగ్ ... కోట్ల రూపాయాలు మోసపోయా!

రోహిణి మాటలు విన్న ప్రభావతి కోపంతో ఊగిపోతుంది. "అంటే నా కొడుకును అసమర్థుడిలా చూపిస్తున్నావా? మా ఇంటి డబ్బులు తీసుకుని.. నీ నాన్న డబ్బులు ఇచ్చాడని అబద్ధం చెప్పడం తప్పు కాదా?" అంటూ ఘాటుగా ప్రశ్నిస్తుంది. దీంతో రోహిణి మళ్లీ "నిజం చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. మేమేం తప్పు చేయలేదు" అంటూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రభావతి మాత్రం ఒక్క మాట కూడా వినడానికి సిద్ధంగా ఉండదు. "నా కొడుకును తక్కువ చేసి మాట్లాడడమే కాదు.. నన్ను కూడా మోసం చేశావు. ఇంకో క్షణం ఇక్కడ ఉంటే నీ పీక పిసికి చంపేస్తా. వెళ్ళిపో.. నిన్ను జీవితంలో ఎప్పటికీ క్షమించను" అంటూ తీవ్ర ఆగ్రహంతో హెచ్చరిస్తుంది. ఈ మాటలు విన్న రోహిణి షాక్‌కు గురై ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా తన గదిలోకి వెళ్లిపోతుంది.

ఇక ఇక్కడితో డ్రామా ఆగలేదు. అదే సమయంలో శృతి తల్లి శోభ రోహిణికి ఫోన్ చేస్తుంది. ఇంట్లో జరిగిన గొడవల గురించి ఆరా తీస్తూ.. "ఏంటమ్మా రోహిణి.. మీ అత్తయ్యతో గొడవ జరిగిందట కదా? నువ్వు ఏదో ప్లాన్ చేసి డబ్బులు తీసుకున్నావట.. అందుకే కొట్టిందట కదా?" అంటూ మాటల్లో మాటగా మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో రోహిణి ఒక్కసారిగా కోపంతో స్పందిస్తుంది. "మీకు ఈ విషయం ఎలా తెలుసు?" అని ప్రశ్నించగా.. "ఎలా తెలిసినా తెలిసింది కదా.. నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు" అంటూ శోభ మాట్లాడుతుంది. దీంతో రోహిణి మరింత అసహనానికి గురై.. "మా ఇంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు. ఏమైనా ఉంటే మీ కూతురు శృతితో మాట్లాడుకోండి. నాకు అనవసరంగా ఫోన్ చేయకండి" అంటూ ఫోన్ కట్ చేస్తుంది.

నా జీవితంతో ఆడుకున్నారు.. స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్..
నా జీవితంతో ఆడుకున్నారు.. స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్..

అయితే మరుక్షణమే రోహిణికి తన తల్లి సుమతి నుంచి ఫోన్ వస్తుంది. కానీ కోపంతో ఉన్న రోహిణి ఈసారి తల్లిపైనే విరుచుకుపడుతుంది. "అవును.. నేను మోసం చేశాను. మా అత్తయ్యను మోసం చేశాను. అయితే మీకేంటి?" అంటూ ఫైర్ అవుతుంది. కూతురు మాటలు విన్న సుమతి ఆశ్చర్యపోతూ.. "ఏమైంది నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు?" అని ప్రశ్నిస్తుంది. దీంతో రోహిణి అసలు విషయం చెబుతుంది. "శృతి వాళ్ల అమ్మ ఫోన్ చేసి గొడవ గురించి అడిగి విసిగించింది. అందుకే కోపంలో అలా మాట్లాడా" అంటుంది. అప్పుడు సుమతి కాస్త శాంతింపజేస్తూ, "జాగ్రత్తగా ఉండు. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది?" అని అడుగుతుంది. "ఇక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మా అత్త క్షమించేలా లేదు" అంటూ రోహిణి బాధపడుతుంది.

దీనిపై సుమతి మరోసారి మంచి సలహా ఇస్తుంది. "అనవసరంగా కంగారు పడకు. కాస్త తగ్గి ఉండు. ముందుగా నీ మామయ్యతో మాట్లాడి చూడు.. ఆయన నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. సంసారం అంటే పెంకు మీద నడిచినట్టే.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు" అంటూ కూతురికి ధైర్యం చెబుతుంది. కానీ రోహిణి మాత్రం "సర్లే" అంటూ నిర్లక్ష్యంగా ఫోన్ పెట్టేస్తుంది. ఇక మరోవైపు ప్రభావతి హాల్లోకి వచ్చి "రోహిణి.. రోహిణి" అంటూ గట్టిగా పిలుస్తుంది. ఆమె పిలుపు విని మీనా అక్కడికి వచ్చి "ఏంటి అత్తయ్య పిలిచారు?" అని అడుగుతుంది. కానీ ప్రభావతి కోపంగా, "నీ పేరు ఏమైనా రోహిణినా? నువ్వెందుకు వచ్చావు?" అంటూ మీనాపై విరుచుకుపడుతుంది. దీంతో మీనా భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

విజయ్ దళపతిపై వేణుస్వామి జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..
విజయ్ దళపతిపై వేణుస్వామి జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..

ఇంతలో మనోజ్ అక్కడికి వస్తాడు. "ఏడిరా నీ పెళ్లాం?" అని ప్రభావతి అడగగా.. "రూమ్‌లో ఉంది అమ్మ" అని మనోజ్ సమాధానం ఇస్తాడు. కానీ ప్రభావతి ఇంకా అనుమానంగా, "ఉందా లేదా? కరెక్ట్‌గా చెప్పు" అంటూ కోపంగా మాట్లాడుతుంది. "ఉంది అమ్మ" అని మనోజ్ చెప్పగానే.. "అయితే పిలువు" అంటూ ఆర్డర్ వేస్తుంది. ప్రభావతి ప్రవర్తన చూస్తుంటే.. రోహిణికి సంబంధించిన మరో పెద్ద నిజం బయటపడబోతుందేమో అన్న అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఆమె కోపం, ఆందోళన చూస్తుంటే రానున్న ఎపిసోడ్‌లో మరిన్ని భారీ ట్విస్టులు ఉండబోతున్నాయన్న ఆసక్తి పెరిగిపోయింది. ఇక రోహిణి దాచిన అసలు నిజం ఏమిటి? ప్రభావతి మరోసారి ఏ షాకింగ్ విషయం తెలుసుకోబోతోంది? అన్న ఉత్కంఠతో ప్రేక్షకులు తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X