Gundeninda Gudigantalu May 12th Episode: రోహిణికి ప్రభావతి వార్నింగ్, శృతి-రోహిణిల క్లాష్, బాలు,మీనాలకు అవమానం
photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్ పూర్తిగా భావోద్వేగాలతో నిండిపోయింది. 40 లక్షల రూపాయల మోసం విషయం బయటపడటంతో ఇంట్లో భారీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులంతా రోహిణినే తప్పుబడుతుండగా, తనకు అండగా ఉంటాడని భావించిన మనోజ్ కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం రోహిణిని తీవ్రంగా కలిచివేసింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం హద్దులు దాటింది. మనోజ్ అసమర్థుడు అంటూ రోహిణి అవమానించగా, తన కష్టంతోనే షోరూమ్ స్థాయికి వచ్చామని మనోజ్ చెప్పాడు. అయితే "మీ అమ్మ నన్ను కొట్టినా నువ్వు సపోర్ట్ చేయలేదు" అంటూ రోహిణి కన్నీళ్లు పెట్టుకోవడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. చివరకు ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడం కుటుంబాన్ని మరింత షాక్‌కు గురిచేసింది.
ఇక సత్యం-ప్రభావతి మధ్య కూడా ఘర్షణ తీవ్రంగా మారింది. రోహిణిని అందరి ముందు కొట్టడం తప్పు అని సత్యం ప్రశ్నించగా, ప్రభావతి మాత్రం తన కోడలు మోసం చేసిందని సమర్థించుకుంది. మనోజ్‌ను ఎందుకు మందలించలేదని సత్యం అడగడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇదే సమయంలో రోహిణి తన తల్లి సుమతి దగ్గరకు వెళ్లి బాధ చెప్పుకుంది. కానీ సుమతి కూడా కూతురినే తప్పుపడుతూ, "భర్తను అందరి ముందు అవమానించడం భార్య తప్పు" అంటూ గట్టిగా మందలించింది. చివరకు తల్లి మాటల్లో నిజం గ్రహించిన రోహిణి తిరిగి ఇంటికి వచ్చి ప్రభావతిని క్షమించమని వేడుకుంది. అయినా ప్రభావతి ఆమెను క్షమించకుండా తీవ్రంగా హెచ్చరించింది. చివర్లో ప్రభావతి ప్రవర్తన చూస్తుంటే, రోహిణి దాచిన మరో పెద్ద నిజం త్వరలో బయటపడబోతుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది.

photo courtesy jiohotstar
మంగళవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రభావతి హాల్లోకి వచ్చి గట్టిగా "రోహిణి.. రోహిణి" అంటూ పిలవడం ఇంట్లో మరో కొత్త తుఫాన్‌కు నాంది పలికింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మనోజ్ "ఏంటమ్మా?" అని అడగగా.. "నీ పెళ్లాం ఇంట్లో ఉందా లేదా?" అంటూ ప్రభావతి ప్రశ్నించింది. దీనికి మనోజ్ కాస్త తడబడుతూ "గదిలో ఉన్నట్లుంది" అని చెప్పడంతో ప్రభావతి మరింత కోపంతో "అట్లు దోశలు కాదు.. ఉందా లేదా కరెక్ట్‌గా చెప్పు" అంటూ ఫైర్ అయింది. వెంటనే మనోజ్ "రూమ్‌లోనే ఉందమ్మా" అని సమాధానం చెప్పాడు. అయితే అక్కడితో ఆగని ప్రభావతి.. "నీ పెళ్లాన్ని పిలువు" అంటూ ఆదేశించింది. మనోజ్ మెల్లగా "రోహిణి" అని పిలవడంతో.. "ఏంట్రా అలా పేరు పెట్టినట్టు పిలుస్తున్నావ్.. గట్టిగా పిలువు" అంటూ తానే గట్టిగా రోహిణిని పిలిచింది. దీంతో కంగారుపడుతూ రూమ్ నుంచి బయటకు వచ్చిన రోహిణి "ఏంటి అత్తయ్య.. పిలిచారా?" అని అడిగింది.
కానీ ప్రభావతి మాత్రం అసలు విషయానికి రాకుండా, "చిన్నపిల్లలా నటించకు.. ఎవరితో పడితే వాళ్లతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్టేనా?" అంటూ ఘాటుగా మాట్లాడింది. దీంతో రోహిణి కూడా అయోమయంలో పడిపోయి "మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు" అని చెప్పింది. అప్పుడు ప్రభావతి అసలు విషయాన్ని బయటపెట్టింది. "శృతి వాళ్ల అమ్మతో చిన్నా పెద్దా తేడా లేకుండా ఎందుకు అలా మాట్లాడావు?" అంటూ నిలదీసింది. దీంతో రోహిణి కూడా తన వాదన వినిపించింది. "ఆమె మా ఇంటి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంది. అందుకే మా ఇంటి విషయాలు మేమే చూసుకుంటామని చెప్పాను. ఆమె రాష్‌గా మాట్లాడటంతో నేనూ అలా మాట్లాడాల్సి వచ్చింది" అంటూ సమాధానం ఇచ్చింది.
అయితే ప్రభావతి మాత్రం ఆమెను సమర్థించలేదు. "ఆమె పరాయి కాదు.. మన ఇంటి మనిషే. తప్పు చేశావు కాబట్టే అందరూ అంటున్నారు. మరోసారి పెద్దలతో అమర్యాదగా మాట్లాడితే మాత్రం ఊరుకోను" అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ సన్నివేశాలన్నీ పక్కనే నిలబడి మీనా గమనించడం ఆసక్తికరంగా మారింది. ఆమె విన్నావా మొత్తం విషయం అని ప్రభావతి అడగగా.. "విన్నాను అత్తయ్య" అని మీనా సమాధానం చెప్పింది. వెంటనే ప్రభావతి "వెళ్లి వేడి నీళ్లు పెట్టి తీసుకురా" అంటూ ఆర్డర్ వేయడం ద్వారా ఇంట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చూపించింది.
ఇప్పటికే ఇంట్లో జరిగిన 40 లక్షల వ్యవహారంతో మానసికంగా ఒత్తిడిలో ఉన్న రోహిణి.. ఈసారి శృతి తన గురించి బయట చెప్పిందనే అనుమానంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. గదిలో ఒంటరిగా కూర్చుని "కావాలనే శృతి నా గురించి వాళ్లింట్లో చెప్పింది.. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి" అంటూ కోపంతో ఊగిపోయింది. ఇదే సమయంలో మరోవైపు మీనా, శృతి సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన రోహిణి ఒక్కసారిగా శృతిపై ఫైర్ అవుతుంది. "నువ్వు చేసింది అస్సలు బాగోలేదు. మన ఇంటి విషయాలను మీ ఇంట్లో వాళ్లకు ఎందుకు చెప్పాలి?" అంటూ నిలదీసింది. అయితే శృతి కూడా ఏమాత్రం తగ్గకుండా సూటిగా సమాధానం ఇచ్చింది. "నేనేం అబద్ధాలు చెప్పలేదు. ఇంట్లో జరిగిన విషయమే చెప్పాను. నీ పర్సనల్ విషయాలను బయట పెట్టలేదు. నువ్వు అబద్ధం చెప్పి ఫ్రాడ్ చేయకపోతే నీ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చేదే కాదు" అంటూ ఘాటుగా స్పందించింది.
శృతి మాటలకు రోహిణి మరింత రెచ్చిపోతూ.. "ఇది నా పర్సనల్ విషయం. నా విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదు" అంటూ హెచ్చరించింది. అప్పుడు మధ్యలోకి వచ్చిన మీనా.. రోహిణికి ఊహించని కౌంటర్ ఇచ్చింది. "నీకు ఇప్పుడు పర్సనల్ అనే విషయం గుర్తొచ్చిందా? ఆ రోజు నా తమ్ముడు విషయం ప్రతి వాళ్లమ్మ దగ్గర చెప్పినప్పుడు నీకు ఇదంతా అర్థం కాలేదా? ఇప్పుడు నీకు ఆ బాధ ఏంటో తెలిసొస్తుందా?" అంటూ నిలదీసింది. అంతేకాదు, "శృతి ఏమైనా నీ బెడ్‌రూమ్ విషయాలు చెప్పిందా? ఇంట్లో జరిగిన విషయాలే చెప్పింది కదా" అంటూ రోహిణిని గట్టిగా ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మాటలకు రోహిణి షాక్‌కు గురై తీవ్ర కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత గదిలోకి వెళ్లిన రోహిణి.. "నా టైం బాగోలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ నన్నే అంటున్నారు. కానీ నేనేంటో తర్వాత చూపిస్తా" అంటూ కోపంతో రగిలిపోతుంది. ఇదే సమయంలో టైం చూసిన ఆమె.. "మనోజ్ ఇంకా ఇంటికి రాలేదేంటి?" అంటూ వెంటనే అతనికి ఫోన్ చేస్తుంది. అయితే ప్రభావతి చెప్పిన మాటలు గుర్తు పెట్టుకున్న మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా మౌనంగా ఉంటాడు. వరుసగా కాల్స్ రావడంతో చివరకు మనోజ్ తన తల్లి ప్రభావతికి ఫోన్ చేసి చిన్నపిల్లాడిలా "అమ్మా.. ఫోన్ వస్తుంది" అంటూ చెబుతాడు.
దీంతో ప్రభావతి కూడా సెటైరిక్‌గా స్పందిస్తూ.. "ఏంట్రా చిన్నపిల్లాడిలా టాయిలెట్ వస్తుంది అన్నట్టు చెబుతున్నావ్?" అంటూ మందలిస్తుంది. అప్పుడు మనోజ్ "రోహిణి ఫోన్ చేస్తుంది.. లిఫ్ట్ చేయాలా వద్దా?" అని అడగడం ఆసక్తికరంగా మారింది. దీనికి ప్రభావతి మరింత కఠినంగా స్పందించింది. "రెండు గంటలు కనిపించకపోతే నీ పెళ్లానికి ఏమీ తోచడం లేదా? అవసరం లేదు.. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకు. ఈరోజు ఇంటికి కూడా రాకూ" అంటూ ఆదేశించింది. మనోజ్ ఆశ్చర్యపోతూ "ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావ్?" అని అడగగా.. "ఈరోజు లోడు వస్తుందని చెప్పావ్ కదా.. ఆ లోడు గురించి ఆలోచించు. అక్కడే తిని అక్కడే పడుకో" అంటూ ప్రభావతి ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. తల్లి మాటలకు ఎదురులేక మనోజ్ కూడా సైలెంట్‌గా "సరే" అని చెప్పేయడం ఎపిసోడ్‌లో కీలక మలుపుగా నిలిచింది.
ఇప్పటికే ఇంట్లో జరిగిన గొడవలతో తీవ్రంగా బాధపడుతున్న రోహిణి.. మనోజ్ తనతో మాట్లాడకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇదే సమయంలో మరోసారి ఆమె మనోజ్‌కు ఫోన్ చేయగా.. ప్రభావతి అనుమతితో ఈసారి మనోజ్ కాల్ లిఫ్ట్ చేశాడు. అయితే ఫోన్ ఎత్తిన వెంటనే "సారీ.. కస్టమర్ ఉన్నాడు అందుకే ఫోన్ చూడలేదు. ఇంట్లో ఎలా ఉంది?" అంటూ ఏమీ తెలియనట్లుగా మాట్లాడటం రోహిణికి మరింత అనుమానం కలిగించింది. దీనికి రోహిణి కూడా వెంటనే స్పందిస్తూ.. "ముందు కస్టమర్స్ ఉన్నా వాళ్లను హోల్డ్‌లో పెట్టి నాతో మాట్లాడేవాడివి. ఇప్పుడు ఏమైంది?" అంటూ ప్రశ్నించింది.
మనోజ్ మాత్రం "చాలా పెద్ద కస్టమర్.. అందుకే మాట్లాడలేకపోయాను" అంటూ మాట మార్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత "ఇంటికి ఎప్పుడు వస్తావ్?" అని రోహిణి అడగగా.. "ఈరోజు నేను ఇంటికి రాను. షాపుకు లోడు వస్తుంది" అంటూ చెప్పాడు. దీంతో రోహిణి కూడా అనుమానంగా "అక్కడ వర్కర్స్ ఉన్నారు కదా.. వాళ్లు చూసుకుంటారు కదా" అనగా.. మనోజ్ వెంటనే "అంటే నాకు ఈ పని కూడా చేతకాదని అంటున్నావా?" అంటూ రివర్స్ అయ్యాడు. ఈ మాటలతో రోహిణికి అసలు పరిస్థితి అర్థమైపోయింది. "నాకు మొత్తం స్టోరీ అర్థమైంది. నీ ఇష్టం. రాత్రి రావాలనిపిస్తే ఫోన్ చేయి" అంటూ బాధతో కాల్ కట్ చేసింది.
ఇక మరోవైపు ప్రభావతి వంటగదిలోకి వెళ్లి "ఈరోజు ఒకరికి తక్కువగా వంట చేయండి" అని చెప్పడం ఇంట్లో మరో చర్చకు దారితీసింది. దీంతో మీనా "ఎవరూ రావడం లేదా?" అని అడగగా.. "మనోజ్ ఈరోజు ఇంటికి రావడం లేదు" అంటూ ప్రభావతి సమాధానం ఇచ్చింది. ఈ మాటలు విన్న రోహిణి.. తన అత్తయ్యే కావాలనే మనోజ్‌ను తన నుంచి దూరం పెడుతోందని అర్థం చేసుకుని మరింత మనస్తాపానికి గురైంది. ఇక ఇదే సమయంలో బాలు ఇంట్లోకి వచ్చి "ఏంటి ఈరోజు ఇంట్లో అంతా కొత్తగా ఉంది? అందరూ సైలెంట్‌గా ఉన్నారు?" అంటూ ఆశ్చర్యపోయాడు. దీనికి మీనా పరిస్థితి మొత్తం వివరించింది. "శృతి, రవి ఇంకా ఇంటికి రాలేదు. మనోజ్ ఈరోజు ఇంటికి రాడు అంట. రోహిణి కోపంతో గదిలోనే ఉంది. అందుకే ఇంట్లో ఇంత నిశ్శబ్దం" అని చెప్పింది. వెంటనే బాలు కూడా "ఏంటి మనోజ్ ఇంటికి రాడా?" అంటూ షాక్ అయ్యాడు.
అయితే మీనా ఈసారి ప్రభావతి ప్రవర్తనపై తన అనుమానాన్ని బయటపెట్టింది. "మీ అమ్మ కావాలనే రోహిణి-మనోజ్‌లను దూరం పెడుతున్నట్లు అనిపిస్తోంది. మొగుడు పెళ్లాలను విడదీయడం మహా పాపం" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి బాలు కూడా తన తల్లి స్వభావాన్ని వివరిస్తూ.. "మా అమ్మ గురించి నీకు కొత్తగా ఏముంది? మొన్నటి వరకు శృతి నా కోడలు అంటూ పొగిడింది. కానీ శృతి ఎదురు మాట్లాడిన తర్వాత దూరం పెట్టింది. రోహిణి కూడా ఇన్ని రోజులు మాటలతో మాయ చేసింది. ఇప్పుడు మోసం బయటపడటంతో అమ్మ తన అసలు ప్రతాపం చూపిస్తోంది. ఇవన్నీ కొత్త కాదు.. నాలుగు రోజులు ఇలా ఉంటాయి" అంటూ పరిస్థితిని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.
అయితే మీనా మాత్రం రోహిణిపై కనికరం చూపించింది. "ఆమె ఏం తిందో కూడా తెలియదు. నేను తీసుకెళ్లి అన్నం పెడతా" అని చెప్పింది. కానీ బాలు మాత్రం జాగ్రత్తగా హెచ్చరిస్తూ.. "అన్నం పెట్టే వాళ్లకు సున్నం పెట్టే రకం రోహిణి. అయినా నువ్వు పెట్టాలనుకుంటే నేను ఆపను" అన్నాడు. అంతేకాదు, "అమ్మ కూడా కోప్పడుతుంది" అని ముందే చెప్పాడు. అయితే మీనా మాత్రం తన మంచితనాన్ని చూపిస్తూ.. "మహా అయితే రెండు మాటలు అంటారు. కానీ ఆకలి తీర్చడం కంటే పెద్ద విషయం ఏమీ కాదు" అంటూ రోహిణికి భోజనం పెట్టాలని నిర్ణయించుకుంటుంది.
ఇక బాలు "పని ఉంది" అంటూ బయటకు వెళ్లి నేరుగా తన అన్నయ్య మనోజ్ దగ్గరకు చేరుకున్నాడు. షాప్‌లో ఒంటరిగా కూర్చున్న మనోజ్‌ను చూసి "ఏమైందిరా ఇంకా ఇంటికి రాలేదు? సాధారణంగా ఎనిమిదయ్యే సరికి ఇంటికి వచ్చి తిని పడుకునేవాడివి. ఈరోజు ఇంకా ఇక్కడే ఉన్నావ్?" అంటూ ప్రశ్నించాడు. అయితే మనోజ్ మాత్రం "ఈరోజు చాలా పని ఉంది. లోడ్ వస్తుంది.. అందుకే ఇక్కడే ఉన్నా" అంటూ సమాధానం ఇచ్చాడు. కానీ తమ్ముడిగా అన్నయ్య పరిస్థితి అర్థం చేసుకున్న బాలు "సరేలే.. తిన్నావా లేదా?" అని అడగగా.. మనోజ్ సైలెంట్ అయిపోయాడు.
దీంతో బాలు తన చేతిలో ఉన్న బిర్యానీ ప్యాకెట్ చూపిస్తూ "నీ గురించి నాకు తెలియదా? నువ్వు తినలేదని తెలిసే నీకోసం బిర్యానీ తీసుకొచ్చా.. తిను" అంటూ ప్రేమగా ఇచ్చాడు. ఈ సమయంలో బాలు తన అన్నయ్యపై జాలి చూపిస్తూ.. "ఒక్కసారి అయినా మనం తప్పు చేస్తున్నామేమో అని ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కనీసం అమ్మ దగ్గరైనా నిజం చెప్పి ఉంటే నిన్ను కాపాడేది" అంటూ బాధగా చెప్పాడు. అయితే మనోజ్ మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా మౌనంగా బిర్యానీ తినడం కనిపించింది.
బిర్యానీ తిన్న తర్వాత కూడా బాలు ప్రేమగా "మరోసారి ఇలా కడుపు మార్చుకోకు. నీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే నాకు ఫోన్ చేయి.. నేను తీసుకొస్తా" అంటూ అన్నయ్యపై ప్రేమ చూపించాడు. కానీ ఇదే సమయంలో మనోజ్ ఒక్కసారిగా నోరు జారుతూ "బిర్యానీ తెచ్చి ఈ షాప్‌ను నా దగ్గర నుంచి లాక్కోవాలని ప్లాన్ చేస్తున్నావా?" అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మాటలు విన్న బాలు ఒక్కసారిగా షాక్‌కు గురై తీవ్రంగా ఫీల్ అయ్యాడు. అన్నయ్య మనస్తత్వం తెలిసినా.. ప్రేమతో భోజనం తీసుకొచ్చిన తనపై ఇలా అనుమానం పెట్టుకోవడం అతనికి బాధ కలిగించింది. చివరకు "వాడికి అలాంటి విలువలు ఏం ఉండవు" అంటూ తనలోతానే బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇక మరోవైపు ఇంట్లో మీనా.. రోహిణి ఆకలిగా ఉందని భావించి ఆమె గదికి భోజనం తీసుకెళ్లింది. ఆకలితో ఉన్న రోహిణి మాత్రం ఆహారం వేగంగా తినడం ప్రారంభించింది. అప్పుడు మీనా ఆప్యాయంగా "ఇంకో చపాతీ తీసుకురావాలా?" అని అడగగా.. రోహిణి వెంటనే వెటకారంగా "నేనేమైనా నాలుగు చపాతీలు తినేలా కనిపిస్తున్నానా?" అంటూ మాట్లాడింది. అంతేకాదు, భోజనం పూర్తయ్యాక చేతులు కడిగి ప్లేట్‌ను కూడా మీనానే తీసుకెళ్లాలని ఆదేశించింది.
అక్కడితో ఆగకుండా మీనాపై వ్యంగ్యంగా "ఇప్పుడైనా నీ కడుపు మంట చల్లారిందా? ఇన్ని రోజులు అత్తయ్య నన్నే బాగా చూసుకుని నిన్ను తిడుతుండేది. ఇప్పుడు నన్ను కొట్టడంతో నీకు సంతోషంగా ఉందా?" అంటూ ఘాటుగా మాట్లాడింది. ఈ మాటలతో ఇంతవరకు సహనంగా ఉన్న మీనా ఒక్కసారిగా విరుచుకుపడింది. "పొద్దున్నుంచి నువ్వు అన్నం తినలేదని జాలి వేసి భోజనం తీసుకొస్తే.. నేను అంత తక్కువదానిలా కనిపిస్తున్నానా?" అంటూ ఫైర్ అయింది.
అంతేకాదు, "నువ్వు తిన్న ఎంగిలి ప్లేట్ నువ్వే తీసుకెళ్లలేకపోతుంటే నేను ఎందుకు తీసుకెళ్లాలి? నీలాగా ఒకరు బాధపడితే నేను సంతోషించే మనస్తత్వం కాదు" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక అక్కడితో ఆగని మీనా.. "నీలాగా నాటకాలు ఆడి మోసం చేయడం నాకు రాదు. పార్లర్ పేరుతో అబద్ధాలు చెప్పడం రాదు. ఇంట్లో వాళ్ల డబ్బులు దొంగిలించడం రాదు. మనోజ్ ప్రియురాలు ఇచ్చిన డబ్బును నీ నాన్న ఇచ్చాడని చెప్పుకోవడం రాదు. నువ్వు నిజంగా మహానటివి" అంటూ రోహిణిని దిమ్మతిరిగేలా క్లాస్ పీకింది.చివరగా "నాతో మాట్లాడే అర్హత కూడా నీకు లేదు" అంటూ చీ కొట్టిన మీనా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రోహిణి పూర్తిగా షాక్‌కు గురైంది. ఇలా వరుస ట్విస్టులు, ఎమోషనల్ సన్నివేశాలు, ఘాటైన డైలాగ్‌లతో నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది.


Click it and Unblock the Notifications









