Gundeninda Gudigantalu May 14th Episode: మీనాపై చింతామణి దాడి, రోహిణి మరో ప్లాన్, ప్రభావతికి సత్యం వార్నింగ్

photo courtesy jiohotstar

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. మీనా జాలి చూపించి రోహిణికి భోజనం పెట్టగా.. ఆమె కృతజ్ఞత లేకుండా వ్యంగ్యంగా మాట్లాడటం పరిస్థితిని మలుపుతిప్పింది. దీంతో ఆగ్రహించిన మీనా "నిజాయితీగా జీవించడం నేర్చుకో" అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ సంఘటన తర్వాత ప్రభావతి అనుమానాలు మరింత పెరిగి, మీనాపై ఆరోపణలు చేస్తుంది. అయితే మీనా ధైర్యంగా స్పందిస్తూ "బంధాలను కలపడం మాత్రమే నాకు తెలుసు" అని చెప్పడంతో ప్రభావతి షాక్‌కు గురవుతుంది. మరోవైపు బాలు తన అన్న మనోజ్ వద్ద ఎదురైన అవమానాన్ని చెప్పుకుంటాడు. బిర్యానీ తీసుకెళ్లినా అనుమానం పెట్టుకోవడం అతన్ని బాధపెడుతుంది.

దీంతో బాలు-మీనా ఇద్దరూ ఇకపై ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు. ఇక కథలో కీలక ట్విస్ట్‌గా శివ చెప్పిన సీక్రెట్ హైలైట్ అయింది. రోహిణి తరచూ గుణ దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు తీసుకెళ్తుందని చెప్పడంతో మీనా షాక్ అవుతుంది. దీంతో రోహిణి అసలు ఉద్దేశ్యంపై కొత్త అనుమానాలు మొదలవుతాయి. ఇదే విషయాన్ని మీనా బాలుతో పంచుకోగా.. అతడూ సీరియస్‌గా తీసుకుని నిజం బయటకు తేల్చాలని నిర్ణయించుకుంటాడు. ఇంట్లో పరిస్థితి మరోవైపు మరింత టెన్షన్‌గా మారుతుంది. ప్రభావతి కఠిన ఆంక్షలు విధిస్తూ రోహిణిపై కన్నేసి ఉంచుతుంది. సత్యం కూడా రోహిణి చేసిన పనిని తీవ్రంగా తప్పుపట్టడంతో ఆమె పూర్తిగా ఒంటరిగా మారుతుంది. చివరగా డైనింగ్ టేబుల్ వద్ద రోహిణి అడుగులు ఆగిపోవడం ఎపిసోడ్‌కు సస్పెన్స్‌ను జోడించింది. తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 683 May 14th 2026 here is full story

photo courtesy jiohotstar

Also Read
ఏడో తరగతిలో అలాంటి వేధింపులు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా అలా..
ఏడో తరగతిలో అలాంటి వేధింపులు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా అలా..


గురువారం ఎపిసోడ్‌లో కుటుంబంలో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. ఉదయం టిఫిన్ టైమ్‌లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న సమయంలో రోహిణి కూడా వచ్చి కూర్చోవడంతో సీన్ టెన్షన్‌గా మారింది. ప్రభావతి మాత్రం ఆమెను చూసి కోపంతో రగిలిపోతూ "ఇక్కడ కూర్చోకు.. లేచి వెళ్లిపో" అంటూ కఠినంగా వ్యవహరించింది. శృతి మాత్రం రోహిణిని కూర్చోమని సపోర్ట్ చేయగా, మనోజ్ కూడా "ఆమెకు ఆకలేసి ఉంటుంది" అని చెప్పినా ప్రభావతి అస్సలు వినలేదు. ఇంకా అవమానకరంగా రోహిణిని "పక్కకు వెళ్లూ" అంటూ బిచ్చగాడిలా ట్రీట్ చేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది.

Recommended For You
అల్లు అర్జున్-లోకేష్ కనకరాజ్ కాంబో.. హీరోయిన్‌ ఫిక్స్‌.. ఎవరంటే?
అల్లు అర్జున్-లోకేష్ కనకరాజ్ కాంబో.. హీరోయిన్‌ ఫిక్స్‌.. ఎవరంటే?

ఈ సమయంలో మీనా ధైర్యంగా ముందుకు వచ్చి "ఇలా చేయడం తప్పు" అంటూ రోహిణికి మద్దతు ఇచ్చింది. కానీ ప్రభావతి ఆమెపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ "నీకు మధ్యలో అధికారం ఏమిటి?" అంటూ కఠినంగా మందలించింది. తన భార్యను అవమానిస్తున్నా మనోజ్ సైలెంట్‌గా ఉండటం కూడా రోహిణికి తీవ్ర బాధ కలిగించింది. "నాకు అమ్మ ఉంటే ఇలా జరగదు" అంటూ బాధతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. తరువాత రోహిణి నేరుగా మీనాక్షి ఇంటికి చేరుకుని కన్నీళ్లతో తన బాధను పంచుకుంది. "ఇంట్లో అందరూ నన్ను పరాయి వాళ్లలా చూస్తున్నారు" అంటూ వేదన వ్యక్తం చేసింది.

మీనాక్షి ఆమెను ఓదారుస్తూ "నీ అత్తయ్య నిన్ను కోడలిగా కాకుండా కూతురిలా చూసింది.. కానీ నువ్వు చెప్పకుండా చేసిన పనితో కోపంగా ఉంది" అని వివరించింది. అయితే రోహిణి తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో "మనోజ్ కోసం, అతని భవిష్యత్తు కోసం చేశాను" అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. ఇదే సమయంలో ఆమె ఒక కొత్త ప్లాన్ వేస్తుంది. అత్త ప్రభావతిని తిరిగి కన్విన్స్ చేయడానికి ముందుగానే డైలాగులు రెడీ చేసి, మీనాక్షితో మాట్లాడమని అడుగుతుంది. మీనాక్షి మాత్రం "ఎమోషన్‌లో తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరం" అని హెచ్చరించినా.. రోహిణి సెంటిమెంట్‌తో ఆమెను ఒప్పిస్తుంది. చివరకు మీనాక్షి "నేను నీ అత్తయ్యతో మాట్లాడి నిన్ను తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చేలా చూస్తాను" అని మాట ఇస్తుంది.

You May Also Like
ఫస్ట్ నైట్ రోజే టార్చర్.. భర్తపై కార్తీకదీపం నటి ఎమోషనల్ కామెంట్స్
ఫస్ట్ నైట్ రోజే టార్చర్.. భర్తపై కార్తీకదీపం నటి ఎమోషనల్ కామెంట్స్

ఈ ఎపిసోడ్‌లో ఫ్యామిలీ డ్రామాతో పాటు బిజినెస్ ట్రాక్ కూడా హై వోల్టేజ్ టెన్షన్‌తో సాగింది. బాలు-మీనా తమ డెకరేషన్ బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఓ ఫంక్షన్ హాల్‌కు వెళ్తారు. కొత్త ఆర్డర్ కోసం మీనా తయారు చేసిన మోడల్స్‌ను అక్కడ డిస్ప్లే చేస్తుంది. భార్యకు అండగా నిలిచిన బాలు కూడా ఆమెకు సహాయం చేస్తూ అన్ని మోడల్స్‌ను సెట్ చేస్తాడు. అయితే కస్టమర్స్ రావడానికి టైమ్ పడుతుందని భావించిన మీనా.. "ఇప్పుడు నేను బిజినెస్‌లోకి కొత్తగా అడుగు పెడుతున్నాను. మీరు నా పక్కన ఉంటే, నేను మీ సపోర్ట్‌తోనే పని చేస్తున్నానని వాళ్లు అనుకుంటారు. అది నాకు మైనస్ అవుతుంది" అంటూ బాలును వెళ్లమని చెబుతుంది. మొదట వెనుకాడిన బాలు, చివరకు ఆమె ఆత్మవిశ్వాసాన్ని గౌరవించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. మీనా డిజైన్స్ చూసిన ఫంక్షన్ హాల్ మేనేజర్ ఆకట్టుకుని "ఈ ఆర్డర్ మీకే ఇస్తాను" అని మాట ఇస్తాడు. ఇదే సమయంలో చింతామణి ఎంట్రీ ఇస్తూ సీన్‌ను పూర్తిగా మార్చేస్తుంది. "ఆర్డర్ ఆమెకిస్తే మేమేం చేయాలి?" అంటూ మేనేజర్‌ను బెదిరిస్తూ, మీనాను అవమానించేలా మాట్లాడుతుంది. మీనా చూపించిన మోడల్స్‌ను చూసి చింతామణి వెటకారంగా మాట్లాడుతుంటే.. మీనా మాత్రం ధైర్యంగా "ఇది కొత్త ట్రెండ్.. మేము చేసే పనిని ముందుగానే మోడల్స్ రూపంలో చూపించడం బిజినెస్‌లో కొత్త ఐడియా" అంటూ సమాధానం ఇస్తుంది. కానీ చింతామణి మాత్రం "నా ఏరియాలోకి వచ్చి నా బిజినెస్‌లో వేలు పెడితే మంచిది కాదు" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

The Paradise: నాని 'ది పారడైజ్'పై అలాంటి రూమర్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మూవీ మేకర్స్!
The Paradise: నాని 'ది పారడైజ్'పై అలాంటి రూమర్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మూవీ మేకర్స్!

ఇంతకీ భయపడని మీనా "నాకు టాలెంట్ ఉంది.. నా పని నచ్చితే కస్టమర్స్ నన్నే ఎంచుకుంటారు" అంటూ సూటిగా కౌంటర్ ఇస్తుంది. దీంతో ఆగ్రహానికి గురైన చింతామణి తన గుండాలను పిలిచి మీనా తయారు చేసిన డిజైన్స్‌ను పగలగొట్టిస్తుంది. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో మీనా షాక్ అవుతుంది. అయినా వెనక్కి తగ్గని మీనా ఆవేశంగా స్పందిస్తూ.. "నా మొగుడు ఇక్కడ ఉంటే మీరంతా చూస్తారు. కానీ ఇది ఇక్కడితో ముగియదు. నా పని ద్వారా నేనేంటో నిరూపిస్తా.. మీరు ఊహించని స్థాయికి ఎదిగి మీకు సమాధానం ఇస్తా" అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక చింతామణి కూడా "నన్ను దాటి ఈ ఏరియాలో బిజినెస్ చేయలేవ్" అంటూ మరోసారి బెదిరించడం ద్వారా కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

ఇక రోహిణి సూచనలతో మీనాక్షి ఇంటికి పిలిచిన ప్రభావతి మొదట సాధారణంగా మాట్లాడినప్పటికీ.. వెంటనే తన మనసులో ఉన్న బాధను బయటపెట్టింది. "నమ్ముకున్న వాళ్లే మోసం చేస్తున్నారు" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రోహిణిపై తనకు ఉన్న నమ్మకం పూర్తిగా దెబ్బతిన్నదని, కల్పన ఇచ్చిన 45 లక్షలను దాచిపెట్టి షోరూమ్ ప్రారంభించారని, ఆ విషయాన్ని కూడా తప్పుగా చెప్పిందని తీవ్రంగా మండిపడింది. ఇక రోహిణి చెప్పిన స్క్రిప్ట్‌ను ఫాలో అవుతూ మీనాక్షి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేసింది. "రోహిణి నిన్ను అమ్మలా ప్రేమిస్తుంది.. ఆమె చేసిన తప్పు మనోజ్ కోసం" అంటూ ప్రభావతిని కూల్ చేయడానికి ట్రై చేసింది. అంతేకాదు, ఇందులో మనోజ్ తప్పు కూడా ఉందని గుర్తు చేస్తూ, కోపం తగ్గించుకోవాలని సూచించింది. కానీ ప్రభావతి మాత్రం తన వైఖరిలో మార్పు చూపించలేదు.

సీఎం విజయ్ సినిమాకి భారీ డిమాండ్.. జన నాయగన్ విడుదల ఎప్పుడంటే?
సీఎం విజయ్ సినిమాకి భారీ డిమాండ్.. జన నాయగన్ విడుదల ఎప్పుడంటే?

అప్పుడు మీనాక్షి మరో స్ట్రాటజీతో ముందుకు వచ్చింది. "రోహిణి కోటీశ్వరురాలు.. రేపు ఆమె తండ్రి ఆస్తి ఆమె పేరుకు వస్తే పరిస్థితి మారిపోతుంది. నువ్వు దూరం పెడితే.. రేపు ఆమెనే నిన్ను దూరం పెట్టే అవకాశం ఉంది" అంటూ షాకింగ్ యాంగిల్‌ను తీసుకొచ్చింది. ఈ మాటలు ప్రభావతిని ఆలోచనలో పడేశాయి. "నా కొడుకు నా మాట ఎప్పుడూ తప్పడు" అని గట్టిగా చెప్పిన ప్రభావతికి, మీనాక్షి మరింత రియాలిటీ చెక్ ఇచ్చింది. "డబ్బు ముందు ఎవ్వరైనా మారిపోతారు.. నువ్వు ఇప్పుడు పట్టించుకోకపోతే రేపు నువ్వే ఒంటరిగా మిగిలిపోతావు" అంటూ హెచ్చరించింది. దీంతో ప్రభావతి మనసులో సందేహాలు మొదలయ్యాయి. రోహిణిని పూర్తిగా దూరం పెట్టడం సరైన నిర్ణయమా? అనే ఆలోచనలో పడింది.

ఇక మరోవైపు మీనా, ఇంట్లో జరుగుతున్న అన్యాయాన్ని సత్యం ముందు ఉంచింది. "రోహిణి-మనోజ్ ఇద్దరూ తప్పు చేశారు. కానీ శిక్ష మాత్రం ఒక్కరికి ఎందుకు?" అంటూ ప్రశ్నించింది. రోహిణి భోజనం కూడా చేయడం లేదని, ఇంట్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని వివరించింది. సత్యం కూడా పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్నాడు. "ఇంట్లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు.. నేను మాట్లాడతా" అని చెప్పాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రభావతి, మీనాపై అనుమానం వ్యక్తం చేస్తూ "మధ్యలో చిచ్చు పెడుతున్నావా?" అంటూ ఆగ్రహించింది.

విజయ్ పార్టీలోకి ఆర్కే రోజా? క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి
విజయ్ పార్టీలోకి ఆర్కే రోజా? క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి

అయితే సత్యం ఈసారి కఠినంగా స్పందించాడు. "ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడకు.. మీనా కేవలం రోహిణి పరిస్థితి చెప్పింది" అంటూ భార్యకు కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు, "మొగుడు-పెళ్లాన్ని విడదీయడం పాపం.. అలాంటి పని చేసే వాళ్లు బాగుపడరు" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. సత్యం మాటలు ప్రభావతిని కుదిపేశాయి. ఒకవైపు మీనాక్షి చెప్పిన ఆస్తి అంశం, మరోవైపు సత్యం హెచ్చరికలు... ఈ రెండింటి మధ్య ప్రభావతి మానసికంగా గందరగోళానికి గురైంది. అయితే.. ప్రభావతి తన నిర్ణయం మార్చుకుంటుందా? రోహిణి ప్లాన్ వర్కవుట్ అవుతుందా? సత్యం జోక్యంతో కుటుంబం మళ్లీ కలుస్తుందా? అనే ప్రశ్నలు రాబోయే ఎపిసోడ్లపై ఆసక్తిని పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X