Gundeninda Gudigantalu May 26th Episode: మలేషియా గెస్ట్‌ల ఎంట్రీ, రోహిణి డ్రామా రివర్స్, బాలు-శృతికి అనుమానం..
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఆసక్తిగా ఆకట్టుకుంది. రాజమండ్రి నేపథ్యంలో కథ సాగుతూ, బాలు కారులో ప్రయాణిస్తుండగా మలేషియా నుండి వచ్చిన దంపతులను తీసుకెళ్తాడు. 25 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన వారు దేశ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతారు. తమ పెళ్లిరోజును భారతదేశంలో జరుపుకోవాలని వచ్చామని చెప్పడం భావోద్వేగాన్ని కలిగిస్తుంది. బాలు వారికి గైడ్‌లా మారి గుడికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తాడు. మీనా కూడా పూజ ఏర్పాట్లు చేసి వారిని ఆత్మీయంగా స్వాగతిస్తుంది. ఇక మరోవైపు గుణ గుడికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ కోసం ప్రయత్నిస్తాడు. కానీ ఆలయ అధికారులు కోర్ట్ ఆర్డర్ లేకుండా ఇవ్వలేమని చెప్పడంతో అతని ప్లాన్ విఫలమవుతుంది.
ఇదే విషయం మీనాకు తెలిసి అనుమానాలు పెరుగుతాయి. శివ కూడా గుణపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఈ సంఘటనల వెనుక రోహిణి ఉందనే అనుమానం మరింత బలపడుతుంది. ఇక ఫ్యామిలీ ట్రాక్‌లో బాలు, మీనా మలేషియా దంపతులను ఇంటికి ఆహ్వానించడం ద్వారా భావోద్వేగం పెరుగుతుంది. మరోవైపు ప్రభావతి పరిస్థితి, మనోజ్ సమస్యలపై చర్చలు కుటుంబంలో ఉద్రిక్తతను పెంచుతాయి. రోహిణి తన ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు మనోజ్‌ను పోలీస్ స్టేషన్‌కు పంపించడం కథలో టెన్షన్‌ను మరింత పెంచింది. చివర్లో ప్రభావతి ఎంట్రీతో ఎపిసోడ్ క్లైమాక్స్ టెన్షన్‌గా ముగిసింది.

photo courtesy jiohotstar
మంగళవారం ఎపిసోడ్ ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు హై టెన్షన్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎపిసోడ్ ప్రారంభంలోనే మీనా మలేషియా నుండి వస్తున్న దంపతుల కోసం స్పెషల్ వంటకాలు సిద్ధం చేస్తూ కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో ప్రభావతి ఎంట్రీ ఇచ్చి, "ఏం చేస్తున్నావ్?" అంటూ వెటకారంగా ప్రశ్నించడంతో వంటగదిలో వాతావరణం ఒక్కసారిగా హీట్ అవుతుంది. శృతి కూడా తన స్టైల్‌లో కౌంటర్ ఇస్తూ, ప్రభావతికి ఘాటు సమాధానాలు చెప్పడంతో మాటల యుద్ధం మరింత పెరుగుతుంది. ప్రభావతి, శృతిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయగా... శృతి మాత్రం "ఈ ఇంట్లో దాచుకునే వాళ్ల కంటే దోచుకునే వాళ్లే ఎక్కువ" అంటూ షాకింగ్ కౌంటర్ ఇవ్వడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని గుర్తించిన మీనా వెంటనే కలగజేసుకుని శృతిని అక్కడి నుంచి పంపించి గొడవను తగ్గించే ప్రయత్నం చేస్తుంది.
అయితే ప్రభావతి తన కోపాన్ని తగ్గించుకోకుండా, మీనాను మళ్లీ ప్రశ్నిస్తూ స్పెషల్ వంటల గురించి అడుగుతుంది. దానికి మీనా, "మలేషియా నుండి అతిథులు వస్తున్నారు" అని చెప్పినా... ప్రభావతి "నా ఇల్లు ఏమైనా సత్రమా?" అంటూ ఘాటుగా స్పందించడం ఉద్రిక్తతను పెంచుతుంది. చివరికి "బాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం" అని చెప్పడంతో ప్రభావతి అసహనంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ సమయంలో సత్యం ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని కూల్ చేస్తాడు. అతను బాలు ముందే చెప్పాడని, అతిథులకు భోజనం పెట్టడం మన సంప్రదాయం అని చెప్పి ప్రభావతికి కౌన్సిల్ చేస్తాడు.
ఇక మీనా అతిథుల కోసం స్పెషల్ వంటలు చేస్తుండగా, శృతి వీడియో తీస్తూ సరదాగా గడుపుతుంది. ఈ సమయంలో రోహిణి ఎంట్రీ ఇచ్చి "ఏం చేస్తున్నారు?" అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో శృతి తన స్టైల్‌లోనే కౌంటర్ ఇస్తూ, "రన్నింగ్‌లో చేస్తున్నాం... నువ్వూ వస్తావా?" అంటూ చురకలు వేసింది. అయితే మీనా మాత్రం శాంతంగా వ్యవహరిస్తూ, బాలు ఇద్దరు అతిథులను ఇంటికి తీసుకువస్తున్నాడని, అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పింది. దీనికి రోహిణి "కస్టమర్లకు ఫ్రీ భోజనమా?" అంటూ వ్యంగ్యంగా నవ్వింది. వెంటనే మీనా ఘాటుగా స్పందిస్తూ, "మేము ఎవరి సొమ్ము తినడం లేదు... మా కష్టార్జితంతో ఇతరులకు పెట్టడం మాకు ఆనందం" అంటూ స్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ మాటలకు రోహిణి కాస్త ఇబ్బందిగా ఫీలై అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అయితే వెళ్లేలోపే వంటకు ఉపయోగించాల్సిన కొబ్బరిని తినేయడం మరో చిన్న ట్విస్ట్‌గా మారింది. దీంతో మీనా కాసేపు అయోమయంలో పడినా, శృతి వెంటనే "మిరపకాయలతో పచ్చడి చేద్దాం... రోహిణికి తినిపిస్తే బ్యాలెన్స్ అవుతుంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించడం నవ్వులు పూయించింది. చివరకు ఈ సరదా మధ్యే మీనా తన వంట ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఇదే సమయంలో రవి ఇంటికి భోజనానికి రావడం మరో ఆసక్తికర పరిణామంగా నిలిచింది. సత్యం "ఈరోజు హోటల్‌కు వెళ్లలేదా?" అని అడగగా, రవి మీనా ప్రత్యేకంగా పిలిచిందని చెబుతాడు. దీనిపై ప్రభావతి వ్యంగ్యంగా స్పందించినా, రవి మాత్రం మీనా వంటను పొగడ్తలతో ముంచెత్తాడు. "ప్రేమతో వండితే ఏ వంటకమైనా అమృతంలా మారుతుంది" అంటూ మీనా ప్రతిభను ప్రశంసించడం ఎపిసోడ్‌లో పాజిటివ్ హైలైట్‌గా నిలిచింది.
ఇక బాలు.. మలేషియా దంపతులను ఇంటికి తీసుకురాగానే ప్రభావతి మొదట అసహనం వ్యక్తం చేస్తుంది. "ఎందుకు తీసుకువచ్చావ్?" అన్న భావంతో కోపంగా కనిపించినా, బాలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా వారిని కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు. ఈ సమయంలో శృతి సరదాగా మాట్లాడి వాతావరణాన్ని కాస్త హాయిగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది. అయితే "మలేషియా" అన్న మాట వినగానే ప్రభావతి ఒక్కసారిగా తన టోన్ మార్చుకుని ఆశ్చర్యంతో స్పందిస్తుంది. ముందుగా మీనా చెప్పినా పట్టించుకోలేదని కవరింగ్ చేసుకుంటూ, వెంటనే తన పెద్ద కోడలు కూడా మలేషియాలోనే ఉంటుందని గొప్పలు చెప్పడం ప్రారంభిస్తుంది. ఇదే సమయంలో ఆ దంపతులు మరింత వివరాలు అడగడం ప్రారంభించడంతో ప్రభావతి ఇబ్బందికర పరిస్థితిలో పడుతుంది.
శృతి "ట్విన్స్ టవర్స్" అని చెప్పడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అక్కడే తమకు పరిచయాలు ఉన్నాయని చెప్పిన మలేషియా దంపతులు, రోహిణి కుటుంబం గురించి ప్రశ్నించడంతో ప్రభావతి తడబడుతుంది. ఇదంతా గమనించిన రోహిణి తన అసలు నిజం బయటపడుతుందని గ్రహించి వెంటనే రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. ఇక ప్రభావతి మాత్రం ఆతృతగా రోహిణిని బయటకు పిలవడానికి ప్రయత్నించినా, ఆమె ఎలాంటి స్పందన ఇవ్వదు. చివరకు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని గ్రహించిన రోహిణి ఓ కొత్త డ్రామాకు తెరలేపుతుంది. పంటి నొప్పి పేరుతో నోట్లో కాటన్ పెట్టుకుని మాట్లాడలేనట్టు నటిస్తుంది. కిందికి వచ్చిన తర్వాత కూడా మలేషియా దంపతులు ప్రశ్నలు అడుగుతూనే ఉండటంతో, రోహిణి మరింత కంగారుపడుతూ తన యాక్టింగ్ కొనసాగిస్తుంది.
ఈ సందర్భంలో సత్యం ఆమెను హాస్పిటల్‌కు వెళ్లమని సూచించడంతో, రోహిణి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. బాలు కూడా తాను డ్రాప్ చేస్తానని చెప్పినా, గెస్టులను చూసుకోవాలని చెప్పి రోహిణి ఒంటరిగా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కానీ శృతి మాత్రం అనుమానం పెరిగి, తానే ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్తానని ముందుకు వస్తుంది. రోహిణి ప్రవర్తన మొత్తం బాలు, మీనాలకు అనుమానం కలిగిస్తుంది. ఇప్పటివరకు సాధారణంగా ఉన్న ఆమె, మలేషియా దంపతులు వచ్చిన వెంటనే పంటి నొప్పి అంటూ డ్రామా చేయడం వెనుక ఏదో కారణం ఉందని బాలు గ్రహిస్తాడు. "ఇది అంతా తన గురించి బయటపడకుండా ఉండటానికే" అనే అనుమానం వ్యక్తం చేస్తూ, శృతి ఏదైనా నిజం బయటపెడుతుందేమో అన్న ఆసక్తి వ్యక్తం చేస్తాడు.
ఇక రోహిణి హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత అసలు డ్రామా మొదలైంది. అక్కడికి చేరుకున్న వెంటనే "ఇప్పుడు నాకేం లేదు... పంటి నొప్పి తగ్గిపోయింది" అంటూ బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. అయితే శృతి మాత్రం అస్సలు వదలకుండా, "పంటి నొప్పి అంటే చిన్న విషయం కాదు" అంటూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడంపై పట్టుదలగా ఉంటుంది. రోహిణి తన డ్రామా బయటపడుతుందనే భయంతో మళ్లీ నొప్పి నటన మొదలుపెడుతుంది. ఇదే సమయంలో హాస్పిటల్‌లో పేషెంట్లు లేక ఇబ్బంది పడుతున్న డాక్టర్, వచ్చిన కేసును వదలకుండా వెంటనే పరీక్షించి ఒక పన్ను పాడైందని చెబుతుంది. శృతి కూడా "పాడైన పన్ను తీసేస్తేనే మంచిది" అంటూ డాక్టర్‌ను ప్రోత్సహించడంతో, చివరికి రోహిణి నిజంగానే పన్ను పీకించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మలేషియా దంపతుల నుంచి తప్పించుకోవడానికి వేసిన డ్రామా చివరికి ఆమెకే నష్టం కలుగుతుంది.
మరోవైపు ఇంట్లో మలేషియా దంపతులు వెళ్లే సమయం ఆసన్నమవుతుంది. బాలు వారిని ఎంతో గౌరవంగా చూసుకుంటూ, పెళ్లిరోజు కానుకగా తన తల్లిదండ్రుల చేత బట్టలు అందజేస్తాడు. ఈ ఆతిథ్యానికి ఆకర్షితులైన వారు, "మీరు మలేషియాకు వస్తే మా ఇంట్లోనే ఉండాలి" అంటూ ఆహ్వానం పలుకుతారు. అలాగే మీనా వంట, ఆమె ఆతిథ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, "ఇలాంటి కోడలు ప్రతి ఇంట్లో ఉండాలి" అని చెప్పడం భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఇదే సమయంలో ప్రభావతి బయటకు మాత్రం చిరునవ్వుతో స్పందించినా, లోపల అసంతృప్తితో కనిపిస్తుంది. ఇక మనోజ్ ఎంట్రీతో మరో చిన్న ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. ప్రభావతి అతన్ని "మలేషియా అల్లుడు"గా పరిచయం చేయగా, మనోజ్ తనను పెద్ద బిజినెస్‌మ్యాన్‌గా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే మలేషియా దంపతుల్లో ఒకరు "నిజమైన బిజినెస్‌మ్యాన్ తన గురించి తానే చెప్పుకోడు" అంటూ చురక వేయడం సన్నివేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతతో నేటీ ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications