Gundeninda Gudigantalu May 28th Episode: గుండాలను తరిమికొట్టిన మీనా, చింతామణికి స్ట్రాంగ్ కౌంటర్, సత్యం ఫైర్!
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, అనుమానాలు, కుటుంబ ఘర్షణలతో ఎంతో ఆసక్తికరంగా సాగింది. మలేషియా దంపతులు మీనా చేసిన వంటలను ప్రశంసిస్తూ ఆమెను ఆదర్శ కోడలిగా పొగడటం ఇంట్లో ప్రత్యేక వాతావరణాన్ని తీసుకొచ్చింది. అయితే వారు వెళ్లిన వెంటనే రోహిణి కనిపించకపోవడంతో ఇంట్లో టెన్షన్ మొదలైంది. శృతి ఆమెను తీసుకురాగా, పంటి నొప్పితో ట్రీట్‌మెంట్ చేయించుకున్నానని రోహిణి చెప్పడం అందరినీ షాక్‌కు గురిచేసింది. కానీ మలేషియా పేరు వినగానే ఆమె భయపడటం బాలు, మీనాల్లో అనుమానాలను పెంచింది. "ఏదో దాచిపెడుతోంది" అంటూ బాలు ఆమె గతాన్ని బయటపెడతానని ఛాలెంజ్ చేయడం కథలో సస్పెన్స్‌ను పెంచింది.
ఇక రోహిణి ఫోన్‌కు వచ్చిన కాల్ మరో భారీ ట్విస్ట్ ఇచ్చింది. "నేను రోహిణి భర్తను" అంటూ రెంట్ గురించి మాట్లాడిన వ్యక్తి మాటలు విన్న మనోజ్ షాక్‌కు గురయ్యాడు. దీంతో రోహిణిపై అతని అనుమానం మరింత బలపడింది. మరోవైపు బాలు స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఇంటికి రావడంతో మీనా తీవ్రంగా ఆగ్రహించింది. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణగా మారి, బాలు కోపంతో టెర్రస్‌కు వెళ్లిపోయాడు. అటు రవి-శృతి మధ్య కూడా అపార్థాలు పెరిగాయి. రవి మీటింగ్‌లో ఉండగా కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో శృతి బాధపడగా, నీతూ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. చివరగా డైనింగ్ టేబుల్ దగ్గర మీనా, శృతి, రోహిణి ఒక్కొక్కరిగా కోపంతో వెళ్లిపోవడం ఇంట్లో విభేదాలు ఎంత తీవ్రంగా మారాయో చూపించింది.

photo courtesy jiohotstar
గురువారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర మొదలైన చిన్న గొడవ చివరకు పెద్ద ఎమోషనల్ వార్‌గా మారింది. మీనా కేవలం తన మామయ్య సత్యంకు మాత్రమే భోజనం వడ్డించి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రభావతి షాక్ అవుతుంది. "మేము కనిపించడం లేదా? మామయ్యకు మాత్రమే వడ్డించి వెళ్తున్నావేంటి?" అంటూ ప్రశ్నించగా, మీనా మాత్రం తన కోపాన్ని దాచుకోకుండా "ఇప్పుడు నేను చాలా కోపంగా ఉన్నాను.. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకండి. మీరే వడ్డించుకుని తినండి.. లేకపోతే తినకుండా మానేయండి" అంటూ గట్టిగా సమాధానం ఇస్తుంది. దీంతో ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది.
పరిస్థితిని గమనించిన సత్యం తన ముగ్గురు కొడుకులను చూసి "ఏరా.. మీ ముగ్గురు వాళ్లతో గొడవ పడ్డారా?" అని ప్రశ్నిస్తాడు. దీనికి రవి బాధగా స్పందిస్తూ "మాకు అంత ధైర్యం ఎక్కడ నాన్నా.. వాళ్లే మాతో గొడవ పడుతున్నారు" అని అంటాడు. మరోవైపు మీనా మాత్రం కోపంతో గిన్నెలు, చెంచాలు, గ్లాసులు బలంగా ఎత్తేస్తూ తన ఆగ్రహాన్ని బయటపెడుతుంది. దీంతో బాలు పూర్తిగా సైలెంట్ అయిపోతాడు. ప్రభావతి కూడా ఏం మాట్లాడకుండా పరిస్థితిని గమనిస్తూ ఉంటుంది. ఇంతలో బాలు "అమ్మ" అంటూ ప్రభావతిని పిలవగానే అతని నోటినుంచి మద్యం వాసన రావడంతో అసలు విషయం బయటపడుతుంది.
"అదేనా అసలు విషయం.. అందుకేనా ఇంత గొడవ?" అంటూ రవి ప్రశ్నించగా, బాలు మాత్రం ఏమీ తెలియనట్లుగా "మాకు తెలియకుండానే వాళ్లు గొడవ పడుతున్నారు" అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, అప్పటికే విషయం అర్థం చేసుకున్న సత్యం తీవ్ర అసహనానికి గురవుతూ "నేను ఇక్కడికి తినడానికి వచ్చాను.. మీ గొడవలు తీర్చడానికి కాదు. తినేది ఉంటే తినండి.. లేకపోతే వెళ్లిపోండి" అంటూ ఘాటుగా మాట్లాడతాడు. అయితే ఈ సమయంలో మనోజ్ తన మనసులోని బాధను బయటపెడుతూ "ఏంటి నాన్నా.. మమ్మల్ని చూస్తే మీకు జాలి కలగడం లేదా?" అని ప్రశ్నిస్తాడు.
వెంటనే "నేను 30 ఏళ్ల నుంచి వేగుతున్నాను.. ఎప్పుడైనా నాపై జాలి చూపించారా?" అంటూ ప్రభావతిపై ఇన్‌డైరెక్ట్ పంచ్ వేయడంతో అక్కడి వాతావరణం మరింత మారుతుంది. దీంతో ముగ్గురు అన్నదమ్ములు భోజనం చేయకుండానే టెర్రస్‌పైకి వెళ్లి పడుకుంటారు. టెర్రస్‌పై ముగ్గురు తమ తమ బాధలను ఒకరికొకరు చెప్పుకుంటారు. మనోజ్ "రోహిణి ఏదో దాచిపెడుతోంది.. ఆమెపై అనుమానం పెరుగుతోంది" అని చెబుతాడు. రవి కూడా "శృతి నాపై అనుమానం పెంచుకుంటోంది" అంటూ తన బాధను వ్యక్తం చేస్తాడు. ఇక బాలు మాత్రం "మీనా నన్ను చాలా అవమానించింది" అంటూ బాధపడతాడు.
మరోవైపు ప్రభావతి మాత్రం కోడళ్లు, కొడుకుల ప్రవర్తనను చూసి తీవ్రంగా బాధపడుతుంది. ఈ సమయంలో సత్యం ఆమెకు సలహా ఇస్తూ "వాళ్ల సమస్యలు వాళ్లే పరిష్కరించుకుంటారు.. అనవసరంగా నువ్వు మధ్యలో తలదూర్చకు" అని చెబుతాడు. కానీ ప్రభావతి మాత్రం ఇంకా ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. దీంతో విసిగిపోయిన సత్యం "అనవసరంగా సమస్యను పెద్దది చేయకు.. నీ ప్రశ్నలన్నిటికీ సమయమే సమాధానం చెబుతుంది" అంటూ కోపంగా స్పందిస్తాడు. అయినా ప్రభావతి వినకపోవడంతో చివరకు సత్యం కూడా దిండు పట్టుకుని టెర్రస్‌పైకి వెళ్లిపోవడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది.
ఇక మరోవైపు టెర్రస్‌పై ముగ్గురు అన్నదమ్ములు తమ తమ బాధల్లో మునిగిపోయి ఉంటారు. కానీ బాలు మాత్రం మద్యం మత్తులో నిద్ర పట్టక ఇష్టం వచ్చినట్లు పాటలు పాడుతూ, పెద్దగా భజనలు చేస్తూ హంగామా మొదలుపెడతాడు. దీంతో నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న రవి, మనోజ్ ఇద్దరూ చిరాకు పడుతూ "ఏంట్రా ఇది.. ఎందుకిలా చేస్తున్నావ్?" అంటూ ప్రశ్నిస్తారు. అయితే బాలు మాత్రం మరింత ఎమోషనల్‌గా స్పందిస్తూ "పెళ్లాలతో అవమానం పడ్డాక మీకు ఎలా నిద్ర పడుతోంది రా వెధవల్లారా?" అంటూ ఇద్దరినీ తిడతాడు. అతని మాటల్లో ఉన్న బాధ, మద్యం మత్తు కలిసి ఆ సన్నివేశాన్ని ఒకేసారి కామెడీగానూ, ఎమోషనల్‌గానూ మార్చేస్తాయి.
ఇంతలో అక్కడికి సత్యం ఎంట్రీ ఇవ్వడంతో ముగ్గురు ఒక్కసారిగా షాక్ అవుతారు. "ఏంటి నాన్నా.. నువ్వు కూడా వచ్చేశావా?" అని బాలు ఆశ్చర్యంగా అడగగా, సత్యం కూడా విసుగ్గా "మీ అమ్మ పోరు తట్టుకోలేక నేనే వచ్చేశా" అంటూ సమాధానం ఇస్తాడు. దీంతో బాలు మరింత ఊపులోకి వెళ్లి "ఇకనుండి మనమంతా కలిసి భార్యా బాధితుల సంఘం పెట్టాలి. ఆ సంఘానికి అధ్యక్షుడిగా నాన్ననే పెట్టాలి" అంటూ అర్థంపర్థం లేకుండా మాట్లాడడం మొదలుపెడతాడు. అంతేకాదు "మన ఇంట్లోనే ఇంతమంది భార్య బాధితులు ఉంటే.. ఈ గ్రామంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఇంకా ఎంతమంది ఉంటారో ఊహించండి. ఇది చిన్న విషయం కాదు.. ఒక ఉద్యమంలా ప్రారంభిద్దాం" అంటూ కామెడీగా ప్రసంగం మొదలుపెడతాడు. బాలు మాటలు విన్న రవి, మనోజ్ నవ్వాలో ఏడవాలో అర్థంకాక ఒకరినొకరు చూసుకుంటారు.
అయితే సత్యం మాత్రం వెంటనే సీరియస్ అవుతూ బాలకు స్ట్రాంగ్ క్లాస్ పెడతాడు. "అరేయ్.. తాగిన మత్తులో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతావా? ముందు నీ సమస్య ఏంటో అది పరిష్కరించుకో. చిన్న చిన్న గొడవలు జరిగినా ఇల్లు వదిలేసి పైకి వచ్చి పడుకుంటారా? ఇలా ముఖం ముఖం చాటేస్తూ ఉంటే సంసారం ఎలా సాగుతుంది?" అంటూ మందలిస్తాడు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమని, అవి పెంచుకుంటేనే సమస్యలు పెద్దవవుతాయని సత్యం చెబుతాడు.
ఇక బాలు వైపు తిరిగి "నువ్వు తాగి వస్తే ఏ భార్య అయినా తిడుతుంది. మీ ఆరోగ్యం చెడిపోవాలని వాళ్లు అనుకోరు కదా" అంటూ బాలు తప్పును అర్థమయ్యేలా చెబుతాడు. ఆ తర్వాత రవిని చూసి "ఫోన్ చేస్తే తిరిగి కాల్ చేయాలని కూడా తెలియదా? నీ భార్య నిన్నే సర్వస్వంగా భావిస్తుంది. అలాంటి ఆమెను బాధపెడితే నష్టమంతా నీకే" అంటూ క్లాస్ పెడతాడు. దీంతో రవి కూడా సైలెంట్ అయిపోతాడు.
ఇక మనోజ్‌కి కూడా సత్యం సలహా ఇస్తూ "భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు తోడుగా ఉండాలి. చిన్న గొడవలకే ఇంత దూరం పెంచుకుంటారా? సారీ చెబితే పోయేదేముంది? వారిని ఎలా కూల్ చేయాలో ఆలోచించండి" అంటూ ముగ్గురినీ మందలిస్తాడు. చివరికి "సమస్యను ఇంకా పెద్దది చేయకుండా మీరే సర్దుకుపోండి" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక మరోవైపు ఇంట్లో శృతి ఆకలితో స్నాక్స్ తింటూ ఉంటుంది. అదే సమయంలో మీనా అక్కడికి వచ్చి "నీకు ఆకలేస్తుందా?" అంటూ తన దగ్గర ఉన్న తినుబండారాన్ని కూడా ఆమెతో పంచుకుంటుంది. కొద్దిసేపటికి రోహిణి కూడా శృతి గదిలోకి వస్తుంది. వాళ్లిద్దరూ తింటూ కనిపించడంతో "నాకు చెప్పుంటే నేనూ వచ్చేదాన్ని కదా.. నాకు కూడా ఆకలేస్తోంది" అంటూ సరదాగా అంటుంది.
అయితే శృతి మాత్రం నోరు జారి "నీకు తెలియకుండా గుట్టుగా తినడం బాగా తెలుసు కదా" అంటూ కామెంట్ చేస్తుంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం అసౌకర్యంగా మారుతుంది. వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్న మీనా "పోనీ రోహిణి.. శృతి చిన్నపిల్ల, ఏదో తెలియక అలా మాట్లాడింది. నువ్వూ రా కలిసి తిందాం" అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ముగ్గురు తోడికోడళ్లు తమ తమ సమస్యలను ఒకరికొకరు చెప్పుకుంటూ ఎమోషనల్‌గా మాట్లాడుకుంటారు. భర్తలతో జరిగిన గొడవలు, తమ బాధలు పంచుకుంటూ కాస్త కూల్ అవుతారు. ఇంతలో ప్రభావతి కూడా అక్కడికి రావడంతో ముగ్గురు ఆశ్చర్యపోతారు. "ఏంటి అత్తయ్య.. మీరు ఇక్కడికి వచ్చారు?" అని అడగగా, ప్రభావతి కూడా బాధగా "మీ వల్ల నేను మీ మామయ్యతో తిట్లు తిన్నాను. ఆయన కూడా అలిగి టెర్రస్‌పైకి వెళ్లిపోయాడు. అందుకే మీ దగ్గరకు వచ్చాను" అంటూ చెబుతుంది.దీంతో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అత్తా కోడళ్లు అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ, తమ తమ బాధలను మర్చిపోయే ప్రయత్నం చేస్తారు.
మరుసటి రోజు ఎపిసోడ్‌లో మీనా ట్రాక్ పూర్తిగా హైలైట్‌గా నిలిచింది. తన టాలెంట్, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో చింతామణికి గట్టి కౌంటర్ ఇచ్చిన మీనా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉదయం సీరియల్ నటుడు కిరణ్ ఇంటికి వెళ్లిన మీనా, వాళ్లు చెప్పిన థీమ్‌కి తగ్గట్టుగా సంప్రదాయ తెలుగు ఇంటి వాతావరణాన్ని గుర్తు చేసేలా అందమైన డెకరేషన్ మొదలుపెడుతుంది. ఈ పనిలో ఆమె ఫ్రెండ్స్ కూడా సహాయం చేస్తూ ఎంతో ఉత్సాహంగా పని చేస్తారు. పూలతో, తోరణాలతో, సంప్రదాయ అలంకరణలతో మీనా చేసిన డెకరేషన్ చూసిన వారందరూ మెచ్చుకుంటారు.
అయితే ఇదంతా చూసిన చింతామణి మాత్రం లోలోపల మండిపోతుంది. "ఎలాగైనా మీనాను అవమానపరచాలి.. ఆమె పని చెడగొట్టాలి" అని నిర్ణయించుకుంటుంది. వెంటనే తన అసిస్టెంట్‌ను పిలిచి, కొంతమందిని పంపించి మీనా చేసిన డెకరేషన్ మొత్తం పాడు చేయమని ఆర్డర్ ఇస్తుంది. అయితే.. తన మనసులో మాత్రం ఇప్పటికే వాళ్లు డెకరేషన్ మొత్తం పీకేసి ఉంటారు.. అది చూసి మీనా ఏడుస్తున్నట్లు ఊహించుకుంటూ సంతోషపడుతుంది. కానీ అసలు సీన్ మాత్రం పూర్తిగా రివర్స్ అవుతుంది. చింతామణి పంపిన గుండాలు మీనా దగ్గరకు వచ్చి "నువ్వేనా మీనా?" అంటూ బెదిరించే ప్రయత్నం చేస్తారు.
అయితే మీనా మాత్రం భయపడకుండా "నేనే.. ఏం కావాలి?" అంటూ ధైర్యంగా ఎదురుగా నిలబడుతుంది. "ఈ డెకరేషన్ మాకు నచ్చలేదు.. వెంటనే తీసేసి వేరే డెకరేషన్ చేయాలి" అని వాళ్లు బెదిరించగా, మీనా మరింత ఘాటుగా స్పందిస్తుంది. "పెళ్లికూతురు ఈ డెకరేషన్ ఓకే చేసిన తర్వాతే మేము పని మొదలుపెట్టాం. అయినా మీరు ఎవరు చెప్పడానికి?" అంటూ వారినే ఎదురు ప్రశ్నిస్తుంది. దీంతో ఆ గుండాలు బలవంతంగా డెకరేషన్ పీకేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మీనా ఒక్కసారిగా రెచ్చిపోతూ "తీయరా.. తీసి చూడు!" అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఆమె ధైర్యానికి షాక్ అయిన వాళ్లు అక్కడి నుంచి వెనక్కి తగ్గిపోతారు. ఈ మొత్తం సీన్‌ను దూరం నుంచి గమనిస్తున్న చింతామణి తీవ్ర అవమానంగా ఫీల్ అవుతుంది. మొదటిసారి మీనా ఎదుట తన ప్లాన్ పూర్తిగా ఫెయిల్ కావడంతో కోపంతో రగిలిపోతుంది.
ఇంతలో అక్కడికి సీరియల్ నటుడు కిరణ్ రావడం కథలో మరో ఆసక్తికర మలుపు తీసుకొస్తుంది. ఇంటి అలంకరణ మొత్తం చూసిన కిరణ్ చాలా ఇంప్రెస్ అవుతూ "మీ డెకరేషన్‌లో నిజంగా తెలుగింటి పరిమళం ఉట్టిపడుతోంది. సంప్రదాయం, ఆహ్లాదం రెండూ కనిపిస్తున్నాయి. మీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చాలా మంచి స్థాయికి వెళ్తారు" అంటూ మీనాను ప్రశంసిస్తాడు. అంతేకాదు, తన అసిస్టెంట్‌ను పిలిచి "వాళ్లు అడిగిన దానికంటే ఐదు వేల రూపాయలు ఎక్కువ ఇచ్చి పంపించండి" అని చెప్పడం మీనా టాలెంట్‌కు దక్కిన పెద్ద గుర్తింపుగా నిలుస్తుంది.
అయితే అదే సమయంలో చింతామణి తన డెకరేషన్ గురించి కిరణ్ అభిప్రాయం అడుగుతుంది. దీనికి కిరణ్ చాలా క్లియర్‌గా స్పందిస్తూ "మీ డెకరేషన్‌లో ఇంగ్లీష్ పూల వాసన వస్తోంది. ఫోటోల్లో అవి బాగుండొచ్చు.. కానీ మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వవు. నేను ముందే చెప్పాను.. నా ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలో తెలుగింటి శోభ కనిపించాలని. కానీ మీరు పూర్తిగా భిన్నంగా చేశారు. అది నాకు నచ్చలేదు" అంటూ సూటిగా చెప్పేస్తాడు.
అంతేకాదు, "మీ ప్రవర్తన, మాట్లాడే తీరు కూడా సరిగా లేదు" అంటూ చింతామణికి షాక్ ఇస్తాడు. వెంటనే తన అసిస్టెంట్‌కు "వారికి ఇవ్వాల్సిన అమౌంట్‌లో మరో ఐదు వేల రూపాయలు కట్ చేయండి" అని చెప్పడంతో చింతామణి అవమానంతో రగిలిపోతుంది. ఇలా మొదటిసారిగా మీనా చేతిలో చింతామణి పూర్తిగా ఓడిపోయినట్లు చూపించారు.
అయినా చింతామణి తన పొగరును తగ్గించుకోకుండా మీనా దగ్గరకు వచ్చి "నీకెంత ధైర్యం? నన్ను ఈరోజు అందరి ముందు అవమానపడేలా చేశావు. నీ అంత చూస్తా" అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీనికి మీనా కూడా ఏ మాత్రం తగ్గకుండా "నువ్వు పంపించిన గుండాలను ఎలా తరిమికొట్టానో చూశావు కదా. మరోసారి కూడా అదే రిపీట్ అవుతుంది. అనవసరంగా నాతో పెట్టుకోకు" అంటూ గట్టిగా సమాధానం ఇస్తుంది.
ఇదే సమయంలో చింతామణి అసిస్టెంట్ కోపంతో మీనాపై చేయి చేసుకోవడానికి ముందుకు వస్తాడు. కానీ మీనా వెంటనే రియాక్ట్ అవుతూ అతడిని గట్టిగా దవడపై కొడుతుంది. ఒక్కసారిగా కిందపడిపోయిన అసిస్టెంట్‌ను చూసి చింతామణి కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత మీనా చెప్పిన డైలాగ్ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. "నీలాగా నేనే బాగుపడాలని కోరుకునే రకం కాదు. నాతో పాటు నలుగురు బాగుపడాలని అనుకునే మనస్తత్వం నాది" అంటూ తన వ్యక్తిత్వాన్ని బలంగా చూపిస్తుంది. అయితే చింతామణి మాత్రం తన ఆటిట్యూడ్ మార్చుకోకుండా "ఇలాంటి డైలాగులు మీ ఆయన కారు వెనక రాసుకో" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక మరోవైపు రోహిణి-మనోజ్ ట్రాక్‌లో కూడా సస్పెన్స్ పెరుగుతుంది. ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. ఈ విషయాన్ని గమనించిన మీనా తల్లి పార్వతి వారిని పలకరించడానికి వెళ్తుంది. కానీ రోహిణి, మనోజ్ మాత్రం పెద్దగా పట్టించుకోకుండా చల్లగా స్పందించడంతో పార్వతి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే అక్కడికి కానిస్టేబుల్స్ రావడం కథలో మరో ట్విస్ట్ తీసుకొస్తుంది. వారు ఆలయ ఇన్‌చార్జ్‌ను పిలిచి సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడుగుతారు. ఇదంతా గమనిస్తున్న మనోజ్ కూడా ఆ ఫుటేజ్ తనకు కావాలని అడగడంతో పోలీసులు సీరియస్ అవుతారు. "అనవసరంగా మా ఎంక్వయిరీలో జోక్యం చేసుకోకండి. మీ పని మీరు చూసుకోండి.. మా పని మేము చేసుకుంటాం" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. దీంతో మనోజ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు.
ఇక గుడి దగ్గర జరిగిన ఈ మొత్తం విషయాన్ని సుమతి ఫోన్ చేసి మీనాకు చెప్పడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. పోలీసులు వెతుకుతున్నది ఎవరు? సీసీటీవీ ఫుటేజ్‌లో ఏముంది? రోహిణి-మనోజ్‌కు దీనితో ఏమైనా సంబంధం ఉందా? అనే అనేక అనుమానాలతో ఎపిసోడ్ సస్పెన్స్‌గా ముగిసింది.


Click it and Unblock the Notifications