Gundeninda Gudigantalu June 4th Episode: బాలు అరెస్ట్.. ప్రభావతిపై మీనా ఫైర్.. మనోజ్‌ను కొట్టిన పోలీసులు..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన ట్విస్టులు, కుట్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చింతామణి తన అసలు లక్ష్యమైన మీనాను దెబ్బతీయడానికి ప్రభావతికి దగ్గరైంది. డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఆమె నమ్మకం గెలుచుకుంది. ఇదే సమయంలో మీనా గురించి వివరాలు తెలుసుకుని, ప్రభావతికి కోడలిపై ఉన్న అసంతృప్తిని గమనించింది. దీంతో మీనాకు గుణపాఠం చెప్పాలని కొత్త ప్లాన్ వేసుకుంది. మరోవైపు రోహిణి, విద్య, మాణిక్యం తమ మోసాల గురించి మాట్లాడుతుండగా మీనా విన్నట్లు చూపించడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే చివర్లో అది రోహిణికి వచ్చిన పీడకల మాత్రమే అని తేలింది. కలలో కూడా మీనా తన రహస్యాలను బయటపెట్టడంతో భయపడిన రోహిణి నిద్రలోనే కేకలు వేస్తూ లేచింది.
మరుసటి రోజు విద్యతో మాట్లాడిన ఆమె, తన మోసాన్ని మరింత బలంగా నమ్మించేలా కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. తండ్రి ఫొటోను ఇంటికి తీసుకెళ్లి అందరినీ నమ్మించాలని నిర్ణయించింది. తల్లి సుగుణమ్మ, విద్య ఇద్దరూ నిజం చెప్పమని హెచ్చరించినా రోహిణి వినలేదు. ఇక మరోవైపు రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్న వృద్ధ దంపతుల గుడిసెను తొలగించేందుకు వచ్చిన పోలీసులను బాలు, మీనా అడ్డుకున్నారు. వృద్ధురాలిని కానిస్టేబుల్ తోసేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆగ్రహించిన బాలు పోలీసులను నిలదీశాడు. చివరకు గాయపడిన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించాడు. అక్కడ ఆమెకు అత్యవసరంగా రక్తం అవసరమని వైద్యులు తెలిపారు. ఇంట్లోకి వచ్చిన రోహిణి తన కొత్త డ్రామాకు శ్రీకారం చుడుతూ తండ్రి ఫొటో చూపించి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె నటనకు కుటుంబ సభ్యులు జాలిపడగా, ప్రభావతి మాత్రం వేరే కోణంలో ఆలోచిస్తూ కనిపించింది. దీంతో తదుపరి ఎపిసోడ్‌పై మరింత ఉత్కంఠ నెలకొంది.

Courtesy: Jio hotstar
గురువారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, కుటుంబ గొడవలు, పోలీసుల ఎంట్రీతో ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలో రోహిణి తన తండ్రి ఫోటోను ఇంట్లో అందరికీ చూపిస్తూ భావోద్వేగానికి గురవుతుంది. ఫోటోను చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. అయితే ప్రభావతి మాత్రం మరో కోణంలో ఆలోచిస్తూ, "ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ఆయన బతికున్నప్పుడు ఎన్నిసార్లు తొందరపడమని చెప్పాను. నా మాట ఎవరూ వినలేదు. ఇప్పుడు మిగిలింది బూడిద మాత్రమే" అంటూ వ్యాఖ్యానిస్తుంది. ఈ మాటలకు రోహిణి మరింత ఎమోషనల్ అవుతూ, "మా నాన్న ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పుడు ఆయన ఆస్తి, వీలునామా గురించే ఆలోచించాల్సి వస్తోంది" అంటూ ఏడుస్తుంది. ఇదే సమయంలో మనోజ్ కూడా ఎమోషనల్ అయినట్లు నటిస్తూ ఫ్రిజ్‌లో ఉన్న పూలదండను తీసుకువచ్చి ఫోటోకు వేస్తాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన బాలు, మీనా ఫోటోను చూసి అనుమానం వ్యక్తం చేస్తారు.
"ఈ ఫోటో చూస్తే మలేషియాలో కోట్లకు పడగెత్తిన వ్యక్తిలా కనిపించడం లేదు. ఏదో తేడాగా ఉంది" అంటూ బాలు కామెంట్ చేయడంతో రోహిణి ఒక్కసారిగా కంగారుపడుతుంది. మీనా కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేయడంతో రోహిణి వెంటనే కవరింగ్ ఇస్తూ, "మా నాన్న ఇండియాలోనే పుట్టారు. తర్వాత మలేషియాకు వెళ్లారు" అంటూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రభావతి మాత్రం తన ఆశలు నెరవేరకపోవడంతో నిరాశ చెందుతుంది. "నేను ఆస్తుల వివరాలు వస్తాయని అనుకున్నా.. చివరకు ఫోటో మాత్రమే వచ్చింది" అంటూ ఫీల్ అవుతుంది. అయినప్పటికీ ఫోటోకు పూలు వేసి, "ఆస్తి వ్యవహారాలు, వీలునామా పత్రాలు త్వరగా మా చేతికి వచ్చేలా చూడండి" అంటూ తన ఆశను బయటపెడుతుంది.
ఇదే సమయంలో బాలు ఇంట్లో ఒక షాకింగ్ విషయం చెబుతాడు. ప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధురాలికి అత్యవసరంగా బి-పాజిటివ్ రక్తం కావాలని చెబుతాడు. దీంతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. రవి రక్త గ్రూప్ కూడా అదే కావడంతో అతడిని సంప్రదించాలని సూచిస్తాడు. శృతి సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ ద్వారా రక్తదాతలను వెతకమని సలహా ఇవ్వడంతో బాలు చివరకు రక్తం సమకూర్చగలుగుతాడు. అయితే కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. అకస్మాత్తుగా పోలీసులు ఇంటికి వచ్చి బాలు ఎవరని అడుగుతారు. తానే బాలు అని చెప్పగానే అతడిని అరెస్ట్ చేస్తున్నామని ప్రకటిస్తారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నందుకు కేసు నమోదు చేశామని చెబుతారు. దీంతో మీనా ఆగ్రహంతో ఊగిపోతుంది. "ముసలి దంపతులను రోడ్డుపైకి తోసేసి, వాళ్లను గాయపరిచిన పోలీసులను ప్రశ్నించడం తప్పా?" అంటూ గట్టిగా నిలదీస్తుంది. అయినప్పటికీ పోలీసులు బాలు మాట వినకుండా స్టేషన్‌కు తీసుకెళ్తారు.
ఈ సమయంలో ప్రభావతి వ్యవహరించిన తీరు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. బాలు అరెస్ట్ అయి పోలీసులతో వెళ్తున్న సమయంలో కూడా "మీనా నువ్వు వెళ్తే ఇక్కడ వంట ఎవరు చేస్తారు?" అని అడుగుతుంది. ఈ మాటలు విన్న మీనా కోపంతో ఊగిపోతుంది. "మీరు నిజంగా బాలు తల్లేనా? కొడుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంటే బాధపడాల్సింది పోయి వంట గురించే ఆలోచిస్తున్నారా? మీరు అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా?" అంటూ దిమ్మతిరిగేలా క్లాస్ పీకుతుంది. మీనా మాటలకు ఇంట్లోని అందరూ షాక్ అవుతారు. అయితే ఆమెకు మద్దతుగా సత్యం కూడా ప్రభావతిపై మండిపడతాడు. "నిజంగా నువ్వు మనిషివేనా? కన్నతల్లి ఇలా ఆలోచిస్తుందా? మీనా చెప్పింది కరెక్ట్. నీకు గడ్డి కరెక్ట్‌గా పెట్టింది" అంటూ ప్రభావతిని తీవ్రంగా తప్పుబడతాడు. శృతి, రవి కూడా ప్రభావతి ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తారు. ఒక్కసారిగా ఇంట్లో అందరి నుంచి వ్యతిరేకత ఎదురవడంతో ప్రభావతి ఒంటరిగా మిగిలిపోతుంది. "అటు కోట్లు పోయాయి.. ఇటు పరువు పోయింది" అంటూ తనలో తానే బాధపడుతుంది.
బాలును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. "నీ ధైర్యం చూశావా? ఎక్కడికి తీసుకొచ్చానో తెలుసా?" అంటూ అహంకారంగా మాట్లాడుతాడు. అయితే బాలు మాత్రం ఏమాత్రం భయపడకుండా, "నేను నిజం కోసం నిలబడ్డాను. నిజాయితీగా ఉన్నాను కాబట్టే ధైర్యంగా ఉన్నాను. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో" అంటూ ధీటుగా సమాధానం ఇస్తాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. అయితే మరో కానిస్టేబుల్ వచ్చి మంత్రి పర్యటన ఉందని, ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి ఉందని చెప్పడంతో ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది. ఇంతలో మీనా కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటుంది. "నేను రావొద్దని చెప్పాను కదా" అని బాలు అన్నా, మీనా మాత్రం తన భర్తను ఒంటరిగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుంది. "మీరు బయటికి వచ్చేవరకు నేను ఎక్కడికీ వెళ్లను" అంటూ తన ప్రేమను, నమ్మకాన్ని మరోసారి చాటుకుంటుంది.
ఇదే సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది. 30 లక్షల మోసానికి సంబంధించిన వ్యవహారం కోసం మనోజ్, రోహిణి కూడా పోలీస్ స్టేషన్‌కు వస్తారు. అక్కడ బాలు, మీనాలను చూసిన మనోజ్ మొదట ఎగతాళి చేయడానికి ప్రయత్నిస్తాడు. "ఏంట్రా ఇక్కడికి వచ్చావు? ఏం చేసావు?" అంటూ వ్యంగ్యంగా మాట్లాడతాడు. దీనికి బాలు కూడా తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ, "నీలాగా మోసాలు చేయలేదు. నిజాయితీగా వ్యవహరించాను" అని చెబుతాడు. అయితే మనోజ్ తన స్టేటస్ చూపించుకునేందుకు ప్రయత్నించడం అసలు కామెడీకి కారణమవుతుంది. "నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్‌ను. నాకు పోలీసులతో పర్సనల్ పనులు ఉంటాయి" అంటూ భారీ బిల్డప్ ఇస్తాడు. రోహిణి ముందుగానే "అనవసరంగా బాలు ముందు పరువు తీసుకోకు" అని హెచ్చరించినా, మనోజ్ మాత్రం వినిపించుకోడు.
తన పని త్వరగా పూర్తయ్యేలా చేయాలని భావించిన మనోజ్, ఒక కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో ఆఫర్ ఇస్తాడు. డబ్బు లేదా మరేదైనా ప్రయోజనం ఇస్తానని చెప్పినట్లు సూచిస్తారు. అయితే ఆ మాటలు విన్న కానిస్టేబుల్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురై, అందరి ముందూ మనోజ్ చెంపపై గట్టిగా కొడతాడు. ఆ దెబ్బతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతటితో ఆగలేదు. మరో కానిస్టేబుల్ వచ్చి "ఎందుకు కొట్టావు?" అని అడగగా, జరిగిన విషయం చెవిలో చెబుతాడు. అది విన్న రెండో కానిస్టేబుల్ కూడా కోపంతో మనోజ్ చెంపపై మరోసారి చెల్లుమనిపిస్తాడు. దీంతో వరుసగా ఇద్దరు పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న మనోజ్ పరిస్థితి దారుణంగా మారుతుంది. బాలు, మీనాల ముందే అతడి పరువు పూర్తిగా పోతుంది.
ఇంకా కోపం తగ్గని కానిస్టేబుల్, "ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే జీవితాంతం బయటికి రాకుండా జైలులో పెడతాను" అంటూ హెచ్చరిస్తాడు. ఇదంతా చూసిన బాలు కూడా ఊరుకోకుండా, "స్టేషన్‌కు వచ్చినప్పుడు నన్ను జైలులో వేయిస్తానన్నావు కదా... ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చూసుకో" అంటూ ఘాటుగా బదులిస్తాడు. బాలు మాటలకు మనోజ్ ముఖం కిందికి వాలిపోతుంది. ఈ పరిస్థితి చూసి రోహిణి కూడా తీవ్ర అసహనానికి గురవుతుంది. బాలు నిజంగానే కోపంతో ఏదైనా చేస్తాడేమోనని భయపడి, వెంటనే మనోజ్‌ను అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్తుంది. అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా అతడిని వదిలిపెట్టదు. "అసలు కానిస్టేబుల్ చెవిలో ఏం చెప్పావు?" అని నిలదీస్తుంది. మనోజ్ చెప్పిన సమాధానం విన్న రోహిణి ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతుంది. వెంటనే అతడి చెంపపై మరోసారి కొడుతూ, "నీతో వచ్చి నా పరువు కూడా పోయింది" అంటూ మండిపడుతుంది. ఆ తర్వాత కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా ఒకే రోజు పోలీసుల చేతిలో రెండు చెంపదెబ్బలు, భార్య చేతిలో మరో చెంపదెబ్బ తిన్న మనోజ్ పరిస్థితి ప్రేక్షకులకు నవ్వులు తెప్పించింది.
బాలును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. ఇంతలో స్టేషన్‌కు వచ్చిన ఎస్సై జరిగిన విషయం తెలుసుకుని వెంటనే బాలును తన ముందుకు పిలిపిస్తాడు. "ఏంటి నువ్వు? రౌడీషీటర్‌వా? డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడం ఎంత పెద్ద నేరమో తెలుసా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతేకాదు, వెంటనే కానిస్టేబుల్‌ను పిలిచి బాలును సెల్‌లో వేయాలని ఆదేశిస్తాడు. అయితే ఇదంతా చూస్తున్న మీనా వెంటనే అడ్డుపడుతుంది. తన భర్తను సమర్థిస్తూ, "సార్.. మా ఆయన తప్పు చేశాడని నేను అనడం లేదు. కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో కూడా తెలుసుకోవాలి. రోడ్డుపై ఉన్న ఓ వృద్ధ దంపతుల కోసం నిలబడటమే ఆయన చేసిన తప్పు" అంటూ జరిగిన విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తుంది.
దీంతో ఎస్సై కాస్త శాంతించి అసలు ఏమి జరిగిందో చెప్పమని బాలును ప్రశ్నిస్తాడు. అప్పుడు బాలు ఎంతో ఆవేదనతో జరిగిన ఘటనను వివరిస్తాడు. "సార్.. రోడ్డు క్లియరెన్స్ పేరుతో అధికారులు రోడ్డుపక్కన ఉన్న గుడిసెలు, పందిళ్లు తొలగిస్తున్నారు. అక్కడ ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. వాళ్లకు కొడుకు, కూతురు ఎవరూ లేరు. అడుక్కోవడం ఇష్టం లేక తమకు వచ్చిన పని చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. అలాంటి వాళ్లను కూడా కానిస్టేబుల్ కనికరం లేకుండా బయటకు లాగేశాడు. వాళ్లు ఎంత బతిమిలాడినా వినలేదు. ఆ సమయంలో ఆ ముసలావిడ కిందపడిపోయి తలకు తీవ్ర గాయం అయింది. ఆ దృశ్యం చూసి నేను ఆవేశంతో అతడి కాలర్ పట్టుకుని ప్రశ్నించాను. అంతకుమించి నేను ఏం చేయలేదు" అని చెబుతాడు.
బాలు చెప్పిన మాటలకు మీనా కూడా మద్దతు ఇస్తుంది. "సార్.. ఇప్పటివరకు ఆ వృద్ధ దంపతుల వైద్య ఖర్చులన్నీ మా ఆయనే భరిస్తున్నారు. వాళ్లకు అండగా నిలబడటమే ఆయన చేసిన తప్పు అయితే ఆ తప్పు మేము మళ్లీ కూడా చేస్తాం" అంటూ ధైర్యంగా చెబుతుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం తన తప్పు ఏమీ లేదన్నట్లు మాట్లాడతాడు. తాను కేవలం విధులు నిర్వర్తించానని, బాలు అనవసరంగా గొడవ చేశాడని చెప్పి తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు.
ఇద్దరి వాదనలు పూర్తిగా విన్న ఎస్సై అసలు విషయాన్ని అర్థం చేసుకుంటాడు. వెంటనే కానిస్టేబుల్ వైపు తిరిగి, "ప్రజలతో వ్యవహరించేటప్పుడు కాస్త మానవత్వం కూడా ఉండాలి. ఇకపై ఇలాంటి ఫిర్యాదులు రాకూడదు" అంటూ హెచ్చరిస్తాడు. అదే సమయంలో బాలును కూడా మందలిస్తూ, "నువ్వు చేసిన పని వెనుక మంచి ఉద్దేశం ఉండొచ్చు. కానీ డ్యూటీలో ఉన్న పోలీసుపై చేయి చేసుకోవడం సరైంది కాదు. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది" అని చెబుతాడు.
దీంతో బాలు కూడా తన తప్పును అంగీకరిస్తూ, మరోసారి అలాంటి పరిస్థితి రానివ్వనని చెబుతాడు. ఎస్సై సూచన మేరకు క్షమాపణ లేఖ రాసి ఇస్తాడు. ఆ తర్వాత అతడిని విడుదల చేస్తారు. దీంతో మీనా ఊపిరి పీల్చుకుంటుంది. అయితే కథ ఇక్కడితో ముగియదు. స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ తన అహంకారాన్ని వదలడు. "ఈసారి తప్పించుకున్నావు. కానీ మళ్లీ ఎక్కడైనా నాకు ఎదురైతే నీ పని చూస్తాను" అంటూ బాలును బెదిరించే ప్రయత్నం చేస్తాడు. అయితే బాలు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడు. "నేను నిజాయితీగా ఉంటాను. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నాతో అనవసరంగా పెట్టుకుంటే నీ ఉద్యోగమే ప్రమాదంలో పడుతుంది" అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు. బాలు ధైర్యం చూసి మరో కానిస్టేబుల్ కూడా ఆశ్చర్యపోతాడు.
ఆ తర్వాత ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంటుంది. మనోజ్‌కు చెంపదెబ్బలు కొట్టిన కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లిన బాలు, "అసలు మా మనోజ్ ఏమన్నాడు? ఎందుకు అంత కోపం వచ్చింది?" అని అడుగుతాడు. మొదట చెప్పడానికి ఇష్టపడని ఆ కానిస్టేబుల్, చివరకు మనోజ్ చెవిలో చెప్పిన మాటను బాలుకు వివరిస్తాడు. ఆ విషయం విన్న వెంటనే బాలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. అతడి ముఖంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రేక్షకులకు మాత్రం ఆ విషయం చూపించకుండా సస్పెన్స్‌లో ఉంచేస్తారు. మనోజ్ పోలీసులకు అసలు ఎలాంటి ఆఫర్ ఇచ్చాడు? ఎందుకు కానిస్టేబుళ్లు అంతగా ఆగ్రహించారు? బాలు కూడా ఎందుకు షాక్ అయ్యాడు? అనే ప్రశ్నలకు సమాధానం తదుపరి ఎపిసోడ్‌లో తెలియనుంది.


Click it and Unblock the Notifications